Author: admin

  • christmas aanandam vachchenu mana intiki క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి

    క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి
    దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో (2)
    ఆనందము మహదానందము
    సంతోషము బహు సంతోషము (2)
    మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్
    హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ (2) ||క్రిస్మస్||

    శోధనలేమైనా – బాధలు ఎన్నైనా
    రండి క్రీస్తు నొద్దకు…
    రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు (2) ||ఆనందము||

    చింతయే నీకున్నా – శాంతియే కరువైనా
    రండి క్రీస్తు నొద్దకు…
    నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు (2) ||ఆనందము||


    christmas aanandam vachchenu mana intiki
    devaadi devudu velasenu ee dharanilo (2)
    aanandamu mahadaanandamu
    santhoshamu bahu santhoshamu (2)
    merry merry merry christmas
    happy happy happy christmas (2) ||christmas||

    shodhanalemainaa – baadhalu ennainaa
    randi kreesthu noddaku…
    rakshana ichchenu – prabhuvaina yesu naathudu (2) ||aanandamu||

    chinthaye neekunnaa – shaanthiye karuvainaa
    randi kreesthu noddaku…
    nemmadi ichchenu – priyamaina daiva thanayudu (2) ||aanandamu||

  • kreesthu nedu puttene rakshana dhorikene క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే

    క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
    వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే
    చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె
    మా మంచి రాజు మనసున్న యేసు
    మాకై నేడు పుట్టెను చూడు
    ఆహా ఆనందం ఓహో క్రిస్మస్ సంబరం

    ఆహా ఆ . . చల్లని చలిలో ఓహో ఆ గొల్లల చెవిలో
    ఆహా ఆ . . ఇమ్మానుయేలు ఓహో ఆ దేవుడే తోడు
    క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను

    ఆహా ఆ . . ఆకాశాన ఓహో ఆ తూర్పున తారా
    ఆహా ఆ . . ఆయనే యేసుని ఓహో ఆయనే రక్షని
    తార వార్త తెలిపెను జ్జానులారాధించెను


    kreesthu nedu puttene rakshana dhorikene
    vedhaalu ghoshinche kanyaka puthrude
    cheekati theralu tholagipoyi velugu kaligene
    maa manchi raaju manasunna yesu
    maakai nedu puttenu choodu
    aahaa aanandham oho christmas sambaram

    aha aa . . challani chalilo oho aa gollala chevilo
    aha aa . . emmaanuyelu oho aa dhevude thodu
    kreesthu nedu puttenani dhootha vaartha thelipenu

    aha aa . . aakaasaana oho aa thoorpuna thaaraa
    aha aa . . aayane yesuni oho aayane rakshani

  • nee krupayu kanikaramu నీ కృపయి కనికరము

    నీ కృపయి కనికరము
    కలిసి నన్ను దర్శించేనే
    దయా దాక్షిణ్యము కృప వాత్సల్యము
    కరుణాకటాక్షము ప్రేమామృతం
    దివి నుండి దిగివచ్చి నన్ను దీవించెను

    దరిలేని గురిలేని అలనై నేవుండగా
    చల్లని గాలివై దరి చేర్చినావే
    నా చెంత చేరావే చింతలన్ని తీర్చావే
    నిరాశలోన నిరీక్షణవైనావే

    పడిపోయి ఓడిపోయి కుమిలి పోవుచుండగా
    అవమానపాలై నే కృంగిపోగా
    నా తోడునీడవై నన్ను ఓదార్చావే
    నా గూడు చేరి నా గోడు విన్నావే


    nee krupayu kanikaramu
    kalisi nannu dharsinchene
    dhayaa dhaakshinyamu krupa vaathsalyamu
    karunaa kataakshamu premaamrutham
    dhivi nundi dhigi vachi nannu dheevinchenu

    dhari leni guri leni alanai ne undagaa
    challani gaalivai dhari cherchinaave
    naa chentha cheraave chinthalanni theerchaave
    niraasalona nireekshanavainaave

    padipoyi odipoyi kumili povuchundagaa
    avamaanapaalai ne krungipogaa
    nee thoduneedavai nannu odhaarachaave
    naa goodu cheri naa godu vinnaave

  • Naa jeevithaana maro noothana samvathsaramunu నా జీవితాన మరో నూతన సంవత్సరమును

    నా జీవితాన మరో నూతన సంవత్సరమును
    దయ చేసిన నా యేసయ్య
    కృప చూపిన కరుణామయ
    నీకేమి చెల్లింతును – నా జీవితమే అర్పింతును
    నీకేమి చెల్లింతును – ఇక నీ కొరకే జీవింతును

    హాపి హాపి న్యూ ఇయర్ హాపి డేస్ ఫర్ ఎవర్

    సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు లా లా లా
    నీ కను దృష్టి నాపై నిలిపి నీ సన్నిధి నా తోడు ఉంచి
    నీ కను దృష్టి నాపై నిలిపి నీ సన్నిధి తోడుగా వుంచి
    నను కాపాడుచున్న నా దైవమా నీకే అభివందనం

    నిన్ను గూర్చి నూతన గీతము హృదయమారని పాడెదను హా ..హా…
    నీవిచ్చిన ఆయుష్కాలం నీ కృపలనే తలపోసికొందున్
    సంవత్సరమనే దయా కిరీటం మా కొసగితివి‌ వందనం‌
    సంవత్సరమనే దయా కిరీటం మా కిచ్చితివి వందనం
    హాపి హాపి న్యూ ఇయర్ హాపి డేస్ ఫర్ ఎవర్


    naa jeevithaana maro noothana samvathsaramunu
    dhaya chesina naa yesayya
    krupa choopina karunaamayaa
    neekemi chellinthunu – naa jeevithame arpinthunu
    neekemi chellinthunu – ika nee korake jeevinthunu

    happy happy new year happy days forever

    samvathsaraadhi modhalukoni samvathsaraanthamu
    varuku laa laa laa
    nee kanu drushti naapai nilipi nee sannidhi naa thodu unchi
    nee kanu drushti naapai nilipi nee sannidhi thodugaa unchi
    nanu kaapaadhuchunna naa dhaivamaa neeke abhivandanam

    ninnu goorchi noothana geethamu hrudhayamaarani
    paadedhanu aa aa aa
    neevichina aayushkaalam nee krupalane thalaposikondhun
    samvathsaramane dhayaa kireetam maa kosagithivi vandhanam
    samvathsaramane dhayaa kireetam maa kichithivi vandhanam
    happy happy new year happy days forever

  • prema kshamalanu samapaalluga ప్రేమ క్షమలను సమపాళ్లుగా

    ప్రేమ క్షమలను సమపాళ్లుగా విశ్వాసమే లక్ష్యంగా
    మా జీవితాలనే సాక్ష్యంగా నిజదేవుని జనాంగంగా
    పిలువబడిన వారమే మేము సిగ్గుపడని వారమే మేము

    మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం
    మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం
    మేం క్రైస్తవులం పరలోక దీపికలం
    మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం
    మేం క్రైస్తవులం క్రైస్తవులం

    మతానికి అతీతులం జాతి వర్ణ వర్గాలనేకం
    మేం యేసు రక్తంతో కొనబడిన వారం
    మేం సత్యమార్గంలో నడిచే వారం
    యేసు నీ జీవితమే మాకు పాఠంగా
    మా బ్రతుకులకే ఒక యాగంగా
    చేసుకొన్న వారమే మేము
    ఏక శరీరమై ఉన్నాము

    మనుషులను ప్రేమిస్తాము
    దైవ ప్రేమనే ప్రకటిస్తాము
    ఏ శోధనకైనా తలవంచని వారం
    దేవుని చెంత మోకరించేవారం
    లోకం మమ్ములను వేధిస్తున్నా
    చులకనగా చూసి నింధిస్తున్నా
    బాధను సహించే వారం
    మేం శత్రువునైన క్షమిస్తాము

    (పాపం అంటే శరీరంతో చేసేదే కాదు
    మనసులో తలంచేది అంటాం ఎందుకంటే మేం క్రైస్తవులం
    ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు అందుకే
    విగ్రహారాధన మేం చెయ్యం ఎందుకంటే మేం క్రైస్తవులం
    దేవుడంటే సృష్టిని చేసిన వాడు ఆ దేవునికి
    విదేశీ దేవుడనే మాటే లేదంటాం ఎందుకంటే మేం క్రైస్తవులం
    ఎన్ని బాధలు పెట్టి హింసించినా ప్రేమతో క్షమిస్తాము
    ఎందుకంటే మేం క్రైస్తవులం)


    prema kshamalanu samapaalluga viswasame lakshyamga
    maa jeevithaalane saakshamga nija devuni janaangamga
    piluvabadina vaarame memu siggu padani vaarame memu

    mem kraisthavulam kreesthanucharulam
    mem kraisthavulam premaku gnaapikalam
    mem kraisthavulam paraloka deepikalam
    mem kraisthavulam baadhyathagala pourulam
    mem kraisthavulam kraisthavulam

    mathaaniki atheethulam jaathi varna vargaalanekam
    mem yesu rakthamtho konabadinavaaram
    mem sathya maargamlo nadichevaaram
    yesu nee jeevithame maaku paatamga
    maa brathukalake oka yaagamga
    chesukunnavaarame memu
    eka sareeramai unnaamu

    manushulanu premisthaamu
    dhaiva premene prakatisthaamu
    ey sodhanakainaa thalavanchani vaaram
    dhevuni chentha mokarinchevaaram
    lokam mammulanu vedhisthunnaa
    chulakanagaa choosi nindhisthunnaa
    baadhanu sahinche vaaram
    mem sathruvunainaa kshamisthaamu

    (paapam ante sareeramtho chesedhi kaadu
    manasulo thalanchedhi antaam endhukante mem kraisthavulam
    ey manishi dhevuni roopaanni choodaledu andhuke
    vigrahaaraadhana mem cheyyam endhukante mem kraisthavulam
    dhevudante srushtini chesina vaadu aa dhevuni
    vidhesi dhevudane maate ledhantaam endhukante mem kraisthavulam
    enni baadhalu petti himsinchinaa prematho kshamisthaam
    endhukante mem kraisthavulam)

  • mahonnathuda nee chaatuna ne nivasinchedhanu మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను

    మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను
    సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను

    బలవంతుడా నీ సన్నిధినే
    నే ఆశ్రయించెదా అనుదినము

    యేసయ్యా యేసయ్యా

    రాత్రివేళ కలుగు భయముకైనా
    పగటిలో ఎగిరే బాణముకైనా
    చీకటిలో సంచరించు తెగులుకైనా
    దినమెల్లా వేధించు వ్యాధికైనా

    నే భయపడను నే దిగులు చెందను
    యెహోవా రాఫా నా తోడు నీవే

    యేసయ్యా యేసయ్యా

    వేయిమంది నా ప్రక్క పడిపోయినా
    పదివేలు నా చుట్టు కాలినను
    అంధకారమే నన్ను చుట్టుముట్టినా
    మరణ భయమే నన్ను వేధించినా

    నే భయపడను నే దిగులు చెందను
    యెహోవా నిస్సి నా తోడు నీవే

    యేసయ్యా యేసయ్యా

    నిను ప్రేమించువారిని తప్పించువాడా
    నిన్నెరిగిన వారిని ఘనపరచువాడా

    నా యుద్ధము జయించి లేవనెత్తువాడా
    కృప వెంబడి కృప చూపించువాడా

    యేసయ్యా యేసయ్యా

    నే భయపడను నే దిగులు చెందను
    యెహోవా షాలోం నా తోడు నీవే


    mahonnathuda nee chaatuna ne nivasinchedhanu
    sarva shakthuda nee needalo ne vishraminchedhanu

    balavanthuda – nee sannidhine
    ne ashrayinchedha – anudhinamu

    yesayya…. yesayya….

    raatrivela kalugu bhayamukaina
    pagatilo egire banamukaina
    cheekatilo sancharinchu thegulukaina
    dinamella vedhinche vyaadhikaina

    ne bhayapadanu – ne dhiguluchendhanu
    yehova rapha – naa thodu neeve

    yesayya…. yesayya….

    veyimandi naa prakka padipoyina
    padhivelu naa chuttu kulinanu
    andhakaarame nannu chuttumuttina
    marana bhayame nanu vedhinchina

    ne bhayapadanu – ne dhiguluchendhanu
    yehova nissi – naa thodu neeve

    yesayya…. yesayya….

    ninu preminchu vaarini – tappinchuvaada
    ninnerigina vaarini – ghanaparachuvaada

    naa yuddhamu jayinchi – levanethuvaada
    krupa vembadi krupa – choopinchuvaada

    yesayya…. yesayya….

    ne bhayapadanu – ne dhiguluchendhanu
    yehova shalom – naa thodu neeve

  • oohakandani upakaaramulu ఊహకందని ఉపకారములు

    ఊహకందని ఉపకారములు, కృప వెంబడి కృపలు
    మరువలేని నీదు మేలులు, వర్ణించలేని వాత్సల్యములు
    యేసయ్యా నీవే ఆధారమయ్యా
    నా మంచి కాపరి నీవేనయ్యా

    నూనెతో నా తలనంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది
    నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును

    పచ్చిక చోట్లలో పరుండచేయును, శాంతికర జలములకు నడుపును
    నా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును

    గాఢాంధకారములో నడిచిననూ, నాకు తోడుగా నీవుందువు
    ఏ తెగులును నా దరి రానీయక ప్రతీ కీడు నుండి తప్పించును


    oohakandani upakaaramulu, krupa vembadi krupalu
    maruvaleni needhu melulu, varninchaleni vaathsalyamulu
    yesayya neeve aadharamayya
    naa manchi kaapari neevenayya

    noonetho naa thalanantiyunnaavu, naa ginne nindi porlu chunnadhi
    ne brathuku dinamulanniyu krupaa kshemamule naa venta vachunu

    pachika chotlalo parundacheyunu, saanthikara jalamulaku nadupunu
    naa praanamunaku sedha dheerchi neethi maargamulo nanu nadipinchunu

    gaadaandhakaaramulo nadichinanu, naaku thodhuga neevundhuvu
    ey thegulunu naa dhari raaneeyaka prathi keedu nundi thappinchunu

  • Bethlehemu puramunandhuna బెత్లెహేము పురమునందున

    బెత్లెహేము పురమునందున
    కన్య మరియ గర్భమందున
    బాలయేసుడు పుట్టేనమ్మా
    గొల్లలు జ్ఞానులు ఆరాధించిరి
    మనము కూడా ఆరాధింతుము
    యేసుని హల్లెలుయ

    శాపాన్ని తొలగించడానికి
    పాపాన్ని కడిగేయడానికి
    పశువుల పాకలో పుట్టాడు
    మానవులను రక్షించుటకు
    ఆరాధించిరి ఆనాడు యేసుని
    మనము కూడా ఆరాధింతుము

    కష్టాలను తీర్చడానికి
    కన్నీటిని తుడవడానికి
    కల్వరిలో ప్రాణమిచ్చుటకై
    ప్రభుయేసు జన్మించెన్
    ఆరాధించిరి ఆనాడు యేసుని
    మనము కూడా ఆరాధింతుము


    Bethlehemu puramunandhuna
    kanya mariya garbhamandhuna
    baala yesudu puttenamma
    gollalu gnaanulu aaraadhinchiri
    manamu kudaa aradhinthumu
    yesuni halleluyah

    shaapaanni tholaginchadaaniki
    paapaanni kadigeyadaaniki
    pasuvula paakalo puttaadu
    maanavulanu rakshinchutaku
    aaraadhinchiri aanaadu yesuni
    manamu kuudaa aaraadhinthumu

    kashtaalanu theerchadaaniki
    kanniitini tudavadaaniki
    kalvarilo praanamichutakai
    prabhuyesu janminchen
    aaraadhinchiri aanaadu yesuni
    manamu kuudaa aaraadhintumu

  • Aahaa aanmdhamae mahaa smthoashmae ఆహా ఆనందమే మహా సంతోషమే

    ఆహా ఆనందమే మహా సంతోషమే
    యేసు పుట్టె ఇలలో (2)
    ఆనందమే మహా సంతోషమే
    యేసు పుట్టె ఇలలో (2) ||ఆహా||

    యెషయా ప్రవచనము నేడు రుజువాయే
    జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే||

    మీకా ప్రవచనము నేడు రుజువాయే
    ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే||

    తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
    దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే||


    Aahaa aanMdhamae mahaa sMthoaShmae
    yaesu putte ilaloa (2)
    aanMdhamae mahaa sMthoaShmae
    yaesu putte ilaloa (2) ||aahaa||

    YeShyaa pravachanamu naedu rujuvaayae
    janmiMche kumaaruMdu kanya garbhamMdhuna (2) ||aanMdhamae||

    Meekaa pravachanamu naedu rujuvaayae
    ishraayael naeledivaadu janmiMche bethlaehaemuna (2) ||aanMdhamae||

    ThMdri vaagDhaanM naedu neravaerae
    dhaevuni bahumaanM shree yaesuni janmamu (2) ||aanMdhamae||

  • Naa chinni thandri paraloka raajaa నా చిన్ని తండ్రి పరలోక రాజా

    నా చిన్ని తండ్రి పరలోక రాజా
    బాలయేసుగా
    పవలించితివి పశుల పాకలో

    నీదు జననము మానవాళికి
    ఎంతో పరవశము
    నీదు జననము లోకానికి
    ఎంతో శుభోదయం
    నీదు జననము మాకు
    ఇల రక్షణకు శ్రీకారము
    లాలీ జో లాలీ జో

    దూత సమూహముల స్తోత్రగానములు
    ఇల లేవు నీకు నేను పాడే కీర్తనలు తప్ప
    అందుకో నా పేద హృదయపు లాలి పాట

    లోక రక్షణకు ఇల విమోచనకు
    ఈ పృథ్వి పావనమైనది
    నీ స్పర్శ సోకగనే
    నీ చిన్ని నవ్వులే నాకు చాలు
    మాకు ఈ బ్రతుకంతా


    Naa chinni thandri paraloka raajaa
    baala yesugaa
    pavalinchithivi pasula paakalo

    needhu jananamu maanavaaliki
    entho paravasamu
    needhu jananamu lokaaniki
    entho subhodhayam
    needhu jananamu maaku
    ila rakshanaku sreekaaramu
    laali jo laali jo

    dootha samuuhamula sthothra gaanamulu
    ila levu neeku nenu paadey keerthanalu thappa
    andhuko naa pedha hrudhayapu laali paata

    loka rakshanaku ila vimochanaku
    ee pruthvi paavanamainadi
    nee sparsa sokaganey
    nee chinni navvule naaku chaalu
    maaku ee brathukanthaa