Apu darchakaadhu luppomgiri prabhu
అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభు

అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని విపరీతముగఁ జంపసాగిరి
కృపమాలినట్టి పా పపు జిత్తమున నిష్ఠు రపు సిల్వమానిపైఁ బ్రభుని వేయుట కొప్పి ||రపు డర్చ||

యెరూషలేమను నూరి బైటను దుఃఖ కరమైన కల్వరిమెట్టను పరమ
సాధుని సిల్వ పైఁ బెట్టి తత్పాద కరమధ్యముల మేకు లరుదుగ దిగఁ గొట్టి ||రపు డర్చ||

చిమ్మె నిమ్మగు మేని రక్తము దాని నమ్ము వారల కెంతో యుక్తము
నెమ్మోము వాడి కెం దమ్మి పూవలె మస్త కమ్ము వేటులను ర క్తము జారి కనుపట్టె ||నపు డర్చ||

గడి దొంగ లిరువురుని బట్టిరి ప్రభుని కుడి యెడమలను సిల్వఁ
గొట్టిరి చెడుగు యూదులు బెట్టు కడు బాధలను మరియ కొడు కోర్చుకొని వారి యెడ దయ విడఁడయ్యె ||నపు డర్చ||


Apu darchakaadhu luppoMgiri prabhuni vipareethamugAO jMpasaagiri
krupamaalinatti paa papu jiththamuna niShTu rapu silvamaanipaiAO brabhuni vaeyuta koppi ||rapu darcha||

YerooShlaemanu noori baitanu dhuHkha karamaina kalvarimettanu parama
saaDhuni silva paiAO betti thathpaadha karamaDhyamula maeku larudhuga dhigAO gotti ||rapu darcha||

Chimme nimmagu maeni rakthamu dhaani nammu vaarala keMthoa yukthamu
nemmoamu vaadi keM dhammi poovale mastha kammu vaetulanu ra kthamu jaari kanupatte ||napu darcha||

Gadi dhoMga liruvuruni battiri prabhuni kudi yedamalanu silvAO
gottiri chedugu yoodhulu bettu kadu baaDhalanu mariya kodu
koarchukoni vaari yeda dhaya vidAOdayye ||napu darcha||


Posted

in

by

Tags: