Author: admin

  • Dhaevuni seeyoan దేవుని సీయోన్

    దేవుని సీయోన్ పురమా!
    శ్రేష్టమౌ పట్టణమా!
    స్థావరంబైన పురమా!
    దేవుని నివాసమా!

    యుగముల శిలయైన
    దేవుడే నీ పునాదీ!
    శత్రువు జయించలేని
    రక్షణ నీ దుర్గము

    కాంచుమా సజీవధారల్
    శాశ్వత ప్రేమధారల్
    నీదు పుత్రికా పుత్రులన్
    తృప్తిపర్చు ధారలన్

    అలసి సొలయకుండ
    దాహమున్ దీర్చుధార
    దాతయౌ దేవుని కృప
    సర్వకాలంబు పారున్

    కాంచుమా నీ యిండ్లమీద
    అగ్ని మేఘంబుల్దిగె
    ప్రభుని రాక సమయం
    బని మహిమ దెల్ప!

    ప్రార్థన ఫలంబులిచ్చి
    మన్నా నిచ్చిన ప్రభు
    సింహాసనాసీనుడై సు
    నాదుస్తోత్రంబుల్ వినెన్


    Dhaevuni seeyoan puramaa!
    shraeShtamau pattaNamaa!
    sThaavarMbaina puramaa!
    dhaevuni nivaasamaa!

    yugamula shilayaina
    dhaevudae nee punaadhee!
    shathruvu jayiMchalaeni
    rakShNa nee dhurgamu

    kaaMchumaa sajeevaDhaaral
    shaashvatha praemaDhaaral
    needhu puthrikaa puthrulan
    thrupthiparchu Dhaaralan

    alasi solayakuMda
    dhaahamun dheerchuDhaara
    dhaathayau dhaevuni krupa
    sarvakaalMbu paarun

    kaaMchumaa nee yiMdlameedha
    agni maeghMbuldhige
    prabhuni raaka samayM
    bani mahima dhelpa!

    praarThana phlMbulichchi
    mannaa nichchina prabhu
    siMhaasanaaseenudai su
    naadhusthoathrMbul vinen

  • Dhaevuniki morrapettudhunu దేవునికి మొఱ్ఱపెట్టుదును

    దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి
    చెవియొగ్గువరకు మనవి చేయుచుందును

    ప్రభుని ఆపదల యందు వెదకువాడను
    ప్రాణము పొంద జాలకున్నది యోదార్పును

    పూర్వ సంవత్సరములను తలచుకొందును
    పాడిన పాట రాత్రి జ్ఞప్తినుంచుకొందును

    హృదయమున నిన్ను ధ్యానించుకొందురు
    శ్రద్ధగ నా యాత్మ నీ తీర్పు వెదకుచున్నది

    ప్రభువు నన్ను నిత్యము విడిచిపెట్టునా
    ప్రభువింకెన్నటికిని కటాక్షముంచడా

    దేవుడు నన్ను కనికరింపక మానివేసెనా
    దేవుడు కోపముతో కృప చూపకుండునా

    మహోన్నతుని దక్షిణ హస్తము మారెను
    అనుకొనుటకు నా శ్రమలే కారణము

    దేవా నీ పూర్వపు ఆశ్చర్యకార్యములను
    తలంచు కొందు నాదు మనస్సులో నిప్పుడు

    నీ కార్యమంతటిని ధ్యానించుకొందును
    నీ క్రియలను ధ్యానము నే జేసికొందును

    మహా పరిశుద్ధమైనది నీదు మార్గము
    మహా దేవా నీ వంటివాడు ఎక్కడున్నాడు

    ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే
    జనములలో ప్రభావమును చూపియున్నావు


    Dhaevuniki moRRapettudhunu elugeththi
    cheviyogguvaraku manavi chaeyuchuMdhunu

    prabhuni aapadhala yMdhu vedhakuvaadanu
    praaNamu poMdha jaalakunnadhi yoadhaarpunu

    poorva sMvathsaramulanu thalachukoMdhunu
    paadina paata raathri jnYpthinuMchukoMdhunu

    hrudhayamuna ninnu DhyaaniMchukoMdhuru
    shradhDhaga naa yaathma nee theerpu vedhakuchunnadhi

    prabhuvu nannu nithyamu vidichipettunaa
    prabhuviMkennatikini kataakShmuMchadaa

    dhaevudu nannu kanikariMpaka maanivaesenaa
    dhaevudu koapamuthoa krupa choopakuMdunaa

    mahoannathuni dhakShiNa hasthamu maarenu
    anukonutaku naa shramalae kaaraNamu

    dhaevaa nee poorvapu aashcharyakaaryamulanu
    thalMchu koMdhu naadhu manassuloa nippudu

    nee kaaryamMthatini DhyaaniMchukoMdhunu
    nee kriyalanu Dhyaanamu nae jaesikoMdhunu

    mahaa parishudhDhamainadhi needhu maargamu
    mahaa dhaevaa nee vMtivaadu ekkadunnaadu

    aashcharya kriyalu jarigiMchu dhaevudavu neevae
    janamulaloa prabhaavamunu choopiyunnaavu

  • Dhaevunithoa sahapaati దేవునితో సహపాటి

    దేవునితో సహపాటి పాలివారిగానుజేసె
    తోడివారసులనుగా మనలను ప్రభు జేసెనుగా

    దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించె
    అమూల్య వాగ్దానములిచ్చి దైవస్వభావ మొసగెనుగా

    దైవ వెలుగును పొంది దైవాత్మలో పాలు పొంది
    దివ్య వాక్యమును పొంది దివిని రుచి చూచితిమి

    ప్రభు పరిశుద్ధతలో పాలి వారమగునట్లు
    సకల శ్రమల పాలై దైవశిక్ష నొందితిమి

    పరలోక పిలుపునందు పాలివారిగాను జేసె
    తన యింటి వారినిగా జేయ మనల నేర్పరచె

    తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మముజేసె
    పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారిగా జేసె

    క్రీస్తులో పాలివారై క్రీస్తు సుగుణములను పొంది
    దృఢముగా నిలిచెదము పట్టువదలక మనము

    రాబోవు మహిమయందు పాలివారమౌ మనము
    ప్రభు సెలవిచ్చెనుగా ప్రియులను మేల్కొల్పెదము


    Dhaevunithoa sahapaati paalivaarigaanujaese
    thoadivaarasulanugaa manalanu prabhu jaesenugaa

    dhuShtaloakamu nuMdi adhbhuthamugaa rakShiMche
    amoolya vaagdhaanamulichchi dhaivasvabhaava mosagenugaa

    dhaiva velugunu poMdhi dhaivaathmaloa paalu poMdhi
    dhivya vaakyamunu poMdhi dhivini ruchi choochithimi

    prabhu parishudhDhathaloa paali vaaramagunatlu
    sakala shramala paalai dhaivashikSh noMdhithimi

    paraloaka pilupunMdhu paalivaarigaanu jaese
    thana yiMti vaarinigaa jaeya manala naerparache

    thMdrini sthuthiMchedhamu yoagyulugaa mamujaese
    parishudhDhula svaasThyamuloa paalivaarigaa jaese

    kreesthuloa paalivaarai kreesthu suguNamulanu poMdhi
    dhruDamugaa nilichedhamu pattuvadhalaka manamu

    raaboavu mahimayMdhu paalivaaramau manamu
    prabhu selavichchenugaa priyulanu maelkolpedhamu

  • Dhaeshasaevaojaesi dhaeva దేశసేవఁజేసి దేవ

    దేశసేవఁజేసి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో మోసమార్గములను వీడి
    యేసుని నిజదాసు లగుఁడి దోసములను వీడి దేవ దాసులై వర్ధిల్లుఁ
    డిలలో ||దేశ||

    దేశ బంధువు యేసువే మన దేశ రక్షకుఁ డాయనే దేశ మంత యేసు
    మనసుతో నాశతో సేవించుడి ||దేశ||

    నీతి న్యాయంబులు గలిగియు నిష్ఠలందు మెలఁగియు నిత్య ప్రేమ
    చూపి యేసు నిష్ఠ లేక మేలు లేదు ||దేశ||

    వినయశక్తి నెంతగా వివ రించిన బోధించిన విశ్వ విభుండౌ యేసు
    వినయ విధము లేక మేలు లేదు ||దేశ||

    ప్రేమఁ గలగి పరమ సత్య ప్రేమ సేవఁ జేయుఁడి ప్రేమమూర్తి యేసుకీస్తు
    ప్రేమలలో వర్ధిల్లుఁ డిలలో ||దేశ||

    ఆసేతు హిమాచల ప ర్యంతమున్ దిగంతము లేకముగను దివిని
    భువిని సేలు రాజు యేసుఁడే ||దేశ||


    DhaeshasaevAOjaesi dhaeva dhaasulai
    varDhilluAO dilaloa moasamaargamulanu veedi
    yaesuni nijadhaasu laguAOdi dhoasamulanu
    veedi dhaeva dhaasulai varDhilluAO
    dilaloa ||dhaesha||

    dhaesha bMDhuvu yaesuvae mana dhaesha
    rakShkuAO daayanae dhaesha mMtha yaesu
    manasuthoa naashathoa saeviMchudi ||dhaesha||

    neethi nyaayMbulu galigiyu niShTalMdhu melAOgiyu nithya praema
    choopi yaesu niShTa laeka maelu laedhu ||dhaesha||

    vinayashakthi neMthagaa viva riMchina
    boaDhiMchina vishva vibhuMdau yaesu
    vinaya viDhamu laeka maelu laedhu ||dhaesha||

    praemAO galagi parama sathya praema saevAO
    jaeyuAOdi praemamoorthi yaesukeesthu
    praemalaloa varDhilluAO dilaloa ||dhaesha||

    aasaethu himaachala pa ryMthamun dhigMthamu
    laekamuganu dhivini
    bhuvini saelu raaju yaesuAOdae ||dhaesha||

  • Dhashamu bhaagamu దశము భాగము

    దశము భాగము లెల్ల దేవునివి ధారాళముగ నియ్య సమకూడుఁడి
    పశువులు పైరులు దేవునివి పసిఁడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము
    లెల్ల దేవునివి భావించి కానుకలను నియ్యుఁడి ||దశమ||

    దేవునివి దొంగలించెదరా దేవదేవుని మోసపుచ్చెదరా భావించి మది
    నెంచి భయము నెంచి ప్రార్ధింపఁ దలవంచి ప్రభు భాగమున్
    దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా నుండ సమకూర్చుఁడీ ||దశమ||

    పరిశుద్ధ దేవుని మందిరముఁ పరిపూర్ణముగాను యోచించుఁడీ పరిశుద్ధ
    భాగము విడఁదీయుఁడీ పాడిపంటలు నాస్తి దేవునిని పదియవ భాగంబు
    దేవునివి పరమాత్మ దీవెనలను బొందుఁడీ ||దశమ||

    ప్రథమ ఫలంబులు దేవునివి విదితంబుగా నీయ మది నెంచుఁడీ
    సదమల హృదయములను బొందియుఁ ప్రథమ భాగము నెల్ల విడఁదీసియు
    ముదమున దేవునికర్పించుఁడీ సదయు దీవెనలొంద సమకూర్చుఁడీ
    ||దశమ||

    ఆకసపు వాకిండ్ల విప్పుదును అధిక కృపలను గుమ్మరించుదును మీ
    కష్టఫలములను దీవింతును భీకర నాశంబుఁ దొలఁగింతును మీ కానంద
    దేశ మిత్తు నని శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశమ||

    దినభోజనం బిచ్చు దేవునిని ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని
    వినయంబుతో మదిని ధ్యానించుచు దినభోజనంబులను భాగించుచు
    మానక దేవుని కర్పించు డీ ఘనసేవ జయమొందు పని బూనడీ ||దశమ||


    Dhashamu bhaagamu lella dhaevunivi
    DhaaraaLamuga niyya samakooduAOdi
    pashuvulu pairulu dhaevunivi pasiAOdi
    loahapuganulu dhaevunivi bhaagyabhoagyamu
    lella dhaevunivi bhaaviMchi kaanukalanu niyyuAOdi||dhashama||

    dhaevunivi dhoMgaliMchedharaa dhaevadhaevuni
    moasapuchchedharaa bhaaviMchi madhi
    neMchi bhayamu neMchi praarDhiMpAO
    dhalavMchi prabhu bhaagamun
    dhaevaalayMbunu poorNMbugaa dhaedheepyamugaa
    nuMda samakoorchuAOdee ||dhashama||

    parishudhDha dhaevuni mMdhiramuAO
    paripoorNamugaanu yoachiMchuAOdee parishudhDha
    bhaagamu vidAOdheeyuAOdee paadipMtalu
    naasthi dhaevunini padhiyava bhaagMbu
    dhaevunivi paramaathma dheevenalanu boMdhuAOdee ||dhashama||

    praThama phlMbulu dhaevunivi vidhithMbugaa
    neeya madhi neMchuAOdee
    sadhamala hrudhayamulanu boMdhiyuAO
    praThama bhaagamu nella vidAOdheesiyu
    mudhamuna dhaevunikarpiMchuAOdee sadhayu
    dheevenaloMdha samakoorchuAOdee
    ||dhashama||

    aakasapu vaakiMdla vippudhunu aDhika
    krupalanu gummariMchudhunu mee
    kaShtaphlamulanu dheeviMthunu bheekara
    naashMbuAO dholAOgiMthunu mee kaanMdha
    dhaesha miththu nani shreekaruM dehoavaa
    sela vichchenu ||dhashama||

    dhinabhoajanM bichchu dhaevunini ghana
    saukhyamula nichchu dhaevunini
    vinayMbuthoa madhini DhyaaniMchuchu
    dhinabhoajanMbulanu bhaagiMchuchu
    maanaka dhaevuni karpiMchu dee ghanasaeva
    jayamoMdhu pani boonadee ||dhashama||

  • Dhaasula praarthana దాసుల ప్రార్థన

    దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు యేసు నాయకుఁడై మా వేల్పు
    దోసములు సేయు దుర్జనుఁడైనను దోసి లొగ్గఁ బర వాసి జేయునఁట
    ||దాసుల||

    జన రహిత స్థల మున జని వేఁడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్
    తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతస
    మిడునఁట ||దాసుల||

    మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకుఁ జెవు లొగ్గున్
    హృదయము కనుఁగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల
    కోర్కె లిచ్చునట ||దాసుల||

    ముదమున నిద్దరు ముగ్గురు నొకచోఁ బదిలముగాఁ దనుఁ బ్రార్ధింపన్
    వదలక దానట వచ్చి యుందు నని మృదువుగఁ బలికిన కృత
    రక్షణు(డట ||దాసుల||


    Dhaasula praarThana dhappaka yesAOgedu
    yaesu naayakuAOdai maa vaelpu
    dhoasamulu saeyu dhurjanuAOdainanu
    dhoasi loggAO bara vaasi jaeyunAOta ||dhaasula||

    jana rahitha sThala muna jani vaeAOdedi
    manujula praarThana vinuchuMdun
    thana paadhamu na mmina saaDhooththama
    janulanu joochina sMthasa midunAOta ||dhaasula||

    madhi vishvaasamu goodina praarThana
    sadhayatha vinutakuAO jevu loggun
    hrudhayamu kanuAOgoni yuchitha
    samayamuna gudhuruga bhakthula
    koarke lichchunata ||dhaasula||

    mudhamuna nidhdharu mugguru nokachoaAO
    badhilamugaaAO dhanuAO braarDhiMpan
    vadhalaka dhaanata vachchi yuMdhu nani
    mrudhuvugAO balikina krutha rakShNu(data ||dhaasula||

  • Dhahana bali neeku దహన బలి నీకు

    దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయే
    యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు ||దహన||

    నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి
    ప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి ||దహన||

    అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్
    ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు ||దహన||


    Dhahana bali neeku naniShtamu mariyu
    dhaiva balulu virigina yaathmayae
    yehoava dhaeva virigi naligina yatti
    hrudhayM balakShyMbu saeyavu ||dhahana||

    nee kataakShmuthoa seeyoanuna kipudae
    nenaruthoadanu maelu chaeyumi
    praakatMbuganu yoarooShlae munakuAO
    braakaaramulanu gattiMchumi ||dhahana|

    amthata neethiyukthMbu lau balula
    yaagamula sarvaaMga hoamamul
    eMthoa yiShtMbau balipeeTamu meeAOdha
    nennoa koadela janularpiMchuthuru ||dhahana||

  • Dhaahamu theerchumayyaa దాహము తీర్చుమయ్యా

    దాహము తీర్చుమయ్యా – అభి – షేకము నీయుమయ్యా – మాదు

    వేదము పూర్వము తెలిపిన విధమున – నీ దాసుల నాత్మతో నింపి
    కరుణసాగరా బీదలమగు మము – కరుణించు మిపుడే – మాదు

    శత్రువు చేత సహించరాని – కష్టము లేన్నో కల్గినను
    దేవా నీదుకృప బలముచే – నవిరత జయమభ్భున్ – మాకు

    వేదపుసారము భోధించునట్టి – భోధకుడా పరుశుద్ధాత్ముడా
    పాదశరణము వేడినట్లయిన – పరిశుద్దు లయ్యెదము – మేము

    శుద్ధ జీవితము పరిశుద్ధ సేవయు – శుద్ధునికి హితమగు కానుకలు
    పరిశుద్ధ చిత్తప్రకారము దయనొంది – ఫలమును చూచెదము – మేము


    Dhaahamu theerchumayyaa – abhi
    Shaekamu neeyumayyaa – maadhu

    vaedhamu poorvamu thelipina viDhamuna
    nee dhaasula naathmathoa niMpi
    karuNasaagaraa beedhalamagu mamu
    karuNiMchu mipudae – maadhu

    shathruvu chaetha sahiMcharaani
    kaShtamu laennoa kalginanu
    dhaevaa needhukrupa balamuchae
    naviratha jayamabhbhun – maaku

    vaedhapusaaramu bhoaDhiMchunatti
    bhoaDhakudaa parushudhDhaathmudaa
    paadhasharaNamu vaedinatlayina
    parishudhdhu layyedhamu – maemu

    shudhDha jeevithamu parishudhDha saevayu
    shudhDhuniki hithamagu kaanukalu
    parishudhDha chiththaprakaaramu dhayanoMdhi
    phalamunu choochedhamu – maemu

  • Dhaahamugala vaarellaru దాహముగల వారెల్లరు

    దాహముగల వారెల్లరు – నీళ్ళయొద్దకు రారండి

    దేవుని నది నీళ్ళతో నిండి – భువికి సారము నిచ్చుచున్నది – రారండి
    దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు

    ఆనంద ప్రవాహ నదిలో – పానముతో దప్పి తీర్చును రారండి
    భూనివాసులు దాహముతో – ప్రాణము విడుచుచున్నారు

    మంచితనముతో వత్సరమునకు మకుటము ధరింప చేసెను – రారండి
    మహిమతో నిండిన తన మార్గములో – మేలులు ప్రవహింప జేసెను

    ప్రయాసభారము మోయువారు – యేసు నొద్దకు ఆశతోడను – రారండి
    తీసివేయును మీ భారము – నొసగు మీకు విశ్రాంతి

    సకలము సిద్ధముగా నున్నది – శక్తిగల దేవుని విందునకు – రారండి
    సహవాసంబున భుజించును – చేర్చుకొనిన క్రీస్తు ప్రభుని

    సత్యమును తెలిపెను ప్రభువు – ప్రత్యేక జీవము జీవింపను – రారండి
    ప్రత్యక్ష పరచెను తన వెలుగు – నిత్యము యేసుతో జీవించుడి

    దేవుని నది జీవజల నది – ప్రవహించుచున్నది పల్లమునకు – రారండి
    దేవుని కృప పూర్ణతను బొందగ – నీవును విధేయుడవై యుండుము


    Dhaahamugala vaarellaru – neeLLayodhdhaku raarMdi

    dhaevuni nadhi neeLLathoa niMdi –
    bhuviki saaramu nichchuchunnadhi – raarMdi
    dhaevuni dheevenala valana neevu thrupthi poMdhedhavu

    aanMdha pravaaha nadhiloa –
    paanamuthoa dhappi theerchunu raarMdi
    bhoonivaasulu dhaahamuthoa – praaNamu viduchuchunnaaru

    mMchithanamuthoa vathsaramunaku
    makutamu DhariMpa chaesenu – raarMdi
    mahimathoa niMdina thana maargamuloa –
    maelulu pravahiMpa jaesenu

    prayaasabhaaramu moayuvaaru
    yaesu nodhdhaku aashathoadanu – raarMdi
    theesivaeyunu mee bhaaramu – nosagu meeku vishraaMthi

    sakalamu sidhDhamugaa nunnadhi
    shakthigala dhaevuni viMdhunaku – raarMdi
    sahavaasMbuna bhujiMchunu – chaerchukonina kreesthu prabhuni

    sathyamunu thelipenu prabhuvu
    prathyaeka jeevamu jeeviMpanu – raarMdi
    prathyakSh parachenu thana velugu – nithyamu yaesuthoa jeeviMchudi

    dhaevuni nadhi jeevajala nadhi
    pravahiMchuchunnadhi pallamunaku – raarMdi
    dhaevuni krupa poorNathanu boMdhaga – neevunu viDhaeyudavai yuMdumu

  • Dhoothaganamulella దూతగణములెల్ల

    దూతగణములెల్ల ఆరాధించిరిగా
    పరిశుద్ధుడు సైన్యముల యెహోవని

    ఇహపరములలో ఆయన మహిమ
    నిండియున్నదని గానము చేసిరి – 2

    నిష్కళంకమైనది నీ కనుదృష్టి
    నీవు చూడలేవుగా దుష్టత్వమును
    దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో
    చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము

    నా హృదయమునందు శుద్ధి కలిగించితివి
    నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి
    పెన్నుగా నీ పరిశుద్ధత నొసగిన దేవా
    ఘనముగాను పొగడెదను పావన ప్రభువా

    పాపముతో పతనమైన నా దేహమును
    పరిశుద్ధాలయముగాని చేసికొంటివి
    పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలిచిన
    సర్వోన్నతుడా నిన్ను స్తుతియించెదను

    నీ రక్తముచేత నాకు కలిగించితివి
    నిర్భయంబుగాను పరిశుద్ధ స్థలములో
    ప్రవేశింపజేసియున్న ప్రియ యేసువా
    పూజించెద నిన్ను నాదు జీవితమంతా

    పరలోకపు తండ్రి నీవు పరిశుద్ధుడవు
    పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి
    సమస్తమును చేయుటకు బలపరచితివి
    సమాధాన కర్తనీకే వందన స్తుతులు


    DhoothagaNamulella aaraaDhiMchirigaa
    parishudhDhudu sainyamula yehoavani

    ihaparamulaloa aayana mahim
    niMdiyunnadhani gaanamu chaesiri – 2

    niShkaLMkamainadhi nee kanudhruShti
    neevu choodalaevugaa dhuShtathvamunu
    dhoorasThulamaina mammu nee rakthamuthoa
    chaeradheesi chaerchukonna svaami sthoathramu

    naa hrudhayamunMdhu shudhDhi kaligiMchithivi
    ninnu chooche nireekShNa naa kosagithivi
    pennugaa nee parishudhDhatha nosagina dhaevaa
    ghanamugaanu pogadedhanu paavana prabhuvaa

    paapamuthoa pathanamaina naa dhaehamunu
    parishudhDhaalayamugaani chaesikoMtivi
    parishudhDha svaasThyamunaku nannu pilichin
    sarvoannathudaa ninnu sthuthiyiMchedhanu

    nee rakthamuchaetha naaku kaligiMchithivi
    nirbhayMbugaanu parishudhDha sThalamuloa
    pravaeshiMpajaesiyunna priya yaesuvaa
    poojiMchedha ninnu naadhu jeevithamMthaa

    paraloakapu thMdri neevu parishudhDhudavu
    paripoorNathayMdhu nannu nadipiMchithivi
    samasthamunu chaeyutaku balaparachithivi
    samaaDhaana karthaneekae vMdhana sthuthulu