Kalvarigiripai siluva కల్వరిగిరిపై సిలువ

కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా

తుంటరులంత పట్టి కట్టి తిట్టుచు నిన్ను
కొట్టిర తండ్రీ తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రీ
నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా

మూడు దినముల్ సమాధిలో ముదముతోడ
నిద్రించితివా ముదముతోడ నిద్రించితివా
నా రక్షణకై సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి

ఆరోహణమై వాగ్దానాత్మన్ సంఘముపైకి
పంపించితివా ఆదరణాత్మన్ పంపించితివా
నీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను


Kalvarigiripai siluva baramu barimchitiva O na prabuva
Na papamukai ni raktamunu siluvapaina arpinchitiva

Tumtarulamta patti katti tittuchu ninnu
Kottira tamdri tittuchu ninnu kottira tandri
Na papamukai ni raktamunu siluvapaina arpimchitiva

Mudu dinamul samadhilo mudamutoda
Nidrimchitiva mudamutoda nidrimchitiva
Na rakshanakai sajivamuto samadhin gelchi lechina tamdri

Arohanamai vagdanatman samgamupaiki
Pampimchitiva adaranatman pampinchitiva
Ni rakadakai nirikshanato nimdalanella barimchedanu

Kalvari svaramu కల్వరి స్వరము

కల్వరి స్వరము నీ కొరకే సుమధుర స్వరము మన కొరకే
మరి ఆలకించుమా ప్రభు స్వరము ప్రియ స్వరము
సా. . సగరిగ. . సానీ. . పా. . మా గమపా. .

సత్యము తెలియని గమ్యము దొరకని వారికేగా కల్వరి స్వరము
శాంతి లేకటు బ్రతుకలేకిటు అల్లాడుచున్న వారికి స్వరము
ఆశల అలలో నిరాశల వలలో
చిక్కిన వారికి కల్వరి స్వరము చిక్కిన వారికి ప్రభునీ స్వరము

గాలి తుఫానులో చెదరిన వారిని దరికి చేర్చును కల్వరి స్వరము
చితికిన బ్రతుకును పగిలిన గుండెను
ఆదరించును ప్రియుని స్వరము
దాహముగొనినా వరలకెల్లా
సేదదీర్చును కల్వరి స్వరము సేదదీర్చును ప్రభునీ స్వరము

మార్పును కోరక తీర్పును తలచక తిరుగువారికి కల్వరి స్వరము
పైకి భక్తితో లోపల రక్తితో బ్రతుకు వారికి కల్వరి స్వరము
వేడిగ లేక చల్లగ లేక
నులివెచ్చగుండే వారికి స్వరము నులివెచ్చగుండే వారికి స్వరము


Kalvari svaramu ni korake sumadhura svaramu mana korake
Mari alakimchuma prabu svaramu priya svaramu
Sa. . Sagariga. . Sani. . Pa. . Ma gamapa. .

Satyamu teliyani gamyamu dorakani varikega kalvari svaramu
Samti lekatu bratukalekitu alladuchunna variki svaramu
Asala alalo nirasala valalo
Chikkina variki kalvari svaramu chikkina variki prabuni svaramu

Gali tupanulo chedarina varini dariki cherchunu kalvari svaramu
Chitikina bratukunu pagilina gumdenu
Adarimchunu priyuni svaramu
Dahamugonina varalakella
Sedadirchunu kalvari svaramu sedadirchunu prabuni svaramu

Marpunu koraka tirpunu talachaka tiruguvariki kalvari svaramu
Paiki baktito lopala raktito bratuku variki kalvari svaramu
Vediga leka challaga leka
Nulivechchagumde variki svaramu nulivechchagumde variki svaramu

Kalalo aa ratri కలలో ఆ రాత్రి

కలలో ఆ రాత్రి మదిలో
ఊహలలో తలపుల తలుపులు కదిలె
కలలో కనిపించె నాకు ఆరుదైన రూపమొకటి
కలయో నజమో నేను వర్ణింప లేనుఅది
ఆర్ధా రాత్రి వేళ లేచి మేళ్కొని జూచి
ఇంట బయట కాదు నాలోనే అలజడివుంది
మరువని భావమా నాకు కలిగిన భాగ్యమా ఆ.. ఆ..

హిమముకు హెచ్చిన అతి తెల్లని రూపం
పగటికి మించిన ప్రకాశమానం
రాత్రిలో కలుగని అతి చల్లని కాంతాం
తారలకు తెలియని తేజాత్మ ప్రభావం
తీరములు దాటినా ఆలలు ఎగసి లేచినా
గాడాంధకారము క్రమ్మినా
చెరుగని ఆరూపము

కన్నులకు విందుగా సర్వేశ్వర రుపం
చూపుకు మెండుగా దయనందన రూపం
సుందర వదనిగా సిలువ స్వరూపం
పరిపూర్ణ విభునిగా సింహాసన పీఠం
ఏమి ఆ నయనమో పరమ త్రిత్వపు రూపమా
దూతాళి సైన్యసమూహముతో
పరిశుద్ధ ప్రభుయేసుడే


Kalalo aa ratri madilo
Uhalalo talapula talupulu kadile
Kalalo kanipimche naku arudaina rupamokati
Kalayo najamo nenu varnimpa lenu adi
Ardha ratri vela lechi melkoni juchi
Imta bayata kadu nalone alajadivumdi
maruvani bavama naku kaligina bagyama aa.. aa..

Himamuku hechchina ati tellani rupam
Pagatiki mimchina prakasamanam
Ratrilo kalugani ati challani kamtam
Taralaku teliyani tejatma prabavam
Tiramulu datina alalu egasi lechina
Gadamdhakaramu krammina
cherugani arupamu

Kannulaku vimduga sarvesvara rupam
chupuku memduga dayanamdana rupam
Sumdara vadaniga siluva svarupam
Paripurna vibuniga simhasana pitham
Emi A nayanamo parama tritvapu rupama
Dutali sainyasamuhamuto
Parisuddha prabuyesude

Karunaa karudaa కరుణా కరుడా

కరుణా కరుడా – నీ మార్గము – పరిశుద్ధ స్థలములో గలదు – అది

యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు – వారు
తిరిగి వచ్చెదరు సీయోనునకు

చక్కగ వారి తలలమీద శాశ్వతానందము కలుగున్ – తమ
సంతోషం అధికంబగును

మోక్షానంద భాగ్యముగలిగి అక్షయులై అరుదెంచెదరు – తమ
దుఃఖం నిట్టూర్పును పోవును

విరివిగ శిష్యులానందముతో పరిశుద్ధాత్మతో నిండి – తమ
ప్రభుని కొనియాడిరి బహుగా

ప్రభు రాజ్యము తిని త్రాగుట కాదు
ప్రవిమల నీతి సమాధానం – అది – పరిశుద్ధాత్మానందము

మహోన్నతుడే మనకానందం
మహా బలము కలుగును గాక – అది మహిమార్థంబగును గాక

హల్లెలూయ ఎల్లరుపాడి
హర్షింతుము ప్రభుయేసునిలో – మన రక్షకుడేసుని పాడెదము


Karunaa karudaa – nee maargamu
Parishudhdha sthalamuloa galadhu – adhi

Yehoavaa vimoachinchina vaaru paatalu paaduchu – vaaru
Thirigi vachchedharu seeyoanunaku

Chakkaga vaari thalalameedha shaashvathanandhamu kalugun
Tham Santhosham adhikambagu

Moakshaanandha bhaagyamugaligi akshyulai arudhenchedharu
tham dhuhkham nittoorpunu poavunu

Viriviga shishyulanandhamuthoa parishudhdhaathmathoa nindi
Tham prabhuni koniyaadiri bahugaa

Prabhu raajyamu thini thraaguta kaadhu
Pravimala neethi samaadhanam – adhi parishudhdhaathmaanandhamu

Mahoannathudae manakaanandham
Mahaa balamu kalugunu gaaka – adhi mahimaarthanbagunu gaak

Hallelooya ellarupaadi
Harshinthumu prabhuyaesuniloa – mana rakshkudaesuni paadedhamu

Kreesthu yoadhulaaraa క్రీస్తు యోధులారా

క్రీస్తు యోధులారా
యుద్ధ మాడుఁడీ
క్రీస్తు సిల్వ మీరు
పట్టి గెల్వుఁడీ
మన రాజు క్రీస్తు
దండు నడ్పును
చూడు మాకు ముందు
క్రీస్తు ధ్వజము.
|| క్రీస్తు వీరులారా
యుద్ధ మాడుఁడీ
క్రీస్తు ధ్వజ మెత్తి
జయ మొందుఁడీ ||

లోక రాజ్య కీర్తి
వాడిపోవును
క్రీస్తు రాజ్యమైన
నిత్య ముండును
సాతా నాధిపత్య
మాఁగిపోవును
క్రీస్తు దివ్య సభ
జయ మొందును.

ఓ జనంబులారా
వచ్చి చేరుఁడీ
జయ కీర్తనంబు
లెత్తి పాడుఁడీ
కీర్తి, స్తుతి, ఘవ
మెన్నఁ డుండును
మన క్రీస్తు రాజు
నిత్య మేలును.


Kreesthu yoadhulaaraa
yudhdha maadudee
kreesthu silva meeru
patti gelvudee
mana raaju kreesthu
dhandu nadpunu
choodu maaku mundhu
kreesthu dhvajamu.
|| kreesthu veerulaaraa
yudhdha maadudee
kreesthu dhvaja meththi
jaya mondhudee ||

Loaka raajya keerthi
vaadipoavunu
kreesthu raajyamaina
nithya mundunu
saathaa naadhipathya
maagipoavunu
kreesthu dhivya sabha
jaya mondhunu.

Oa janambulaaraa
vachchi chaerudee
jaya keerthanambu
leththi paadude
keerthi, sthuthi, ghava
menna dundunu
mana kreesthu raaju
nithya maelunu.

Kristu mahimake క్రీస్తు మహిమకే

క్రీస్తు మహిమకే మా ప్రాణం మా జీవం మా సర్వం
లోకము మరచి పాడెదము స్తుతి గీతం కలకాలం
చప్పట్లతో తాళాలతో నాట్యముతో కొనియాడెదం
తప్పెట్లతో భజనలతో శాంతి సువార్తను ప్రకటించెదమ్

అడుగులు తడబడు వేళ
జారనీయక నిలిపి ఇక్కట్టులో
దరి చేరి వ్యథను తీర్చాడు
ఈ సామర్థ్యమెవరికి లేదు
ధర ఎవరికి సాధ్యము కాదు
ఏది ఏమైనను నే యేసయ్యనే
స్తుతి గళమెత్తి మనసారా భజియింతుము

ఆత్మీయ పోరాటమును మాకు నేర్పిన గురువు
పోరాడువాడు తానై జయమునిచ్చాడు
మాకు మెళుకువ నేర్పువాడు ప్రార్థనాయుధమును ఇచ్చాడు
నాశనమవ్వని జీవకీరింటము నాకు
తప్పక బహుమతిగా అందించును


Kristu mahimake ma pranam ma jivam ma sarvam
Lokamu marachi padedamu stuti gitam kalakalam
Chappatlato talalato natyamuto koniyadedam
Tappetlato bajanalato samti suvartanu prakatimchedam

Adugulu tadabadu vela
Jaraniyaka nilipi ikkattulo
Dari cheri vyathanu tirchadu
I samarthyamevariki ledu
Dhara evariki sadhyamu kadu
Edi emainanu ne yesayyane
Stuti galametti manasara bajiyimtumu

Atmiya poratamunu maku nerpina guruvu
Poraduvadu tanai jayamunichchadu
Maku melukuva nerpuvadu prarthanayudhamunu ichchadu
Nasanamavvani jivakirimtamu naku
Tappaka bahumatiga andinchunu

Kreesthu mimmulanu క్రీస్తు మిమ్ములను

క్రీస్తు మిమ్ములను స్వతంత్రుల జేసె
దాస్యపు కాడికి చిక్కుకొనకు

నీవు ఈ లోకములో నున్నను – కాని ఈ లోకమునకు జెందవు
లోకముతో ఏకీభవించకు లోకపు కాడికి చేరకుము

నీ శరీరేచ్ఛ దురాశలను సిలువపైన అంత మొందించు
పరిశుద్ధాత్మచే నడిపింపబడి శరీర ఆశల నెరవేర్చకు

దేవుని వాత్సల్యమును పరిశుద్ధముగా మీ శరీరములన్
అనుకూల సజీవ యాగముగ అర్పించుకొనుడి ప్రభువునకే

మీరు క్రీస్తుతో లేపబడిన పైనున్న వాటినే వెదకుడి
లోకమునకు మీరు మరణించి పరలోక వాటినే ప్రేమించుడి


Kreesthu mimmulanu svathanthrula jaese
Dhaasyapu kaadiki chikkukonaku

Neevu ee loakamuloa nunnanu – kaani ee loakamunaku jendhavu
Loakamuthoa aekeebhavinchaku loakapu kaadiki chaerakumu

Nee shareeraechcha dhuraashalanu siluvapaina antha mondhinchu
Parishudhdhaathmachae nadipinpabadi shareera aashala neravaerchaku

Dhaevuni vaathsalyamunu parishudhamugaa mee shareeramulan
Anukoola sajeeva yaagamuga arpinchukonudi prabhuvunakae

Meeru kreesthuthoa laepabadina painunna vaatinae vedhakudi
Loakamunaku meeru maraninchi paraloaka vaatinae preminchudi

Kreesthu prabhukae క్రీస్తు ప్రభుకే సకల

క్రీస్తు ప్రభుకే సకల మహిమ – శాశ్వతంబైనది తన రాజ్యం

మర్మంబిదియే – కనుమా ప్రియుడా – ఉర్విని మానవ – సాయము లేక
పర్వతంబు నుండి – మల్చబడె నొకరాయి

మేలిమి వెండి – రాజ్యాలను – యిత్తడి యినుప – రాజ్యాదులను
ఈ రాయియే నలుగ – గొట్టును చెత్తవలెనే

ప్రియుడా వింతై – న యీ రాయి – పెరిగి భులో – కమంతాయె
ప్రభు క్రీస్తుని వింత – సార్వత్రిక సంఘమిదే

ఆ రాజ్యమును – చూచు భాగ్యం – ఆ రాజ్యములో – చేరెడి భాగ్యం
అనుభవింపనగును – పరిశుద్ధ ప్రజలకే

ఈ సుహృదయ – శుద్ధి నీకు – క్రీస్తు ప్రభువే – కలుగ చేయున్
యేసాటియులేని – ఈ శుద్ధి నొందుము

మనకిచ్చిన ఆ – హ్వానంబునకు – తన రాజ్యని – త్యమహిమలకు
తగినయట్టి రీతిన్ – నడుచుకోవలె ప్రియుడా


Kreesthu prabhukae sakala mahima
Shaashvathanbainadhi thana raajyam

Marmambidhiyae – kanumaa priyudaa
Urvini maanava – saayamu laek
Parvathambu nundi – malchabade nokaraayi

Maelimi vendi – raajyaalanu
Yiththadi yinupa – raajyaadhulanu
Ee raayiyae naluga – gottunu cheththavalenae

Priyudaa vinthai – na yee raayi
Perigi bhuloa – kamanthaaye
Prabhu kreesthuni vintha – saarvathrika sangamidhae

Aa raajyamunu – choochu bhaagyam
Aa raajyamuloa – chaeredi bhaagyam
Anubhavimpanagunu – parishudhdha prajalakae

Ee suhrudhaya – shudhdhi neeku
Kreesthu prabhuvae – kaluga chaeyun
Yaesaatiyulaeni – ee shudhdhi noMdhumu

Manakichchina aa – hvaanambunaku
Thana raajyani – thyamahimalaku
Thaginayatti reethin – naduchukoavale priyudaa

Kreesthu chenthaku క్రీస్తు చెంతకు రమ్ము

క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా
యేసు చెంతకు రమ్ము ప్రియుడా
జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్

ఆయనే జీవజలము – నిత్యమైన తృప్తినిచ్చును
నీవు ఆ జలము త్రాగిన – ఇంకెన్నడు దప్పిగొనవు
యుగ యుగములవరకు

ఆయనే జీవాహారము – నిత్యమైన తృప్తినిచ్చును
జీవాహారము భుజించిన – ఆకలిగొనవెప్పుడు
యుగ యుగములవరకు

ఆయనే జీవ మార్గము – స్వర్గరాజ్యమును చేరను
ఆయన నంగీకరించిన – తండ్రియొద్దకు చేరెదవు
యుగములు రాజ్య మేలను

ఆయనే యేకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను
నీ వందు ప్రవేశించిన – చేరుదువు నిశ్చయముగ
నిత్యసుఖము లొందెదవు

ఆయనే నిత్య సత్యము – సర్వలోకమును రక్షింప
ఆయనను స్వీకరించిన – నిత్య శిక్షనుండి తప్పించున్
సదా ఆయనతో నుందువు


Kreesthu chenthaku rammu priyudaa
Yaesu chenthaku rammu priyudaa
Jeevajalamunu thraagi nee dhaahamu theerchukonan

Aayanae jeevajalamu – nithyamaina thrupthinichchunu
Neevu aa jalamu thraagina – inkennadu dhappigonavu
Yuga yugamulavaraku

Aayanae jeevaahaaramu – nithyamaina thrupthinichchunu
Jeevaahaaramu bhujinchina – aakaligonaveppudu
Yuga yugamulavaraku

Aayanae jeeva maargamu – svargaraajyamunu chaeranu
Aayana nangeekarinchina – thandriyodhdhaku chaeredhavu
Yugamulu raajya maelanu

Aayanae yaekaika dhvaaram svargaraajyamu chaeranu
Nee vandhu pravaeshinchina – chaerudhuvu nishchayamug
Nithyasukhamu londhedhavu

Aayanae nithya sathyamu – sarvaloakamunu rakshinp
Aayananu sveekarinchina – nithya shikshnundi thappinchun
Sadhaa aayanathoa nundhuvu

Kreesthaesu siluvapai క్రీస్తేసు సిలువపై

క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి – ఆయన కృపయందే నిలుచుండుము
పరలోక మహిమ కిరీటముకై – క్రీస్తేసు అడుగులలో నడువుము
క్రీస్తేసు సిలువపై దృష్టినుంచు

సమాదాన దేశం పరలోకము – ఎన్నో దీవెనలు కలవందున
ఇహలోక శాంతి క్షణమాత్రమే – గొప్ప శిక్ష యందు దాగియుండె

క్రీస్తు నుండి నిన్ను దూరపరచ – లోకాశలు నిన్ను ఆకర్షించు
సిలువను చూడక పోయినచో – చిక్కుకొనెదవు ఈ లోకములో

ప్రభుయేసు సహవాసమున నిలిచి – సాతానుకు స్థలమియ్యకుము
ఏవి క్రీస్తునుండి విడదీయునో – యేసు రక్తమందు కడుగుకొనుము

పరలోక దీవెనలు రుచిచూడను – ఆశతో వెళ్ళను సిద్ధపడు
లోకమునకు నీవు వేరైనచో – ఆత్మీయముగ నీవు యెదిగెదవు


Kreesthaesu siluvapai dhrushtinunchi
aayana krupayandhae niluchundumu
Paraloaka mahima kireetamukai
kreesthaesu adugulaloa naduvumu
Kreesthaesu siluvapai dhrushtinunchu

Samaadhaana dhaesham paraloakamu
ennoa dheevenalu kalavandhuna
Ihaloaka shanthi kshnamaathramae
goppa shiksh yandhu dhaagiyunde

Kreesthu nundi ninnu dhooraparacha
loakaashalu ninnu aakarshinchu
Siluvanu choodaka poayinachoa
chikkukonedhavu ee loakamuloa

Prabhuyaesu sahavaasamuna nilichi
saathaanuku sthalamiyyakumu
Aevi kreesthunundi vidadheeyunoa
yaesu rakthamandhu kadugukonumu

Paraloaka dheevenalu ruchichoodanu
aashathoa vellanu sidhdhapadu
Loakamunaku neevu vaerainachoa
aathmeeyamuga neevu yedhigedhavu