Author: admin

  • Maelukonarae మేలుకొనరే

    మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక
    పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింప గ్రక్కున ||మేలుకొనరే||

    దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుదయింపనయ్యెను
    మ్రొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు మూల
    కర్తకుఁ గొలువసేయఁగ ||మేలుకొనరే||

    పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని మహిమలు బల్కఁ దొడఁగెను
    రక్షకుని సకలోపకృతులను రమ్యముగ
    నుతియించి పాడఁగ ||మేలుకొనరే||

    నిదుర బోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాసియుండక
    పదిలముగ రక్షించు దేవునిఁ బ్రస్తుతింప
    మహాముదంబున ||మేలుకొనరే||

    మేటియౌ హృదయాబ్జములలో మీ కృతాజ్ఞతా భూషణంబులు
    నేటుగా ధరియించుకొని యిటు
    నిర్మలాత్మునిఁ బూజసేయఁగ ||మేలుకొనరే||

    తెల్లవారఁగఁ దెలియరే యిది తెలివిగల మానవ సమాజము
    యల్లసిల్లుచు నీతి భాస్కరుఁడుదయ
    మయ్యెను హృదయముల పై ||మేలుకొనరే||


    Maelukonarae mee manmbula maelimiga
    mee maera dhappaka
    paalu maalaka laechi dhaevuni paadhamulu
    poojimpa grakkuna ||maelukonarae||

    Dhikku lellanu dhaejarillenu
    dhinakarumdudhayimpanayyenu
    mrokkulaku prathiphlamu nichchedu
    moola karthaku goluvasaeyaga ||maelukonarae||

    Pakshulellanu gilakilmchunu brabhuni
    mahimalu balka dhodagenu
    rakshkuni sakaloapakruthulanu ramyamuga
    nuthiyimchi paadaga ||maelukonarae||

    Nidhura boayina vaeLa mimmoka
    nimiShmainanu baasiyumdaka
    padhilamuga rakshimchu dhaevuni brasthuthimpa
    mahaamudhmbuna ||maelukonarae||

    Maetiyau hrudhayaabjamulaloa mee
    kruthaajnythaa bhooshnmbulu
    naetugaa Dhariyimchukoni yitu nirmalaathmuni
    boojasaeyaga ||maelukonarae||

    Thellavaaraga dheliyarae yidhi
    thelivigala maanava samaajamu
    yallasilluchu neethi bhaaskarududhaya
    mayyenu hrudhayamula pai ||maelukonarae||

  • Maelukoni yika మేలుకొని యిక లేచి

    మేలుకొని యిక లేచి యేసుని మేలులన్ వేనోళ్ల బాడరే బాలబాలికలారా
    చాలా పాడరే వేలపాడరే ||మేలు||

    పక్షి గణములు కూడి దేవుని ప్రేమ నెల్లను పొగడుచున్నవి బాపహరుడగు
    క్రీస్తు చెంతకు పారుమా రక్షణ కోరుమా ||మేలు||

    అరుణరాగము వెల్లి విరిసెను ఆకసంబున జుక్కలణగెను తరుణ
    ముననే లేచి దేవుని కెఱగుమా దీవెన కరుగుమా ||మేలు||

    తెల్లవారెను లోకమెల్లను తెలివిగొని మున్ముందు దేవుని తల్లి దండ్రియు
    గురుడవీవని దలచుచూ తగధ్యానించుమా ||మేలు||

    జగములెల్లను జంతుజాలము ల గణితంబగు జీవులెల్లను సొగసున
    న్వేనోళ్ల బొగడుట జూడుమా నీవును పాడుమా ||మేలు||

    నీతి భాస్కరుడుదయమాయెను నూతనోజ్జీవన
    మొసంగను సతత మాతని
    దాపున న్వసియించుమా తగ జీవించుమా ||మేలు||


    Maelukoni yika laechi yaesuni maelulan
    vaenoaLla baadarae baalabaalikalaaraa
    chaalaa paadarae vaelapaadarae ||maelu||

    Pakshi ganamulu koodi dhaevuni praema
    nellanu pogaduchunnavi baapaharudagu
    kreesthu chemthaku paarumaa rakshna koarumaa ||maelu||

    Arunaraagamu velli virisenu aakasmbuna jukkalanagenu tharuna
    munanae laechi dhaevuni keragumaa dheevena karugumaa ||maelu||

    Thellavaarenu loakamellanu thelivigoni
    munmundhu dhaevuni thalli dhndriyu
    gurudaveevani dhalachuchoo thagadhyaaninchumaa ||maelu||

    Jagamulellanu jmthujaalamu la ganithmbagu
    jeevulellanu sogasuna
    nvaenoaLla bogaduta joodumaa neevunu paadumaa ||maelu||

    Neethi bhaaskarududhayamaayenu noothanoajjeevana
    mosmganu sathatha maathani
    dhaapuna nvasiyimchumaa thaga jeevimchumaa ||maelu||

  • Maelukoa mahima మేలుకో మహిమ

    మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు

    పరమునుండి – బూర ధ్వనితో అరయు నేసు – ఆర్భాటముతో
    సర్వలోకము – తేరిచూచును త్వరపడు ఓ ప్రియుండా

    గురుతులెల్ల – ధరణియందు సరిగ చూడ – జరుగుచుండ
    చిరునవ్వుతో – చేరి ప్రభుని త్వరపడు ఓ ప్రియుండా

    క్రీస్తునందు – మృతులెల్లరు కడబూర – మ్రోగగానే
    క్రీస్తువలె – తిరిగి లేతురు – లేతువా నీవు ప్రియుడా

    అరయంగ – పరిశుద్ధులు మురిసెదరు – అక్షయ దేహులై
    పరమందు – ప్రభుక్రీస్తు నిరతము – ఓ ప్రియుండా

    కరుణలేని – ఓ మరణమా నిరతము నీకు జయమగునా
    మరణ సంహా – రుండేసు త్వరగా – రానై యున్నాడు

    మాంసలోక – పిశాచాదులు హింస పరచ – విజృంభించిన
    లేశమైనను – జడియకుము ఆశతో – కాచుకొనుము

    పాపమును – చేయకుమా రేపకుమా – దైవ కోపమును
    శాపమును – తప్పుకొని శ్రద్ధతో – కాచుకొనుమా


    Maelukoa! mahima raaju vaegamae raanai yunnaadu

    Paramunumdi – boora dhvanithoa arayu naesu – aarbhaatamuthoa
    sarvaloakamu – thaerichoochunu thvarapadu oa priyumdaa

    Guruthulella – dharaniymdhu sariga chooda – jaruguchumd
    chirunavvuthoa – chaeri prabhuni thvarapadu oa priyumdaa

    KreesthunMdhu – mruthulellaru kadaboora – mroagagaanae
    kreesthuvale – thirigi laethuru – laethuvaa neevu priyudaa

    Araymga – parishudhdhulu murisedharu – akshya dhaehulai
    paramandhu – prabhukreesthu nirathamu – oa priyumdaa

    Karunalaeni – oa maranamaa nirathamu neeku jayamagunaa
    marana samhaa – rumdaesu thvaragaa – raanai yunnaadu

    Maamsaloaka – pishaachaadhulu himsa paracha – vijrumbhimchin
    laeshamainanu – jadiyakumu aashathoa – kaachukonumu

    Paapamunu – chaeyakumaa raepakumaa – dhaiva koapamunu
    shaapamunu – thappukoni shradhdhathoa – kaachukonumaa

  • Maelkonumu మేల్కొనుము

    మేల్కొనుము ఓ కావలి యేసుని యోధుడవు
    పోరాడవలె నీవే ప్రభు శక్తితో పోవలెన్

    శత్రువు లెందరో నీ చుట్టు చేరియున్నారు
    తప్పించు కొందువెట్లు? ప్రభువాజ్ఞను పాలించు

    ఆయుధములు తీసుకో పొందుము ప్రభు శక్తిని
    స్థిరుడవై నిలువవలె శత్రువులందరి యెదుట

    సిద్ధపడు మిప్పుడే ఆయుధము పట్టుకో
    ఆత్మీయ యుద్ధం నీది భయపడ కెవ్వరికి

    సత్యము నీనడికట్టు తొలగు అబద్ధము నుండి
    తొడుగుకో మైమరువును – ఆత్మ రక్షణ పొందను

    పాదరక్షలు ధరించు అందించు సువార్తను
    విశ్వాసమను డాలుతో దుష్టుని అగ్నినార్పు

    శిరస్త్రాణము ధరించు కనుపరచు నీ రక్షణ
    ఆత్మఖడ్గము తీసికో – వాక్యమే ఆ ఖడ్గము

    ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్ఠాయుధమదియే
    గురియెన్నడు తప్పవు మెలకువగా నుండిన


    Maelkonumu oa kaavali yaesuni yoadhudavu
    poaraadavale neevae prabhu shakthithoa poavalen

    Shathruvu lemdharoa nee chuttu chaeriyunnaaru
    thappimchu komdhuvetlu prabhuvaajnynu paalimchu

    Aayudhamulu theesukoa pomdhumu prabhu shakthini
    sthirudavai niluvavale shathruvulmdhari yedhut

    Sidhdhapadu mippudae aayudhamu pattukoa
    aathmeeya yudhdhm needhi bhayapada kevvariki

    Sathyamu neenadikattu tholagu abadhdhamu numdi
    thodugukoa maimaruvunu – aathma rakshna pomdhanu

    Paadharakshlu dharimchu amdhimchu suvaarthanu
    vishvaasamanu daaluthoa dhushtuni agninaarpu

    Shirasthraanamu dharimchu kanuparachu nee rakshn
    aathmakhadgamu theesikoa – vaakyamae aa khadgamu

    Praarthimchu mellappudu shraeshtaayudhamadhiyae
    guriyennadu thappavu melakuvagaa numdin

  • Maelkonumaa maelkonumaa మేల్కొనుమా మేల్కొనుమా

    మేల్కొనుమా మేల్కొనుమా
    యేసే నుడివెను ఓ ప్రియుడా మేల్కొనుమా మేల్కొనుమా

    తెలిసికొనుము వివేచించి విభుని యొక్క చిత్తంబేమో
    కాలవిలువను యెరిగి మేల్కొనుమా

    నమ్మజాల మీ లోకమును నీ జీవమేపాటిది
    సమస్తంబు వ్యర్థంబేగా ప్రార్థించుమా

    తప్పుడు బోధలనుండి భద్రపరచు కొనుము నీవు
    ఎప్పుడు ప్రభు యిష్టమును నెరవేర్చుమా

    ఆవేశము వ్యర్థంబేగా ప్రవర్తింపకు డంబముగా
    అహంకార గర్వమునుండి తప్పించుకో

    యేసు శీఘ్రముగావచ్చు యెదురు చూడవలెను నీవు
    భాసురముగా తనతో వెళ్ళ సిద్ధపడుమా


    Maelkonumaa maelkonumaa
    yaesae nudivenu oa priyudaa maelkonumaa maelkonumaa

    Thelisikonumu vivaechimchi vibhuni yokka chiththmbaemoa
    kaalaviluvanu yerigi maelkonumaa

    Nammajaala mee loakamunu nee jeevamaepaatidhi
    samasthambu vyarthmbaegaa praarthimchumaa

    Thappudu boadhalanumdi bhadhraparachu konumu neevu
    eppudu prabhu yishtamunu neravaerchumaa

    Aavaeshamu vyarthmbaegaa pravarthimpaku dmbamugaa
    ahmkaara garvamunumdi thappimchukoa

    Yaesu sheeghramugaavachchu yedhuru choodavalenu neevu
    bhaasuramugaa thanathoa vella sidhdhapadumaa

  • Maelkonumaa మేల్కొనుమా

    మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమా
    యోచించుమా, మాటవినుమా పొందెదవు సర్వమున్

    యేసు పాదముల యొద్దకురా యేసు కర్పించు నీజీవితము
    నీ విపుడే (2) యెరుగు దీనిన్ – జ్ఞానము పొందెదవు

    జీవాహారము భుజించుమిపుదే జీవితమందు శక్తిని పొందు
    నీ విపుడే (2) యెరుగు దీనిన్ – జయమును పొందెదవు

    సర్వమున్ ప్రభువుతో నారంభించి – సర్వమున్ ముగించు మాయనతో
    నీ విపుడే (2) యెరుగు దీనిన్ – ప్రభువే గొప్పవాడని

    ఎవ్వరు ప్రభుసేవ చేసేదరో – ఎవ్వరాయనతో నడిచెదరో
    నీ విపుడే (2) యెరుగు దీనిన్ – పొందెదరు జీతమున్

    తుఫాను మధ్య నీవుండినను – ధైర్యముగ నీవు నడువవలెన్
    నీ విపుడే (2) యెరుగు దీనిన్ – విశ్రాంతి పొందెదవు

    నిద్రించి పొందకపోయి రేమియున్ – కలిగినదాని పోగొట్టుకొనిరి
    నీ విపుడే (2) యెరుగు దీనిన్ – లేచి పొందు ఘనత

    అంతము వరకు స్థిరముగ నుండిన – పొందెదవు ప్రభువిచ్చు ఘనత
    నీ విపుడే (2) పొందెదవు – జీవకిరీటమును


    Maelkonumaa, maelkonumaa naa praanamaa
    yoachimchumaa, maatavinumaa pomdhedhavu sarvamun

    Yaesu paadhamula yodhdhakuraa
    yaesu karpimchu neejeevithamu
    nee vipudae (2) yerugu dheenin
    jnyaanamu pomdhedhavu

    Jeevaahaaramu bhujimchumipudhae
    jeevithamandhu shakthini pomdhu
    nee vipudae (2) yerugu dheenin
    jayamunu pomdhedhavu

    Sarvamun prabhuvuthoa naarmbhimchi
    sarvamun mugimchu maayanathoa
    nee vipudae (2) yerugu dheenin
    prabhuvae goppavaadani

    Evvaru prabhusaeva chaesaedharoa
    evvaraayanathoa nadichedharoa
    nee vipudae (2) yerugu dheenin
    pomdhedharu jeethamun

    Thuphaanu madhya neevumdinanu
    dhairyamuga neevu naduvavalen
    nee vipudae (2) yerugu dheenin
    vishraamthi pomdhedhavu

    Nidhrimchi pomdhakapoayi raemiyun
    kaliginadhaani poagottukoniri
    nee vipudae (2) yerugu dheenin
    laechi pomdhu ghanath

    Amthamu varaku sthiramuga numdina
    pomdhedhavu prabhuvichchu ghanath
    nee vipudae (2) pomdhedhavu
    jeevakireetamunu

  • Maaru manassu మారు మనస్సు

    మారు మనస్సు పొందుము – ప్రభుని రాజ్యము సమీపించెను

    యెహోవా దేవుని రాజ్యము మహోన్నతమై వ్యాపించెను
    తన రాజ్యప్రభావమున్ తన ప్రజలు – తన శౌర్యమునెంతో చాటెదరు

    ఆయన రాజ్యము శాశ్వతము ఆత్మలో దీనులగువారు
    ఆ రాజ్య వాసులగుదురు – ఆయనకే మా వందన స్తుతులు

    నూతన జన్మానుభవము ద్వారా చూతురు ఆ రాజ్యంబును
    ఆత్మ జన్మమును గలవారై – ఆ రాజ్యములోన చేరెదరు

    రక్తమాంసంబులు దానిని స్వతంత్రించు కొనజాలవు
    స్వాస్థ్యం పాపులకసలే లేదు – దుష్టులకందులో భాగములేదు

    అంధకార రాజ్యమునుండి పొందుగా తన రాజ్యంబునకు
    ప్రభుదెచ్చె ప్రియమారగ మనల – ప్రశంస స్తుతి చెల్లించెదము


    Maaru manassu pomdhumu
    prabhuni raajyamu sameepimchenu

    Yehoavaa dhaevuni raajyamu
    mahoannathamai vyaapimchenu
    thana raajyaprabhaavamun thana prajalu
    thana shauryamunemthoa chaatedharu

    Aayana raajyamu shaashvathamu
    aathmaloa dheenulaguvaaru
    aa raajya vaasulagudhuru
    aayanakae maa vandhana sthuthulu

    Noothana janmaanubhavamu dhvaaraa choothuru aa raajymbunu
    aathma janmamunu galavaarai
    aa raajyamuloana chaeredharu

    Rakthamaamsmbulu dhaanini svathmthrimchu konajaalavu
    svaasthym paapulakasalae laedhu
    dhushtulakmdhuloa bhaagamulaedhu

    Amdhakaara raajyamunumdi pomdhugaa thana raajymbunaku
    prabhudhechche priyamaaraga manala
    prashmsa sthuthi chellimchedhamu

  • Mariyaku suthuduga మరియకు సుతుడుగ

    మరియకు సుతుడుగ ధరను జన్మించి
    ఇమ్మానుయేలాయెన్

    నిరుపేదగాను పశువుల పాకలో
    తేజోమయ ప్రభు భువుని శిశువుగ బుట్టెను

    పాపసంకటము పోగొట్ట ధరను – ప్రాపకుడు నరునిగ బేత్లెహేమున
    పాపపరిహారుడు నరుల మిత్రుడు – అవనిలో జన్మించెన్

    ఆకాశచుక్క భాసిల్లుచుండ – వీకతో దీనోపకారుడు వెలసెన్
    హీన సైతానుడు కూలిపోవగన్ – ప్రియముతో ఉదయించెన్

    దూత గణములు గీతముల్ పాడ – క్షితిలో నరులు మంగళము పాడ
    కన్య మరియమ్మ పాడెను లాలి – పుణ్యుడు జన్మించగా


    Mariyaku suthuduga dharanu janminchi
    immaanuyaelaayen

    Nirupaedhagaanu pashuvula paakaloa
    thaejoamaya prabhu bhuvuni shishuvuga buttenu

    Paapasmkatamu poagotta dharanu
    praapakudu naruniga baethlehaemun
    paapaparihaarudu narula mithrudu
    avaniloa janminchen

    Aakaashachukka bhaasilluchumda
    veekathoa dheenoapakaarudu velasen
    heena saithaanudu koolipoavagan
    priyamuthoa udhayimchen

    Dhootha ganamulu geethamul paada
    kshithiloa narulu mangalamu paad
    kanya mariyamma paadenu laali
    punyudu janmimchagaa

  • Mariya tanayudata మరియ తనయుడట

    మరియ తనయుడట మనుజ రూపుడట
    మాన వాళి నిజదేవుడట
    ఇది మరి తలచిన మరువక కొలచిన
    మానవాళి నిజ దేవుడట

    దావీదు అను పట్టణమునకు
    పరుగు పరుగునా పొదామా (2)

    పొత్తి గుడ్డలట చిన్ని తొట్టెలట
    పశుల పాకలో పుట్టెనట (2)


    Mariya tanayudata manuja rupudata
    Mana vali nijadevudata
    Idi mari talachina maruvaka kolachina
    Manavali nija devudata

    Davidu anu pattanamunaku
    Parugu paruguna podama (2)

    Potti guddalata chinni tottelata
    Pasula pakalo puttenata (2)

  • Meeraemi vedhakuchunnaaru మీరేమి వెదకుచున్నారు

    మీరేమి వెదకుచున్నారు
    సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే

    నా చెడు మార్గమును విడచితిని – నీచపు జీవితమును విడచితిని
    ఆయన దొరకు కాలమునందు – వేడగ క్షమియించి కడిగె నన్ను

    యెహోవా యొద్ద వరమడిగితిని – యెహోవా ప్రసన్నత చూడ
    బహుకాంక్షించి మందిరములో – ఇహమందు వసియింప గోరుదున్

    ఆయన రాజ్యమున్ వెదకుచున్నాను – తానే సమస్తము విత్తుననె గదా
    క్రీస్తుతో లేపబడిన చింతించక – పై నున్న వాటినే నే వెదకెదను

    దేవుని చిత్తము నే నెరుగుచును – ఆత్మచే దానిని నెర వేర్చెదను
    సీయోను పర్వతముపై నున్న – గొర్రె పిల్లను నే వెంబడించెదను

    ప్రార్థన సహవాసమును పొంది – రొట్టెను విరుచుటలో యెడ తెగక
    దేవుని వాక్య ఖడ్గము బూని – సేవను చేతుము సంఘమునందు


    Meeraemi vedhakuchunnaaru
    sooryuni krimdha jarugu kriyal vyarthamae

    Naa chedu maargamunu vidachithini
    neechapu jeevithamunu vidachithini
    aayana dhoraku kaalamunMdhu
    vaedaga kshmiyimchi kadige nannu

    Yehoavaa yodhdha varamadigithini
    yehoavaa prasannatha chood
    bahukaamkshimchi mandhiramulo
    ihammdhu vasiyimpa goarudhun

    Aayana raajyamun vedhakuchunnaanu
    thaanae samasthamu viththunane gadhaa
    kreesthuthoa laepabadina chimthimchaka
    pai nunna vaatinae nae vedhakedhanu

    Dhaevuni chiththamu nae neruguchunu
    aathmachae dhaanini nera vaerchedhanu
    seeyoanu parvathamupai nunna
    gorre pillanu nae vembadimchedhanu

    Praarthana sahavaasamunu pomdhi
    rottenu viruchutaloa yeda thegak
    dhaevuni vaakya khadgamu booni
    saevanu chaethumu sanghamunandhu