అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య…
- నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచె
ఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె…||అ|| - మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయ
మొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి జయధ్వనులిడిరె ||అ|| - ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించా
ధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా ||అ|| - లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములని
జాగినయేల యేసును చేరి జయమని పాడుము అభయమని ||అ|| - పావనయేసుని పదముల చేరుము పాపములను తొలగించు
నిదే జీవము నిచ్చును భావము మార్చును దేవ దేవుని కరుణ యిదే ||అ|| - హల్లెలూయ పాటలు పాడుదము ఆనందముతో ప్రభు
చాటుదము అలరాకడకై తలలెత్తుదము ఆ ప్రభురాగా వెళ్ళుదము ||అ||
andhudaa raavaa aramarayaela adugoanayya! ayyoa adugoa yaesayya…
- neethisooryudu nirmalajyoathi ninu veligiMpanu narudheMche
khyaathiga siluvaloa karamulu joochi kanneenarolukuchu ninupiliche ||a|| - maraNapushakthini maarkoniyaesu maraNamunuMdi jaya
moMdhae paramMdhali thMdriyu dhoothalugani karamuleththi jayaDhvanulidire ||a|| - Dhairyamuchedenu sruShtikini aa dhaiva maraNamunu thilakiMchaa
Dhairyamu chedenu aDhikaarulakunu dhaathanu chaeranu gaTinMbaa ||a|| - loakapu jnYaanamu vyarThamani yika shoaka moMdhadi dhinamulani
jaaginayaela yaesunu chaeri jayamani paadumu abhayamani ||a|| - paavanayaesuni padhamula chaerumu paapamulanu tholagiMchu
nidhae jeevamu nichchunu bhaavamu maarchunu dhaeva dhaevuni karuNa yidhae ||a|| - hallelooya paatalu paadudhamu aanMdhamuthoa prabhu
chaatudhamu alaraakadakai thalaleththudhamu aa prabhuraagaa veLLudhamu ||a||