Category: Song Lyrics

  • Devuni Yandu Bhakthi
    దేవుని యందు భక్తి

    దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును
    ఆమె చేసిన పనులే ఆమెకు – ఘనత నొసంగును ||దేవుని||

    ప్రార్ధన చేసి వీర వనితగా
    ఫలమును పొంది ఘనత పొందెను
    హన్నా వలె నీవు
    ప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా ||దేవుని||

    ప్రభు పాదములు ఆశ్రయించి
    ఉత్తమమైనది కోరుకున్నది
    మరియ వలె నీవు
    ప్రభు సన్నిధిని కోరెదవా ||దేవుని||

    వినయ విధేయతలే సుగుణములై
    తన జనమును రక్షించిన వనిత
    ఎస్తేరును బోలి
    దీక్షను పూణెదవా ఉపవసించెదవా ||దేవుని||


    Devuni Yandu Bhakthi Gala Sthree Koniyaadabadunu
    Aame Chesina Panule Aameku – Ghanatha Nosangunu ||Devuni||

    Praardhana Chesi Veera Vanithagaa
    Phalamunu Pondi Ghanatha Pondenu
    Hannaa Vale Neevu
    Praardhana Chesedavaa Upavasinchedavaa ||Devuni||

    Prabhu Paadamulu Aashrayinchi
    Utthamamainadi Korukunnadi
    Mariya Vale Neevu
    Prabhu Sannidhini Koredavaa ||Devuni||

    Vinaya Vidheyathale Sugunamulai
    Thana Janamunu Rakshinchina Vanitha
    Estherunu Boli
    Deekshanu Poonedavaa Upavasinchedavaa ||Devuni||

  • Devuni Prema Idigo
    దేవుని ప్రేమ ఇదిగో

    దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే
    కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును ||దేవుని||

    సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను
    సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను ||దేవుని||

    మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను
    మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే ||దేవుని||

    యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల
    దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు ||దేవుని||

    పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి
    పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||

    సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను
    సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను ||దేవుని||

    చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను
    సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి ||దేవుని||

    గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే
    మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను ||దేవుని||

    చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను
    పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్ ||దేవుని||

    ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి
    వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు ||దేవుని||

    ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను
    మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను ||దేవుని||

    రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్
    రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను ||దేవుని||

    రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును
    పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా ||దేవుని||

    మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు
    నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్ ||దేవుని||

    పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు
    పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను ||దేవుని||

    నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును
    నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను ||దేవుని||


    Devuni Prema Idigo – Janulaara – Bhaavambunam Deliyare
    Kevalamu Nammukonina – Paraloka – Jeevambu Manakabbunu ||Devuni||

    Sarvalokamu Manalanu – Thana Vaakya – Sathyambutho Jesenu
    Sarvopakaarudunde – Mana Meeda – Jaaliparudai Yundenu ||Devuni||

    Maanavula Rakshimpanu – Devundu – Thana Kumaaruni Bampenu
    Mana Shareeramu Daalchenu – Aa Prabhuvu – Mana Paapamunaku Doorude ||Devuni||

    Yesu Kreesthanu Peruna – Rakshakudu – Velasi Naadilalopala
    Dosakaari Janulatho – Nentho -Su Bhaashalanu Balkinaadu ||Devuni||

    Paapa Bhaarambu Thoda – Ne Proddu – Prayaasamula Bondedi
    Paapulandaru Nammina – Vishraanthi – Paripoornamitthu Nanenu ||Devuni||

    Sathulaina Purushulainan – Yaa Kartha – Sarva Janula Yedalanu
    Sathpremaga Nadichenu – Paraloka – Sadhbodhalika Jesenu ||Devuni||

    Chaavu Nondina Kondarin – Yesundu – Chakkagaa Brathikinchenu
    Sakala Vyaadhula Rogulu – Prabhu Nanti – Swasthambu Thaa Mondiri ||Devuni||

    Gaali Sandrapu Pongulan – Saddanipi – Neellapai Nadachinaade
    Melu Gala Yadbhuthamulu – Eelaagu – Vela Koladiga Jesenu ||Devuni||

    Chethula Kaallalonu – Raa Raaju – Chera Mekulu Bondenu
    Paathakulu Gottinaare – Parishuddha – Neethi Thaa Morvalekan ||Devuni||

    Odulu Rakthamu Gaaraga – Debbalu – Chedugu Landaru Gottiri
    Vadimullu Thala Meedanu – Bettiri – Orcheno Rakshakundu ||Devuni||

    Inni Baadhalu Bettuchu – Danu Jampu – Chunna Paapa Narulanu
    Manninchu Mani Thandrini – Yesundu – Sannuthitho Vedenu ||Devuni||

    Rakshakudu Shrama Bondagaa – Deshambu – Thakshanamu Cheekatayyen
    Rakshakudu Mruthi Nondaga – Thera Chinigi – Raathi Kondalu Pagilenu ||Devuni||

    Raathi Samaadhilonu – Rakshakuni – Neethigala Dehambunu
    Paathi Pettiri Bhakthulu – Nammina – Naathu Landaru Joodagaa ||Devuni||

    Moodava Dinamanduna – Yesundu – Mruthi Gelchi Lechinaadu
    Naadu Nammina Manujulu – Choochiri – Naluvadi Dinamulandun ||Devuni||

    Padunokandu Maarulu – Vaaralaku – Brathyakshu Daaye Nesu
    Paralokamuna Kegenu – Thana Vaartha – Brakatinchu Mani Palkenu ||Devuni||

    Nammi Baapthismamondu – Narulaku – Rakshana Mari Kalgunu
    Namma Nollaka Poyedu – Narulaku – Narakambu Siddhamanenu ||Devuni||

  • Devuni Goppa Mahimanu దేవుని గొప్ప మహిమను

    దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?
    ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2)
    ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న
    వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో మన్నా (2)

    మరచినవా నీ అపజయములు
    గుర్తు లేదా! ఆ శోధనలు
    నీవు చూపిన ఆ వినయములు
    ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు
    తండ్రి నీవే దిక్కంటూ, మోకరిల్లిన ఆ క్షణము
    అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2) ॥ఎంత॥

    అందుకొంటివి బాప్తిస్మమును
    పొందు కొంటివి ఆ రక్షణను
    వదలబోకు ఆత్మీయతను
    చేరనివ్వకు నిర్లక్ష్యమును
    తీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగు
    నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా? (2) ॥ఎంత॥


    Devuni Goppa Mahimanu Choosi
    Thirigi Paapam Chesedavaa?
    Dvandava Neethiki Nishkruthi Ledani
    Neeku Thelusaa O Kraisthavaa? (2)
    Entha Adhamu Anyula Kanna
    Entha Ghoramu Aa Yooda Kanna
    Valadu Paapam Ikapainanna
    Thirigi Pondu Kreesthulo Mannaa (2)

    Marachinaavaa Nee Apajayamulu
    Guruthu Ledaa Aa Shodhanalu
    Neevu Choopina Aa Vinayamulu
    Edchi Chesina Aa Praardhanalu
    Thandri Neeve Dikkantu
    Mokarillina Aa Kshanamu
    Andukontivi Vijayamulu
    Vidachi Pedithivi Vaakyamunu (2) ||Entha||

    Andukontivi Baapthismamunu
    Pondukontivi Aa Rakshananu
    Vadalaboku Aathmeeyathanu
    Cheranivvaku Nirlakshyamunu
    Theerpu Theerche Samayamlo
    Orpu Dorakadu Gurtherugu
    Nithya Jeevamlo Nundi
    Ghora Narakam Cheredaa (2) ||Entha||

  • Devude Naakaashrayambu దేవుడే నాకాశ్రయంబు

    దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
    మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
    అభయ మభయ మభయ మెప్పు
    డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||

    పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
    సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ||

    దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
    ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ||

    రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన
    పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును ||అభయ||

    విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
    చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే ||అభయ||

    పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
    నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును ||అభయ||

    కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
    ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ ||అభయ||


    Devude Naakaashrayambu – Divyamaina Durgamu
    Mahaa Vinodu Daapadala – Sahaayudai Nan Brochunu
    Abhaya Mabhaya Mabhaya Meppu
    Daananda Maananda Maananda Mouga ||Devude||

    Parvathamulu Kadilina Nee – Yurvi Maaru Padinanu
    Sarvamun Ghoshinchuchu Nee – Sandra Mupponginan ||Abhaya||

    Devudepdu Thodugaaga – Deshamu Vardhillunu
    Aa Thaavu Nandu Prajalu Migula – Dhanyulai Vasinthuru ||Abhaya||

    Raajyamul Kampinchina Bhoo – Raashtramul Ghoshinchina
    Poojyundou Yehovaa Vairi – Booni Samharinchunu ||Abhaya||

    Villu Virachu Naana Thega – Ballemu Naraku Naayana
    Chella Chedara Jesi Ripula – Nelladrunchu Naayane ||Abhaya||

    Pishaachi Poorna Balamu Naatho – Benugulaada Jadiyunu
    Nashinchi Shathru Ganamu Devu – Naazna Valana Madiyunu ||Abhaya||

    Kotayu Naashrayamunai Yaa – Kobu Devu Dundaga
    Aeti Kinka Verava Valayu – Nepdu Naaku Banduga ||Abhaya||

  • Devude Ila Cheretanduku దేవుడే ఇల చేరేటందుకు

    దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం
    అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం
    నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం
    కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం (2)
    అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో
    ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2) ||దేవుడే||

    కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం
    తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం (2)
    మోషేగా మారిన పసివాడిని
    దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం (2)
    దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం ||అమ్మా||

    సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం
    దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం (2)
    హన్నా చేసిన ఆ త్యాగమే కాదా
    సమూయేలు పొందిన న్యాయాధిపత్యము (2)
    సమూయేలు పొందిన న్యాయాధిపత్యము ||అమ్మా||

    కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము
    ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము (2)
    ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి
    నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం (2)
    నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం ||అమ్మా||


    Devude Ila Cheretanduku Ennukunna Maargam
    Ammaa Antu Piluchukoni Pondukonenu Janmam
    Neekantu Edi Ledannatlu Endukantha Thyaagam
    Kanaraani Premaku Neevegaa Kadalaaduthunna Roopam (2)
    Ammaa Nee Runamunu Theerche Sirulu Levu Ilalo
    Aa Daivamu Saithamu Nerche Paataalu Challani Nee Odilo (2) ||Devude||

    Kanna Biddanu Paraayi Biddagaa Penchukunna Mamakaaram
    Thana Prajala Vinukthiki Devudu Chesina Kaaryamlo Sahakaaram (2)
    Moshegaa Maarina Pasivaadini
    Daasigaa Penchina Kannathalli Sugunam (2)
    Daasigaa Penchina Kannathalli Sugunam ||Ammaa||

    Santhathi Leka Savathi Porutho Visiginatti Deenathvam
    Devuni Sannidhi Hrudayamu Parachi Pondukonenu Maathruthvam (2)
    Hannaa Chesina Aa Thyaagame Kaadaa
    Samooyelu Pondina Nyaayaadhipathyamu (2)
    Samooyelu Pondina Nyaayaadhipathyamu ||Ammaa||

    Kona Oopiritho Siluvapaina Velaaduthunna Kshanamu
    Aa Deva Devudu Theerchukonenu Thana Maathrumoorthy Runamu (2)
    Priya Shishyuni Dariki Thallini Cherchi
    Neraverchenu Ilalo Thanayudigaa Dharmam (2)
    Neraverchenu Ilalo Thanayudigaa Dharmam ||Ammaa||

  • Devudu Lokamunu
    దేవుడు లోకమును

    దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2)
    నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2)
    ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను ।।దేవుడు।।

    పరలోక ప్రేమ ఈ ధరలో
    ప్రత్యక్షమాయె ప్రతివానికై (2)
    ఆదియందున్న ఆ దేవుడు
    ఏతెంచె నరుడై ఈ భువికి (2)
    ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే (2) ।।దేవుడు।।

    పాపంధకారములో అంధులుగా
    చీకటి త్రోవలో తిరుగాడగా (2)
    జీవపు వెలుగైన ఆ ప్రభువు
    వెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2)
    ఈ వెలుగు నీ కొరకే – యేసు నిన్నిల వెలిగించును (2) ।।దేవుడు।।


    Deudu Lokamunu Entho Preminchenu (2)
    Ninnu Nannu Dharalo Prathi Vaarini (2)
    Entho Preminhcenu Preminchi Ethenchenu ||Devudu||

    Paraloka Prema Ee Dharalo
    Prathyakashamaaye Prathi Vaanikai (2)
    Aadiyandunna Aa Devudu
    Ethenche Narudai Ee Bhuviki (2)
    Ee Prema Nee Korake – Janminche Ila Yesu Nee Korake (2) ||Devudu||

    Paapaandhakaaramulo Andhulugaa
    Cheekati Throvalo Thirugaadagaa (2)
    Jeevapu Velugaina Aa Prabhuvu
    Veliginchagaa Vachchenu Prathivaarini (2)
    Ee Velugu Nee Korake – Yesu Ninnila Veliginchunu (2) ||Devudu||

  • Devudu Manaku Ellappudu దేవుడు మనకు ఎల్లప్పుడు

    దేవుడు మనకు ఎల్లప్పుడు (2)
    తోడుగ నున్నాడు (3)

    ఏదేనులో ఆదాముతో నుండెన్ (2)
    హానోకు తోడనేగెను (2)
    దీర్ఘ దర్శకులతో నుండెన్ (2)
    ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడు

    దైవాజ్ఞను శిరసావహించి (2)
    దివ్యముగ నా బ్రాహాము (2)
    కన్న కొమరుని ఖండించుటకు (2)
    ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడు

    యోసేపు ద్వేషించ బడినపుడు (2)
    గోతిలో త్రోయబడినపుడు (2)
    శోధనలో చెరసాలయందు (2)
    సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడు

    ఎర్ర సముద్రపు తీరమునందు (2)
    ఫరో తరిమిన దినమందు (2)
    యోర్దాను దాటిన దినమందు (2)
    యెరికో కూలిన దినమందు – తోడుగనున్నాడు

    దావీదు సింహము నెదిరించి (2)
    ధైర్యాన చీల్చినయపుడు (2)
    గొల్యాతును హతమార్చినయపుడు (2)
    సౌలుచే తరుమబడినపుడు – తోడుగనున్నాడు

    సింహపు బోనులో దానియేలు (2)
    షద్రకు మేషా కబేద్నెగో (2)
    అగ్ని గుండములో వేయబడెన్ (2)
    నల్గురిగా కనబడినపుడు – తోడుగనున్నాడు

    పౌలు బంధించబడినపుడు (2)
    పేతురు చెరలో నున్నపుడు (2)
    అపోస్తలులు విశ్వాసులు (2)
    హింసించ బడినయపుడు – తోడుగనున్నాడు ||దేవుడు||


    Devudu Manaku Ellappudu (2)
    Thoduga Nunnaadu (3)

    Aedenulo Aadaamutho Nunden (2)
    Haanoku Thodanegenu (2)
    Deergha Darshakulatho Nunden (2)
    Dhanyulu Devuni Galavaaru – Thoduganunnaadu

    Daivaaznanu Shirasaavahinchi (2)
    Divyamuga Naa Braahaamu (2)
    Kanna Komaruni Khandinchutaku (2)
    Khadgamu Neththina Yapudu – Thoduganunnaadu

    Yosepu Dweshincha Badinapudu (2)
    Gothilo Throyabadinapudu (2)
    Shodhanalo Cherasaalayandu (2)
    Simhaasanamekkina Yapudu – Thoduganunnaadu

    Erra Samudrapu Theeramunandu (2)
    Pharo Tharimina Dinamandu (2)
    Yordaanu Daatina Dinamandu (2)
    Yeriko Koolina Dinamandu – Thoduganunnaadu

    Daaveedu Simhamu Nedirinchi (2)
    Dhairyaana Cheelchinayapudu (2)
    Golyaathunu Hathamaarchinayapudu (2)
    Souluche Tharumabadinapudu – Thoduganunnaadu

    Simhapu Bonulo Daaniyelu (2)
    Shadraku Meshaa Kabednego (2)
    Agni Gundamulo Veyabaden (2)
    Nalgurigaa Kanabadinapudu – Thoduganunnaadu

    Poulu Bandhinchabadinapudu (2)
    Pethuru Cheralo Nunnapudu (2)
    Aposthalulu Vishwaasulu (2)
    Himsincha Badinayapudu – Thoduganunnaadu ||Devudu||

  • Devudu Neeku Thelusu దేవుడు నీకు తెలుసు

    దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా
    నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2)
    అవసరాలకు దేవుని నమ్మక
    ఆత్మకు తండ్రని నమ్మాలి (2)
    నీ ఆత్మకు తండ్రని నమ్మాలి ||దేవుడు||

    నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక
    నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2)
    ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక
    పాపిని రక్షించు పరలోకానికి నడిపించు
    నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు
    నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు ||దేవుడు||

    నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి
    సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2)
    ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2)
    దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2)
    దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు
    దేహానికిష్టమైనది అడగకూడదు ముందు ||దేవుడు||


    Devudu Neeku Thelusu – Neevu Devuniki Thelusaa
    Neevu Devuni Namminaa – Ninnu Devudu Nammaali (2)
    Avasaaralaku Devuni Nammaka
    Aathmaku Thandrani Nammaali (2)
    Nee Aathmaku Thandrani Nammaali ||Devudu||

    Naalugu Godala Madhya Neevu Naligipoka
    Nalu Dikkulaku Suvaarthanu Prakatinchu (2)
    Prabhuvaa Prabhuvani Piluvaka – Praardhanatho Visginchaka
    Paapini Rakshinchu Paralokaaniki Nadipinchu
    Naa Nimitthamu Evadu Povunani Aduguchunnaadu Devudu
    Naa Avasaratha Theerchamani Aduguchunnaadu Kraisthavudu ||Devudu||

    Naamakaardha Bhakthi Devunike Adi Virakthi
    Suvaartha Bhaaram Kaligi Neevu Brathikithene Mukthi (2)
    Prajalandariki Ide Bible Sookthi (2)
    Devuni Cheyi Vethakakunte Agnithone Shaasthi (2)
    Devunikishtamainadi Thelusukovaali Mundu
    Dehaanikishtamainadi Adagakoodadu Mundu ||Devudu||

  • Devudu Dehamunu దేవుడు దేహమును

    దేవుడు దేహమును పొందిన దినము
    మనిషిగా మారి ఇల చేరిన క్షణము (2)
    తార వెలిగెను – దూత పాడెను
    పరలోకనికి మార్గము వెలిసెను (2)
    స్తుతుల గానములు పాడి పరవశించెదము
    యేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2)

    దూత పలికెను భయము వలదని
    తెలిపే వార్తను యేసే క్రీస్తని (2)
    చీకటి తొలగెను రారాజుకు భయపడి
    లోకము వెలిగెను మరణము చెరవిడి (2)
    క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము
    నిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2) ||దేవుడు||

    సృష్టి కారుడు అల్పుడాయెను
    అది శాపము తీయ వచ్చెను (2)
    పాపము ఎరుగని మనిషిగా బ్రతికెను
    మానవ జాతికి మార్గమై నిలిచెను (2)
    నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు
    పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు (2) ||దేవుడు||


    Devudu Dehamunu Pondina Dinamu
    Manishigaa Maari Ila Cherina Kshanamu (2)
    Thaara Veligenu – Dootha Paadenu
    Paralokaaniki Maargamu Velisenu (2)
    Sthuthulu Gaanamulu Paadi Paravashinchedamu
    Yesu Naamamune Chaati Mahima Parichedamu (2) ||Devudu||

    Dootha Palikenu Bhayamu Valadani
    Thelipe Vaarthanu Yese Kreesthani (2)
    Cheekati Tholagenu Raaraajuku Bhayapadi
    Lokamu Veligenu Maranamu Cheravidi (2)
    Kreesthu Puttenani Thelipi Santhoshinchedamu
    Nithya Jeevamune Chaati Ghanatha Pondedamu (2) ||Devudu||

    Srushtikaarudu Alpudaayenu
    Aadi Shaapamu Theeya Vachchenu (2)
    Paapamu Erugani Manishigaa Brathikenu
    Maanava Jaathiki Maargamai Nilichenu (2)
    Nammi Oppinanu Chaalu Tholagu Paapamulu
    Paramu Cherutaku Manaku Kalugu Deevenalu (2) ||Devudu||

  • Devaadhi Devudu
    దేవాది దేవుడు

    దేవాది దేవుడు మహోపకారుడు
    మహాత్యము గల మహారాజు (2)
    ప్రభువుల ప్రభువు – రాజుల రాజు
    ఆయన కృప నిరంతరముండును ||దేవాది||

    సునాద వత్సరము ఉత్సాహ సునాదము
    నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2)
    ఉత్తమ దేవుని దానములు (2) ||దేవాది||

    యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు
    జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2)
    నీదు క్రియలు ఘనమైనవి (2) ||దేవాది||

    అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు
    మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును (2)
    సదా నీకే కలుగును గాక (2) ||దేవాది||


    Devaadhi Devudu Mahopakaarudu
    Mahaathyamu Gala Maharaaju (2)
    Prabhuvula Prabhuvu – Raajula Raaju
    Aayana Krupa Nirantharamundunu ||Devaadhi||

    Sunaadha Vathsaramu Uthsaaha Sunaadhamu
    Noothana Sahsraabdhi Noothana Shathaabdhamu (2)
    Utthama Devuni Dhaanamulu (2) ||Devaadhi||

    Yugamulaku Devudavu Unnavaadavanuvaadavu
    Jagamanthaa Eluchunna Jeevaadhipathi Neeve (2)
    Needhu Kriyalu Ghanamainavi (2) ||Devaadhi||

    Adhvitheeya Devudavu Prabhuvaina Yesu Kreesthu
    Mahimaa Mahathyamulu Sarvaadhipathyamunu (2)
    Sadhaa Neeke Kalugunu Gaaka (2) ||Devaadhi||