Author: admin

  • Dhaaruna magu marana vaaridhi దారుణ మగు మరణ వారిధి

    దారుణ మగు మరణ వారిధి దాఁట నె వ్వారి శక్యము సోదర ఘోర
    మగు కెరటములవలె వి స్తారముగ
    నేరములు పైఁగొని పారు చుండునప్పు
    డద్దరిఁ జేరు టెట్లు దారిఁ గనరే ||దారుణ||

    ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావు
    ఎక్కడైనను నోడ గనుఁగొని యెక్కిపోద
    మని తలంచినఁ జెక్క నిర్మతమైన
    యోడ లక్కఱకు రావేమి సేతుము ||దారుణ||

    మంగళ ధ్వనులతో శృంగారపురము వె లుంగుచున్నది ముందట
    పొంగి పారుచు మరణ నది త రంగములఁ
    జెలంగుచున్నది భంగపడకుఁడి
    మనకు క్రీస్తు సువార్తయను పెను నావ యిదిగో ||దారుణ||

    వాద రహితుండైన యాది దేవుఁడు దాని నాధుం డనం బరఁగును
    బాధ లొందిన నరుల నందరిఁ జేరఁదీసిన
    క్రీస్తు యేసు నాధుఁడే నావి
    కుఁ డు క్రైస్తవ వేదమే చుక్కాని దీవికి ||దారుణ||

    మానవు లందరు మరణాంబుధిని దాఁట మహనీయ మగు నావ యిదె
    దీనిలో నెక్కుటకు ముందే మానుగ వాక్యమును విని సు జ్ఞాన
    మొందినవారు క్రైస్తవ స్నాన మను పత్రికను బొందరె ||దారుణ||

    విదితంబుగా నిందు విజ్ఞాన బోదకుల్ వినిపించుదురు వాక్యముఁ
    గొదగొనిన యాత్మములు తృప్తిఁ గొనును బ్రభు భోజనములోనే
    హృదయములలో దేవునాత్మ యెపుడు దీపంబై వెలుంగును ||దారుణ||

    పలువిధ సంగీత ములతో సాగుచు మనము నలయ కుండఁగఁ బోదు
    ము బలముగల యీ యలలు దాఁటి పరమ పురద్వారముల వెలుపల
    గలిసికొని పరిశుద్ధ జనమును గడకు మోక్షము చేరుకొందుము ||దారుణ||

    కరుణామయుని సభలోఁ జొరకపోయిన నిత్య నరక మంత మందున
    మరియు నంత్య దినపు బాధలు విరివిగ వినఁ గోరువారలు మరణ
    మొందక మును ప్రత్యక్షీ కరుణ మను గ్రంథమను వినరే ||దారుణ||


    DhaaruNa magu maraNa vaariDhi dhaaAOta
    ne vvaari shakyamu soadhara ghoara
    magu keratamulavale vi sthaaramuga
    naeramulu paiAOgoni paaru chuMdunappu
    dadhdhariAO jaeru tetlu dhaariAO ganarae ||dhaaruNa||

    okka pettuna negasi chakka velLudha mana
    nee rekka lakkaRaku raavu
    ekkadainanu noada ganuAOgoni yekkipoadha
    mani thalMchinAO jekka nirmathamaina
    yoada lakkaRaku raavaemi saethumu ||dhaaruNa||

    mMgaLa Dhvanulathoa shruMgaarapuramu
    ve luMguchunnadhi muMdhata
    poMgi paaruchu maraNa nadhi tha rMgamulAO
    jelMguchunnadhi bhMgapadakuAOdi
    manaku kreesthu suvaarthayanu penu naava yidhigoa ||dhaaruNa||

    vaadha rahithuMdaina yaadhi dhaevuAOdu
    dhaani naaDhuM danM barAOgunu
    baaDha loMdhina narula nMdhariAO jaerAOdheesina
    kreesthu yaesu naaDhuAOdae naavi
    kuAO du kraisthava vaedhamae chukkaani dheeviki ||dhaaruNa||

    maanavu lMdharu maraNaaMbuDhini
    dhaaAOta mahaneeya magu naava yidhe
    dheeniloa nekkutaku muMdhae maanuga
    vaakyamunu vini su jnYaana
    moMdhinavaaru kraisthava snaana manu
    pathrikanu boMdhare ||dhaaruNa||

    vidhithMbugaa niMdhu vijnYaana
    boadhakul vinipiMchudhuru vaakyamuAO
    godhagonina yaathmamulu thrupthiAO
    gonunu brabhu bhoajanamuloanae
    hrudhayamulaloa dhaevunaathma yepudu
    dheepMbai veluMgunu ||dhaaruNa||

    paluviDha sMgeetha mulathoa saaguchu
    manamu nalaya kuMdAOgAO boadhu
    mu balamugala yee yalalu dhaaAOti
    parama puradhvaaramula velupala
    galisikoni parishudhDha janamunu
    gadaku moakShmu chaerukoMdhumu ||dhaaruNa||

    karuNaamayuni sabhaloaAO jorakapoayina
    nithya naraka mMtha mMdhuna
    mariyu nMthya dhinapu baaDhalu viriviga
    vinAO goaruvaaralu maraNa
    moMdhaka munu prathyakShee karuNa manu
    grMThamanu vinarae ||dhaaruNa||

  • Dhaaritholagithivaela rakshna దారితొలగితివేల రక్షణ

    దారితొలగితివేల (2) రక్షణ మార్గము వెదకు (2)

    పాపమందే జన్మించితివి (2)
    పాపమందే జీవించితివి (2) ఎరుగకున్నావు (2)….

    పాప ఫలితము ఘోరమరణము
    నరకదండన అగ్ని గుండము మారు మనస్సు నొందు….

    నేడే యేసుని వాక్యము వినుము
    నేడే ప్రభుని స్వరము వినుము తన చిత్తము నెరుగు….

    నీవు నశించుట కోరడు ప్రభువు
    తరుణముండగ వేడుకొనుము ఎరుగు నీ స్థితిని….

    అందరిని మారుమనస్సును
    పొందుమని ప్రభువాజ్ఞాపించె పశ్చాత్తాపపడుము….

    ఒప్పుకొనుము నీ పాపమును
    క్షమాపణకై వేడుకొనుము రక్షణ పొందెదవు….

    విశ్వాసముతో అడిగిన యెడల
    పొందితివని నిశ్చయముగ నెరుగు గొప్ప రక్షణ యిదియే


    Dhaaritholagithivaela (2) rakShNa maargamu vedhaku (2)

    paapamMdhae janmiMchithivi (2)
    paapamMdhae jeeviMchithivi (2) erugakunnaavu (2)….

    paapa phalithamu ghoaramaraNamu
    narakadhMdana agni guMdamu maaru manassu noMdhu….

    naedae yaesuni vaakyamu vinumu
    naedae prabhuni svaramu vinumu thana chiththamu nerugu….

    neevu nashiMchuta koaradu prabhuvu
    tharuNamuMdaga vaedukonumu erugu nee sThithini….

    aMdharini maarumanassunu
    poMdhumani prabhuvaajnYaapiMche pashchaaththaapapadumu….

    oppukonumu nee paapamunu
    kShmaapaNakai vaedukonumu rakShNa poMdhedhavu….

    vishvaasamuthoa adigina yedal
    poMdhithivani nishchayamuga nerugu goppa rakShNa yidhiyae

  • Dhorakuthaavuraa sahoadharaa దొరకుతావురా సహోదరా

    దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా, నీవు
    తరిమి తరిమి కీడుచేయ పరుగులెత్తినగాని తుదకు ||దొ||

    చిన్న చూపు చూచి తమ్ముని కన్నెఱుంగక చంపినగాని
    అన్న కయీను దేవుని హస్తమునకు దొరికిన రీతిగా ||దొ||

    వరములొందిన తమ్ముని జంప వలయునని పంతముగబట్టి
    నరకవచ్చిలోబడి యేడ్చిన దురిత చరితుని యేశావువలె ||దొ||

    భక్త దావీదును బట్టి ప్రాణము దీయగ దలచిన తన
    శక్తితో తరిమిన రాజగు సౌలు దొరికినరీతిగాను ||దొ||

    విగ్రహమునకు మ్రొక్కని దైవ పిల్లల నగ్నిలోపడవైచి
    ఆగ్రహించిన నెబుకద్నెజరు గడ్డిమోసి దొరికిన విధముగ ||దొ||

    క్రైస్తవులను బట్టి కొట్టి ఖైదులో వేయదలచినను
    వాస్తవమగు వెలుగును జూచి ప్రభుని చాటిని పౌలుబోలి ||దొ||

    కీడుచేయబోకు మెపుడు కీడు నీకే కీడు కీడు
    కీడు చేసినమేలుచేసి కీడును జయింపకపోతే ||దొ||

    మాటలు కుదిరితే మాటలు కోటలు కుదురును నీకు
    మాటలలో లోటుంటే నోటిమాట తప్పకుండ ||దొ||

    దొంగతనము వ్యభిచారమునకు లొంగి శాపగ్రస్తులునై
    దొంగిలించిన దశమభాగమే లొంగుట కారణమని తుదకు ||దొ||

    కొంతయిచ్చిన దశభాగ మంత యిదియని తప్పుకున్న
    కొంతయిచ్చిన కయీనువలె కొంతయిచ్చిన అననియవలె ||దొ||

    చెడుగుచేసి బదులు దానిని చేసినారని చెప్పమన్న వడిగ
    దేవుని న్యాయమనెడి పరమత్రాసులో నిలువండి ||దొ||


    Dhorakuthaavuraa sahoadharaa!
    dhorukuthaavuraa, neevu
    tharimi tharimi keeduchaeya
    paruguleththinagaani thudhaku ||dho||

    chinna choopu choochi thammuni
    kanneRuMgaka chMpinagaani
    anna kayeenu dhaevuni hasthamunaku
    dhorikina reethigaa ||dho||

    varamuloMdhina thammuni jMpa
    valayunani pMthamugabatti
    narakavachchiloabadi yaedchina
    dhuritha charithuni yaeshaavuvale ||dho||

    bhaktha dhaaveedhunu batti praaNamu
    dheeyaga dhalachina thana
    shakthithoa tharimina raajagu saulu
    dhorikinareethigaanu ||dho||

    vigrahamunaku mrokkani dhaiva pillala
    nagniloapadavaichi
    aagrahiMchina nebukadhnejaru gaddimoasi
    dhorikina viDhamuga ||dho||

    kraisthavulanu batti kotti khaidhuloa
    vaeyadhalachinanu
    vaasthavamagu velugunu joochi prabhuni
    chaatini pauluboali ||dho||

    keeduchaeyaboaku mepudu keedu neekae keedu keedu
    keedu chaesinamaeluchaesi keedunu jayiMpakapoathae ||dho||

    maatalu kudhirithae maatalu koatalu kudhurunu neeku
    maatalaloa loatuMtae noatimaata thappakuMda ||dho||

    dhoMgathanamu vyabhichaaramunaku
    loMgi shaapagrasthulunai
    dhoMgiliMchina dhashamabhaagamae
    loMguta kaaraNamani thudhaku ||dho||

    koMthayichchina dhashabhaaga mMtha
    yidhiyani thappukunna
    koMthayichchina kayeenuvale
    koMthayichchina ananiyavale ||dho||

    cheduguchaesi badhulu dhaanini
    chaesinaarani cheppamanna vadiga
    dhaevuni nyaayamanedi paramathraasuloa niluvMdi ||dho||

  • Parimapuri kalpabhooja niratha పరిమపురి కల్పభూజ నిరత

    పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ
    వరస్తుతి సల్పెదము రాజ

    జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమ
    ననిపి మము కనికరించు||పరమ||

    నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచు
    వారిఁ బావనులఁ జేయు సదా ||పరమ||

    కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను
    దలంచు బలము గల ప్రభుఁడ వీవే ||పరమ||

    ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై
    తానును బడఁద్రొక్కివేయు ||పరమ||

    అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా
    కరుణించు మమును ||పరమ||


    Parimapuri kalpabhooja niratha bhoonarula
    pooja yurutharachitha mahimathaeja
    varasthuthi salpedhamu raaj

    janaka sutha shudhDhaathma yanu paerita
    yaekaathma ghanathara sMrakSh praema
    nanipi mamu kanikariMchu||parama||

    neevae maa praapuvMchu neranammi ymdhu
    mmchu bhaavMbuna dhalAOchu
    vaariAO baavanulAO jaeyu sadhaa ||parama||

    kaluShMbulanu hariMpa nila saithaanunu
    jayiMpa balumaaru ninu
    dhalMchu balamu gala prabhuAOda veevae ||parama||

    ee loaka paapanarulu chaala ninu nammi
    marala dhoolichae dhaaruNa sai
    thaanunu badAOdhrokkivaeyu ||parama||

    alpaa oa maegayunu naadhyMthMbulunu
    kalpaaMtha sThaayuvaina karthaa
    karuNiMchu mamunu ||parama||

  • Prematho nanu pilichinaa ప్రేమతో నను పిలిచినా

    ప్రేమతో నను పిలిచినా
    కృపతో నను నడిపినా
    యేసయ్య నీవే కదా
    నను సృష్టించిన దేవుడు
    యేసయ్య నీవే కదా
    నను నడిపించిన నాయకుడు

    వెలుగు కమ్మని పలుకగా
    వెలుగు కలిగెనుగా
    వెలుగులో నన్ను పిలిచినా
    ఆ వెలుగులో నను నడిపినా
    యేసయ్య నీవే కదా
    నను రక్షించిన దేవుడు

    నా పేరు నీవు పిలువగా
    జీవితం మారెనుగా
    జీవములో నన్ను నడిపినా
    ఆ జీవం నాలో నింపినా
    యేసయ్య నీవే కదా
    నను మార్చిన దేవుడు

    సిలువలో పాపాన్ని కడుగగా
    మార్గము తెరిచెనుగా
    ఆత్మతో నను నడిపినా
    పరిశుద్దాత్మతో నను నింపినా
    యేసయ్య నీవే కదా
    నను ప్రేమించిన దేవుడు


    Prematho nanu pilichinaa
    krupatho nanu nadipinaa
    yesayya neeve kadaa
    nanu srushtinchina dhevudu
    yesayya neeve kadaa
    nanu nadipinchina naayakudu

    velugu kammani palukagaa
    velugu kaligenugaa
    velugulo nannu pilichinaa
    aa velugulo nanu nadipinaa
    yesayya neeve kadaa
    nanu rakshinchina dhevudu

    naa peru neevu piluvagaa
    jeevitham maarenugaa
    jeevamulo nannu nadipinaa
    aa jeevam naalo nimpinaa
    yesayya neeve kadaa
    nanu maarchina dhevudu

    siluvalo paapaanni kadugagaa
    maargamu therichenugaa
    aathmatho nanu nadipinaa
    parishuddaathmatho nanu nimpinaa
    yesayya neeve kadaa
    nanu preminchina dhevudu

  • Paadudhunu kreesthu paera padhamu పాడుదును క్రీస్తు పేర పదము

    పాడుదును క్రీస్తు పేర పదము నెంతో వేడుదు నా దివ్యాగురు నివ్విధముఁ
    జూడఁజూడ మదిలో నెంతో వేడుకగా మీఱె వింత ఱేడుఁ బోలినవా
    డిహ లేఁడు లేఁడందు నహహా ||పాడుదును||

    పెక్కు పాపములలోన మణఁగి నాదు తక్కువ బుద్ధిచే నందణఁగి దిక్కు
    గానక నుండు వేళ దిక్కయి చనుదెంచి మరల గ్రక్కున కరముఁ జూచి
    చక్కికిఁ జేర్చి ప్రోచె ||పాడుదును||

    మోసపు లోక వాంఛలను వట్టి యాశలతోఁ గూడికొన్న కలలు
    రోసితిఁ గాన వాని యేసుతోఁ గూడుకొంటి వీసమైనను లేమి లేశము
    లేదనుస్వామి ||పాడుదును||

    పాయ నెన్నటికిని వాసిగాఁ బాస త్రోయను త్రోయను యని చేసెగా
    రోయక న న్నావిభుఁడు సాయమై రక్షించు నెపుడు
    నా యనీతి భయములు
    మాని యాయనే జయంజయమని ||పాడుదును||

    చాలు చాలు పాపమా నీ చెలిమి నిత్య కాలము గలిగించు మృత్యుకలిమి
    యేలికైన నాయిమ్మాను యేలు నాయందు దయను మేలిమి
    నగుపరచినట్టి జాలినేఁ గంటిఁ గాన ||పాడుదును||

    ధరలో దేనికి భయపడను ఎట్టి తరుణమైనను చేయి విడను
    కరుణామయుండు నన్ను కరుణ నేర్పరచి మున్ను
    మరణమందును వాని
    శరణం నాశరణమని ||పాడుదును||


    Paadudhunu kreesthu paera padhamu neMthoa
    vaedudhu naa dhivyaaguru nivvidhamuAO
    joodAOjooda madhiloa neMthoa vaedukagaa
    meeRe viMtha RaeduAO boalinavaa
    diha laeAOdu laeAOdMdhu nahahaa ||paadudhunu||

    pekku paapamulaloana maNAOgi naadhu
    thakkuva budhDhichae nMdhaNAOgi dhikku
    gaanaka nuMdu vaeLa dhikkayi chanudheMchi
    marala grakkuna karamuAO joochi
    chakkikiAO jaerchi proache ||paadudhunu||

    moasapu loaka vaaMChalanu vatti
    yaashalathoaAO goodikonna kalalu
    roasithiAO gaana vaani yaesuthoaAO
    goodukoMti veesamainanu laemi laeshamu
    laedhanusvaami ||paadudhunu||

    paaya nennatikini vaasigaaAO baasa
    throayanu throayanu yani chaesegaa
    roayaka na nnaavibhuAOdu saayamai
    rakShiMchu nepudu naa yaneethi bhayamulu
    maani yaayanae jayMjayamani ||paadudhunu||

    chaalu chaalu paapamaa nee chelimi
    nithya kaalamu galigiMchu mruthyukalimi
    yaelikaina naayimmaanu yaelu naayMdhu dhayanu maelimi
    naguparachinatti jaalinaeAO gMtiAO gaana ||paadudhunu||

    Dharaloa dhaeniki bhayapadanu etti
    tharuNamainanu chaeyi vidanu
    karuNaamayuMdu nannu karuNa naerparachi
    munnu maraNamMdhunu vaani
    sharaNM naasharaNamani ||paadudhunu||

  • Padeda nenoka nutana gitam పాడెద నేనొక నూతన గీతం

    పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా
    యేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయె

    కలుషితమైన నదియై నేను కడలియ్యేనదిలో
    కలసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాలరాశి

    పోరు తరగని సిగసిగలెనియె అణచి కృపాతిశయము
    పాదయైన నా హృదయంలోనే పొంగెనే అభిషేక తైలం


    Padeda nenoka nutana gitam padeda manasara
    Yesayya ni namamu gaka veroka namamu ledaye

    Kalushitamaina nadiyai nenu kadaliyyenadilo
    Kalasipotine kaluvari darilo kanabadade ika papalarasi

    Poru taragani sigasigaleniye anachi krupatisayamu
    Padayaina na hrudayamlone pomgene abisheka tailam

  • Thellaga thelavaarakamumdhae తెల్లగ తెలవారకముందే

    తెల్లగ తెలవారకముందే
    తొలి కోడి కూయకముందే
    లేచినాడే యేసుదేవుడు
    సమాధిగుండె చాల్చినాడే మృత్యుంజయుడు

    ఈ గుడిని పడగొట్టమన్నాడే
    మూడు రోజుల్లో లేపుతానన్నాడే
    తనదేహము గూర్చి ఈ మాట చెప్పినాడే
    మాట తప్పనివాడు చేసి చూపినాడే

    స్త్రీలు సుగంధాలు సిద్దపరచినారే
    యేసు దేహానికి పూయాలని తలచినారే
    తిరిగిలేస్తానన్న యేసుమాట మరచినారే
    ఖాళీ సమాధిని చూచి నిజమునెరిగినారే


    Thellaga thelavaarakamuMdhae
    tholi koadi kooyakamuMdhae
    laechinaadae yaesudhaevudu
    samaaDhiguMde chaalchinaadae mruthyuMjayudu

    ee gudini padagottamannaadae
    moodu roajulloa laeputhaanannaadae
    thanadhaehamu goorchi ee maata cheppinaadae
    maata thappanivaadu chaesi choopinaadae

    sthreelu sugMDhaalu sidhdhaparachinaarae
    yaesu dhaehaaniki pooyaalani thalachinaarae
    thirigilaesthaananna yaesumaata marachinaarae
    khaaLee samaaDhini choochi nijamuneriginaarae

  • Tambura nada svaramulatoda తంబుర నాద స్వరములతోడ

    తంబుర నాద స్వరములతోడ
    తగువిదిని నేను భజన చేసెద
    అంబురంబున కెగసే పాటలు
    హాయిగా హాయిగా పాడెద పాడెద

    సితార స్వరమండలములతో శ్రీకర నిను భజన చేసెద
    ప్రతి దినము నీ ప్రేమ గాదను ప్రస్తుతించి పాడెద పాడెద (2)

    మృదంగ తాళద్వనులతోడ మృత్యుంజయ నిను భజన చేసెద
    ఉదయ సాయంత్రములాయందు హొసన్నాయని పాడెద పాడెద (2)

    పిల్లన గ్రోవి చల్లగ నుండి ఉల్లమున నిన్ను భజన చేసెద
    ఉల్లమున నిను ఎల్లవేలల హల్లెలూయని పాడెద పాడెద (2)


    Tambura nada svaramulatoda
    Taguvidini nenu bajana cheseda
    Amburambuna kegase patalu
    Hayiga hayiga padeda padeda

    Sitara svaramamdalamulato srikara ninu bajana cheseda
    Prati dinamu ni prema gadanu prastutimchi padeda padeda (2)

    Mrudamga taladvanulatoda mrutyumjaya ninu bajana cheseda
    Udaya sayamtramulayamdu hosannayani padeda padeda (2)

    Pillana grovi challaga numdi ullamuna ninnu bajana cheseda
    Ullamuna ninu ellavelala halleluyani padeda padeda (2)

  • Aela chimtha yaela vmtha yicha ఏల చింత యేల వంత యిచట

    ఏల చింత యేల వంత యిచట నీకు క్రైస్తవ పాలకుండు యేసు నీదు
    వంత లెల్ల నెరుఁగుఁగా ||యేల||

    తొల్లి నీ వొనర్చినట్టి దోష మెంతో జూడుమా కల్లగాదు యేసు క్రీస్తు
    చెల్ల చెదరఁ జేసెఁగా ||యేల||

    నీకు కాలు జారినపుడు నిన్ను లేవనెత్తెఁగా నీ కలుషముఁ గడిగి వైచి
    నిన్ను విమలుఁ జేసెఁగా ||యేల||

    నీకుఁ గల్గు వ్యాధు లన్నా నెవరు మీరఁ దీర్చెఁగా ప్రాకటముగ నీకు
    సకల పదవు లిచ్చి ప్రోచెఁగా ||యేల||

    యేసు నిన్ను బాగు జేయ నిచట శ్రమలు బెట్టుగా వాసిగాను
    శ్రమలయందు యేసు పజ్జఁజేరుమా ||యేల||

    నిన్ను తల్లడిల్లఁజేయు నీ విరోధు లందరిన్ మున్ను తండ్రి పగిదిఁ
    దరిమి పన్నుగాను బ్రోచెఁగా ||యేల||

    సందియంబు లేల నీకు స్వర్గ నాధుఁ డుండఁగా
    అందమైన యీవులిచ్చి
    యతఁడు నిన్ను ఁ బ్రోవగా ||యేల||


    Aela chiMtha yaela vMtha yichata neeku
    kraisthava paalakuMdu yaesu needhu
    vMtha lella neruAOguAOgaa ||yaela||

    tholli nee vonarchinatti dhoaSh meMthoa
    joodumaa kallagaadhu yaesu kreesthu
    chella chedharAO jaeseAOgaa ||yaela||

    neeku kaalu jaarinapudu ninnu laevaneththeAOgaa
    nee kaluShmuAO gadigi vaichi
    ninnu vimaluAO jaeseAOgaa ||yaela||

    neekuAO galgu vyaaDhu lannaa nevaru meerAO
    dheercheAOgaa praakatamuga neeku
    sakala padhavu lichchi proacheAOgaa ||yaela||

    yaesu ninnu baagu jaeya nichata shramalu
    bettugaa vaasigaanu
    shramalayMdhu yaesu pajjAOjaerumaa ||yaela||

    ninnu thalladillAOjaeyu nee viroaDhu
    lMdharin munnu thMdri pagidhiAO
    dharimi pannugaanu broacheAOgaa ||yaela||

    sMdhiyMbu laela neeku svarga naaDhuAO
    duMdAOgaa aMdhamaina yeevulichchi
    yathAOdu ninnu AO broavagaa ||yaela||