Tag: Andhala

  • అందాల తార అరుదెంచె నాకై – Andhala taara arudhinche naakai

    అందాల తార అరుదెంచె నాకై – అంబర వీధిలో

    అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
    ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో
    ఆది దేవుని జూడ – అశింపమనసు –పయనమైతిమి                             .. అందాల తార..

    1)విశ్వాసయాత్ర – దూరమెంతైన – విందుగా దోచెను
    వింతైన శాంతి – వర్షంచెనాలో – విజయపధమున
    విశ్వాలనేలెడి – దేవకుమారుని – వీక్షించు దీక్షలో
    విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ – విశ్రాంతి నొసగుచున్   .. అందాల తార..

    2)యెరూషలేము – రాజనగరిలో – ఏసును వెదకుచు
    ఎరిగిన దారి – తొలగిన వేల – ఎదలో క్రంగితి
    ఏసయ్యతార – ఎప్పటివోలె – ఎదురాయె త్రోవలో
    ఎంతో యబ్బురపడుచు – విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు      .. అందాల తార..

    3)ప్రభుజన్మస్ధలము – పాకయేగాని పరలోక సౌధమే
    బాలునిజూడ – జీవితమెంత – పావనమాయెను
    ప్రభుపాదపూజ – దీవెనకాగా – ప్రసరించె పుణ్యము
    బ్రతుకె మందిరమాయె – అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన            .. అందాల తార


    Andala Tara Arudhenche Naakai… Ambara Veedhilo

    Avathaaramoorthy Yesayya Keerthi… Avani Chaatuchun
    Aanandhasandhra Mupponge Naalo… Amarakaanthilo
    Aadhi Devuni Jaada… Aashimpamanasu Payanamaithimi

    1)Vishwaasayaathra Dhooramenthaina… Vindhugaa Dhochenu
    Vinthaina Shaanthi Varshinche Naalo… Vijayapathamuna
    Vishwaalaneledi Devakumaaruni Veekshinchu Dheekshalo
    Virajimme Balamu, Pravahinche Prema… Vishraanthi Nosaguchun

    2)Yerushalemu Rajanagarilo… Yesuni Vedhakuchu
    Erigina Daari, Tholagina Vela… Edhalo Krungithi
    Yesayya Thaara Eppativole… Edhuraaye Throvalo
    Entho Yabburapaduchu, Vismayamondhuchu… Egithi Swami Kadaku

    3)Prabhu Janma Sthalamu… Paakaye Gaani Paralokasoudhame
    Baalunijooda Jeevithamentha Paavanamaayenu
    Prabhu Paadhapooja Deevenakaagaa… Prasarinche Punyamu
    Brathuke Mandhiramaaye, Arpanale Sirulaaye..Phaliyinche Prardhana