పల్లవి: అందరము ప్రభు నిన్ను కొనియాడెదము
మహాత్ముండవు పరిశుద్ధుడవు
బలియైతివి లోకమును రక్షించుటకు
- అపారము నీ బుద్ధిజ్ఞాన మెంతయో
సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది
సర్వలోకము నీదు వశమందున్నది - గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా
అద్భుతములు చేయు దేవ నీవే ఘనుడవు
శత్రువులను అణచునట్టి విజయశాలివి - బండవైన ప్రభూ మమ్ము స్థిరపరచితివి
నీదు మార్గములు యెంతో అగమ్యంబులు
కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు - కృపాళుండవైన యేసు దయగల దేవా
దయాకనికరములు గల దీర్ఘశాంతుడవు
వేల వేల తరములలో కృపను జూపెదవు - క్షమించెదవు మానవుల పాపములెల్ల
విరోధులకు ప్రేమ జూపు దయామయుడవు
పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా
Chorus: aMdharamu prabhu ninnu koniyaadedhamu
mahaathmuMdavu parishudhDhudavu
baliyaithivi loakamunu rakShiMchutaku
- apaaramu nee budhDhijnYaana meMthayoa
saamarThyudavaina needhu shakthi goppadhi
sarvaloakamu needhu vashamMdhunnadhi - goppa kaaryamulu chaeyu sarvashakthudaa
adhbhuthamulu chaeyu dhaeva neevae ghanudavu
shathruvulanu aNachunatti vijayashaalivi - bMdavaina prabhoo mammu sThiraparachithivi
needhu maargamulu yeMthoa agamyMbulu
kuthMthramu laedhu neeloa neethimMthudavu - krupaaLuMdavaina yaesu dhayagala dhaevaa
dhayaakanikaramulu gala dheerghashaaMthudavu
vaela vaela tharamulaloa krupanu joopedhavu - kShmiMchedhavu maanavula paapamulell
viroaDhulaku praema joopu dhayaamayudavu
paapamulanu dhvaeShiMchedu nyaayavMthudaa