Category: Telugu Worship Songs Lyrics
-
Nadipisthaadu Naa Devudu నడిపిస్తాడు నా దేవుడు
నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2)అడుగులు తడబడినా – అలసట పైబడినా (2)చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2) ||నడిపిస్తాడు|| అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా (2)తన చిత్తం నెరవేర్చుతాడుగమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా (2)తన చిత్తం నెరవేర్చుతాడుగమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడిపిస్తాడు|| నాకున్న కలిమి కరిగిపోయిన –…
-
Nadavaalani Yesu నడవాలని యేసు
నడవాలని యేసు నడవాలనినడవాలని నీతో నడవాలనినాకున్న ఆశ నీపైనే ధ్యాస (2)నిరంతరం నీతోనే నడవాలని (2) హానోకు నీతో నడిచాడు దేవపరలోకపు నడకతో చేరాడు నిన్ను ||నడవా|| నోవాహు నీతో నడిచాడు దేవరక్షణనే ఓడలో రక్షింప బడెను ||నడవా|| అబ్రాహాము నీతో నడిచాడు దేవవిశ్వాసపు యాత్రలో సాగాడు నీతో ||నడవా|| నా జీవితమంతా నీతో నడవాలనినా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా ||నడవా|| Nadavaalani Yesu NadavaalaniNadavaalani Neetho NadavaalaniNaakunna Aasha Neepaine Dhyaasa (2)Nirantharam Neethone…
-
Najareyudaa Naa Yesayya నజరేయుడా నా యేసయ్య
నజరేయుడా నా యేసయ్యఎన్ని యుగాలకైనాఆరాధ్య దైవము నీవేననిగళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)శూన్యములో ఈ భూమినివ్రేలాడదీసిన నా యేసయ్య (2)నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)జలములలోబడి నే వెళ్ళినానన్నేమి చేయవు నా యేసయ్యా (2)నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)సీయోనులో నిను చూడాలనిఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)నీకే…
-
Dhanyamu Entho Dhanyamu ధన్యము ఎంతో ధన్యము
ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2)ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2)వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము|| ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2)ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు|| క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2)క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు|| ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2)ప్రభుని గూర్చి పాటపాడు…
-
Doshivaa Prabhu
దోషివా…. ప్రభూసర్వమానవ పాపపరిహారార్థమైసిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – (2) దోషివా…. ప్రభూ…. నువు దోషివానీ విధేయతకు నా అవిధేయతకుమధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా (2)దోషివా…. ప్రభూ…. నువు దోషివా ఘోరంబుగా నే చేసిన నేరాలకునువు పొందిన మరణ శిక్షనే నడచిన వక్ర మార్గాలకునువు పొందిన సిలువ యాతన (2)కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర (2)నే పొందిన రక్షణా పాత్ర (2) ||దోషివా|| నే వేసిన తప్పటడుగులకునీవు కార్చిన రక్త పు మడుగులూనే చేసిన కపటంబులకునీవు పొందిన…
-
Dorakunu Samasthamu దొరకును సమస్తము
దొరకును సమస్తము యేసు పాదాల చెంతవెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2)యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యాయేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా ||దొరకును|| మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరికన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2)పాదాలను ముద్దు పెట్టుకొనిపూసెను విలువైన అత్తరు (2)చేసెను శ్రేష్టారాధనదొరికెను పాప క్షమాపణ (2) ||దొరకును|| యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరిబ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2)చిన్నదాన లెమ్మని చెప్పిబ్రతికించెను యేసు దేవుడు (2)కలిగెను మహదానందందొరికెను…
-
Daiva Kutumbam
దైవ కుటుంబందైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం (2)శాంతి సంతోషాలకు అది నిలయంఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం (2)విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు (2)ఆతిథ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు (2)దైవ కుటుంబపు సంతోషంకని విని ఎరుగని ఆనందం (4) ||దైవ కుటుంబం|| రక్షణ పొందిన కుటుంబం మోక్ష పురికి సోపానంక్రమశిక్షణ కలిగిన కుటుంబం వీక్షించు దైవ సాన్నిధ్యం (2)అపార్ధాలు అంతరాలు లేనట్టి అన్యోన్యతషడ్రుచుల ఘుమఘుమలు గుభాలించు మా ఇంట (2)అష్టైశ్వర్యాలకు తూలతూగే కుటుంబం (2)తరతరాలు వర్ధిల్లే కుటుంబం (2)…
-
Deham Paathadi దేహం పాతది
దేహం పాతది – మనసు మలినమైనదిజీవం పాపిది – మార్గం తెలియనిది (2)సర్వోన్నతుడా నిత్య నూతనుడానిత్య జీవనం కలిగించుమయ్యామరియా కన్న తనయా ||దేహం|| దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానేఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానేతల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానేమానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే ||సర్వోన్నతుడా|| తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించుతండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించువీడగ లేని సంసారమనే బంధం విడిపించునీపై మనసు నిలిచే విధమును…
-
Devuniyandu Nireekshana Nunchi దేవునియందు నిరీక్షణ నుంచి
దేవునియందు నిరీక్షణ నుంచిఆయనను స్తుతించు నా ప్రాణమా (2) ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2) ||దేవుని|| చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2)సత్యమగు – జీవమగు – మార్గమేసే (2) ||దేవుని|| నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)ఆధారము – ఆదరణ – ఆయనలో (2) ||దేవుని|| తల్లి తన బిడ్డను…
-
Devunike Mahima దేవునికే మహిమ
దేవునికే మహిమ (2)యుగయుగములు కలుగును గాక (2) ||దేవునికే|| దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో (2)దానికి మనలను వారసుల జేసెను (2)వందనములు చెల్లింతుము (2) ||దేవునికే|| నిలవరమైనది మనకిల లేదని (2)వల్లభుడు స్థిరపరచెను పరమందు (2)చెల్లించి స్తుతులను పూజింతుము (2) ||దేవునికే|| సీయోను పురమగు దేవుని నగరుకు (2)సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే (2)స్తోత్ర గీతములను పాడెదము (2) ||దేవునికే|| శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన (2)ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను (2)ముదమారగను ప్రణుతింతుము (2) ||దేవునికే||…