Jeevana Tholi Sandhya జీవన తొలి సంధ్య

జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం
నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2)
నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2)
నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2) ||జీవన||

నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు
నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2)
నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను
నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2)
దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2) ||జీవన||

నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు
ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను (2)
నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా
నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా (2)
దేవా నను నీ సాక్షిగ నిల్పుమా (2) ||జీవన||


Jeevana Tholi Sandhya Neethone Aarambham
Naa Jeevana Mali Sandhya Neethone Anthamu (2)
Naa Jeevana Yaathraku Mali Sandhya Aasannamauthundi (2)
Nanu Siddha Parachu Yesu Naatha Neethonundutaku (2) ||Jeevana||

Naa Jeevana Yaathralo Enno Avarodhaalu
Naa Jeevana Gamanamlo Enno Avamaaanaalu (2)
Nireekshana Leni Itharula Poli Dukhinchanu Nenu
Naa Bhaaramu Neepai Mopi Munduku Saaguchunnaanu (2)
Devaa Neeve Naa Aashraya Durgamu (2) ||Jeevana||

Naa Poorvikulandaru Eppudo Gathinchaaru
Edo Oka Rojuna Naa Yaathra Muginchedanu (2)
Naa Shesha Jeevithamanthayu Neeke Arpinchithinayyaa
Naa Vesha Bhaashayulanniyu Neeke Samarpinthunu Devaa (2)
Devaa Nanu Nee Saakshiga Nilpumaa (2) ||Jeevana||


Posted

in

by

Tags:

Comments

Leave a Reply