I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Madhura madhuramu మధుర మధురము

    మధుర మధురము యేసు నామం ….2స్తుతికి యోగ్యము ప్రభుని నామం …. 2మధుర మధురము యేసు నామం – మధుర మేసుని నామం స్వర్గము వీడి – జగమున కరిగిసిలువలో రక్తము – చిందించెను సిలువపై సైతానును ఓడించితొలగించెను నరక శిక్షను పాపులకు విమోచన మొసగినేర్పుగ తండ్రితో నైక్యము చేసెన్ రక్తముచే మమ్ము శుద్ధుల జేసెన్దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్ ఆత్మలో వారసులుగ మమ్ము జేసెన్దేవుని మందిరముగ నిర్మించెన్ Madhura madhuramu yaesu naamam ….2sthuthiki yoagyamu…

  • Madhyapaana priyulu మద్యపాన ప్రియులు

    మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార మీరా మత్తులోనే మునిఁగిపోకుండి మద్యపానము చేయువారికిఁ దథ్యముగఁ బ్రాప్తించుఁ గీడులుకొద్దియైనన్ రుచిని జూడఁగఁ గోరఁ దగ దని తలఁచుకొనుఁడి ||మద్య|| రక్త మంతయుఁ జెడును సుమ్మండి ప్రియులారా మీరు శక్తిహీనులగుదురిల నుండి శక్యిహీనులె గాక మఱి మీ భక్తి దొలఁగి పోవునండిముక్తిమార్గము దెలియదండి ముందు గతికి హీనమండి ||మద్య|| బుద్ధిబలములు కొద్ది వౌనండి ప్రియులారామీరు మొద్దు లగుదురనియునమ్ముండి హద్దు మిరుచుఁ ద్రాగువారికిఁ గొద్దికాలమె జీవమండిశ్రద్ధగల్గి మద్యపానము రద్దు చేయుట తగినదండి ||మద్య||…

  • Mithramaa naa mithramaa మిత్రమా నా మిత్రమా

    మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే నీతో స్నేహం నాకు ప్రాణం నాతో బంధం అది నీ త్యాగం మిత్రమా నా మిత్రమా చిత్రము ఇది చిత్రము మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహంనా గుండెల్లో…

  • Medunna middunna మేడున్నా మిద్దున్నా

    మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నానీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా సిరి ఉందని తూలనాడినా బలముందని విర్రవీగినాతీర్పునందు చిక్కెదవన్నా మార్పునొంద త్వరపడుమన్నా అందముతో అతిశయించినా సుందరునని గర్వించినాచివరకు ఇది మన్నగునన్నా ఆపై నీ గతి ఏమన్నా చుదువులలో శిఖరమెక్కినా పదవులలో పైకి ఎదిగినాహృదయం ప్రభుకీయకున్నా నరకమే గతి ఇది నిజమన్నా Medunna middunna pedda gaddemida nivunnaNilo yesanna lekunna nikunnadamta sunna Siri umdani tulanadina balamumdani virraviginaTirpunamdu chikkedavanna marpunomda tvarapadumanna Aamdamuto…

  • Matadu na prabuva మాటాడు నా ప్రభువా

    మాటాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువానీ మాటలే జీవపు ఊటలు నీ పలుకులే ప్రాణాధారాలు సమరయ స్త్రీతో మాటాడావు సకల పాపములు హరియించావుజీవ జలములు త్రాగనిచ్చావు జీవితమునే మార్చివేసావు చచ్చిన లాజరును చక్కగ పిలిచావు బయటకు రమ్మని ఆదేశించావుకుళ్ళిన శవముకు జీవమునిచ్చావు మళ్ళీ బ్రతుకును దయచేసావు Matadu na prabuva nato matadu na prabuvaNi matale jivapu utalu ni palukule pranadharalu Samaraya strito matadavu sakalapapamulu hariyimchavuJiva jalamulu traganichchavujivitamune…

  • Mattivira vattivira మట్టివిరా వట్టివిరా

    మట్టివిరా వట్టివిరా మన్నువురా మన్నవురాకాయము మాయము ఖాయమురా అయ్యయ్యో! అటుచేసి ఇటుచేసి అందరిని మోసం చేసిసంఘాన్ని రెండుగ చీల్చావే అయ్యయ్యోనీ గోతిలో నువ్వే పడ్డావే అయ్యయ్యో! నువు వేసిన వేషాలు నువు చేసిన మోసాలునరకాగ్నికి నిను చేర్చునులే అయ్యయ్యోనరకాగ్నిలో కాలిపోదువులే అయ్యయ్యో! నీ బ్రతుకు దెరువుకోసం బైబిల్ చేతబట్టిపమార్ధం మర్చిపోయావే అయ్యయ్యోఆత్మలతో ఆడుకొన్నావే అయ్యయ్యో! సువార్త సేవకోసం పంపిన సొమ్ములన్నీసొంతానికి ఖర్చు చేశావే అయ్యయ్యోశాపాన్ని తెచ్చుకున్నావే అయ్యయ్యో! పాపాన్ని పాతిపెట్టి దోషాన్ని దాచిపెట్టిదొరలాగ తిరుగుచున్నావే అయ్యయ్యోతొందరలో దొరకిపోతావే…

  • Maeghamu meedha మేఘము మీద

    మేఘము మీద యేసురాజు వేగ మిలకువచ్చున్ సిద్ధముగా నుండువారల జేర్చును శీఘ్రముగా దిగును ప్రభువు తానే ఆర్భాటముతో ఈ భువికి వచ్చున్ఇక్కడ నమ్మినవారలు ఎగురుచు ఈ భువి విడచెదరు క్రీస్తునందు మృతులగు వారు లేచి వెళ్ళుదురునిలిచియుండు పరిశుద్ధులందరు మాయమై పోయెదరు వేల వేలగు ఆయన మాటలు రాకను దెల్పెనుప్రవక్తలపొస్తలులు దానిని గూర్చియే ప్రకటించిరి పాట్లుపడెడు వారల కేసు ప్రతిఫలమిచ్చునుచేరు మనకు సంపూర్ణశక్తిని చెలువుగ నొసగును ఆయన తెల్పిన గురుతులన్నియు నెరవేరుచున్నవిరాకడ గడియ నెవరు యెరుగరు తండ్రికే తెలియును…

  • Maeghmbupai nekki మేఘంబుపై నెక్కి

    మేఘంబుపై నెక్కి మేలుగ ప్రభు క్రీస్తు యాకసంబున కేగెనుప్రాకటముగను ఆత్మనంది ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి యేక దీక్షను యేసురాకకు నెదురు జూడుడటంచు ప్రభువు ||మేఘంబు|| యూదయ్య సమరయ్య ప్రాంతంబులంతట నాదు వార్తను జాటరేభూదిగంతము వరకు మీరు భూరిసాక్షులగుచు నాకు సాదరంబుగ సత్యవిశ్వా సంబులన్ మనుడంచు ప్రభువు ||మేఘంబు|| గలిలయ్యులార మీ రాశతో నెందుకు తిలకించు చున్నారట్లువెలయపరమున కెట్లు నేగెనొ యిలకునా ప్రభువట్లెమరల యలర వచ్చుటమీరు గాంచెద రంచు దూతలు బల్కిరపుడె ||మేఘంబు|| శ్రీ సంఘ మిదివిను మా…

  • Maeghaa roodumdai మేఘా రూఢుండై

    మేఘా రూఢుండై – ప్రభుయేసు, అతి వేగముగా నేతెంచున్ఏతెంచున్ ఏతెంచున్ఆకాశమునుండే వాడైన యేసు యిలకు నేతెంచున్ ఆకాశమందాయనను – సంధింపఏకముగ నేగుదురు – నిజ విశ్వాసులందరు పాపబంధకముల్ ఆయనే త్రుంచున్పాపముల నెడబాపున్ ప్రభుయేసే నినురక్షించున్ రక్తముచే విమోచన మొందియేసుతో నేగ నాయత్తమా? క్రీస్తేసే – నీకై రాగన్ శాశ్వత జీవము నిచ్చును నీకుతండ్రితో నైక్యపర్చునిన్ – నదాతనతోనే నిన్నుంచున్ Maeghaa roodumdai – prabhuyaesu, athi vaegamugaa naethemchunaethemchun aethemchunaakaashamunumdae vaadaina yaesu yilaku naethemchun aakaashammdhaayananu…

  • Maakartha gatti dhurgamu మాకర్త గట్టి దుర్గము

    మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబుసంప్రాప్తమైన కష్టములన్నిటి నణంచుఆ పాత శత్రువెంతో క్రూరుఁడుతదాయుధములుపాయ శక్తులు అతం డసమానుండు. మేమో నశించిపోదుము మా శక్తి నిష్ఫలంబుమాకై ప్రభుని శూరుఁడు యుద్దంబు చేసిపెట్టుఅతం డెవ్వఁడు యేసు క్రీస్తను మా రక్షకుండుమరొక్కఁ డెవ్వడు అతండె గెల్పుపొందు ప్రపంచ మంతటన్ గ్రమ్ము పిశాచు లేమి చేయుమమ్మెల్ల మ్రింగనున్నను మాకేల భేతివేయుఈ లోకాధిపుఁడుగ్రుఁడైనను దానేమి చేయుఁదీర్పొందె నతఁడు నశించు మాటతోనే. వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచ లేఁడు.దైవాత్మ తోడగుం గదా తా…

Got any book recommendations?