Blog

  • Kreesthu Puttenu క్రీస్తు పుట్టెను

    క్రీస్తు పుట్టెను పశుల పాకలో
    పాపమంతయు రూపు మాపను
    సర్వలోకమున్ విమోచింపను
    రారాజు పుడమిపై జన్మించెను
    సంతోషమే సమాధానమే
    ఆనందమే పరమానందమే (2)
    అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి
    యేసుని చూచి కానుకలిచ్చి
    పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే

    పరలోక దూతాలి పాట పాడగా
    పామరుల హృదయాలు పరవశించగా (2)
    అజ్ఞానము అదృష్యమాయెను
    అంధకార బంధకములు తొలగిపోయెను (2) || అరె గొల్లలొచ్చి ||

    కరుణగల రక్షకుడు ధర కేగెను
    పరమును వీడి కడు దీనుడాయెను (2)
    వరముల నొసగ పరమ తండ్రి తనయుని
    మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2) || అరె గొల్లలొచ్చి ||


    Kreesthu Puttenu Pashula Paakalo
    Paapamanthayu Roopu Maapanu
    Sarvalokamun Vimochimpanu
    Raaraaju Pudamipai Janminchenu
    Santhoshame Samaadhaaname
    Aanandame Paramaanandame (2)
    Arey Gollalochchi Gnaanulochchi
    Yesuni Choochi Kaanukalichchi
    Paatalu Paadi Naatyamulaadi Paravashinchire

    Paraloka Doothaali Paata Paadagaa
    Paamarula Hrudayaalu Paravashinchagaa (2)
    Agnaanamu Adrushyamaayenu
    Andhakaara Bandhakamulu Tholagipoyenu (2) || Arey Gollalochchi ||

    Karunagala Rakshakudu Dhara Kegenu
    Paramunu Veedi Kadu Deenudaayenu (2)
    Varamula Nosaga Parama Thandri Thanayuni
    Manakosagenu Rakshakuni Ee Shubhavela (2) || Arey Gollalochchi ||

  • Keerthinthunu Nee Naamamu కీర్తింతును నీ నామము

    కీర్తింతును నీ నామము
    మనసారా యేసయ్యా (2)
    మదిలో ధ్యానించి (2)
    తరియింతు నేనయ్యా.. నా యేసయ్యా ||కీర్తింతును||

    ఏలేశమైన కరుణకు
    ఈ దోషి పాత్రమా (2)
    కల్వరిలో కృప చూపి
    కలుషాలు బాపిన.. నా యేసయ్యా ||కీర్తింతును||

    వేనోళ్ళతోను పొగిడినా
    నీ ఋణము తీరునా (2)
    ఇన్నాళ్లు కన్నీళ్లు (2)
    తుడిచావు జాలితో.. నా యేసయ్యా ||కీర్తింతును||

    జీవింతు నేను నీ కొరకే
    నీ సాక్షిగా ఇలలో (2)
    సేవించి పూజింతు (2)
    నీ పాద సన్నిధిలో.. నా యేసయ్యా ||కీర్తింతును||


    Keerthinthunu Nee Naamamu
    Manasaaraa Yesayyaa (2)
    Madilo Dhyaaninchi (2)
    Thariyinthu Nenayyaa.. Naa Yesayyaa ||Keerthinthunu||

    Aeleshamaina Karunaku
    Ee Doshi Paathramaa (2)
    Kalvarilo Krupa Choopi (2)
    Kalushaalu Baapina.. Naa Yesayyaa ||Keerthinthunu||

    Venollathonu Pogadinaa
    Nee Runamu Theerunaa (2)
    Innaallu Kanneellu (2)
    Thudichaavu Jaalitho.. Naa Yesayyaa ||Keerthinthunu||

    Jeevinthu Nenu Nee Korake
    Nee Saakshigaa Ilalo (2)
    Sevinchi Poojinthu (2)
    Nee Paada Sannidhilo.. Naa Yesayyaa ||Keerthinthunu||

  • Keerthinthu Nee Naamamun కీర్తింతు నీ నామమున్

    కీర్తింతు నీ నామమున్
    నా ప్రభువా… సన్నుతింతు నీ నామమున్ (2)
    మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో (2)
    నిను నే కొనియాడెదన్ (4) ||కీర్తింతు||

    ప్రతి ఉదయం నీ స్తుతి గానం
    దినమంతయు నీ ధ్యానం (2)
    ప్రతి కార్యం నీ మహిమార్ధం (2)
    సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2) ||కీర్తింతు||

    నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ
    వేలాది స్తుతులన్ చెల్లిస్తూ (2)
    ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ (2)
    నిన్నే నేను ఆరాధిస్తూ (2) ||కీర్తింతు||

    అమూల్యమైనది నీ నామం
    ఇలలో శ్రేష్టమైనది నీ నామం (2)
    ఉన్నతమైనది నీ నామం (2)
    నాకై నిలచిన మోక్ష మార్గం (2) ||కీర్తింతు||


    Keerthinthu Nee Naamamun
    Na Prabhuvaa… Sannuthinthu Nee Naamamun (2)
    Manasaaraa Ellappudu Krottha Geethamutho (2)
    Ninu Ne Koniyaadedan (4) ||Keerthinthu||

    Prathi Udayam Nee Sthuthi Gaanam
    Dinamanthayu Nee Dhyaanam (2)
    Prathi Kaaryam Nee Mahimaardham (2)
    Sandhya Velalo Nee Sthothra Geetham (2) ||Keerthinthu||

    Neevu Chesina Melulan Lekkisthu
    Velaadi Sthuthulan Chellisthu (2)
    Enaleni Nee Premanu Varnisthu (2)
    Ninne Nenu Aaraadhisthu (2) ||Keerthinthu||

    Amoolyamainadi Nee Naamam
    Ilalo Shreshtamainadi Nee Naamam (2)
    Unnathamainadi Nee Naamam (2)
    Naakai Nilachina Moksha Maargam (2) ||Keerthinthu||

  • Keerthi Hallelooyaa కీర్తి హల్లెలూయా

    కీర్తి హల్లెలూయా
    గానం యేసు నామం మధురమిదే
    నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2)
    స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
    స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే
    స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం
    స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే

    ప్రయాసే లేదుగా – యేసే తోడుగా
    మాతో నడువగా – భయమే లేదుగా ||స్తుతి||

    క్రీస్తుని వేడగా – మార్గం తానేగా
    సత్యం రూఢిగా – జీవం నీయగా ||స్తుతి||


    Keerthi Hallelooyaa
    Gaanam Yesu Naamam Madhuramide
    Nithyam Sthothramu Ee Ghanunike (2)
    Sthuthi Sthuthi Shree Yesu Naamam – Sthuthi Sthuthi Sajeeva Naamam
    Sthuthi Sthuthi Ujjeeva Naamam – Ee Gaanamu Shree Yesuke
    Sthuthi Sthuthi Shree Yesu Naamam – Sthuthi Sthuthi Sajeeva Naamam
    Sthuthi Sthuthi Ujjeeva Naamam – Ee Sthothramu Maa Kreesthuke

    Prayaase Ledugaa – Yese Thodugaa
    Maatho Naduvagaa – Bhayame Ledugaa ||Sthuthi||

    Kreesthuni Vedagaa – Maargam Thaanegaa
    Sathyam Roodigaa – Jeevam Neeyagaa ||Sthuthi||

  • Christmas Shubha Dinam క్రిస్మస్ శుభదినం

    క్రిస్మస్ శుభదినం
    మహోన్నతమైన దినము
    ప్రకాశమైన దినము
    నా యేసు జన్మ దినము (2)
    క్రిస్మస్ శుభదినం

    హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)
    విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
    వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2)

    దావీదు వేరు చిగురు
    వికసించె నేడు భూమిపై (2)
    అద్వితీయ కుమారునిగా
    లోక రక్షకుడు ఉదయించెను (2) ||హ్యాప్పీ||

    కన్నుల పండుగగా మారెను
    నా యేసు జన్మదినం (2)
    కన్య మరియకు జన్మించెను
    కలతలు తీర్చే శ్రీ యేసుడు (2) ||హ్యాప్పీ||

    ఆనందముతో ఆహ్వానించండి
    క్రీస్తుని మీ హృదయములోకి (2)
    ఆ తారగా మీరుండి
    నశించు వారిని రక్షించాలి (2) ||హ్యాప్పీ||


    Christmas Shubha Dinam
    Mahonnathamaina Dinamu
    Prakaashamaina Dinamu
    Naa Yesu Janma Dinamu (2)
    Christmas Shubha Dinam

    Happy Christmas – Merry Christmas (2)
    Wish you Happy Christmas
    We wish you Merry Christmas (2) ||Christmas||

    Daaveedu Veru Chiguru
    Vikasinche Nedu Bhoomipai (2)
    Advitheeya Kumaarunigaa
    Loka Rakshakudu Udayinchenu (2) ||Happy||

    Kannula Pandugagaa Maarenu
    Naa Yesu Janmadinam (2)
    Kanya Mariyaku Janminchenu
    Kalathalu Theerche Shree Yesudu (2) ||Happy||

    Aanandamutho Aahwaaninchudi
    Kreesthuni Mee Hrudayamuloki (2)
    Aa Thaaragaa Meerundi
    Nashinchu Vaarini Rakshinchaali (2) ||Happy||

  • Christmas Vachchindayyaa క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు

    క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
    రక్షణ తెచ్చిందయ్యా చూడు (2)
    ఆనందం వెల్లి విరిసే
    జగతిలో జ్యోతిగా నేడు (2)
    క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ
    యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్||

    లోక పాపం తొలగింప
    జీవితాలను వెలిగింప (2)
    ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు
    విడుదల కలిగించె మనకు (2) ||క్రీస్తుకు||

    యేసుకు మనలో చోటిస్తే
    మానమొక తారగ కనిపిస్తాం (2)
    పరలోక మార్గం క్రీస్తే
    సమస్తము ఆయనకు అర్పిద్దాం (2) ||క్రీస్తుకు||


    Christmas Vachchindayyaa Nedu
    Rakshana Thechchindayyaa Choodu (2)
    Aanandam Velli Virise
    Jagathilo Jyothigaa Nedu (2)
    Kreesthuku Aaraadhana – Prabhvuku Sthothraarpana
    Yesuku Chellinchedam – Hallelooyaa Hallelooyaa ||Christmas||

    Loka Paapam Tholagimpa
    Jeevithaalanu Veligimpa (2)
    Ee Lokaaniki Vachchenandi Prabhuvu
    Vidudala Kaliginche Manaku (2) ||Kreesthuku||

    Yesuku Manalo Chotisthe
    Manamoka Thaaraga Kanipisthaam (2)
    Paraloka Maargam Kreesthe
    Samasthamu Aayanaku Arpiddaam (2) ||Kreesthuku||

  • Christmas Panduga క్రిస్మస్ పండుగ

    క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు
    యేసయ్య జన్మదినం వచ్చేనులే (2)
    ఆనందించెదం నూతన కీర్తన పాడెదం
    యేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడం
    యేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం (2)

    కన్యక గర్భములో యేసయ్య జన్మించెను
    పశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెను
    దివినుండి దూతలొచ్చి కొత్త పాటలు పాడెను (2)
    గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి
    రక్షకుడు పుట్టెనని లోకమంతా చాటిరి (2) ||క్రిస్మస్||

    దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికొచ్చెను
    తన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణం అర్పించెను
    సాతాను కట్లన్ని యేసయ్య తెంచెను (2)
    జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరి
    బహుమానములిచ్చిరి సాగిలపడి మొక్కిరి (2) ||క్రిస్మస్||


    Christmas Panduga Vachchenule Nedu
    Yesayya Janmadinam Vachchenule (2)
    Aanandinchedam Noothana Keerthana Paadedam
    Yesayya Premanu Lokamantha Chaatedam
    Yesayya Maargamulo Aanandamuga Saagedam (2)

    Kanyaka Garbhamulo Yesayya Janminchenu
    Pashuvula Paakalone Parishudhdhudu Janminchenu
    Divinundi Doothalochchi Koththa Paatalu Paadenu (2)
    Gollalu Vachchiri Yesayyanu Choochiri
    Rakshakudu Puttenani Lokamantha Chaatiri (2) ||Christmas||

    Devuni Bahumaanamugaa Sreshtudu Bhuvikochchenu
    Thana Premanu Velladi Cheya Thana Praanam Arpinchenu
    Saathaanu Katlanni Yesayya Thenchenu (2)
    Gnaanulu Vachchiri Yesayyanu Choochiri
    Bahumaanamulichchiri Saagilapadi Mokkiri (2) ||Christmas||

  • Christmas Kaalam క్రిస్మస్ కాలం

    క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే
    రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2)
    ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
    ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం||

    పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో
    లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2)
    యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2) ||క్రిస్మస్ కాలం||

    కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను
    బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2)
    దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి (2) ||క్రిస్మస్ కాలం||

    ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా
    మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా
    ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా
    మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా (2)
    ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
    ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం||


    Christmas Kaalam Kreesthu Jananam – Entho Aanandame
    Raajaadhi Raaju Prabhuvula Prabhuvu – Dharakethenchele (2)
    Entho Aanandame – Raaraaju Nee Janmame
    Entho Santhoshame – Aa Prabhuni Aagamaname (2) ||Christmas||

    Parishuddhudu Janminchenu – Pashuvula Paakalo
    Lokaalanelel Raaraajugaa – Aa Bethlehemulo (2)
    Yoodaa Gothramulo – Oka Thaara Kaanthilo (2) ||Christmas||

    Kaaparulu Chaatinchiri – Lokaama Shubhavaarthanu
    Bangaaru Saambraani Bolamulu – Arpinchiri Gnaanulu (2)
    Doothalu Sthothrinchiri – Aa Prabhuni Ghanaparachiri (2) ||Christmas||

    Aa Prabhuvu Janminchenu – Nara Roopa Dhaarigaa
    Mana Paapa Parihaara Baliyaardhamai Gorrepillagaa
    Aa Prabhuvu Janminchenu – Nara Roopa Dhaarigaa
    Mana Paapaanni Tholaginchi Rakshimpagaa Mariya Suthunigaa (2)
    Entho Aanandame – Raaraaju Nee Janmame
    Entho Santhoshame – Aa Prabhuni Aagamaname (2) ||Christmas||

  • Christmas Aanandam క్రిస్మస్ ఆనందం

    క్రిస్మస్ ఆనందం సంతోషమే
    నా యేసుని జన్మదినమే
    యూదుల రాజుగ జన్మించెనే
    పశులతొట్టెలో పరుండబెట్టెనే (2)
    క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
    క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||

    సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెను
    ఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2)
    క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
    క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||

    గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరి
    విలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి (2)
    క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
    క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||

    ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడు
    నిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు (2)
    క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్
    క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) ||క్రిస్మస్ ఆనందం||


    Christmas Aanandam Santhoshame
    Naa Yesuni Janmadiname
    Yoodula Raajuga Janminchene
    Pashula Thottelo Parundabettene (2)
    Christmas – Happy Christmas
    Christmas – Merry Christmas (2) ||Christmas||

    Santhosham Sambaram – Raajulaku Raaju Puttenu
    Aanandam Manaku Anudinam – Ika Immaanuyelu Vachchenu (2)
    Christmas – Happy Christmas
    Christmas – Merry Christmas (2) ||Christmas||

    Gollalu Gnaanulu – Darshinchi Poojinchiri
    Viluvaina Kaanukalanu – Arpinchi Pranamilliri (2)
    Christmas – Happy Christmas
    Christmas – Merry Christmas (2) ||Christmas||

    Aascharyakarudu Aalochanakartha – Balavanthudaina Devudu
    Nithyudagu Thandri Samaadhaana Kartha – Immaanuyelu Yesudu (2)
    Christmas – Happy Christmas
    Christmas – Merry Christmas (2) ||Christmas||

  • Kaavalenaa Yesayya
    కావలెనా యేసయ్య

    కావలెనా యేసయ్య బహుమానము
    (మరి) చేయాలి విలువైన ఉపవాసము (2)
    సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియా సంఘమా
    చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా (2) ||కావలెనా||

    నీనెవె పట్టణము యెహోవా దృష్టికి
    ఘోరమాయెను – పాపముతో నిండిపోయెను
    సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి
    నీనెవెకు పంపెను – కనికరము చూపించెను
    ఘనులేమి అల్పులేమి – నీనెవె పట్టణపు రాజేమి
    పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా
    ఆగింది యెహోవా శాపము
    కురిసింది కరుణ వర్షము (2) ||కావలెనా||

    దేవుని ప్రజలను నశియింప చేయుటకు
    దుష్టుడు తలచెను – కలవరము పుట్టించెను
    మొర్దెకై వేదనతో రాజునొద్దకు పంపుట
    దైవ చిత్తమని – ఎస్తేరును సిద్ధపరచెను
    ఘనులేమి అల్పులేమి – షూషను కోటలో రాణి ఏమి
    పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా
    అణిగింది హామాను గర్వము
    జరిగింది దేవుని చిత్తము (2) ||కావలెనా||


    Kaavalenaa Yesayya Bahumaanamu
    (Mari) Cheyaali Viluvaina Upavaasamu (2)
    Siddhamou Shree Yesuni Priya Sanghamaa
    Chigurinchaali Anjoorapu Chettu Kommalaa (2) ||Kaavalenaa||

    Neeneve Pattanamu Yehovaa Drushtiki
    Ghoramaayenu – Paapamutho Nindipoyenu
    Srushtikartha Yehovaa Yonaanu Darshinchi
    Neeneveku Pampenu – Kanikaramu Choopinchenu
    Ghanulemi Alpulemi – Neeneve Pattanapu Raajemi
    Pillalemi Peddalemi – Upavaasamu Cheyagaa
    Aagindi Yehovaa Shaapamu
    Kurisindi Karuna Varshamu (2) ||Kaavalenaa||

    Devuni Prajalanu Nashiyimpa Cheyutaku
    Dushtudu Thalachenu – Kalavaramu Puttinchenu
    Mordekai Vedanatho Raajunoddaku Pamputa
    Daiva Chitthamani – Estherunu Siddhaparachenu
    Ghanulemi Alpulemi – Shooshanu Kotalo Raani Emi
    Pillalemi Peddalemi – Upavaasamu Cheyagaa
    Anigindi Haamaanu Garvamu
    Jarigindi Devuni Chitthamu (2) ||Kaavalenaa||