Author: admin

  • Maa mora naalakimchumu మా మొర నాలకించుము

    మా మొర నాలకించుము – మహారాజ యేసు ప్రభువా
    కోపముతో నను జూడకుము – కనికరమున పలుకుము

    నిన్నెట్లు విడనాడెదను – ప్రాణప్రియుడా నా యేసు
    సిలువకు జడియలేదు – శ్రమలకు బెదురలేదు
    నీ నోట దూషణమాట – ఒకటైనను రాలేదు

    పరలోకమును విడచితివి – పాపులకై ఏతెంచితివి
    సర్వలోక రక్షణకై సిలువపై శ్రమనొందితివి
    ఇట్టి నీ ప్రేమకు నేను – ఎట్టి ధనమియ్యగలను

    సమస్త లోకమునకు – నీ రక్తము నిచ్చితివి
    మూయబడిన యీ తలుపు – తీయబడెను నీ వలన
    నే నేల నీ సంస్తుతిని – నిరతంబు చేయకపోతి

    జగమంత నీ రాకడను – నిరీక్షించుచుండెను
    నీ నీతిని నెరవేర్చుటకు – ఖ్యాతిగ నరుదెంచితివి
    నిబంధన ననుసరించి – విముక్తిని మా కొసగితివి

    రక్షకుండా పాపులను – శిక్షించక రక్షించు
    నిత్యజీవము నిమ్ము – ఆత్మయందు దీనులకు
    దైవ కుమారా యేసు – సార్వత్రిక నివాసీ


    Maa mora naalakimchumu – mahaaraaja yaesu prabhuvaa
    koapamuthoa nanu joodakumu – kanikaramuna palukumu

    ninnetlu vidanaadedhanu – praanapriyudaa naa yaesu
    siluvaku jadiyalaedhu – shramalaku bedhuralaedhu
    nee noata dhooshnamaata – okatainanu raalaedhu

    paraloakamunu vidachithivi – paapulakai aethemchithivi
    sarvaloaka rakshnakai siluvapai shramanomdhithivi
    itti nee praemaku naenu – etti dhanamiyyagalanu

    samastha loakamunaku – nee rakthamu nichchithivi
    mooyabadina yee thalupu – theeyabadenu nee valan
    nae naela nee smsthuthini – nirathmbu chaeyakapoathi

    jagammtha nee raakadanu – nireekshimchuchumdenu
    nee neethini neravaerchutaku – khyaathiga narudhemchithivi
    nibmdhana nanusarimchi – vimukthini maa kosagithivi

    rakshkumdaa paapulanu – shikshimchaka rakshimchu
    nithyajeevamu nimmu – aathmaymdhu dheenulaku
    dhaiva kumaaraa yaesu – saarvathrika nivaasee

  • Maa prabhuyaesu neevae మా ప్రభుయేసు నీవే

    మా ప్రభుయేసు నీవే మా సర్వము
    మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము

    సంతృప్తి నీ మందిరమున గలదు
    అందానంద ప్రవాహంబు మెరిసింది
    వింతైన జీవపు యూటందు గలదు
    యెంతైన మా పూజార్హుండ వీవే

    ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు
    మొదటి ప్రేమ నెంతో విడచి పెట్టితిని
    సదయాక్షమించి మొదటి ప్రేమ నిమ్మయా
    సతతంబు మా పూజార్హుండ వీవే

    మా తలపు మాటల్లో మా చూపు నడకలో
    మేము కూర్చున్న నిలుచున్న వీక్షించిన
    మక్కువతో మా ప్రభున్ మెప్పించెదము
    యెక్కడైనా మా యేసు సన్నిధిలో

    పరిశుద్ధంబైనది నీ దివ్య నైజము
    పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము
    పరిశుద్ధ ప్రజలుగ మమ్ము సరిజేసి
    పాలించుము ప్రభుయేసు రారాజ

    సోదర ప్రేమ సమాధానంబులతో
    సాత్వీక సంతోష భక్తి వినయాలతో
    వింతైన మాదు స్తుతి పరిమాళాలతో
    వినయంబున పూజింతుము నిన్ను


    Maa prabhuyaesu neevae maa sarvamu
    mahin maakepudu neethoanae snaehamu

    smthrupthi nee mmdhiramuna galadhu
    amdhaanmdha pravaahmbu merisimdhi
    vimthaina jeevapu yootmdhu galadhu
    yemthaina maa poojaarhumda veevae

    imthati praemanu naenemthoa pomdhiyu
    modhati praema neMthoa vidachi pettithini
    sadhayaakshmimchi modhati praema nimmayaa
    sathathmbu maa poojaarhumda veevae

    maa thalapu maatalloa maa choopu nadakaloa
    maemu koorchunna niluchunna veekshimchin
    makkuvathoa maa prabhun meppimchedhamu
    yekkadainaa maa yaesu sannidhiloa

    parishudhdhmbainadhi nee dhivya naijamu
    parishudhdhmbaina jeevithamae maa bhaagyamu
    parishudhdha prajaluga mammu sarijaesi
    paalimchumu prabhuyaesu raaraaj

    soadhara praema samaadhaanmbulathoa
    saathveeka santhosha bhakthi vinayaalathoa
    vimthaina maadhu sthuthi parimaaLaalathoa
    vinaymbuna poojimthumu ninnu

  • Maa dhaevunakunu మా దేవునకును

    మా దేవునకును స్తోతములు మహిమయు జ్ఞానము నామీదన్ మాదు
    కృతజ్ఞతగల స్తుతియు న్మఱి ఘనతా శక్తియు బలమున్ యుగయుగములకును
    గల్గునుగాక ||ఆ…మెన్||


    Maa dhaevunakunu sthoathamulu mahimayu
    jnyaanamu naameedhan maadhu
    kruthajnythagala sthuthiyu nmari ghanathaa
    shakthiyu balamun yugayugamulakunu
    galgunugaaka ||aa…men||

  • Manninchina aa preme మన్నించినా ఆ ప్రేమే

    మన్నించినా ఆ ప్రేమే నా సొంతమా
    నీ చెంతనా నే చేరి ప్రార్ధించనా
    కలనైనా ఇలా మరతును
    ఎనలేని నీ ప్రేమను
    నీవేగా నీవేగా
    నీవే నా ప్రాణ దైవమా

    శిలనేనైన రూపం చేసి జీవం పోసితివి
    నిరతము నాకు మాదిరి నీవై దారి చూపితివి
    నా చేతులను సుఖముతో నింపి నడిపే నీ ప్రేమ
    అపారము నీ దయాగుణం అనంతము నీ ప్రేమామృతం
    నీవు నా ప్రాణం

    ఊహకు అందని త్యాగం చేసి శ్వాసై నిలిచావు
    నీ ముఖకాంతిలో వెలుగై నన్ను మార్చుకొన్నావు
    గతమేదైనా ప్రేమించావు స్తుతికే పాత్రుడవు
    ప్రతిక్షణం నా నిరాశలో ప్రభాతమైనా నా యేసయ్య
    నీవు నా ధ్యానం


    Manninchina aa preme naa sonthamaa
    nee chenthanaa ne cheri praardhinchanaa
    kalanainaa ila marathunu
    enaleni nee premanu
    neevegaa neevegaa
    neeve naa praana daivamaa

    Silanenaina roopam chesi jeevam posithivi
    nirathamu naaku maadhiri neevai dhaari choopithivi
    naa chethulanu sukhamutho nimpi nadipe nee prema
    apaaramu nee dayaagunam ananthamu nee preamaamrutham
    neevu naa praanam

    Oohaku andhani thyaagam chesi swaasai nilichaavu
    nee mukhakaanthilo velugai nannu maarchukonnaavu
    gathamedainaa preminchaavu sthuthike paathrudavu
    pratikshanam naa niraasalo prabhaathamainaa naa yesayya
    neevu naa dhyaanam

  • Raepu maapu gooda రేపు మాపు గూడ

    రేపు మాపు గూడ రమ్యమైన గింజల్
    ప్రీతితోను జల్లివేసి యుందుము
    కాపుతోడనుండి దాపునుండు పంట
    నేపు మీరబంటగోసి కొందము

    పంట పండగన్ గోసి కొందము
    కంట నీరు పోవ గోసి కొందము

    సందియంబు లేల స్వామి సేవ యందు
    నందనంబు తోడ విత్తుచుందుము
    కొందలంబులేక కష్టవృత్తిచేసి
    యందరము చేరి యానందింతుము

    ప్రేమ విత్తనంబుల క్షేమ యంకురంబుల్
    ప్రీతిన్ గాలమెల్ల ప్రాంతమంతటన్
    నేను మొప్ప నాటి నాయకుండు
    నిండు పంట గోసి గూర్చుకొందము


    Raepu maapu gooda ramyamaina gimjal
    preethithoanu jallivaesi yumdhumu
    kaaputhoadanumdi dhaapunumdu panta
    naepu meerabmtagoasi komdhamu

    pmta pmdagan goasi komdhamu
    kmta neeru poava goasi komdhamu

    smdhiymbu laela svaami saeva ymdhu
    nmhanmbu thoada viththuchumdhumu
    komdhalmbulaeka kashtavruththichaesi
    ymdharamu chaeri yaanmdhimthumu

    praema viththanmbula kshaema ymkurmbul
    preethin gaalamella praamthammthatan
    naenu moppa naati naayakumdu
    niMdu pmta goasi goorchukomdhamu

  • Prabu namam na asrayame ప్రభు నామం నా ఆశ్రయమే

    ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతియించెదను
    ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడించెదను

    యెహొవా యీరే అన్నింటిని చూచుకొనును
    కొదువలేదు నాకు కొదువలేదు కొదువలేదు నాకు కొదువలేదు

    యెహొవా రాఫా స్వస్ధతనిచ్చెను
    భయము లేదు నాకు భయము లేదు
    భయము లేదు నాకు భయము లేదు

    యెహొవా షాలోం శాంతినెచ్చెను
    శాంతి దాతా నా శాంతి దాతా శాంతి దాతా నా శాంతి దాతా

    యెహొవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును
    జయమున్నది నాకు జయమున్నది జయమున్నది నాకు జయమున్నది


    Prabu namam na asrayame ayananu stutiyimchedanu
    Prabu mahima na jivitame ayananu vembadimchedanu

    Yehova yire annimtini chuchukonunu
    Koduvaledu naku koduvaledu koduvaledu naku koduvaledu

    Yehova rapa svasdhatanichchenu
    Bayamu ledu naku bayamu ledu bayamu ledu naku bayamu ledu

    Yehova shalom samtinechchenu
    Samti data na samti data samti data na samti data

    Yehova nissiye ellappudu jayamichchunu
    Jayamunnadi naku jayamunnadi jayamunnadi naku jayamunnadi

  • Manishi o manishi మనిషీ ఓ మనిషీ

    మనిషీ ఓ మనిషీ ఓ మనిషీ నీవెవరు
    యాక్టరువైనా, డాక్టరువైనా, మంత్రివైనా ధనవంతుడివైనా
    బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి

    మనిషి పుట్టింది ఒకని నుండే
    మరణమొచ్చింది ఆ ఒకని నుండే
    మనుషులంతా ఒక్కటే
    అందరి దేవుడు ఒక్కడే

    కులమే లేదు మతమే లేదు
    ప్రాంతీయ తత్వమే లేనేలేదు
    మొదటి మనిషికి లేదు కులం
    మనిషిని చేసిన దేవుని దే కులం

    మనిషికి పుడితే మనుష్య కుమారుడు
    రాజుకు పుడితే రాజ కుమారుడు
    దేవునికి పుడితే దైవ కుమారుడు
    మనుష్యులంతా దైవ కుమారులే


    Manishi o manishi o manishi nivevaru
    Yaktaruvaina, daktaruvaina, mamtrivaina dhanavamtudivaina
    Bratikumdagane perunnavadavu maranimchagane savanivi

    Manishi puttimdi okani numde
    Maranamochchimdi a okani numde
    Manushulamta okkate
    Amdari devudu okkade

    Kulame ledu matame ledu
    Pramtiya tatvame leneledu
    Modati manishiki ledu kulam
    Manishini chesina devuni de kulam

    Manishiki pudite manushya kumarudu
    Rajuku pudite raja kumarudu
    Devuniki pudite daiva kumarudu
    Manushyulamta daiva kumarule

  • Ninnu vidichi nee praema నిన్ను విడిచి నీ ప్రేమ

    నిన్ను విడిచి నీ ప్రేమ మరచి –
    నేనెటు పోగలను దేవా
    ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
    నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి)

    దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో
    నాయకుడా నా ఆర్త ధ్వని విని
    నావను నడిపించినావే – తీరము చూపించినావే
    యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
    నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు

    శ్రమల పాలైతి సొమ్మసిల్లితి – సిలువకు నే చేరితి
    శ్రీకరుడా నా శిలువను మోసి – ఆదరణె చూపినావే
    నూతన బలమిచ్చినావే …. యేసయ్యా
    నేనెటు పోగలను దేవా – యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||

    విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం
    శ్రీమంతడా నా షాఓము రాజా
    బ్రతికెద నీ కోసమే చావైన లాభమే
    నేనెటు పోగలను దేవా – యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||


    Ninnu vidichi nee praema marachi –
    naenetu poagalanu dhaevaa
    evvaru nee praema naakila choopagalaru
    naadhaevaa naa dhaevaa naa dhaevaa (ninnu vidichi)

    dhaari tholagi theeramu chaerani ghoara sudigaaliloa
    naayakudaa naa aartha dhvani vini
    naavanu nadipimchinaavae – theeramu choopimchinaavae
    yaesayyaa yaesayyaa naa yaesayyaa
    naenetu poagalanu dhaevaa-evvaru
    nee praema naakila choopagalaru

    shramala paalaithi sommasillithi – siluvaku nae chaerithi
    shreekarudaa naa shiluvanu moasi – aadharane choopinaavae
    noothana balamichchinaavae …. yaesayyaa
    naenetu poagalanu dhaevaa – yaesayyaa naa yaesayyaa||ninnu||

    virigi naligina naa hrudhayaana neekae simhaasanm
    shreemmthadaa naa Shaaoamu raajaa
    brathikedha nee koasamae chaavaina laabhamae
    naenetu poagalanu dhaevaa – yaesayyaa naa yaesayyaa||ninnu||

  • Balamaina dhaevudavu బలమైన దేవుడవు

    బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు
    శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము
    సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)
    హల్లెలూయా……..హల్లెలూయా (2)
    హల్లెలూయా……..హల్లెలూయా హోసన్న
    హల్లెలూయా……..హల్లెలూయా

    ఎల్‌ ఓలామ్‌ (2)
    అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)
    నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
    నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)
    హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా

    ఎల్‌ షద్దాయ్‌ (2)
    పోషించు దేవుడవు ఆశ్రయ దుర్గము నీవు (2)
    రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా
    నీ మాటున దాచె దేవా మాటను నెరవేర్చేదేవా (2) ||హల్లెలూయా||

    అడోనాయ్‌ (2)
    ప్రభువైన దేవుడవు -ప్రభువులకు ప్రభువు నీవు (2)
    సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు
    నీవే నాకు ప్రభువు -నీవేనా యజమానుడవు (2) ||హల్లెలూయా||


    Balamaina dhaevudavu – balavmthudavu neevu
    shoonyamuloa samasthamunu niraakaaramuloa aakaaraamu
    srujiyimchinaavu neevu sarva srushti karthavu neevu (2)
    hallelooyaa……..hallelooyaa (2)
    hallelooyaa……..hallelooyaa hoasanna
    hallelooyaa……..hallelooyaa

    El‌ oalaam‌ (2)
    alpaa oamegayoo, nithyudaina dhaevudavu (2)
    nithyanibmdhana chaeshaavu nibmdhanane sthiraparichaavu
    ninnaanaedu raepu maarani dhaevudavu neevu(2)
    hallelooyaa hallelooyaa hoasanna hallelooyaa hallelooyaa

    El‌ Shdhdhaay‌ (2)
    poashimchu dhaevudavu aashraya dhurgamu neevu (2)
    rekkalapai moasedi vaadaa – rakshna shrumgamu neevaegaa
    nee maatuna dhaache dhaevaa maatanu neravaerchaedhaevaa (2) ||hallelooyaa||

    Adoanaay‌ (2)
    prabhuvaina dhaevudavu -prabhuvulaku prabhuvu neevu (2)
    sarvaadhikaarivi neevu – sakala janulaku prabhuvu neevu
    neevae naaku prabhuvu -neevaenaa yajamaanudavu (2) ||hallelooyaa||

  • Nammi nammi manushyulanu నమ్మి నమ్మి మనుష్యులను

    నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మీ
    పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు
    ఇలా. . ఎంత కాలము. . నీవు సాగిపోదువు. .

    రాజులను నమ్మి బహుమతిని ప్రేమించినా
    బిలాము ఏమాయెను! దైవదర్శనం కోల్పోయెను
    నాయేసయ్యను నమ్మిన యెడల
    ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే

    ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన
    ఆకాను ఏమాయెను! అగ్నికి ఆహుతి ఆయెను
    నాయేసయ్యను నమ్మిన యెడల
    మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే

    సుఖ భోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తిన
    గెహజీ ఏమాయెను! రోగమును సంపాదించెను
    నాయేసయ్యను నమ్మిన యెడల
    శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే


    Nammi nammi manushyulanu nivu nammi nammi
    Palumarlu mosapoyavu palumarlu mosapoyavu
    Ela. . Emta kalamu. . Nivu sagipoduvu. .

    Rajulanu nammi bahumatini premimchina
    Bilamu emayenu! Daivadarsanam kolpoyenu
    Nayesayyanu nammina yedala
    Unnata bahumanamu niku nischayame

    Aisvaryamu nammi vemdi bamgaramu asimchina
    Akanu emayenu! Agniki ahuti ayenu
    Nayesayyanu nammina yedala
    Mahimaisvaryamu niku nischayame

    Suka bogamu nammi dhanapekshato parugettina
    Gehaji emayenu! Rogamunu sampadimchenu
    Nayesayyanu nammina yedala
    Sasvatamaina ganata niku nischayame