రమ్మనుచున్నాడు నిన్ను – Rammanuchunnaadu Ninnu

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి
రమ్మనుచున్నాడు (2)

ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2)
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దు లేని ఇంపు పొందెదవు (2)                ||రమ్మను||

కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2)
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ
కనికరించి నిన్ను కాపాడును (2)||రమ్మను||

సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2)
ఆయన నీ వెలుగు రక్షణనై యుండును
ఆలసింపక త్వరపడి రమ్ము (2)                  ||రమ్మను||

సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2)
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
అందరికి తన కృపలనిచ్చున్ (2)                 ||రమ్మను||


Rammanuchunnaadu Ninnu Prabhu Yesu
Vaanchatho Thana Karamu Chaapi
Rammanuchunnaadu (2)

Etuvanti Shramalandunu
Aadarana Neekichchunani (2)
Grahinchi Neevu Yesuni Choochina
Hadhdhu Leni Impu Pondedavu (2)    ||Rammanu||

Kanneeranthaa Thuduchunu
Kanupaapavale Kaapaadun (2)
Kaaru Meghamuvale Kashtamulu Vachchinanoo
Kanikarinchi Ninnu Kaapaadunu (2)    ||Rammanu||

Sommasillu Velalo
Balamunu Neekichchunu (2)
Aayana Nee Velugu Rakshananai Yundunu
Aalasimpaka Thvarapadi Rammu (2)   ||Rammanu||

Sakala Vyaadhulanu
Swasthatha Parachutaku (2)
Shakthimanthudagu Prabhu Yesu Prematho
Andariki Thana Krupalanichchun (2)   ||Rammanu||

భాసిల్లెను సిలువలో- Bhaasillenu Siluvalo

భాసిల్లెను సిలువలో పాపక్షమా

భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా      ||భాసిల్లెను||

కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2)      ||భాసిల్లెను||

దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం (2)     ||భాసిల్లెను||

పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2)     ||భాసిల్లెను||

నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో (2)     ||భాసిల్లెను||

ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2)     ||భాసిల్లెను||

నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2)      ||భాసిల్లెను||


Bhaasillenu Siluvalo Paapa Kshamaa
Yesu Prabhu Nee Divya Kshamaa         ||Bhaasillenu||

Kaluvarilo Naa Paapamu Ponchi
Siluvaku Ninnu Yaahuthi Chesi
Kalusha Haraa Karuninchithivi (2)       ||Bhaasillenu||

Doshamu Chesinadi Nene Kadaa
Mosamutho Brathikina Nene Kadaa
Mosithivaa Naa Shaapa Bhaaram (2)       ||Bhaasillenu||

Paapamu Chesi Gadinchithi Maranam
Shaapamegaa Nenaarjinchinadi
Kaaparivai Nanu Brochithivi (2)       ||Bhaasillenu||

Nee Maranapu Vedana Vrudhaa Gaadu
Naa Madi Nee Vedanalo Munigenu
Kshemamu Kaligenu Hrudayamulo (2)       ||Bhaasillenu||

Endulako Naapai Ee Prema
Andadayyaa Swamee Naa Madiki
Andulake Bhayamondithini (2)       ||Bhaasillenu||

Nammina Vaarini Kaadana Vaniyu
Nemmadi Nosagedi Naa Prabhudavani
Nammithi Nee Paadambulanu (2) ||Bhaasillenu||

స్తుతి సింహాసనాసీనుడా – Sthuthi Simhaasanaaseenudaa

స్తుతి సింహాసనాసీనుడా

స్తుతి సింహాసనాసీనుడా
యేసు రాజా దివ్య తేజా (2)

అద్వితీయుడవు పరిశుద్ధుడవు
అతి సుందరుడవు నీవే ప్రభూ (2)
నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2)
కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2)       ||స్తుతి||

బలియు అర్పణ కోరవు నీవు
బలియైతివి నా దోషముకై (2)
నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2)
స్తుతియాగమునే చేసెద నిరతం (2)       ||స్తుతి||

బూరధ్వనులే నింగిలో మ్రోగగా
రాజధిరాజ నీవే వచ్చువేళ (2)
సంసిద్ధతతో వెలిగే సిద్దెతో (2)
పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును (2)       ||స్తుతి||


Sthuthi Simhaasanaaseenudaa
Yesu Raajaa Divya Tejaa (2)

Advitheeyudavu Parishuddhudavu
Athi Sundarudavu Neeve Prabhu (2)
Neethi Nyaayamulu Nee Simhaasanaadhaaram (2)
Krupaa Sathyamulu Nee Sannidhaanavarthulu (2)         ||Sthuthi||

Baliyu Arpana Koravu Neevu
Bali Aithivi Naa Doshamukai (2)
Naa Hrudayame Nee Priyamagu Aalayam (2)
Sthuthiyaagamune Cheseda Niratham (2)         ||Sthuthi||

Booradhwanule Ningilo Mrogagaa
Raajaadhiraaja Neeve Vachchu Vela (2)
Samsidhdhathatho Velige Siddetho (2)
Pendli Kumaarudaa Ninnedurkondunu (2)         ||Sthuthi||

ప్రార్థన వినెడి పావనుడా – Praarthana Vinedi Paavanudaa

ప్రార్థన వినెడి పావనుడా

ప్రార్థన మాకు నేర్పుమయా                ||ప్రార్థన||

శ్రేష్టమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రనుతించెదము
పరలోక ప్రార్థన నేర్పుమయా              ||ప్రార్థన||

పరమ దేవుడవని తెలిసి
కరము లెత్తి జంటగా మోడ్చి
శిరమునువంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్థన నేర్పుమయా               ||ప్రార్థన||

దినదినంబు చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యి దిటముగా కొండను
చేసిన ప్రార్థన నేర్పుమయా                 ||ప్రార్థన||

శత్రుమూక నిను చుట్టుకొని
సిలువపైన నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ
సలిపిన ప్రార్థన నేర్పుమయా               ||ప్రార్థన||


Praarthana Vinedi Paavanudaa

Praartana Maaku Nerpumayaa    ||Praarthana||

Sreshtamaina Bhaavamu Goorchi
Shishya Brundamuku Nerpithivi
Paramuda Ninnu Pranuthinchedamu
Paraloka Praarthana Nerpumayaa   ||Praarthana||

Parama Devudavani Thelisi
Karamu Leththi Jantaga Modchi
Shiramunuvanchi Sariganu vedina
Sunkari Praarthana Nerpumayaa     ||Praarthana||

Dinadinambu Chesina Seva
Daiva Chiththamuku Saripova
Deenudavayyi Ditamuga Kondanu
Chesina Praarthana Nerpumayaa      ||Praarthana||

Shathrumooka Ninu Chuttukoni
Siluvapaina Ninu Jampaganu
Shaanthamutho Nee Shathrula Brovaga
Salipina Praarthana Nerpumayaa     ||Praarthana||

ఇదిగో దేవా – Idigo Devaa

ఇదిగో దేవా నా జీవితం

ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4)                       ||ఇదిగో||

పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం        ||ఇదిగో||

నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము      ||ఇదిగో||

విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా         ||ఇదిగో||


Idigo Devaa Naa Jeevitham

Aapaadamasthakam Neekankitham (2)
Sharanam Nee Charanam (4)     ||Idigo||

Palumaarlu Vaidolaginaanu
Paraloka Darshanamunundi
Viluvaina Nee Divya Pilupuku
Ne Thaginatlu Jeevinchanaithi (2)
Ainaa Nee Prematho
Nannu Dari Cherchinaavu
Anduke Gaikonumu Devaa
Ee Naa Shesha Jeevitham      ||Idigo||

Nee Paadamula Chentha Cheri
Nee Chiththambu Neneruga Nerpu
Nee Hrudaya Bhaarambu Nosagi
Praardhinchi Panicheyanimmu (2)
Aagipoka Saagipovu
Priyasuthuniga Panicheyanimmu
Prathi Chota Nee Saakshigaa
Prabhuvaa Nannundanimmu     ||Idigo||

Visthaara Panta Polamu Nundi
Kashtinchi Pani Cheya Nerpu
Kanneetitho Vitthu Manasu
Kalakaalam Mari Naaku Nosagu (2)
Kshema Kshaama Kaalamainaa
Ninnu Ghanaparachu Bathukunimmayyaa
Nashiyinche Aathmalan
Nee Dari Cherchu Krupanimmayyaa     ||Idigo||

అపరాధిని యేసయ్యా – aparadhini yesayya

అపరాధిని యేసయ్యా

కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)

సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)

ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)

ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)

దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)

ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)

చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)

శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2)


Aparaadhini Yesayyaa

Krupa Joopi Brovumayyaa (2)
Nepamenchakaye Nee Krupalo
Naparaadhamulanu Kshaminchu (2)

Siluvaku Ninu Ne Gotti
Thuluvalatho Jerithini (2)
Kalushambulanu Mopithini
Doshnda Nenu Prabhuvaa (2)

Prakkalo Ballepu Potu
Grakkuna Podichithi Nene (2)
Mikkili Baadhinchithini
Makkuva Joopithivayyo (2

Mullatho Kireetambu
Nalli Nee Shiramuna Nidithi (2)
Naa Valla Neramaaye
Challani Dayagala Thandri (2)

Daahambu Gonagaa Chedu
Chirakanu Draava Nidithi (2)
Naa Valla Neramaaye
Challani Dayagala Thandri (2)

Ghormabugaa Doorithini
Nerambulanu Jesithini (2)
Kroorundanai Gottithini
Ghorampu Paapini Devaa (2)

Chindithi Rakthamu Naakai
Pondina Debbala Chetha (2)
Apanindalu Mopithinayyo
Sandehamelanayyaa (2)

Shikshaku Paathrudanayyaa
Rakshana Dechchithivayyaa (2)
Akshaya Bhaagyamu Niyya
Mokshambu Joopithivayyaa (2)


అత్యున్నత సింహాసనముపై – Athyunnatha Simhaasanamu pai

అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా

అత్యంత ప్రేమా స్వరూపివి నీవే – ఆరాధింతును నిన్నే
ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్

1. ఆశ్చర్యకరుడా స్తోత్రం – ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి – సమాధాన అధిపతి స్తోత్రం
ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్

2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం – కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం
ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్

3. మృత్యుంజయుడా స్తోత్రం – మహా ఘనుడా స్తోత్రం మమ్మును
కొనిపోవ త్వరలో రానున్న- మేఘవాహనుడా స్తోత్రం
ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్

4. ఆమేన్ అనువాడా స్తోత్రం – అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం
ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్


Athyunnatha Simhaasanamu pai – Aaasieenudavyana devaa

Atyantha premaa swarupeeve neve araadhinthumu nine (2)]

haha –halleluya (4)Ahaha –halleluya (3)AMEN

1 Ashryakaruda stotram – Alochana kartha stotram
balamyna devaA nintyu davagu thandri – samaadana adhipathi stotram (2)

Ahaha –halleluya (4)Ahaha –halleluya (3)AMEN

2. Krupa satya sampurnada stotram – Krupalo rakshinthive stotram
Nee rakta michi vemochiinchi nave –naa raksha na kartha stotram (2)

Ahaha –halleluya (4)Ahaha –halleluya (3)AMEN

3. Amen anuvada stostram – alpha omega stotram
Agni jwalala vanti kannulu galavada – atyunnathudaa stotaram (2)

Ahaha –halleluya (4)Ahaha –halleluya (3)AMEN

4. Mruthyunjayuda sthothram – Maha ghanuda sthothram
mammunu konipova thvaralo ranunna – megha vaahanuda sthothram

Ahaha –halleluya (4)Ahaha –halleluya (3)AMEN


అందాల తార అరుదెంచె నాకై – Andhala taara arudhinche naakai

అందాల తార అరుదెంచె నాకై – అంబర వీధిలో

అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో
ఆది దేవుని జూడ – అశింపమనసు –పయనమైతిమి                             .. అందాల తార..

1)విశ్వాసయాత్ర – దూరమెంతైన – విందుగా దోచెను
వింతైన శాంతి – వర్షంచెనాలో – విజయపధమున
విశ్వాలనేలెడి – దేవకుమారుని – వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ – విశ్రాంతి నొసగుచున్   .. అందాల తార..

2)యెరూషలేము – రాజనగరిలో – ఏసును వెదకుచు
ఎరిగిన దారి – తొలగిన వేల – ఎదలో క్రంగితి
ఏసయ్యతార – ఎప్పటివోలె – ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు – విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు      .. అందాల తార..

3)ప్రభుజన్మస్ధలము – పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ – జీవితమెంత – పావనమాయెను
ప్రభుపాదపూజ – దీవెనకాగా – ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె – అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన            .. అందాల తార


Andala Tara Arudhenche Naakai… Ambara Veedhilo

Avathaaramoorthy Yesayya Keerthi… Avani Chaatuchun
Aanandhasandhra Mupponge Naalo… Amarakaanthilo
Aadhi Devuni Jaada… Aashimpamanasu Payanamaithimi

1)Vishwaasayaathra Dhooramenthaina… Vindhugaa Dhochenu
Vinthaina Shaanthi Varshinche Naalo… Vijayapathamuna
Vishwaalaneledi Devakumaaruni Veekshinchu Dheekshalo
Virajimme Balamu, Pravahinche Prema… Vishraanthi Nosaguchun

2)Yerushalemu Rajanagarilo… Yesuni Vedhakuchu
Erigina Daari, Tholagina Vela… Edhalo Krungithi
Yesayya Thaara Eppativole… Edhuraaye Throvalo
Entho Yabburapaduchu, Vismayamondhuchu… Egithi Swami Kadaku

3)Prabhu Janma Sthalamu… Paakaye Gaani Paralokasoudhame
Baalunijooda Jeevithamentha Paavanamaayenu
Prabhu Paadhapooja Deevenakaagaa… Prasarinche Punyamu
Brathuke Mandhiramaaye, Arpanale Sirulaaye..Phaliyinche Prardhana

Naa Thandri Neeve నా తండ్రి నీవే నా దేవుడవు నీవే

నా తండ్రి నీవే నా దేవుడవు నీవే

నా తండ్రి నీవే నీవే – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా – 2

1)నా అడుగులు తప్పటడుగులై
నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి – 2
పగలు ఎండ దెబ్బయైనను
రాత్రి వెన్నేల దెబ్బయైనను
తగలకుండా కాచెది ప్రేమా – 2
!! యేసయ్యా !!


2)గాఢాంధకార లోయలో
నే నడిచిన ప్రతి వెళలో
తోడున్న నా తండ్రివి – 2
వేయి మంది కుడి ఎడమకు
కూలినా కూలును గాని
చెదరకుండా కాపాడు ప్రేమా – 2
!! యేసయ్యా !!


Naa Thandri Neeve

Naa Thandri Neeve –
Naa Devudavu Neeve
Naa Thandri Neeve – Neeve (2)

Yesayya… Yesayya…
Yesayya…. Yesayya- 2 -Naa Thandri

1)naa Adgulu Thappatadugulai –
Nadichina Naa Prathi Maargamu
Saricheyu Naa Thandrivi (2)
Pagalu Enda Dhebbayayinanu – Rathri Vennela Dhebbayayinanu
Thagulakunda Kaache Nee Prema

Yesayya… Yesayya…
Yesayya…. Yesayya- 2 -Naa Thandri

2)Gaadandhakaara Loyalo
Nenadachina Prathivelalo
Thodunna Naa Thandrivi (2)
Veyimandhi Kudi Edamaku – Koolina Koolunu Kani,
Chedharakunda Nannu Kaapadu Prema

Yesayya… Yesayya…
Yesayya…. Yesayya- 2 -Naa Thandri

Nee Karyamulu

నీ కార్యములు ఆశ్చర్యములు దేవా(4)

నీవు సెలవియ్యగా – సూన్యము సృష్టిగా మారేనె
నీవు సెలవియ్యగా – మారా మధురం ఆయనె
నీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయేనె
నీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయేనె (2)

(1) మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివే
ఆ మన్నా నీవే యేసయ్య
ఏలీయా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివే
నా పోషకుడవు నీవే కదా(2)
౹౹నీవు సెలవియ్యగా౹౹

(2) లాజరు మరణించగా – మరణము నుండి లేపితివే
మోడైనను చిగురింపచేసేదవు
కానాన్ వివాహము ఆగిపోవుచుండగా
నీ కార్యముతో జరిగించితివే
నీ కార్యముతో (12)

సెలవిమ్మయ్య సెలవిమ్మయ్య – ఈ క్షణమే యేసయ్య (8)
౹౹నీవు సెలవియ్యగా౹౹
౹౹నీ కార్యములు౹౹