Author: admin

  • Mimmununimpe మిమ్మునునింపె

    మిమ్మునునింపె మేలులతోడ
    అవియే పరలోక దీవెనలు

    ఆయన మందిర మందే మీకు
    అధిక దీవెనలు దొరుకును ఎన్నో
    తన మందిర సమృద్ధిని పొంది
    త్రాగుడి జీవజలములను

    మీ పాపములను పరిహరించును ప్రభు
    మీకు విమోచన తనయందే కలదు
    సత్యుని కృపామహదైశ్వర్యముతో
    సంతోషించుడి మీరు

    తన రక్తముతో విమోచించిన
    వారికి ప్రభువు యిచ్చును స్వాస్థ్యము
    తేజోవాసులు పరిశుద్ధులతో
    పాలివారినిగా చేసె

    ప్రభు యేసు నెందరు స్వీకరించెదరో
    నిత్యజీవమును స్వతంత్రించుకొని
    పరిశుద్ధాత్మ వరమును పొంది
    ఆత్మలో ఆనందించెదరు

    మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువు
    మునుపటికన్న హెచ్చుగా నిచ్చి
    మీతో నుండగోరెను నిత్యము
    పొందుడి ప్రభు దీవెనలు

    ఆయన కృపలో వర్థిల్లినచో
    అనుదినము ప్రభు మిము దీవించును
    తన కృప మిమ్ము ఆవరించును
    ఆనందించుడి కృపతో

    జయ జీవితమును కలిగినవారే
    తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు
    విశ్వాసముతో విజయముపొంది
    పాడుడి హల్లెలూయ ప్రభుకే


    Mimmununimpe maelulathoad
    aviyae paraloaka dheevenalu

    aayana mandhira mandhae meeku
    adhika dheevenalu dhorukunu ennoa
    thana mandhira samrudhdhini pomdhi
    thraagudi jeevajalamulanu

    mee paapamulanu pariharimchunu prabhu
    meeku vimoachana thanaymdhae kaladhu
    sathyuni krupaamahadhaishvaryamuthoa
    santhoShimchudi meeru

    thana rakthamuthoa vimoachimchin
    vaariki prabhuvu yichchunu svaasthyamu
    thaejoavaasulu parishudhDhulathoa
    paalivaarinigaa chaese

    prabhu yaesu nemdharu sveekarimchedharoa
    nithyajeevamunu svathmthrimchukoni
    parishudhdhaathma varamunu pomdhi
    aathmaloa aanmdhimchedharu

    mimmunu sthirulugaa chaeyunu prabhuvu
    munupatikanna hechchugaa nichchi
    meethoa numdagmoarenu nithyamu
    podhudi prabhu dheevenalu

    aayana krupaloa varthillinachoa
    anudhinamu prabhu mimu dheevimchunu
    thana krupa mimmu aavarimchunu
    aanmdhimchudi krupathoa

    jaya jeevithamunu kaliginavaarae
    thana svaasthyamunu migula pomdhedharu
    vishvaasamuthoa vijayamupomdhi
    paadudi hallelooya prabhukae

  • Mammun srujimchina మమ్మున్ సృజించిన

    మమ్మున్ సృజించిన దేవుండు – ప్రాణము
    నొసంగి యెప్పుడు – కాపాడు మమ్మును
    సంతోష స్వరమెత్తుచు – స్తుతించుచుండుఁడాయనన్

    పలువిధాలుగా – బాధించు రోగముల్
    పోఁగొట్టి మీదను – రాకుండఁజేసెను
    సంతోష స్వరమెత్తుచు – స్తుతించుచుండుఁడాయనన్

    దేవుండు మాత్రమే – రక్షణ మార్గము
    నాయత్తపరచి – చూపించె మాకును
    సంతోష స్వరమెత్తుచు – స్తుతించుచుండుఁడాయనన్

    మా నిత్యబాధలు – వారించుకొరకుఁ
    దా సొంత పుత్రుని – బంపెన్ సు ప్రేమతో
    సంతోష స్వరమెత్తుచు – స్తుతించుచుండుఁడాయనన్

    ఆనందమొందుడి శ్రీ యేసే మోక్షము
    సర్వజనాళికి – ననుగ్రహించును
    సంతోష స్వరమెత్తుచు – స్తుతించుచుండుఁడాయనన్


    Mammun srujimchina dhaevumdu – praamamu
    nosmgi yeppudu – kaapaadu mammunu
    santhosha svarameththuchu – sthuthimchuchumduaodaayanan

    Paluvidhaalugaa – baadhidchu roagamul
    poaaogotti meedhanu – raakumdaojaesenu
    santhosha svarameththuchu – sthuthimchuchumduaodaayanan

    Dhaevumdu maathramae – rakshna maargamu
    naayaththaparachi – choopimche maakunu
    santhosha svarameththuchu – sthuthimchuchumduaodaayanan

    Maa nithyabaadhalu – vaarimchukorakuao
    dhaa somtha puthruni – bmpen su praemathoa
    santhosha svarameththuchu – sthuthimchuchumduaodaayanan

    Aanmdhamomdhudi shree yaesae moakshmu
    sarvajanaaLiki – nanugrahimchunu
    santhosha svarameththuchu – sthuthimchuchumduaodaayanan

  • Mammuao praemao మమ్ముఁ ప్రేమఁ

    మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు మకు బోధపరపఁగ ఇమ్ముగాను
    లేఖనముల నిచ్చె మాకు భూమిపై ||మమ్ము||

    మా మొగంబు నద్దమందు మేము చూచునట్లు మేము గాన వచ్చు
    మాస్థితి మిగులఁ దేటగ నందులో ||మమ్ము||

    పాప మనెడు బురద గోతిని బడిన మమ్ము నెత్తఁగా పాప రహితుండైన
    యేసు ప్రాణ మిచ్చెను బ్రేమచే ||మమ్ము||

    పాప మంతయు వీడి మేము భక్తి సరణిని నడువఁగఁ ప్రాపుగాఁ దన
    యాత్మ నిచ్చెఁ ప్రాణసఖుఁడగు యేసుండు ||మమ్ము||

    సకల జనులు లేఖనముల సత్యములను దెలియుచు అకలుషముగ
    వానినమ్మఁగ నంపు మాత్మను రక్షకా ||మమ్ము||


    Mammuao praemao joochi dhaevuaodu
    maku boadhaparapaoga immugaanu
    laekhanamula nichche maaku bhoomipai ||mammu||

    Maa mogmbu nadhdhammdhu maemu
    choochunatlu maemu gaana vachchu
    maasThithi migulao dhaetaga nmdhuloa ||mammu||

    Paapa manedu buradha goathini badina
    mammu neththaogaa paapa rahithumdaina
    yaesu praana michchenu braemachae ||mammu||

    Paapa mmthayu veedi maemu bhakthi
    saranini naduvaogao praapugaa dhana
    yaathma nichcheao praanasakhuaodagu yaesumdu ||mammu||

    Sakala janulu laekhanamula sathyamulanu
    dheliyuchu akalushmuga
    vaaninammaoga nmpu maathmanu rakshkaa ||mammu||

  • Maemichchu kaanukal మేమిచ్చు కానుకల్

    మేమిచ్చు కానుకల్
    నీవే మాకిచ్చితి
    మా యాస్తియంత ప్రభువా
    నీ దానమే గదా.

    నీ వుచితంబుగా
    మా కిచ్చువాడవు
    అన్యుల కుచితంబుగా
    మేమిచ్చుచుందుము.

    సర్వత్ర బీదలు
    అన్నంబునొందరు
    కన్నీళ్లు రాల్చు ప్రజలు
    అనేకులుందురు.

    ఈలాటివారికి
    సహాయమిచ్చుట
    దూతలు చేయు సేవకు
    సమానమగును.

    పోషించి బీదలన్
    రక్షించి పాపులన్
    అందరిన్ సంరంక్షించుట
    శ్రీ యేసు కార్యమే.

    నా బీదవారికి
    నీవిచ్చు దానము
    నా కిత్తువను వాక్యము
    శ్రీ యేసు చెప్పెను.


    Maemichchu kaanukal
    neevae maakichchithi
    maa yaasthiymtha prabhuvaa
    nee dhaanamae gadhaa.

    Nee vuchithmbugaa
    maa kichchuvaadavu
    anyula kuchithmbugaa
    maemichchuchumdhumu.

    Sarvathra beedhalu
    annmbunomdharu
    kanneeLlu raalchu prajalu
    anaekulumdhuru.

    Eelaativaariki
    sahaayamichchuta
    dhoothalu chaeyu saevaku
    samaanamagunu.

    Poashimchi beedhalan
    rakshimchi paapulan
    amdharin smrmkshimchuta
    shree yaesu kaaryamae.

    Naa beedhavaariki
    neevichchu dhaanamu
    naa kiththuvanu vaakyamu
    shree yaesu cheppenu.

  • Manasunna mamchideva మనసున్న మంచిదేవా

    మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా
    నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా

    హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా

    చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా

    నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా


    Manasunna mamchideva ni manasunu nakichchava
    Manasu malinamaina nakai manishiga digi vachchava
    Na madi ni kovelaga malachukovaya
    Na hrudini rarajuga nilichipovaya

    Hrudayamu vyadhito nimdina kapata kemdramu
    Danini grahiyimchuta evari sadhyamu
    Manasu marmamerigina mahaniyuda
    Manasu marchagaligina nijadevuda

    Chamchala manassadimchu bratuku atanu
    Vamchana chesi nadupunu tappu batanu
    Amtaramgamunu parisilimchu yesayya
    Sdhiramanassuto ni darilo saganivayya

    Nimdu manassuto ninnu asrayimchiti
    Dinamanassuto nikada siramu vamchiti
    Purnasamti galavaniga nannu marchuma
    Tarataramulaku kshemamu chekurchuma

  • Manasu nichchi మనసు నిచ్చి

    మనసు నిచ్చి వినుమా మది ననుసరించి చనుమా ||మనసు||

    అరయ యేసు సిలువ యది అమరపురికి త్రోవ ఆ రమ్యమైన త్రోవ
    యది యనుసరించినావ అది యరసి చూచినావ ||మనసు||

    అది నడచి నడచి పోను ఆనందమిచ్చి చనును అది యేసు సిలువ
    మ్రాను అది యనుసరింపదగును అది యందరు చనదుగును ||మనసు||

    రక్తమయపు బాట నీ ముక్తికదియె యూట భక్తులందరి యెదుట స
    ద్భక్తి మెరయు పాట లనురక్తి బాడెదరచట ||మనసు||

    ఎంత పాపమైన మదికెంత భారమైన ఎంత దయయోగాని యది
    ఎంత కృపయొ గాని అతి శాంతి నిచ్చులోన ||మనసు||

    సాటిలేనిదారి మన స్వామిచూపుదారి మేటికల్వరిదారి జనకోటి
    దుర్గుణహారి మనకోటకు రహదారి ||మనసు||

    వలదులోకమేల నీ వలపు నా కికేల నిలువుమింక చాలు నని
    బిలుచు యేసుమ్రోల నే గొలుతు కాలమెల్ల ||మనసు||


    Manasu nichchi vinumaa madhi
    nanusarimchi chanumaa ||manasu||

    Araya yaesu siluva yadhi amarapuriki
    throava aa ramyamaina throava
    yadhi yanusarimchinaava adhi yarasi
    choochinaava ||manasu||

    Adhi nadachi nadachi poanu aanmdhamichchi
    chanunu adhi yaesu siluva
    mraanu adhi yanusarimpadhagunu adhi
    ymdharu chanadhugunu ||manasu||

    Rakthamayapu baata nee mukthikadhiye
    yoota bhakthulmdhari yedhuta sa
    dhbhakthi merayu paata lanurakthi
    baadedharachata ||manasu||

    Emtha paapamaina madhikemtha bhaaramaina
    emtha dhayayoagaani yadhi
    emtha krupayo gaani athi shaamthi
    nichchuloana ||manasu||

    Saatilaenidhaari mana svaamichoopudhaari
    maetikalvaridhaari janakoati
    dhurgunahaari manakoataku rahadhaari ||manasu||

    Valadhuloakamaela nee valapu naa
    kikaela niluvumimka chaalu nani
    biluchu yaesumroala nae goluthu
    kaalamella ||manasu||

  • Manassaara kruthajnytha మనస్సార కృతజ్ఞత

    మనస్సార కృతజ్ఞత లిడుచు ఘనంబు చేయు ప్రభున్

    విరివిగ నాశీర్వాదము లొసగున్
    మరువకు యేసుని యుపకారం
    ధర నీకున్నది దేవునిదే యని
    కోరిన ప్రబుకిడు త్వరపడుచు – ఘనంబు

    దర్శించిన నీ దయగల ప్రభువునకు
    హర్షముతో కొట్లను విప్పి
    విరివిగ మురియుచు ప్రభునకు అన్నియు
    అర్పించి కొనియాడెదము – ఘనంబు

    తనయునిలో మన కన్నియు నిడెను
    మనలను ముందే తనకిడెను
    పానార్పణముగ ప్రభుకర్పించి
    కాలంబంతయు గడిపెదము – ఘనంబు

    సంతసముగ నిడుటే ప్రభు చిత్తము
    ఎంతో మెళకువతో నుండి
    చింతింపక నిడుటే సరియర్పణ
    వింతగు వృద్ధిని పొందెదము – ఘనంబు

    పిసినితనంబుగ దోషార్పణ నిడ
    వాసము చేయును లేశములు
    యేసునికి నీ జీవనమియ్యను
    శాసనమిదె ప్రభుదని యెరుగు – ఘనంబు

    ఘనపరచును ప్రభు – మనస్సారగ నిడ
    కానుకగా బలకాలములు
    మన కెన్నో తన గుణముల నిడి
    ఘనమును బలమును ప్రభువొసగున్ – ఘనంబు

    మకెదొనియ సంఘము వలె నీకు
    సకల ఇక్కట్లుండినను
    శక్తికి మించి సాగిన గాని
    మక్కువగా నిడి మనమిలను – ఘనంబు


    Manassaara kruthajnytha liduchu ghanmbu chaeyu prabhun

    Viriviga naasheervaadhamu losagun
    maruvaku yaesuni yupakaarm
    dhara neekunnadhi dhaevunidhae yani
    koarina prabukidu thvarapaduchu – ghanmbu

    Dharshimchina nee dhayagala prabhuvunaku
    harshmuthoa kotlanu vippi
    viriviga muriyuchu prabhunaku anniyu
    arpimchi koniyaadedhamu – ghanmbu

    Thanayuniloa mana kanniyu nidenu
    manalanu mumdhae thanakidenu
    paanaarpanamuga prabhukarpimchi
    kaalmbmthayu gadipedhamu – ghanmbu

    Santhasamuga nidutae prabhu chiththamu
    emthoa melakuvathoa numdi
    chimthimpaka nidutae sariyarpan
    vimthagu vrudhdhini pomdhedhamu – ghanmbu

    Pisinithanmbuga dhoashaarpana nid
    vaasamu chaeyunu laeshamulu
    yaesuniki nee jeevanamiyyanu
    shaasanamidhe prabhudhani yerugu – ghanmbu

    Ghanaparachunu prabhu – manassaaraga nid
    kaanukagaa balakaalamulu
    mana kennoa thana gunamula nidi
    ghanamunu balamunu prabhuvosagun – ghanmbu

    Makedhoniya smghamu vale neeku
    sakala ikkatlumdinanu
    shakthiki mimchi saagina gaani
    makkuvagaa nidi manamilanu – ghanmbu

  • Maanasaveenanu మానసవీణను

    మానసవీణను శృతిచేసి
    మనసు నిండా కృతజ్ఞత నింపి
    గొంతెత్తి స్తుతిగీతములే పాడవా
    వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా

    వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా
    సాయంసమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా
    స్తుతి చేయుట క్షేమకరం – ఘనపరచుట మేలుకరం
    దేవుని ఉపకారములకై సదా కీర్తించుట ధన్యకరం

    శ్రమలతో తడబడితే ప్రార్ధనతో సరిచేయి
    దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగనీయి
    మనమే జగతికి వెలుగిస్తే – విశ్వాసగళాలు కలిస్తే
    స్తుతిధూపం పైపైకెగసి దీవెనలే వర్షింపవా


    Maanasaveenanu shruthichaesi
    manasu nimdaa kruthajnytha nimpi
    gomtheththi sthuthigeethamulae paadavaa
    vimthaina dhaevuni praemanu neevila chaatavaa

    Vaekuvanae pakshulu laechi sthuthi kaekalu vaeyavaa
    saaymsamayaana pichchukalu dhaevuni keerthimchavaa
    sthuthi chaeyuta kshaemakarm – ghanaparachuta maelukarm
    dhaevuni upakaaramulakai sadhaa keerthimchuta dhanyakarm

    Shramalathoa thadabadithae praardhanathoa sarichaeyi
    dhiguluthoa shruthi thaggithae nammikathoa saaganeeyi
    manamae jagathiki velugisthae – vishvaasagaLaalu kalisthae
    sthuthidhoopm paipaikegasi dheevenalae varShimpavaa

  • Manasaanmdhamuao మనసానందముఁ

    మనసానందముఁ బొందుట కన్నను మరి యే భాగ్యము గల దన్న
    అనుమానము లిఁక సఖిల సుఖంబులు
    దిన మొక గడికొక తీరై యుండును ||మన||

    దిటముగఁ ప్రార్థన యను ఖడ్గముఁ గని తిరుగు పిశాచము వెఱ చన్న
    పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు
    బహు సంశయ పం కము నింకించును ||మన||

    సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటి
    స్థిరముగ నోర్చెడి శుభమతి కన్నను
    సుఖమే మున్నది ||మన||

    తనువున దానను వానికి దురితము దగిలెడు విధిఁ గనవలె నన్న
    యొనర గ క్రీస్తుని వధ్యాస్తంభముఁ గని
    విశ్వాసముఁ గట్టిగఁ బెంచిన ||మన||

    క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువు లిఁక భువి లేరన్న
    సమదృష్టి జగ జ్జనుల గనుంగొను
    సత్క్రైస్తవులకు సాధన మనఁ దగు ||మన||

    పరమదయానిధి క్రీస్తుని బలమునఁ బాప భరంబులు విడు నన్న
    పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర
    చీఁకటు లన్నియుఁ దొలఁ గును ||మన||


    Manasaanmdhamuao bomdhuta kannanu
    mari yae bhaagyamu gala dhanna
    anumaanamu liaoka sakhila sukhmbulu
    dhina moka gadikoka theerai yumdunu ||mana||

    dhitamugao praarthana yanu khadgamuao gani
    thirugu pishaachamu vera channa
    patudheepthulu gala prabhu shaasthroakthulu
    bahu smshaya pm kamu nimkimchunu ||mana||

    saadhu janoaththama kraisthava smgathi
    samakoodina maelau nanna shoadhana lanniti
    sthiramuga noarchedi shubhamathi
    kannanu sukhamae munnadhi ||mana||

    thanuvuna dhaananu vaaniki dhurithamu
    dhagiledu vidhiao ganavale nanna
    yonara ga kreesthuni vadhyaasthmbhamuao
    gani vishvaasamuao gattigao bemchina ||mana||

    kshmayunu snaehamu prabhukada naerchina
    shathruvu liaoka bhuvi laeranna
    samadhrushti jaga jjanula ganumgonu
    sathkraisthavulaku saadhana manao dhagu ||mana||

    paramadhayaanidhi kreesthuni balamunao
    baapa bharmbulu vidu nanna
    parishudhdhaathmuni bmdhuthvmbuna
    aramara cheeaokatu lanniyuao dholao gunu ||mana||

  • Manasaa vinavaemae మనసా వినవేమే

    మనసా వినవేమే క్రీస్తునిఁ గని సేవింపవేమే అనుదినమున నీ కాయువు
    క్షీణం బగుచున్నది గదవే ||మనసా||

    చింతలేల నీకు వర శ్రీ మంతుడుండు వరకు చెంతను జేరక
    యెంతసేపు నీ యంతట నుండెదవే ||మనసా||

    లోకాశలకును నీవు లోకువై యుండకుము ఆకాశము నేలెడు మన
    ప్రభువును ప్రాకటముగ నమ్ము ||మనసా||

    మాయ సంతలోన జిక్కి మాయలఁ బోయెదవు కాయము స్థిరమని
    నమ్మకు మీ నీ ప్రాయము దక్కదుగా ||మనసా||

    రక్షకయని వేఁడు నీవు రక్షణకై వేఁడు రక్షణఁ బొందుట కిదియే
    సమయము తక్షణమున వేఁడు ||మనసా||

    అందరమును గూడి యేసుని మందిరమునఁ జేరి పొందుగ క్రీస్తుని
    పొగడుచుఁ బాడుచు నందునఁ జేరుదము ||మనసా||


    Manasaa vinavaemae kreesthuniao gani
    saevimpavaemae anudhinamuna nee kaayuvu
    ksheenm baguchunnadhi gadhavae ||manasaa||

    chimthalaela neeku vara shree
    manthudumdu varaku chemthanu jaeraka
    yemthasaepu nee ymthata numdedhavae ||manasaa||

    loakaashalakunu neevu loakuvai
    yumdakumu aakaashamu naeledu mana
    prabhuvunu praakatamuga nammu ||manasaa||

    maaya smthaloana jikki maayalao
    boayedhavu kaayamu sthiramani
    nammaku mee nee praayamu dhakkadhugaa ||manasaa||

    rakshkayani vaeaodu neevu rakshnakai
    vaeaodu rakshnao bomdhuta kidhiyae
    samayamu thakshnamuna vaeaodu ||manasaa||

    amdharamunu goodi yaesuni mandhiramunao
    jaeri pomdhuga kreesthuni
    pogaduchuao baaduchu nmdhunao jaerudhamu ||manasaa||