Author: admin

  • Neevu laeni roajmthaa నీవు లేని రోజంతా

    నీవు లేని రోజంతా రోజేనా – నీవు లేని బ్రతుకంతా బ్రతుకేనా

    జీవ జల ఊటయు ప్రభు నీవే – సత్యము మార్గము ప్రభు నీవే
    నా తోడ బుట్టువు ప్రభు నీవే – నాలో సంతసం ప్రభు నీవే
    IIనీవు లేనిII

    వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే – గాలియు శబ్దము ప్రభు నీవే
    తాళము రాగము ప్రభు నీవే – మ్రోగెడు కంచు ప్రభు నీవేIIనీవు లేనిII

    నా క్రియలు అన్నియు ప్రభు నీవే – నాదు బలమంతయు ప్రభు నీవే
    నా కోట బాటయు ప్రభు నీవే – నా డాలు కేడెము ప్రభు నీవేIIనీవు లేనిII

    నా తలపులన్నియు ప్రభు నీవే – నా భాష మాటయు ప్రభు నీవే
    నాదు విమోచన ప్రభు నీవే – నా పునరుత్తానము ప్రభు నీవే IIనీవు లేనిII


    Neevu laeni roajMthaa roajaenaa
    neevu laeni brathukMthaa brathukaenaa

    jeeva jala ootayu prabhu neevae
    sathyamu maargamu prabhu neevae
    naa thoada buttuvu prabhu neevae
    naaloa sMthasM prabhu neevae
    II neevu laeni II

    velugoMdhu jvaalayu prabhu neevae
    gaaliyu shabdhamu prabhu neevae
    thaaLamu raagamu prabhu neevae
    mroagedu kMchu prabhu neevaeII neevu laeni II

    naa kriyalu anniyu prabhu neevae
    naadhu balamMthayu prabhu neevae
    naa koata baatayu prabhu neevae
    naa daalu kaedemu prabhu neevaeII neevu laeni II

    naa thalapulanniyu prabhu neevae
    naa bhaaSh maatayu prabhu neevae
    naadhu vimoachana prabhu neevae
    naa punaruththaanamu prabhu neevae II neevu laeni II

  • Nashinchipoye aathmalu నశించిపోయే ఆత్మలు

    నశించిపోయే ఆత్మలు ఎన్నో
    నరకపు పొలిమేరను చెర
    నన్ను పంపుము నన్ను నడిపించుము
    నీ ప్రేమ సువార్త చాటను
    నీ వాక్కుతో నీ శక్తితో
    నీ ఆత్మతో నీ ప్రేమతో
    (నను) నిత్యము నడిపించుమా – (2)

    నీవు చేసిన త్యాగాన్ని
    చాటి చెప్పే భాగ్యాన్ని
    నాకు ఇమ్ము నా దేవా
    వాడుకొనుము నా ప్రభువా (2) ||నీవు||

    నా జీవితాంతం – మరణ పర్యంతం
    నీతోనే నేనుందునయ్యా (2)
    కరుణ చూచి నీ మహిమ గాంచితి
    నిత్యం నిను సేవింతును
    నీ సన్నిధిలో ఆ దూతలతో
    నీ రాజ్యములో పరిశుద్ధులతో (2)
    (నిను) నిత్యము కీర్తింతును – (2) ||నీవు||


    Nashinchipoye aathmalu enno
    narakapu polimeranu chera
    nannu pampumu nannu nadipinchumu
    nee prema suvaartha chaatanu
    nee vaakkutho nee shakthitho
    nee aathmatho nee prematho
    (nanu) nithyamu nadipinchumaa – (2)

    neevu chesina thyaagaanni
    chaati cheppe bhaagyaanni
    naaku immu naa devaa
    vaadukonumu naa prabhuvaa (2) ||neevu||

    naa jeevithaantham – marana paryantham
    neethone nenundhunayyaa (2)
    karuna choochi nee mahima gaanchithi
    nithyam ninu sevinthunu
    nee sannidhilo aa dhoothalatho
    nee raajyamulo parishuddhulatho (2)
    (ninu) nithyamu keerthinthunu – (2) ||neevu||

  • Nishchayamuga ninnu నిశ్చయముగ నిన్ను

    నిశ్చయముగ నిన్ను దీవించెదను (2)
    నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2)

    ప్రత్యక్షమై పలికెనుగ ప్రభువు – సర్వశక్తిగల యెహోవాను నేను
    నా సన్నిధిన్ నిర్దోషిగా నడచిన – నీతో నిబంధన నియమింతును

    నీ సంతానమును దీవించి – నిన్ను ఫలియింప జేసెదను
    నీలో నుండి జనములు వచ్చును – నీతో నిబంధన స్థిరపరతున్

    యుగయుగములు నీకు దేవుడను – కనాను దేశము నీకొసగెదను
    నిత్యస్వాస్థ్యమును నీ కొసగెదను – నీలో మహిమ నే పొందెదను

    గొప్ప జనముగా జేసెదనిన్ను – నిశ్చయముగా ఆశీర్వదింతున్
    నీనామమును గొప్ప జేసెదను – ఆశీర్వాదముగ జేసెదను

    నిన్నాశీర్వదించువారిని – నేను ఆశీర్వదించెదను
    దూషించువారిని నే శపించెదను – నీ ద్వారా దీవింపబడెదరు


    Nishchayamuga ninnu dheeviMchedhanu (2)
    nishchayamuga ninnu vrudhDhi poMdhiMthun (2)

    prathyakShmai palikenuga prabhuvu
    sarvashakthigala yehoavaanu naenu
    naa sanniDhin nirdhoaShigaa nadachina
    neethoa nibMDhana niyamiMthunu

    nee sMthaanamunu dheeviMchi
    ninnu phaliyiMpa jaesedhanu
    neeloa nuMdi janamulu vachchunu
    neethoa nibmdhana sthiraparathun

    yugayugamulu neeku dhaevudanu
    kanaanu dhaeshamu neekosagedhanu
    nithyasvaasThyamunu nee kosagedhanu
    neeloa mahima nae poMdhedhanu

    goppa janamugaa jaesedhaninnu
    nishchayamugaa aasheervadhiMthun
    neenaamamunu goppa jaesedhanu
    aasheervaadhamuga jaesedhanu

    ninnaasheervadhiMchuvaarini
    naenu aasheervadhiMchedhanu
    dhooShiMchuvaarini nae shapiMchedhanu
    nee dhvaaraa dheeviMpabadedharu

  • Nishchalamainadhi yaesu నిశ్చలమైనది యేసు

    నిశ్చలమైనది యేసు రాజ్యము ప్రకాశించే రాజ్యము
    యుగయుగములు నిలుచును ప్రభుని రాజ్యము

    క్రీస్తు రాజ్య సింహాసనమెంతో గొప్పది
    కనకంబునకన్న బహుప్రకాశించును
    దానిచుట్టు దేవుని మహిమ యుండును
    దీక్షతోడ జయించెడువారే పొందెదరు

    నాశనము లేనిది యేసు రాజ్యము
    నిత్యుడగు తండ్రి దాని స్థిరము జేసెను
    ప్రభుని రాజ్యము యెంతో అనంతమైనది
    పరిపాలించు తానే తరతరంబులు

    తన రాజ్యమహిమకు మిమ్ము పిలిచెను
    వినయముగా నీతి భక్తికలిగి నిలువుడి
    కడవరకు విశ్వాసము కలిగియుండిన
    క్రీస్తుయేసు మీకు నీతి మకుటమిచ్చును

    యేసురక్తమందు యెవరు కడుగబడెదరో
    వారే హృదయశుద్ధిని పొందెదరిలలో
    పరలోక రాజ్యములో ప్రవేశింతురు
    ప్రవిమలుని ముఖముజూచి సంతసింతురు

    భూలోక రాజ్యములు అంతరించును
    ప్రభుయేసు రాజ్యము నిలచు స్థిరముగా
    నీతి సమాధానములతో దేవుడేలును
    నేడే చేరవా నీవు ఆ రాజ్యములో


    Nishchalamainadhi yaesu raajyamu prakaashimchae raajyamu
    yugayugamulu niluchunu prabhuni raajyamu

    kreesthu raajya siMhaasanameMthoa goppadhi
    kanakMbunakanna bahuprakaashiMchunu
    dhaanichuttu dhaevuni mahima yuMdunu
    dheekShthoada jayiMcheduvaarae poMdhedharu

    naashanamu laenidhi yaesu raajyamu
    nithyudagu thMdri dhaani sThiramu jaesenu
    prabhuni raajyamu yeMthoa anMthamainadhi
    paripaaliMchu thaanae tharatharMbulu

    thana raajyamahimaku mimmu pilichenu
    vinayamugaa neethi bhakthikaligi niluvudi
    kadavaraku vishvaasamu kaligiyumdin
    kreesthuyaesu meeku neethi makutamichchunu

    yaesurakthamMdhu yevaru kadugabadedharoa
    vaarae hrudhayashudhDhini poMdhedharilaloa
    paraloaka raajyamuloa pravaeshiMthuru
    pravimaluni mukhamujoochi sMthasiMthuru

    bhooloaka raajyamulu amtharimchunu
    prabhuyaesu raajyamu nilachu sThiramugaa
    neethi samaaDhaanamulathoa dhaevudaelunu
    naedae chaeravaa neevu aa raajyamuloa

  • Nashtamu nanthatini నష్టము నంతటిని

    ఆనందించెదము – ప్రభు యేసులో – అంతయు మరలార్జించు కొంటిమి
    ఆదాము నుండి పోయిన దెల్లయు – అనుభవించు చున్నామిప్పుడు

    పల్లవి: నష్టము నంతటిని మరల – మా యేసునిలో ఆర్జించితిమి
    ఎల్లప్పుడు జీవితమతయు హల్లెలూయ పాడెదము

    దావీదువలె అంత నష్టపడితిమి – దుఃఖపడి బహుగా ఏడ్చితిమి
    దావీదువలె ప్రభుని వెదకగ – తిరిగి ఆర్జించుకొంటిమి

    పూర్వము నైక్యము లేకపోయెను – పేదలమై యుంటిమి అపుడు
    మనలను ఖాళీ చేసికొనగా – మరల నొందితిమి పూర్ణత

    మొదటి ప్రమను కోల్పోతిమిల – వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి
    పొందితిమి యేసు ప్రభువులో – నిండుగను దైవ ప్రేమను

    దేవుని కల్గియుండకుంటిమి – దైవసమాధాన మొందకుంటిమి
    పాపములలో మరణించియుంటిమి – పరమజీవ మొందితిమి

    నిరీక్షణయేమి లేక యుంటిమి – నరకమున కర్హులమై యుంటిమి
    ఘనుడగు యేసు నంగీకరింపగా – నన్నును విమోచించెను

    పాపము వలనెంతో నష్టపోతిమి – ప్రభులో సకలము సంపాదించితిమి
    శాపమునందు చుట్టబడితిమి – సర్వమొందెదము మరల


    Aanamdhimchedhamu – prabhu yaesuloa
    amthayu maralaarjiMchu koMtimi
    aadhaamu nuMdi poayina dhellayu
    anubhaviMchu chunnaamippudu

    Chorus: nashtamu nanthatini marala
    maa yaesuniloa aarjiMchithimi
    ellappudu jeevithamathayu hallelooya paadedhamu

    dhaaveedhuvale aMtha naShtapadithimi
    dhuHkhapadi bahugaa aedchithimi
    dhaaveedhuvale prabhuni vedhakaga
    thirigi aarjiMchukoMtimi

    poorvamu naikyamu laekapoayenu
    paedhalamai yuMtimi apudu
    manalanu khaaLee chaesikonagaa
    marala noMdhithimi poorNath

    modhati pramanu koalpoathimila
    vyarThamainatti praemanoMdhithimi
    poMdhithimi yaesu prabhuvuloa
    niMduganu dhaiva praemanu

    dhaevuni kalgiyuMdakuMtimi
    dhaivasamaaDhaana moMdhakuMtimi
    paapamulaloa maraNiMchiyuMtimi
    paramajeeva moMdhithimi

    nireekShNayaemi laeka yuMtimi
    narakamuna karhulamai yuMtimi
    ghanudagu yaesu nMgeekariMpagaa
    nannunu vimoachiMchenu

    paapamu valaneMthoa naShtapoathimi
    prabhuloa sakalamu sMpaadhiMchithimi
    shaapamunMdhu chuttabadithimi – sarvamoMdhedhamu maral

  • Nesageda yesunito నేసాగెద యేసునితో

    నేసాగెద యేసునితో నా జీవిత కాలమంతా

    యేసులో గడిపెద యేసుతో నడిచెద
    పరమున చేరగ నే వెళ్ళెదా హానోకుతో సాగెదా. .ఆ

    తల్లి మరచిన తండ్రి విడచినా బందువులే
    నను వెలివేసినా బలవంతునితో సాగెదా. .ఆ

    లోకపు శ్రమలు నన్నెదిరించినా కఠినులు రాళ్ళతో
    హింసించినా స్తెఫనువలె సాగెదా. .ఆ


    Nesageda yesunito na jivita kalamamta

    Yesulo gadipeda yesuto nadicheda
    Paramuna cheraga ne velleda hanokuto sageda. .aa

    Talli marachina tamdri vidachina bamduvule
    Nanu velivesina balavamtunito sageda. .aa

    Lokapu sramalu nannedirimchina kathinulu rallato
    Himsimchina stepanuvale sageda. .aa

  • Naahrudhayamu vimthaga నాహృదయము వింతగ

    నా హృదయము వింతగ మారెను (3)
    నాలో యేసు వచ్చినందున

    పల్లవి: సంతోషమే సమాధానమే (3)
    చెప్పనశక్యమైన సంతోషమే

    తెరువబడెను – నా మనోనేత్రము (3)
    యేసు నన్ను ముట్టినందున

    ఈ సంతోషము – నీకు కావలెనా (3)
    నేడే యేసు నొద్దకు రమ్ము

    సత్య సమాధానం – నీకు కావలెనా (3)
    నేడే యేసు నొద్దకు రమ్ము

    నిత్య జీవము – నీకు కావలెనా (3)
    నేడే యేసు నొద్దకు రమ్ము

    మోక్ష భాగ్యము – నీకు కావలెనా (3)
    నేడే యేసు నొద్దకు రమ్ము

    యేసు క్రీస్తును నేడే చెర్చుకో (3)
    ప్రవేశించు నీ యుల్లమందు


    Naa hrudhayamu viMthaga maarenu (3)
    naaloa yaesu vachchinMdhun

    Chorus: sMthoaShmae samaaDhaanamae (3)
    cheppanashakyamaina sMthoaShmae

    theruvabadenu – naa manoanaethramu (3)
    yaesu nannu muttinMdhun

    ee smthoashmu – neeku kaavalenaa (3)
    naedae yaesu nodhdhaku rammu

    sathya samaaDhaanM – neeku kaavalenaa (3)
    naedae yaesu nodhdhaku rammu

    nithya jeevamu – neeku kaavalenaa (3)
    naedae yaesu nodhdhaku rammu

    moakSh bhaagyamu – neeku kaavalenaa (3)
    naedae yaesu nodhdhaku rammu

    yaesu kreesthunu naedae cherchukoa (3)
    pravaeshiMchu nee yullamMdhu

  • Nuthi saeyanu laevae నుతి సేయను లేవే

    నుతి సేయను లేవే యో మనసా నుతిఁజేయను లేవే క్షితిని దివిని
    హితమతిఁ బ్రోచెడి సుతుని జనకుని శుద్ధాత్మునిఁ ద్ర్యేకుని ||నుతి||

    సూర్యుని కాంతి సొంపగు పంటలు సుకాలక్షేమముల్ శోభిలు
    గేహమున్ ఆర్య సాంగత్యము నైశ్వర్యముల నిల ననుభవింపవె నీవా
    యాఢ్యుని పేర్మిని ||నుతి||

    దురితము లందె దుర్గతి నున్న నీ కురుతర ప్రేమను బరమార్థ
    మీయను వరపుత్రు నొసఁగఁడె వందనీయుఁడు ప్రభు మరిమరి
    మ్రొక్కు మా పరమోపకారిని ||నుతి||

    జీవము జ్ఞానము జీవము నొసంగెడు పావనాత్మను నీకై పంపిన
    దేవుడు కేవల దోష స్వ భావము మార్చఁడె సేవ జేయుమ నీవా
    పావనమూర్తికి ||నుతి||

    కరములు పదముల్ కనకాదు లన్నియు స్వరమును చిత్తము స్థిరమగు
    ప్రేమయు మరి నీదు హృదయము పరమాత్ము సేవకై పరిపూర్ణముగ
    నిచ్చి ప్రణుతించు మాయనన్ ||నుతి||


    Nuthi saeyanu laevae yoa manasaa
    nuthiaojaeyanu laevae kShithini dhivini
    hithamathiAO broachedi suthuni janakuni
    shudhDhaathmuniAO dhryaekuni ||nuthi||

    sooryuni kaamthi sompagu pmtalu
    sukaalakShaemamul shoabhilu
    gaehamun aarya saaMgathyamu naishvaryamula
    nila nanubhaviMpave neevaa
    yaaDyuni paermini ||nuthi||

    dhurithamu lMdhe dhurgathi nunna nee
    kuruthara praemanu baramaarTha
    meeyanu varaputhru nosAOgAOde
    vmdhaneeyuaodu prabhu marimari
    mrokku maa paramoapakaarini ||nuthi||

    jeevamu jnYaanamu jeevamu nosMgedu
    paavanaathmanu neekai pMpina
    dhaevudu kaevala dhoaSh sva bhaavamu
    maarchAOde saeva jaeyuma neevaa
    paavanamoorthiki ||nuthi||

    karamulu padhamul kanakaadhu lanniyu
    svaramunu chiththamu sThiramagu
    praemayu mari needhu hrudhayamu
    paramaathmu saevakai paripoorNamuga
    nichchi praNuthiMchu maayanan ||nuthi||

  • Nuvvae kaavaalayyaa నువ్వే కావాలయ్యా

    నువ్వే కావాలయ్యా – నీ ప్రేమ చాలయ్య
    నీతో ఉండాలయ్యా – నీకై బ్రతకాలయ్యా
    నువ్వే కావాలయ్యా – యేసయ్యా
    నీ ప్రేమే చాలయ్యా – యేసయ్యా
    నీతో ఉండాలయ్యా – యేసయ్యా – నీకై బ్రతకాలయ్యా –
    యేసయ్యా యేసయ్యా …….నా బలమా (2) ||నువ్వే||

    లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవు
    మనుష్యులలో మంచితనము కంటె – మహనీయుడవు(2)
    ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయా
    నీవు ఉండగా లోకం నాకు ఎందుకు మెస్సయ్యా (2) ||నువ్వే||

    ప్రకృతిలో అందచందాల కంటే – సుందరుడవు
    లోకంలో ధనధాన్యాలకంటే – ధనవంతుడవు (2)
    ఈ లోకంలో నీవు గాక నాకెవరున్నారయా
    నీవు ఉండగా ధన ధాన్యాలు ఎందుకె మెస్సయ్యా (2) ||నువ్వే||


    Nuvvae kaavaalayyaa – nee praema chaalayy
    neethoa uMdaalayyaa – neekai brathakaalayyaa
    nuvvae kaavaalayyaa – yaesayyaa
    nee praemae chaalayyaa – yaesayyaa
    neethoa uMdaalayyaa – yaesayyaa – neekai brathakaalayyaa –
    yaesayyaa yaesayyaa …….naa balamaa (2) ||nuvvae||

    loakMloa unna vaatikMtae unnathudavu
    manuShyulaloa mMchithanamu kMte – mahaneeyudavu(2)
    aakaashMloa neevugaaka naakevarunnaarayaa
    neevu uMdagaa loakM naaku eMdhuku messayyaa (2) ||nuvvae||

    prakruthiloa aMdhachMdhaala kMtae – suMdharudavu
    loakMloa DhanaDhaanyaalakMtae – DhanavMthudavu (2)
    ee loakMloa neevu gaaka naakevarunnaarayaa
    neevu uMdagaa Dhana Dhaanyaalu eMdhuke messayyaa (2) ||nuvvae||

  • Nuvvu leni nannu నువ్వు లేని నన్ను

    నువ్వు లేని నన్ను ఊహించలేను
    నీ ఉన్నత ప్రేమను వివరించలేను (2)
    అడగాలని నేను అనుకోకముందే
    నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు (2)
    నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు
    యేసయ్యా… నీవే నా ఆరాధ్య దైవమా
    యేసయ్యా… నీవే నా ఆధార దీపమా (2) ||నువ్వు లేని||

    పదివేలలో అతి సుందరుడా
    కురూపినైన నాకు నీ స్వారూప్యమునిచ్చావు
    ఎందుకు పనికిరాని వాడనై యుండగా
    నీ కుమారునిగా నను స్వీకరించావు (2) ||అడగాలని||

    ఏ పాపమును ఎరుగని పరిశుద్ధుడా
    ఘోరపాపినైన నాకు పరిశుద్ధత నొసగావు
    ఈ లోకము వీడి నిన్ను చేరేంత వరకు
    పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచావు (2) ||అడగాలని||


    Nuvvu leni nannu oohinchalenu
    nee unnatha premanu vivarinchalenu (2)
    adagaalani nenu anukokamunde
    naa avasarathalu erigi akkaralu theerchaavu (2)
    naa avasarathalu erigi akkaralu theerchaavu
    yesayyaa… neeve naa aaraadhya daivamaa
    yesayyaa… neeve naa aadhaara deepamaa (2) ||nuvvu leni||

    padivelalo athi sundarudaa
    kuroopinaina naaku nee swaaraoopyamunichchaavu
    enduku panikiraani vaadanai yundagaa
    nee kumaarunigaa nanu sweekarinchaavu (2) ||adagaalani||

    ae paapamunu erugani parishudhdhudaa
    ghora paapinaina naaku parishudhdhatha nosagaavu
    ee lokamu veedi ninnu cherentha varaku
    parishudhdhaathmanu naaku thodugaa unchaavu (2) ||adagaalani||