అద్భుత దీవెనలు – ప్రభువా కుమ్మరించితివి
నీదు ప్రేమ అపారము – ప్రభువా మాపై జూపితివి
మానవుని చేసినావు – నీ స్వంత రూపమునకు
నీ కిష్టులముగా బ్రతికి – దీవెనలెన్నో పొందెదము
నూతన జన్మవలన – ఆశీర్వాదములు దొరికె
శాపమును దూరపరచి – సర్వంబు క్రొత్తజేసె
లోకమునుండి వేరై – సిలువను మోయవలెను
అప్పుడే ప్రభు దీవించు – స్వాస్థ్యమును గాంచుమెంతో
తన సుతులుగాను మెలిగి – తన చిత్తమందు నిలిచి
జీవజలమును పొంది – దేవెనలెన్నో పొందెదము
ఆత్మీయముగ నడిచి – శరీర క్రియలను విడిచి
ఆయన స్వరము వినుచు – దీవెనలెన్నో పొందెదము
ఆశీర్వాదముల కొరకు – పిలువబడియున్న మనము
ఆజ్ఞలను నెరవేర్చినతో – దీవెనలెన్నో పొందెదము
adhbhutha dheevenalu – prabhuvaa kummariMchithivi
needhu praema apaaramu – prabhuvaa maapai joopithivi
maanavuni chaesinaavu – nee svMtha roopamunaku
nee kiShtulamugaa brathiki – dheevenalennoa poMdhedhamu
noothana janmavalana – aasheervaadhamulu dhorike
shaapamunu dhooraparachi – sarvMbu kroththajaese
loakamunuMdi vaerai – siluvanu moayavalenu
appudae prabhu dheeviMchu – svaasThyamunu gaaMchumeMthoa
thana suthulugaanu meligi – thana chiththamMdhu nilichi
jeevajalamunu poMdhi – dhaevenalennoa poMdhedhamu
aathmeeyamuga nadichi – shareera kriyalanu vidichi
aayana svaramu vinuchu – dheevenalennoa poMdhedhamu
aasheervaadhamula koraku – piluvabadiyunna manamu
aajnYlanu neravaerchinathoa – dheevenalennoa poMdhedhamu