Author: admin

  • Echoes of glory

    “Echoes of glory” are ringing
    down thro’ the gates so fair;
    news of sweet rest they are bringing,
    to hearts that are weary with care.

    oh! “echoes of glory”
    from angels so fair,
    list to the music,
    that floats on the air.

    “echoes of glory” are sweetly
    coming to cheer the weak,
    filling the soul thus completely,
    with love that the sorrowing seek.

    “echoes of glory” come ever
    telling of rest at last,
    when we shall cross o’er the river,
    and life with its turmoil is past.

  • Ni devudedamchu నీ దేవుడేడంచు

    నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు
    ఎక్కడున్నావని చెప్పనూ
    ఎలా వున్నావని చూపను యేసు (2)

    ఆకాశముల నడుగరాదా అంతరిక్షము చెప్పలేదా
    యేసురాజే స్రుస్టికర్తయని యేసు నాధుడే సార్వభౌముడని
    అంతరిక్షము చెప్పలేదా ఆకాశముల నడుగరాదా

    నక్షత్రముల నడుగరాదా సాక్షులై అవి చెప్పలేదా
    యేసురాజే దేవదేవుడని విశ్వమంత యేసు సృస్టియని
    సాక్షులై అవి చెప్పలేదా నక్షత్రముల నడుగరాదా

    మానవాత్మను అడుగరాదా అంతరాత్మే చెప్పలేదా
    యేసు దేవుడే నిన్ను చేసేనని యేసు లేనిదే ఏది కలుగలేదని
    అంతరాత్మే చెప్పలేదామానవాత్మను అడుగరాదా

    దైవ వాక్యం చదువరాదా వాక్యసత్యం చెప్పలేదా
    యేసు ప్రజల రక్షకుండని యేసే ప్రజల విమోచకుండని
    వాక్యసత్యం చెప్పలేదాదైవ వాక్యం చదువరాదా


    Ni devudedamchu nannaduguchunnaru
    Ekkadunnavani cheppanu
    Ela vunnavani chupanu yesu (2)

    Akasamula nadugarada amtarikshamu cheppaleda
    Yesuraje srustikartayani yesu nadhude sarvabaumudani
    Amtarikshamu cheppaleda akasamula nadugarada

    Nakshatramula nadugarada sakshulai avi cheppaleda
    Yesuraje devadevudani visvamamta yesu srustiyani
    Sakshulai avi cheppaleda nakshatramula nadugarada

    Manavatmanu adugarada amtaratme cheppaleda
    Yesu devude ninnu chesenani yesu lenide edi kalugaledani
    Amtaratme cheppaledamanavatmanu adugarada

    Daiva vakyam chaduvarada vakyasatyam cheppaleda
    Yesu prajala rakshakumdani yese prajala vimochakumdani
    Vakyasatyam cheppaledadaiva vakyam chaduvarada

  • Nee dhayaloanee krupaloa నీ దయలోనీ కృపలో

    నీ దయలోనీ కృపలో కాచితివి గతకాము నీ దయలో
    నీ నీడలో దాచుమయా జీవితాంతం
    నీ ఆత్మతో నను నింపుమా`
    నీ సేవలో ఫలియింపగా
    దేవా………………దేవా……..
    నీ దయలో

    కష్టకాం దుఖ:సమయం నన్ను వేధించగా
    ప్రాణహితులె నన్ను విడచి వెలిగ నను చూడగా ఓదార్పువై నా చెంత నీవె ఉండినావు
    నా కన్నీరు నీ కవితలై రాసి ఉంచినావు
    ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా

    నీవె నా మార్గము నీవె నా జీవము నీవె నా గమ్యము
    నీవె నా సర్వము
    నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా……

    ఏ యోగ్యతు లేని నా యెడ నీ కృప చూపితివి
    ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి
    నీ చిత్తమే నాయందు నెరవేర్పవ్వాని
    నీ సేవయే నా శ్వాసగా కడవరకు నివాని
    నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం

    నీవె నా తోడుగా నీవె నా నీడగా
    ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా
    నా చేయిపట్టి నన్ను నీతొ నడుపుము దేవా…….


    Nee dhayaloanee krupaloa kaachithivi gathakaamu nee dhayaloa
    nee needaloa dhaachumayaa jeevithaaMthM
    nee aathmathoa nanu niMpumaa`
    nee saevaloa phaliyiMpagaa
    dhaevaa………………dhaevaa……..
    nee dhayaloa

    kaShtakaaM dhukha:samayM nannu vaeDhiMchagaa
    praaNahithule nannu vidachi veliga nanu choodagaa oadhaarpuvai naa cheMtha neeve uMdinaavu
    naa kanneeru nee kavithale raasi uMchinaavu
    aemi adhbhutha praemayaa ae reethi paadanayaa

    neeve naa maargamu neeve naa jeevamu neeve naa gamyamu
    neeve naa sarvamu
    naa manasu theera ninnu paadi pogadedha dhaevaa……

    Ae yoagyathu laeni naa yeda nee krupa choopithivi
    otti paathranu mahimathoa niMpi maargamu neevaithivi
    nee chiththamae naayMdhu neravaerpavvaani
    nee saevayae naa shvaasagaa kadavaraku nivaani
    naa madhi niMdenu aashathoa nae paadedha sthuthi geethM

    neeve naa thoadugaa neeve naa needagaa
    aathmathoa niMpumaa shakthi naa kosagumaa
    naa chaeyipatti nannu neetho nadupumu dhaevaa…….

  • Naa jeevithamulo velugai నా జీవితములో వెలుగై

    నా జీవితములో వెలుగై నిలిచినా
    జోతిర్మయుడైన నా యేసురాజును
    ఆత్మతో సత్యముతో ఆరాధించెదా
    తండ్రి తనయునిపై జాలి పడినట్టుగా
    తండ్రిగా నాపై జాలి చూపిస్తివే
    కరుణమయుడైన నా యేసురాజుని
    ఆత్మతో సత్యముతో ఆరాధించెదా
    తల్లి మరచినా మరువనంటివే
    శాశ్వత ప్రేమతో నను ప్రేమిస్తివే
    ప్రేమామయుడైనా ఆ యేసునాధుని
    ఆత్మతో సత్యముతో ఆరాధించెదా


    Naa jeevithamulo velugai nilichinaa
    joathirmayudaina naa yesuraajunu
    aathmatho satyamutho aaraadhinchedaa
    thandri thanayunipai jaali padinattugaa
    thandrigaa naapai jaali choopisthive
    karunamayudaina naa yesuraajuni
    aathmatho sathyamutho aaraadhinchedaa
    thalli marachinaa maruvanantive
    saasvatha prematho nanu premisthive
    premaamayudainaa aa yesunaadhuni
    aathmatho sathyamutho aaraadhinchedaa

  • Nee jeevithamu నీ జీవితము క్షణభంగురమే

    నీ జీవితము క్షణభంగురమే – ఒక గడియలోనే గతియించెదవు

    నీటి బుడగవలె నీ జీవితము – సంపూర్ణముగా నశియించు
    సాగిపోయెడు నీడవలెనే నీదు బ్రతుకు వున్నదిగా

    ధన సంపదలు గౌరవములు – ధరలోనున్న సర్వమును
    వ్యర్థము వీటి వైభవమంతయు – విడిచెదవు ఒక దినమందే – నీవు

    మోసపోతివిగా నీవు యిలలో – నష్టపడితివి పాపములో
    నేడే రమ్ము యేసుని కడకు – నీకై రక్తము చిందించెనుగా
    నిన్ను పిలుచుచున్నాడు


    Nee jeevithamu kShNabhMguramae – oka gadiyaloanae gathiyiMchedhavu

    Neeti budagavale nee jeevithamu – sMpoorNamugaa nashiyiMchu
    saagipoayedu needavalenae needhu brathuku vunnadhigaa

    Dhana smpadhalu gauravamulu – Dharaloanunna sarvamunu
    vyarThamu veeti vaibhavamMthayu -vidichedhavu oka dhinamMdhae – neevu

    Moasapoathivigaa neevu yilaloa – naShtapadithivi paapamuloa
    naedae rammu yaesuni kadaku – neekai rakthamu chiMdhiMchenugaa
    ninnu piluchuchunnaadu

  • Naa jeevitha saagaramuna నా జీవిత సాగరమున

    నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా
    కుడి యెడమకు తొలగకుండ నను చక్కగ నడిపించు

    అంధకార లోకములో అంధుడనై నేనుండగా
    పందెరంగములో నేను గెలువ నా ముందుగ నడువుము

    లోకములో మాయలకు లోకుల మోమాటముకు
    లోకువ నేను కాకుండునట్లు మెళకువ నొసగుము ప్రభువా

    ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్
    సత్య వాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా


    Naa jeevitha saagaramuna nanu nadipiMchumu prabhuvaa
    kudi yedamaku tholagakuMda nanu chakkaga nadipiMchu

    amdhakaara loakamuloa amdhudanai naenuMdagaa
    pMdherMgamuloa naenu geluva naa muMdhuga naduvumu

    loakamuloa maayalaku loakula moamaatamuku
    loakuva naenu kaakuMdunatlu meLakuva nosagumu prabhuvaa

    aathmeeya yudhDhamuloa shathruvunu oadiMpan
    sathya vaakya vishvaasamulu nithyamu nosagumu prabhuvaa

  • Nee chiththm baenu nee నీ చిత్తం బేను నీ

    నీ చిత్తం బేను నీ చిత్తంబే
    నేను మట్టిని ఓ కుమ్మరీ!
    నీ కోర్కెదీర నన్ దీర్చుమా
    నీకు లొంగెదన్ ఓ ప్రభువా ||

    నీ మార్గంబేను నీ మార్గంబే
    నేడు నన్ను పరిశోధించు
    శుద్ధిజేయుమో యేసూ నన్ను
    నీ సన్నిధిలో మోకరింతున్ ||

    నీ కోర్కె యేసు నీ కోర్కెయే
    నే గాయంబొంది అలసితిన్
    బాగుచేయు నన్ ముట్టిప్రభో
    నీకే సమస్త శక్తి నొప్పున్ ||

    నీ యిష్టంబేను నీ యిష్టంబే
    నీ యాత్మతోడ నన్ నింపుమా
    నాయందెల్లరు క్రీస్తుంజూడన్
    నీ యాధీనంబు నన్నుంచుకో

    అప్పుడు నేను నీ రీతిగాన్
    తప్పకజేతు నో ప్రభువా
    ఇప్పుడే నీదు సేవ జేయున్
    అప్పగింతు నా సమస్తంబు ||


    Nee chiththm baenu nee chiththMbae
    naenu mattini oa kummaree!
    nee koarkedheera nan dheerchumaa
    neeku loMgedhan oa prabhuvaa ||

    nee maargMbaenu nee maargMbae
    naedu nannu parishoaDhiMchu
    shudhDhijaeyumoa yaesoo nannu
    nee sanniDhiloa moakariMthun ||

    nee koarke yaesu nee koarkeyae
    nae gaayMboMdhi alasithin
    baaguchaeyu nan muttiprabhoa
    neekae samastha shakthi noppun ||

    nee yiShtMbaenu nee yiShtMbae
    nee yaathmathoada nan niMpumaa
    naayMdhellaru kreesthuMjoodan
    nee yaaDheenMbu nannuMchukoa

    appudu naenu nee reethigaan
    thappakajaethu noa prabhuvaa
    ippudae needhu saeva jaeyun
    appagiMthu naa samasthMbu ||

  • Nee chemthakoa prabhoa నీ చెంతకో ప్రభో

    నీ చెంతకో ప్రభో – నే జేరెదన్
    కష్టంబు లేచినన్ – నిన్ జేరెద
    నా పాట యెప్పుడు – నీ చెంత నుండును
    నీ చెంత నుందును – నా రక్షకా

    భానుండు ద్రిమ్మరి – యిట్టిప్పుడు
    క్రుంకంగ నిక్కడ నా చుట్టును
    చీకట్లు గ్రమ్మినన్ – స్వప్నంబు నందును
    నీ చెంతనుందును – నా రక్షకా

    ఆకాశమండల – మార్గంబును
    నాకీవు చూపుమా – నీ కూర్మిచే
    నీ దివ్యదూతలు – నన్ గోరి పిల్వగా
    నీ చెంతనుందును – నా రక్షకా

    నే నిద్రలేక నీ – స్తోత్రంబుతో
    శోకంపు రాళ్ళుగ – బేతేలును
    నీకై నిర్మింతును – నా దుఃఖమందున
    నీ చెంతనుందును – నా రక్షకా

    ఆనంద పూర్ణమై – పక్షంబులన్
    నాకంబు నంటుచు – నే లేచినన్
    నా పాటయంతయు – నీ చెంతనుండు
    నీ చెంతనుందును – నా రక్షకా


    Nee chemthakoa prabhoa – nae jaeredhan
    kaShtMbu laechinan – nin jaeredh
    naa paata yeppudu – nee cheMtha nuMdunu
    nee cheMtha nuMdhunu – naa rakShkaa

    bhaanuMdu dhrimmari – yittippudu
    kruMkMga nikkada naa chuttunu
    cheekatlu gramminan – svapnMbu nMdhunu
    nee cheMthanuMdhunu – naa rakShkaa

    aakaashamMdala – maargMbunu
    naakeevu choopumaa – nee koormichae
    nee dhivyadhoothalu – nan goari pilvagaa
    nee cheMthanuMdhunu – naa rakShkaa

    nae nidhralaeka nee – sthoathrMbuthoa
    shoakMpu raaLLuga – baethaelunu
    neekai nirmiMthunu – naa dhuHkhamMdhun
    nee cheMthanuMdhunu – naa rakShkaa

    aanMdha poorNamai – pakShMbulan
    naakMbu nMtuchu – nae laechinan
    naa paatayMthayu – nee cheMthanuMdu
    nee cheMthanuMdhunu – naa rakShkaa

  • Naa chenthanundumu నా చెంత నుండుము

    నా చెంత నుండుము ఓ యేసయ్య
    నే నిన్ను విడచి బ్రతుకలేనయ్య

    చీకటి సమయములో వెలుగులో నను నడుపు
    మరణపు సమయములో జీవముతో నింపు

    కన్నీటి సమయములో తల్లిలా ఓదార్చు
    కష్టముల సమయములో తండ్రిలా కాపాడు

    వాక్యం చదివే సమయములో గురువుగా బోధించు
    ప్రార్ధించే సమయములో దైవంలా ఆలకించు


    Naa chenthanundumu o yesayya
    ne ninnu vidachi brathukalenayya

    cheekati samayamulo velugulo nanu nadupu
    maranapu samayamulo jeevamutho nimpu

    kanniti samayamulo thallila odhaarchu
    kashtamula samayamulo thandrila kaapaadu

    vaakyam chadhive samayamulo guruvugaa bodhinchu
    praardhinche samayamulo daivamla aalakinchu

  • Naa geethaaraadhanaloayaesayyaa నా గీతారాధనలోయేసయ్యా

    నా గీతారాధనలో-యేసయ్యా నీ కృప ఆధారమే
    నా ఆవేదనలలో-జనించెనే నీ కృపాదరణ

    నీ కృప నాలో వ్యర్థము కాలేదు- నీ కృపా వాక్యమే
    చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే
    నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే ||నా గీతా||

    చేనిలోని పైరు చేతికిరాకున్నా- ఫలములన్ని రాలిపోయిన
    సిరిసంపదలన్నీ దూరమైపోయిన-నేను చల్లించనులే
    నిశ్చలమైన రాజ్యముకొరకే- ఎల్లవేళల నిన్నే ఆరాధింతునే ||నా గీతా||

    ఆత్మాభిషేకం-నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే
    ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే
    ఆత్మతో సత్యముతో ఆరాధించుచు-నే వేచియుందునే నీ రాకడకై ||నా గీతా||


    Naa geethaaraadhanaloayaesayyaa nee krupa aadhaaramae
    Naa aavaedhanalaloa-janiMchenae nee krupaadharan

    nee krupa naaloa vyarThamu kaalaedhu- nee krupaa vaakyamae
    chaedhaina vaeru aedhainaa naaloa molavanivvalaedhulae
    nee krupa naaloa athyunnathamai neethoa nannu
    amtukattenae ||naa geethaa||

    chaeniloani pairu chaethikiraakunnaa- phalamulanni raalipoayin
    sirisMpadhalannee dhooramaipoayina-naenu challiMchanulae
    nishchalamaina raajyamukorakae- ellavaeLala
    ninnae aaraaDhiMthunae ||naa geethaa||

    aathmaabhiShaekM-nee praema naaloa niMdugaa kummariMchenae
    aathmaphalamulennoa meMdugaa naaloa phaliMpajaesenae
    aathmathoa sathyamuthoa aaraaDhiMchuchu-nae
    vaechiyuMdhunae nee raakadakai ||naa geethaa||