Category: Telugu Worship Songs Lyrics

  • Yesu Yesu Yesu
    యేసు యేసు యేసు

    యేసు యేసు యేసు నిన్ను చూడాలి (2)చూడాలి నిత్యం చూడాలి (2) అగ్ని స్థంభమా నిన్ను చూడాలి (2)మేఘ స్థంభమా నిన్ను చూడాలి (2) ||యేసు|| అగ్ని జ్వాల నేత్రుడా నిన్ను చూడాలి (2)అపరంజి పాదములను చూడాలి (2) నీ.. ||యేసు|| దహించు అగ్ని నిన్ను చూడాలి (2)పాపపు పెదవులు దహించు నిన్ను చూడాలి (2) నా.. ||యేసు|| మండుచున్న అగ్ని పొద నిన్ను చూడాలి (2)పాదాలకున్న మలినము పోవాలి (2) నా.. ||యేసు|| దీప వృక్షమా…

  • Yesu Maatho Neevundagaa
    యేసు మాతో నీవుండగా

    యేసు మాతో నీవుండగామేము అలసిపోలేమయ్యా (2)అంతా నీవే చూసుకుంటావు (4) ||యేసు మాతో|| సమాధానకారకుడు నీవేనయ్యాసర్వశక్తుడవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| అద్భుత దేవుడవు నీవేనయ్యాఆలోచన కర్తవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| నా యొక్క సౌందర్యం నీవేనయ్యానాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు మాతో|| Yesu Maatho NeevundagaaMemu Alasipolemayyaa (2)Anthaa Neeve Choosukuntaavu (4) ||Yesu Maatho|| Samaadhaana Kaarakudu NeevenayyaaSarvashakthudavu Neevenayyaa (2) ||Yesu Maatho|| Adbhutha Devudavu NeevenayyaaAalochana Karthavu Neevenayya…

  • Yesu Manchi Devudu
    యేసు మంచి దేవుడు

    యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడుయేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2)ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనునుచింతలన్ని బాపి శాంతినిచ్చును (2) ||యేసు మంచి|| శాశ్వతమైన ప్రేమతోనిన్ను నన్ను ప్రేమించాడు (2)సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడుతన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2) ||యేసు మంచి|| శాంతి సమాధానం మనకిచ్చాడుసమతా మమత నేర్పించాడు (2)మార్గము సత్యము జీవమైనాడుమానవాళికే ప్రాణమైనాడు (2) ||యేసు మంచి|| Yesu Manchi Devudu – Premagala DevuduYesu Goppa Devudu…

  • Yesu Prabhuve యేసు ప్రభువే

    యేసు ప్రభువే – సాతాను బలమును జయించెనుఅందరము – విజయ గీతములు పాడెదమువిజయ గీతములు పాడెదము మన శ్రమలలో విజయమునిచ్చెన్తన రాజ్యమునందు మనలను చేర్చును (2)ఘన విజయమును మనకై పొందెన్ (2)మన విజయము యేసే అని హర్షించెదము (2) ||యేసు|| మనమాయన సంఘముగాతన రక్తము ద్వారా సమకూర్చెను (2)సంఘమునకు శిరస్సాయనే (2)సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము (2) ||యేసు|| మహోన్నతుడు మహా ఘనుడుమహిమ రాజు మనకు విజయమునిచ్చే (2)మరణము గెల్చి తిరిగి లేచే (2)ఆర్భాటముతో హర్షించెదము (2) ||యేసు||…

  • Yesu Prabhuvaa Neeve
    యేసు ప్రభువా నీవే

    యేసు ప్రభువా నీవేమహిమా నిరీక్షణా (2)హల్లెలూయా హల్లెలూయామహిమా నిరీక్షణా నీవే (2) ||యేసు|| గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2)మహిమా నిరీక్షణా నీవేనిశ్చయముగా నిన్ను చూతును (2)యేసు ప్రభో జయహో (4) ||యేసు|| నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2)ఎనలేని ధనము నీవేగానిశ్చయముగా నే పొందుదును (2)యేసు ప్రభో జయహో (4) ||యేసు|| ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ (2)పరలోకమే నా దేశముమహిమలోనచ్చట నుందును (2)యేసు నీతో సదాయేసు ప్రభో జయహో…

  • Yesu Parishuddha Naamamunaku
    యేసు పరిశుద్ధ నామమునకు

    యేసు పరిశుద్ధ నామమునకుఎప్పుడు అధిక స్తోత్రము (2) ఇహపరమున మేలైన నామముశక్తి గల్గినట్టి నామమిది (2)పరిశుద్దులు స్తుతించు నామమిది (2) ||యేసు|| సైతానున్‌ పాతాళమును జయించువీరత్వము గల నామమిది (2)జయమొందెదము ఈ నామమున (2) ||యేసు|| నశించు పాపుల రక్షించు లోకమున కేతెంచిన నామమిది (2)పరలోకమున చేర్చు నామమిది (2) ||యేసు|| ఉత్తమ భక్తుల పొగడి స్తుతించుఉన్నత దేవుని నామమిది (2)లోకమంతా ప్రకాశించే నామమిది (2) ||యేసు|| శోధన, బాధల, కష్ట సమయానఓదార్చి నడుపు నామమిది (2)ఆటంకము…

  • Yesu Neeve Chaalu Naaku
    యేసు నీవే చాలు నాకు

    యేసు నీవే చాలు నాకు – వేరెవ్వరు అక్కరలేదుమనుషులు నను మరచినా – నా వారే విడిచినా ||యేసు|| నింగి నేల మారినా – స్థితి గతులు మారినా (2)ఎన్నడెన్నడు మారానిది యేసు నీ ప్రేమఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమకంటి పాపవలె కాయు నీవుండగా ||యేసు|| దారి తొలగి యుండగా – మార్గమును చూపించిన (2)ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా – మారని ప్రేమరక్తము నాకై చిందించినా – రక్షకుని ప్రేమనిత్య జీవమొసగె నీవుండగా ||యేసు||…

  • Yesu Nee Swaroopamunu
    యేసు నీ స్వరూపమును

    యేసు నీ స్వరూపమును నేను చూచుచు (2)నీ పోలికగా నేను మారేదన్ (2) ||యేసు|| యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివిదాసుని రూపము ధరించి దీనుడైతివి (2)నేను దీనుడను కాను గర్వముతో నిండియున్నానునీదు వినయముతో నింపుము (2) ||యేసు|| ప్రేమగల ఓ ప్రభువా లోకమును ప్రేమించితివినీ ప్రేమ ద్వారనే సమస్తము నిచ్చితివి (2)నీ ప్రేమ చూపలేను కఠినుడనైయున్నానునీ ప్రేమతో నింపుము (2) ||యేసు|| యేసు నీ స్వరూపము కలిగి ఆయన వాలే మారెదన్నీ రూపాంతరము కొరకై…

  • Yesu Nee Vaaramu
    యేసు నీ వారము

    యేసు నీ వారము – నీవే మా రాజువు (2)తల్లి తండ్రి గురువు దైవం – అన్నీ నీవేలే (2) ||యేసు|| మా ప్రాణం మా గానం – మా సర్వం మా సకలంఅన్నీ నీవొసగినవేమాదంతా నీకేలే – మహిమంతా నీకేలేస్తుతి స్తోత్రముల్ నీకేలే (2)సర్వంబు నీవైన ప్రభువాహల్లెలూయ స్తుతి మహిమ నీకే (2) ||యేసు|| ఈ భూమి ఈ గాలి – ఈ నేల ఈ నీరుఅన్నీ నీవొసగినవేఆకాశం ఆ తారల్ – ఆ ఇనుని…

  • Yesu Nee Naamaamruthamu
    యేసు నీ నామామృతము

    యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవమా – దోషములను హరించి మోక్షనివాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన ||యేసు|| వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవయెంతో – కీడు జేసిన పాడు వైరినిగోడుగో డనంగ వాని – తాడనము జేసితివి ||యేసు|| పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవనీ – దాపు జేరిన వారి కందరికాపదలు బాపి నిత్య…