Aanandinthu Neelo Devaa ఆనందింతు నీలో దేవా

ఆనందింతు నీలో దేవా
అనుదినం నిను స్తుతించుచు (2)
మధురమైన నీ నామమునే (2)
మరువక ధ్యానించెద ప్రభువా ||ఆనందింతు||

ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా (2)
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర (2) ||ఆనందింతు||

నాదు జనములు నను విడచినను
నన్ను నీవు విడువకుండా (2)
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన (2) ||ఆనందింతు||

శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న (2)
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము (2) ||ఆనందింతు||

శ్రమలు నన్ను చుట్టిన వేళ
చింతలో కృశించిన వేళ (2)
అభయముగా నీ దర్శనమిచ్చి
శ్రమలు బాపి శాంతినిచ్చితివి (2) ||ఆనందింతు||


Aanandinthu Neelo Devaa
Anudinam Ninu Sthuthinchuchu (2)
Madhuramaina Nee Naamamune (2)
Maruvaka Dhyaaninicheda Prabhuvaa ||Aanandinthu||

Aathma Naathaa Adrushya Devaa
Akhila Charaalaku Aadhaarundaa (2)
Anayamu Ninu Madi Koniyaaduchune
Aanandinthu Aasha Theera (2) ||Aanandinthu||

Naadu Janamulu Nanu Vidachinanu
Nannu Neevu Viduvakunda (2)
Nee Kanu Drushti Naapai Nunchi
Naaku Rakshana Shrungamaina (2) ||Aanandinthu||

Shreshtamagu Nee Swaasthyamu Korakai
Meghamandu Raanaiyunna (2)
Aa Ghadiya Epudo Evariki Thelusu
Antham Varakunu Bhadra Parachumu (2) ||Aanandinthu||

Shramalu Nannu Chuttina Vela
Chinthalo Krushinchina Vela (2)
Abhayamugaa Nee Darshanamichchi
Shramalu Baapi Shaanthinichchithivi (2) ||Aanandinthu||


Posted

in

by

Tags:

Comments

Leave a Reply