Author: admin

  • Ne brathiki unnaanante adi kevalam nee krupa నే బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృప

    నే బ్రతికి ఉన్నానంటే – అది కేవలం నీ కృప
    ఈ స్థితిలో ఉన్నానంటే – అది క్రీస్తు మహా కృప (2)
    నీ ప్రేమ బలమైనది
    నీ మాట విలువైనది (2) ||నే బ్రతికి||

    లోకములో నేనుండగా
    నీ కరములు చాపి పిలిచావయ్యా
    దుఃఖములో నేనుండగా
    నన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2)
    నా ఆధారము నీవే
    నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి||

    నా వారలే నన్ను నిందించినా
    నా బంధువులే నన్ను వెలివేసినా (4)
    ఎవరున్నా లేకున్ననూ
    నీ తోడు చాలునయ్యా
    ఏమున్నా లేకున్ననూ
    నీ కృపయే చాలునయ్యా ||నే బ్రతికి||

    నా స్థితి నీవు చూసావయ్యా
    నా గతినే నీవు మార్చావయ్యా (2)
    నా ఆధారము నీవే
    నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి||


    Ne brathiki unnaanante – adi kevalam nee krupa
    ee sthithilo unnaanante – adi kreesthu mahaa krupa (2)
    nee prema balamainadi
    nee maata viluvainadi (2) ||ne brathiki||

    lokamulo nenundagaa
    nee karamulu chaapi pilichaavayyaa
    dukhamulo nenunddagaa
    nannu odaarchinaavu naa yesayyaa (2)
    naa aadhaaramu neeve
    naa aashrayamu neeve (2) ||ne brathiki||

    naa vaarale nannu nindinchinaa
    naa bandhuvule nannu velivesinaa (4)
    evarunna lekunnanu
    nee thodu chaalunayyaa
    emunna lekunnanu
    nee krupaye chaalunayyaa ||ne brathiki||

    naa sthithi neevu choosaavayyaa
    naa gathine neevu maarchaavayyaa (2)
    naa aadhaaramu neeve
    naa aashrayamu neeve (2) ||ne brathiki||

  • sthothrarhudavu maa prabhuva deva స్తోత్రార్హుడవూ మా ప్రభువా దేవా

    స్తోత్రార్హుడవూ మా ప్రభువా దేవా
    నిత్య పరిశుద్ధా రాజా
    స్తోత్రార్హుడవూ మా ప్రభువా దేవా
    నీ వాక్యం సంధ్య వేళ దిగివచ్చే
    బాహు బలవంతుడా అదోనాయ్
    హల్లెలూయా నీవే నా రాజువూ

    నీ జ్ఞానముతో ప్రభూ
    నింగి తలుపులు తెరచి
    వివేచనతో రుతువులనూ చేసి
    దిన రాత్రులు చేసి
    చీకటి వెలుగుగా మార్చి
    తారలు నీకిష్టముగా అమర్చి

    సన్నుతించుడీ రాజునీ
    పాడుడీ పరిశుద్ధునీ
    సైన్యములకు అధిపతి తన పేరూ
    ఓ నిత్యా దేవా మము పాలించూ
    నేడు రేపు మారని వాడా
    బాహుబలవంతుడా అదోనాయ్
    హల్లెలూయా నీవే నా రాజువూ


    sthothrarhudavu maa prabhuva deva
    nithya parishuddha raajaa
    sthothrarhudavu maa prabhuva deva
    nee vaakyam sandhya vela dhigivache
    bahu balavanthudaa adonai
    hallelujah neeve naa raajuvu

    nee gnaanamutho prabhu
    ningi thalupulu therachi
    vivechanatho ruthuvulanu chesi
    dhina raathrulu chesi
    cheekati veluguga maarchi
    thaaralu neekistamugaa amarchi

    sannuthinchudi raajuni
    paadudi parishudduni
    sainyamulaku adhipathi thana peru
    oh nithya deva mamu paalinchu
    nedu repu maarani vaadaa
    bahu balavanthudaa adonai
    hallelujah neeve naa raajuvu

  • Na hrudhayaana koluvaina yesayya నా హృదయాన కొలువైన యేసయ్యా

    నా హృదయాన కొలువైన – యేసయ్యా
    నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా
    నా హృదయార్పణతో – ప్రాణమిల్లేదనే
    నీ సన్నిధిలో పూజార్హుడా

    అగ్ని ఏడంతలై – మండుచుండినను
    అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను
    అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడే నే
    నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే
    నా స్తోత్రబలులన్నీ నీకేనయ్యా

    అంతా వ్యర్థమని – వ్యర్థులైరెదరో
    నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే
    నీయందు పడిన ప్రయాసము
    శాశ్వత కృపగా నాయందు నిలిచెను
    నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే
    నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును
    విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు
    ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృదిచేసింది నీవే కదా
    సంఘక్షేమాభివృదికే – పరిచర్య ధర్మము నియమించినావే
    నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే
    నా స్వరము నీకే అర్పింతును


    Na hrudhayaana koluvaina yesayya
    naa anuvanuvu ninne prasthuthinchene keerthaneeyudaa
    naa hrudhayaarpanatho praanamilledhane
    nee sannidhilo poojaarhudaa

    naa hrudhayaana koluvaina yesayya
    agni edanthalai manduchundinanu
    agni jwaalalu thaakaledhule nee priyula dhehaalanu
    agni balamu challarene shathru samuhamu allaadene
    nenu nee swaasthyame neevu naa sonthame
    naa sthothrabalulanni neekenayya

    anthaa vyardhamani vyardhulairedharo
    naa guri neepai nilpinandhuke naa parugu saardhakamaayene
    neeyandhu padina prayaasamu
    saaswatha krupagaa naa yandhu nilichenu
    neepai viswaasame nannu balaparachene

    naa swarametthi ninne keerthinthunu
    vithinadhi okaru neeru posindhi verokaru
    eruvu vesindhi evvarainanu vruddhi chesindi neeve kadhaa
    sanga kshemaabivruddhike

  • Snehamai praanamai varinche daivamai స్నేహమై ప్రాణమై వరించే దైవమై

    స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
    ఇదే జీవితం, నీకే అంకితం
    ఇదే నా వరం, నీవే అమృతం
    నిరంతరం సేవించనీ

    జగతిన వెలసి, మనసున నిలచి
    కోరె నన్ను దైవము
    లోకమందు జీవమాయె – చీకటందు దీపమాయె
    పలకరించే నేస్తమాయె – కనికరించే బంధమాయె
    ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో జీవించనీ

    తలపున కొలువై – మనవుల బదులై
    చేరె నన్ను నిరతము
    కలతలన్నీ కరిగిపోయే – భారమంతా తొలగిపోయే
    ఆపదందు క్షేమమాయె – తరిగిపోని భాగ్యమాయే
    ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో తరియించనీ

    స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
    ఇదే జీవితం, నీకే అంకితం
    ఇదే నా వరం, నీవే అమృతం
    నిరంతరం సేవించనీ


    snehamai praanamai varinche daivamai
    idhey jeevitham, neeke ankitham
    idhey na varam, neeve amrutham
    nirantharam sevinchani

    jagathina velasi, manasuna nilachi
    kore nannu daivamu
    lokamandhu jeevamaaye – cheetandhu dheepamaaye
    palakarinche nesthamaaye – kanikarinche bhandhamaaye
    entha prema yesayaa – nannu neelo jeevinchani

    thalapuna koluvai – manavula badhulai
    cheri nannu nirathamu
    kalathalanni karigipoye – bhaaramantha tholagipoye
    aapadhandhu kshemamaaye – tharigiponi bhaagyamaaye
    entha prema yesayaa – nannu neelo tharinchani

    snehamai praanamai varinche daivamai
    idhey jeevitham, neeke ankitham
    idhey na varam, neeve amrutham
    nirantharam sevinchani

  • Neethone nadichedhanayyaa నీతోనే నడిచెదనయ్యా

    నీతోనే నడిచెదనయ్యా
    నీతోనే సాగెదనయ్యా
    ఎదురు గాలులే నాపై వీచినా
    జీవిత అలలే నన్ను ముంచినా
    నీతోనే నడిచెదనయ్యా
    నీతోనే సాగెదనయ్యా

    కన్నీటి సముద్రాన మునిగియున్నా
    ఏ తోడు లేక తిరుగుచున్నా
    నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా
    మిగిలున్న ఒక్క ఆశ నీవేనయ్యా

    అనాధుల దైవము నీవేకద దేవా
    నా చేయి విడువను అంటివి కద దేవా
    నను దాటి పోకుము దేవా
    నా చేయి విడువకు దేవా
    నీతోనే నడిచెదనయ్యా
    నీతోనే సాగెదనయ్యా

    ఎదురు గాలులే నాపై వీచినా
    జీవిత అలలే నన్ను ముంచినా
    నీతోనే నడిచెదనయ్యా
    నీతోనే సాగెదనయ్యా


    Neethone nadichedhanayyaa
    neethone saagedhanayyaa
    edhuru gaalule naapai veechinaa
    jeevitha alale nannu munchinaa
    neethone nadichedhanayyaa
    neethone saagedhanayyaa

    kanneeti samudhraana munigiyunnaa
    ey thodu leka thiruguchunnaa
    naakunna okka aasa neevenayyaa
    migilunna okka aasa neevenayyaa

    anaadhula daivamu neevekada devaa
    naa cheyi viduvanu antivi kada devaa
    nanu dhaati pokumu devaa
    naa cheyi viduvaku devaa
    neethone nadichedhanayyaa
    neethone saagedhanayyaa

    edhuru gaalule naapai veechinaa
    jeevitha alale nannu munchinaa
    neethone nadichedhanayyaa
    neethone saagedhanayyaa

  • Dhinamulu jaruguchundagaa దినములు జరుగుచుండగా

    దినములు జరుగుచుండగా
    సంవత్సరాలు దొర్లుచుండగా
    నీ కృపను మా యెడల విస్తరింపజేసి
    నీ చేతి నీడలో నడిపించితివి
    అనుదినం నీ వాత్సల్యమే
    ప్రతిదినం నీ వాగ్దానమే
    నాకు మార్గము చూపించెను
    నీ చిత్తములో నడిపించెను

    ఎన్నో ఆపదలు అపవాది తంత్రములు
    నన్ను చుట్టుముట్టి ఆవరించగా
    నీ అదృశ్య హస్తమే నా తోడుగ ఉండి
    అద్భుతములు ఎన్నో చేసెను
    అనుదినం నీ వాత్సల్యమే
    ప్రతిదినం నీ వాగ్దానమే
    నాకు నిరీక్షణ కలిగించెను

    ఆధరణ కరువై అలసిన సమయములో
    నీ కౌగిలిలో హత్తుకున్నావు
    ఆధరణ కర్తవై నా దరికి చేరి
    కన్నీరంతా తుడచినావు
    అనుదినం నీ వాత్సల్యమే
    ప్రతిదినం నీ వాగ్దానమే
    నాకు ఆధరణ కలిగించెను

    దీనుల యెడల కృపచూపువాడా
    నీ కొరకే కనిపెట్టియుందును
    నీ కరుణ హస్తమే నా తోడుగా ఉండి
    అన్నిటిలో విజయము నిచ్చును
    అనుదినం నీ వాత్సల్యమే
    ప్రతిదినం నీ వాగ్దానమే
    నాకు విజయము చేకూర్చెను

    దినములు జరుగుచుండగా
    సంవత్సరాలు దొర్లుచుండగా
    నీ కృపను మా యెడల విస్తరింపజేసి
    నీ చేతి నీడలో నడిపించితివి
    అనుదినం నీ వాత్సల్యమే
    ప్రతిదినం నీ వాగ్దానమే
    నాకు మార్గము చూపించెను
    నీ చిత్తములో నడిపించెను
    నాకు నెమ్మది కలిగించెను
    నాకు నిరీక్షణ కలిగించెను
    నాకు ఆధరణ కలిగించెను
    నాకు విజయము చేకూర్చెను


    Dhinamulu jaruguchundagaa
    samvatsaraalu dhorluchundagaa
    nee krupanu maa yedala vistharimpajesi
    nee chethi needalo nadipinchithivi
    anudhinam nee vaathsalyame
    prathidhinam nee vaagdhaaname
    naaku maargamu choopinchenu
    nee chitthamuloa nadipinchenu

    enno aapadhalu apavaadhi thanthramulu
    nannu chuttumutti aavarinchagaa
    nee adhrushya hasthame naa thoduga undi
    adbhuthamulu enno chesenu
    anudhinam nee vaathsalyame
    prathidhinam nee vaagdhaaname
    naaku nireekshana kaliginchenu

    aadharana karuvai alasina samayamulo
    nee kougililo hatthukunnaavu
    aadharana karthavai naa dhariki cheri
    kanneeranthaa tudachinaavu
    anudhinam nee vaathsalyame
    prathidhinam nee vaagdhaaname
    naaku aadharana kaliginchenu

    dheenula yedala krupa choopuvaadaa
    nee korake kanipetti yundhunu
    nee karuna hasthame naa thodugaa undi
    annitilo vijayamu nichunu
    anudhinam nee vaathsalyame
    prathidhinam nee vaagdhaaname
    naaku vijayamu chekurchenu

    dhinamulu jaruguchundagaa
    samvatsaraalu dhorluchundagaa
    nee krupanu maa yedala vistharimpajesi
    nee chethi needalo nadipinchithivi
    anudhinam nee vaathsalyame
    prathidhinam nee vaagdhaaname
    naaku maargamu choopinchenu
    nee chitthamuloa nadipinchenu
    naaku nemmadhi kaliginchenu
    naaku nireekshana kaliginchenu
    naaku aadharana kaliginchenu
    naaku vijayamu chekurchenu

  • Porli porli paaruthundi karunaa nadi పొర్లి పొర్లి పారుతుంది కరుణానది

    పొర్లి పొర్లి పారుతుంది కరుణానది
    కల్వరిలో యేసు స్వామి రుధిరమది (4)

    నిండియున్న పాపమంత కడిగివేయును
    కడిగివేయును.. కడిగివేయును (2)
    రండి మునుగుడిందు
    పాపశుద్ధి చేయును (2)
    చేయును శుద్ధి – చేయును శుద్ధి (4) ||పొర్లి||

    రక్తము చిందించకుండా పాపము పోదు
    పాపము పోదు.. పాపము పోదు (2)
    ఆ ముక్తిదాత రక్తమందే
    జీవము గలదు (2)
    గలదు జీవము – గలదు జీవము (4) ||పొర్లి||

    విశ్వ పాపములను మోసే యాగ పశువదే
    యాగ పశువదే.. యాగ పశువదే (2)
    కోసి చీల్చి నదియై పారే
    యేసు రక్తము (2)
    రక్తము యేసు – రక్తము యేసు (4) ||పొర్లి||

    చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము
    పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము (2)
    రమ్ము రమ్ము ఉచితము
    ఈ ముక్తి మోక్షము (2)
    మోక్షము ఉచితము – మోక్షము ఉచితము (4) ||పొర్లి||


    porli porli paaruthundi karunaa nadi
    kalvarilo yesu swaami rudhiramadi (4)

    nindiyunna paapamantha kadigiveyunu
    kadigiveyunu.. kadigiveyunu (2)
    randi munugudindu
    paapa shuddhi cheyunu (2)
    cheyunu shuddhi – cheyunu shuddhi (4) ||porli||

    rakthamu chindinchakunda paapamu podu
    paapamu podu.. paapamu podu (2)
    aa mukthidaatha rakthamande
    jeevamu galadu (2)
    galadu jeevamu – galadu jeevamu (4) ||porli||

    vishwa paapamulanu mose yaaga pashuvade
    yaaga pashuvade.. yaaga pashuvade (2)
    kosi cheelchi nadiyai paare
    yesu rakthamu (2)
    rakthamu yesu – rakthamu yesu (4) ||porli||

    chimme chimme daiva gorrepilla rudhiramu
    pilla rudhiramu.. gorrepilla rudhiramu (2)
    rammu rammu uchithamu
    ee mukthi mokshamu (2)
    mokshamu uchithamu – mokshamu uchithamu (4) ||porli||

  • Neeve naaku chaalunu yesu నీవే నాకు చాలును యేసు

    నీవే నాకు చాలును యేసు “8”

    ఒంటి నిండా బంగారమున్నాను
    అది నీకు సాటి రాగలదా “2”
    బంగారమా యేసయ్యా
    నా బంగారమా యేసయ్యా…( నీవే )

    కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను
    అది నీకు సాటి రాగాలదా…. “2”
    ధనమంతా నీవే యేసయ్య
    నా ధనమంతా నీవే యేసయ్య….( నీవే )

    కొండంతగా బలము ఉన్నాను
    అది నీకు సాటి రాగలదా… “2”
    బాలమంతా నీవే యేసయ్యా
    నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే )

    ప్రేమించే వారు ఎందరున్నాను
    వారు నీకు సాటి రాగలరా….. “2”
    ప్రేమమాయా యేసయ్య
    నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )


    neeve naaku chaalunu yesu
    neeve naaku chaalunu yesu

    onti nindaa bangaaramunnanu
    adhi neeku saati raagaladhaa
    bangaaramaa yesayya
    naa bangaaramaa yesayya

    kotlu kotlugaa dhanamunnanu
    adhi neeku saati raagaladhaa
    dhanamanthaa neeve yesayya
    naa dhanamanthaa neeve yesayya

    kondanthagaa balamunnanu
    adhi neeku saati raagaladhaa
    balamantha neeve yesayya
    naa balamantha neeve yesayya

    preminche vaaru endharunnanu
    vaaru neeku saati raagalaraa
    premaamayaa yesayya
    naa premaamayaa yesayya

  • Nadavaleni velalo endina edaarilo నడువలేని వేళలో ఎండినా ఎడారిలో

    నడువలేని వేళలో ఎండినా ఎడారిలో
    నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ..
    దారితెలియని యాత్రలో గాలిసంద్రపు అలలలో
    నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ.. ॥నడువలేని॥

    అలలతో నీవు కొట్టబడినా నడిసంద్రములో చిక్కుబడినా -2
    చెంతచేరి చెయ్యిచాపి జీవమిచ్చి నిలుపునుగా
    విడువనీ ప్రేమతో లేవనెత్తి నడుపునుగా-2
    ॥నడువలేని॥

    శ్రమలలో నీవు కృంగిపొయినా ఆప్తులంతా దూరమైన -2
    ఆధరించి సేదధీర్ఛి హృదయవంచలు తీర్చునుగా
    మరువనీ ప్రేమతో నిత్యము నిను నడుపునుగా -2 ॥నడువలేని॥


    nadavaleni velalo endina edaarilo
    neeku naaku thodu yesey ninnu nannu nadupunesu
    dhaari theliyani yaathralo gaali sandhrapu alalalo
    neeku naaku thodu yesey ninnu nannu nadupunesu

    alalatho neevu kottabadinaa nadi sandhramulo chikkubadinaa
    chentha cheri cheyyi chaapi jeevamichi nilipunugaa
    viduvani prematho levanethi nadupunugaa

    sramalalo neevu krungipoyinaa aapthulanthaa dhooramaina
    aadharinchi sedha deerchi hrudhaya vaanchalu theerchunugaa
    maruvani prematho nithyamu ninu nadupunugaa

  • Vande mataram vande mataram వందేమాతరం వందేమాతరం

    వందేమాతరం వందేమాతరం వందేమాతరం

    దేశం మన దేశం
    ఈ భారతదేశం
    ఈ దేశమును నీవు ప్రేమిస్తే
    ప్రార్ధించు నీవు మరువక
    యేసయ్యా వింటాడు
    మన దేశమును దీవిస్తాడు
    ఈ దేశం ఈ దేశం
    ఈ దేశం మన దేశం

    వందేమాతరం వందేమాతరం వందేమాతరం
    నీది ఇండియా నాది ఇండియా అందరి ఇండియా
    నీది ఇండియా నాది ఇండియా మనదే ఇండియా
    ఈ దేశం మన దేశం
    భారతదేశం


    vande mataram vande mataram vande mataram

    desham mana desham
    ee bhaarathadesham
    ee deshamunu neevu premisthe
    praardhinchu neevu maruvaka
    yesayyaa vintaadu
    mana deshamunu dheevisthaadu
    ee desham ee desham
    ee desham mana

    vandeamaataram vandeamaataram vandeamaataram
    needi india naadi india andari india
    needi india naadi india manadhe india
    ee desham mana desham
    bhaaratha desham