Aakaashmbu bhoomiyu anthata
ఆకాశంబు భూమియు అంతట

ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి
సమయమున ప్రార్థన చేతుము మా దేవా

చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా
ప్రభువా గావుము గావుము నీ నీడన్

చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే
గొలిచి నిద్రించున్

చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా
చెన్నుగ యేసూగావుమా

నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో గాలి
విమానంబులలోన కావుము దేవప్రయాణికులన్

రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో చిత్రంబుగ మమ్మును
గ్రమ్మన్ నిద్రించెదము మాదేవా

తెల్లవారుజామున తెలివొంది మే మందరము మెల్లగలేచి నుతియింపన్
మేల్కొల్పుము నా ప్రియతండ్రి

జనక తనయా శుద్ధాత్మా జయము మహిమ స్తోత్రములు అనిశము
నీకే చెల్లునుగా అనిశము చెల్లును నీ కామెన్


Aakaashmbu bhoomiyu anthata cheekati yaayenu praakedu cheekati
samayamuna praarThana chaethumu maa dhaevaa

Chakkani chukkalu mintanu chakkagaa mammunujoodaga prakkaku raave vaegamugaa
prabhuvaa gaavumu gaavumu nee needan

Chinna chinna pakShulu chinna chinna poovulu ennoa ennoa jeevulu ninnae
golichi nidhrinchun

Chinna chinna paapalu chinna chinna padakalaloa chinna kannulu mooyngaa
chennuga yaesoogaavumaa

Naelanu boayedi bndlaloa neetanu boayedi oadalaloa gaali
vimaanmbulaloana kaavumu dhaevaprayaanikulan

Raathriloa needhu dhoothalu ramymbaina rekkalathoa chithrmbuga mammunu
gramman nidhrinchedhamu maadhaevaa

Thellavaarujaamuna thelivondhi mae mndharamu mellagalaechi nuthiyimpan
maelkolpumu naa priyathNdri

Janaka thanayaa shudhdhaathmaa jayamu mahima sthoathramulu anishamu
neekae chellunugaa anishamu chellunu nee kaamen


Posted

in

by

Tags: