Amulyarakthamu dhvaaraa
అమూల్యరక్తము ద్వారా

అమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారా
సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము

మన యౌవన జీవితముల్ – శరీరాశకు లోబరచి
చెడుమాటలను పలుకుచు – శాంతిలేక యుంటిమిగా

చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము
నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి

నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక
స్వంత నీతితోడనే – దేవుని రాజ్యము కోరితిమి

కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను
ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను

తన రక్తధారలలో – మన పాపములను కడిగి
మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో

పాపులమైన మనమీద – తన యాశ్చర్య ఘనప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము

మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా
మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములన్


Amoolyarakthamu dhvaaraarakShNapoMdhina janulaaraa
sarvashakthuni prajalaaraa parishudhDhulaaraa paadedhamu
ghanatha mahima sthuthulanu parishudhDhulaaraa paadedhamu

Mana yauvana jeevithamul – shareeraashaku loabarachi
chedumaatalanu palukuchu – shaaMthilaeka yuMtimigaa

Chedu maargamuna poathimi – dhaani yMthamu maraNamu
naraka shikShku loabaduchu – paapapu Dhanamu poMdhithimi

Nithya sathya dhaevuni – naamamuna moralidak
svMtha neethithoadanae – dhaevuni raajyamu koarithimi

Kanikaramugala dhaevudu – maanavaroopamu dhaalchenu
praaNamu siluvanu balijaesi – manala vimoachiMchenu

Thana rakthaDhaaralaloa – mana paapamulanu kadigi
mana kannulanu therachi – manala niMpenu jnYaanamuthoa

Paapulamaina manameedha – thana yaashcharya ghanapraem
kummariMchenu mana prabhuvu – kruthajnYtha chelliMthumu

Mana rakShkuni sthuthiMchedhamu – manalanu jaesenu Dhanyulugaa
mana dhaevuni karpiMchedhamu – jeevaathma shareeramulan


Posted

in

by

Tags: