Author: admin

  • Nee chiththm baenu nee నీ చిత్తం బేను నీ

    నీ చిత్తం బేను నీ చిత్తంబే
    నేను మట్టిని ఓ కుమ్మరీ!
    నీ కోర్కెదీర నన్ దీర్చుమా
    నీకు లొంగెదన్ ఓ ప్రభువా ||

    నీ మార్గంబేను నీ మార్గంబే
    నేడు నన్ను పరిశోధించు
    శుద్ధిజేయుమో యేసూ నన్ను
    నీ సన్నిధిలో మోకరింతున్ ||

    నీ కోర్కె యేసు నీ కోర్కెయే
    నే గాయంబొంది అలసితిన్
    బాగుచేయు నన్ ముట్టిప్రభో
    నీకే సమస్త శక్తి నొప్పున్ ||

    నీ యిష్టంబేను నీ యిష్టంబే
    నీ యాత్మతోడ నన్ నింపుమా
    నాయందెల్లరు క్రీస్తుంజూడన్
    నీ యాధీనంబు నన్నుంచుకో

    అప్పుడు నేను నీ రీతిగాన్
    తప్పకజేతు నో ప్రభువా
    ఇప్పుడే నీదు సేవ జేయున్
    అప్పగింతు నా సమస్తంబు ||


    Nee chiththm baenu nee chiththMbae
    naenu mattini oa kummaree!
    nee koarkedheera nan dheerchumaa
    neeku loMgedhan oa prabhuvaa ||

    nee maargMbaenu nee maargMbae
    naedu nannu parishoaDhiMchu
    shudhDhijaeyumoa yaesoo nannu
    nee sanniDhiloa moakariMthun ||

    nee koarke yaesu nee koarkeyae
    nae gaayMboMdhi alasithin
    baaguchaeyu nan muttiprabhoa
    neekae samastha shakthi noppun ||

    nee yiShtMbaenu nee yiShtMbae
    nee yaathmathoada nan niMpumaa
    naayMdhellaru kreesthuMjoodan
    nee yaaDheenMbu nannuMchukoa

    appudu naenu nee reethigaan
    thappakajaethu noa prabhuvaa
    ippudae needhu saeva jaeyun
    appagiMthu naa samasthMbu ||

  • Nee chemthakoa prabhoa నీ చెంతకో ప్రభో

    నీ చెంతకో ప్రభో – నే జేరెదన్
    కష్టంబు లేచినన్ – నిన్ జేరెద
    నా పాట యెప్పుడు – నీ చెంత నుండును
    నీ చెంత నుందును – నా రక్షకా

    భానుండు ద్రిమ్మరి – యిట్టిప్పుడు
    క్రుంకంగ నిక్కడ నా చుట్టును
    చీకట్లు గ్రమ్మినన్ – స్వప్నంబు నందును
    నీ చెంతనుందును – నా రక్షకా

    ఆకాశమండల – మార్గంబును
    నాకీవు చూపుమా – నీ కూర్మిచే
    నీ దివ్యదూతలు – నన్ గోరి పిల్వగా
    నీ చెంతనుందును – నా రక్షకా

    నే నిద్రలేక నీ – స్తోత్రంబుతో
    శోకంపు రాళ్ళుగ – బేతేలును
    నీకై నిర్మింతును – నా దుఃఖమందున
    నీ చెంతనుందును – నా రక్షకా

    ఆనంద పూర్ణమై – పక్షంబులన్
    నాకంబు నంటుచు – నే లేచినన్
    నా పాటయంతయు – నీ చెంతనుండు
    నీ చెంతనుందును – నా రక్షకా


    Nee chemthakoa prabhoa – nae jaeredhan
    kaShtMbu laechinan – nin jaeredh
    naa paata yeppudu – nee cheMtha nuMdunu
    nee cheMtha nuMdhunu – naa rakShkaa

    bhaanuMdu dhrimmari – yittippudu
    kruMkMga nikkada naa chuttunu
    cheekatlu gramminan – svapnMbu nMdhunu
    nee cheMthanuMdhunu – naa rakShkaa

    aakaashamMdala – maargMbunu
    naakeevu choopumaa – nee koormichae
    nee dhivyadhoothalu – nan goari pilvagaa
    nee cheMthanuMdhunu – naa rakShkaa

    nae nidhralaeka nee – sthoathrMbuthoa
    shoakMpu raaLLuga – baethaelunu
    neekai nirmiMthunu – naa dhuHkhamMdhun
    nee cheMthanuMdhunu – naa rakShkaa

    aanMdha poorNamai – pakShMbulan
    naakMbu nMtuchu – nae laechinan
    naa paatayMthayu – nee cheMthanuMdu
    nee cheMthanuMdhunu – naa rakShkaa

  • Naa chenthanundumu నా చెంత నుండుము

    నా చెంత నుండుము ఓ యేసయ్య
    నే నిన్ను విడచి బ్రతుకలేనయ్య

    చీకటి సమయములో వెలుగులో నను నడుపు
    మరణపు సమయములో జీవముతో నింపు

    కన్నీటి సమయములో తల్లిలా ఓదార్చు
    కష్టముల సమయములో తండ్రిలా కాపాడు

    వాక్యం చదివే సమయములో గురువుగా బోధించు
    ప్రార్ధించే సమయములో దైవంలా ఆలకించు


    Naa chenthanundumu o yesayya
    ne ninnu vidachi brathukalenayya

    cheekati samayamulo velugulo nanu nadupu
    maranapu samayamulo jeevamutho nimpu

    kanniti samayamulo thallila odhaarchu
    kashtamula samayamulo thandrila kaapaadu

    vaakyam chadhive samayamulo guruvugaa bodhinchu
    praardhinche samayamulo daivamla aalakinchu

  • Naa geethaaraadhanaloayaesayyaa నా గీతారాధనలోయేసయ్యా

    నా గీతారాధనలో-యేసయ్యా నీ కృప ఆధారమే
    నా ఆవేదనలలో-జనించెనే నీ కృపాదరణ

    నీ కృప నాలో వ్యర్థము కాలేదు- నీ కృపా వాక్యమే
    చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే
    నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే ||నా గీతా||

    చేనిలోని పైరు చేతికిరాకున్నా- ఫలములన్ని రాలిపోయిన
    సిరిసంపదలన్నీ దూరమైపోయిన-నేను చల్లించనులే
    నిశ్చలమైన రాజ్యముకొరకే- ఎల్లవేళల నిన్నే ఆరాధింతునే ||నా గీతా||

    ఆత్మాభిషేకం-నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే
    ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే
    ఆత్మతో సత్యముతో ఆరాధించుచు-నే వేచియుందునే నీ రాకడకై ||నా గీతా||


    Naa geethaaraadhanaloayaesayyaa nee krupa aadhaaramae
    Naa aavaedhanalaloa-janiMchenae nee krupaadharan

    nee krupa naaloa vyarThamu kaalaedhu- nee krupaa vaakyamae
    chaedhaina vaeru aedhainaa naaloa molavanivvalaedhulae
    nee krupa naaloa athyunnathamai neethoa nannu
    amtukattenae ||naa geethaa||

    chaeniloani pairu chaethikiraakunnaa- phalamulanni raalipoayin
    sirisMpadhalannee dhooramaipoayina-naenu challiMchanulae
    nishchalamaina raajyamukorakae- ellavaeLala
    ninnae aaraaDhiMthunae ||naa geethaa||

    aathmaabhiShaekM-nee praema naaloa niMdugaa kummariMchenae
    aathmaphalamulennoa meMdugaa naaloa phaliMpajaesenae
    aathmathoa sathyamuthoa aaraaDhiMchuchu-nae
    vaechiyuMdhunae nee raakadakai ||naa geethaa||

  • Ni kashtalanni badhalanni నీ కష్టాలన్నీ బాధలన్నీ

    నీ కష్టాలన్నీ బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే ఆ నాధుడు యేసే
    ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు అద్భుతాలు చేసేవాడు నా యేసుడు

    ఈ లోక బంధాలన్నీ నీకున్న స్నేహాలన్నీ
    నీవు కూర్చే భోగలన్నీ ప్రేరు ప్రఖ్యాతలన్నీ
    ఇవన్నీ నిన్ను రక్షింపలేవు రక్షకుడు శ్రీ యేసే

    క్షణమాత్రం నీదు జీవితం ఈనాడే యేసుని చేరు
    నీవు పొందే విడుదల చూడు నీకు లేదు వేరే మార్గం
    ఆలస్యం చేయకు ఇక సమయం లేదు యేసు చెంతకు చేరు


    Ni kashtalanni badhalanni sramalanni tirche aa nadhudu yese
    Adi numdi unnavadu A devudu adbutalu chesevadu na yesudu

    E loka bamdhalanni nikunna snehalanni
    Nivu kurche bogalanni preru prakyatalanni
    Ivanni ninnu rakshimpalevu rakshakudu sri yese

    Kshanamatram nidu jivitam inade yesuni cheru
    Nivu pomde vidudala chudu niku ledu vere margam
    Alasyam cheyaku ika samayam ledu yesu chemtaku cheru

  • Naa kaalagathu levvi naa నా కాలగతు లెవ్వి నా

    నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు నాదు దేవ యెపుడు నీకే
    వాని మీద నిత్యాధికారంబు నిల్చియుండు ||నా||

    తల్లిగర్భంబున దసర సృజించితివి ధరణి నన్ను నీవు తల్లికన్నను
    మిగుల దయచేతఁ జూచితివి తండ్రి నన్ను ||నా||

    పాప కూపమునందుఁ బడియుండఁగా నన్నుఁ బారఁజూచి
    చేయి చాపి యేసునిద్వార చక్కఁగాఁదెచ్చితివి చాలు దేవా ||నా||

    సుఖఃదుఖ కాలములు శోధింపఁ బంపుదువు శోభాయుక్త నాకు
    సుఖముఁ గల్గజేయు సొంపుగ వానిచే స్థూల శక్తి ||నా||

    సకల కాలంబులఁ జక్కఁగ లోఁబడి నన్నుతింతు నన్ను
    ఆకలంకునిగాఁ జేయు మనుచు వేఁడుచునుందు నధికాసక్తి ||నా||


    Naa kaalagathu levvi naa chaethulanu
    laevu naadhu dhaeva yepudu neekae
    vaani meedha nithyaaDhikaarMbu nilchiyuMdu ||naa||

    thalligarbhMbuna dhasara srujiMchithivi
    DharaNi nannu neevu thallikannanu
    migula dhayachaethAO joochithivi thMdri nannu ||naa||

    paapa koopamunMdhuAO badiyuMdAOgaa nannuAO baarAOjoochi
    chaeyi chaapi yaesunidhvaara chakkAOgaaAOdhechchithivi
    chaalu dhaevaa ||naa||

    sukhHdhukha kaalamulu shoaDhiMpAO bMpudhuvu shoabhaayuktha naaku
    sukhamuAO galgajaeyu soMpuga vaanichae sThoola shakthi ||naa||

    sakala kaalMbulAO jakkAOga loaAObadi
    nannuthiMthu nannu
    aakalMkunigaaAO jaeyu manuchu vaeAOduchunuMdhu
    naDhikaasakthi ||naa||

  • Naa korakuao chanipoayi నా కొఱకుఁ చనిపోయి

    నా కొఱకుఁ చనిపోయి నాఁడ ఆద యాకరుండిరు వంక దొంగలతోడ
    ||నా కొఱకు||

    ఆలకింపగను మనసార నాకు నానదే యా దయామృత సారధార
    భూలోకమునఁదనివిఁ దీర నిట్టి పుణ్యాత్ము నేమఱక
    పూజింతు మీర ||నా కొఱకు||

    కన్న తలిదండ్రులకు నైన యింత ఘన వత్సలత నేఁ గల్గుటంగాన
    విన్నదియులేదు చెవులూన స్వామి విక్రయంబై కొర్త వేదనలతోను ||నా
    కొఱకు||

    కీటకమువంటి ననుఁ బ్రోవ సొంత కీలాలమర్పించి ఖేదపడిచావ
    వాటమా తన కిటులఁ గావ నేను వర్ణింపఁ గన్నీరు వరదలైపోవ
    ||నా కొఱకు||

    ఘోరముగ నినుపమేకులను గ్రుచ్చి కొంకకానిర్దయుల్ గొల్గొతా
    మనలను మారణంబగు నవస్థలను బెట్ట మాదృశాత్మన్గావ
    మౌనమైయిలను ||నా కొఱకు||

    ఏమి బహుమతుల నర్పింతు నట్టి స్వామిమేళ్లల్ల నా స్వాంతమున
    నుంతున్ ప్రేమ భావమున వర్తింతున్ నిత్య కామితార్థం బిడు
    కర్తను భజింతున్ ||నా కొఱకు||

    చేయనిఁక పాప సంగతము నాఁడు సిలువపైఁ జచ్చిన శ్రీకరుని
    కతము పాయ కాబ్రభుసత్యవ్రతము నాధు ప్రాణాంత మౌదాఁక ప్రార్థింతు
    సతము ||నా కొఱకు||


    Naa korakuao chanipoayi naaAOda aadha
    yaakaruMdiru vMka dhoMgalathoada
    ||naa koRaku||

    aalakiMpaganu manasaara naaku naanadhae
    yaa dhayaamrutha saaraDhaara
    bhooloakamunAOdhaniviAO dheera nitti
    punyaathmu naemaRaka poojiMthu meera ||naa koRaku||

    kanna thalidhMdrulaku naina yiMtha
    ghana vathsalatha naeAO galgutMgaana
    vinnadhiyulaedhu chevuloona svaami
    vikrayMbai kortha vaedhanalathoanu ||naa
    koRaku||

    keetakamuvMti nanuAO broava soMtha
    keelaalamarpiMchi khaedhapadichaava
    vaatamaa thana kitulAO gaava naenu
    varnimpao ganneeru varadhalaipoava
    ||naa koRaku||

    ghoaramuga ninupamaekulanu gruchchi
    koMkakaanirdhayul golgothaa
    manalanu maaraNMbagu navasThalanu
    betta maadhrushaathmangaava
    maunamaiyilanu ||naa koRaku||

    aemi bahumathula narpiMthu natti
    svaamimaeLlalla naa svaaMthamuna
    nuMthun praema bhaavamuna varthiMthun
    nithya kaamithaarThM bidu
    karthanu bhajiMthun ||naa koRaku||

    chaeyaniAOka paapa sMgathamu naaAOdu
    siluvapaiAO jachchina shreekaruni
    kathamu paaya kaabrabhusathyavrathamu
    naaDhu praaNaaMtha maudhaaAOka praarThiMthu
    sathamu ||naa koRaku||

  • Naa korikalu theeripoaye నా కోరికలు తీరిపోయె

    నా కోరికలు తీరిపోయె ప్రియ యేసులో
    నా ప్రాణప్రియుని యందు అవి తీరుచున్నవి

    పెంటగ కనుపించె ఈ లోకమంతయు
    ప్రభుని చూడ నా హృదయము ఆశపడినది

    తీర్చును ఆకలిని జీవాహారంబుతో
    తృప్తిని యిచ్చినాకు తన శాంతి నొసగును

    తీర్చును నా దాహమును జీవజలంబుతో
    నీరుకట్టిన తోటవలె వృద్ధి చేయును

    బలహీనతలయందు తన బలమునిచ్చును
    కొల్లగ శక్తి నిచ్చి విజయముతో నడుపును

    నిరీక్షణను కలిగి స్వాస్థ్యమును పొందెదన్
    నను పుత్రునిగా జేసి ఆనంద మొసగెను

    వెలిగించె ప్రభువు నన్ను ఆత్మీయముగను
    విలువైన నగరమందు నన్నుచేర్చుకొనును


    Naa korikalu theeripoaye priya yaesuloa
    naa praaNapriyuni yMdhu avi theeruchunnavi

    pemtaga kanupiMche ee loakamMthayu
    prabhuni chooda naa hrudhayamu aashapadinadhi

    theerchunu aakalini jeevaahaarMbuthoa
    thrupthini yichchinaaku thana shaaMthi nosagunu

    theerchunu naa dhaahamunu jeevajalMbuthoa
    neerukattina thoatavale vrudhDhi chaeyunu

    balaheenathalayMdhu thana balamunichchunu
    kollaga shakthi nichchi vijayamuthoa nadupunu

    nireekShNanu kaligi svaasThyamunu poMdhedhan
    nanu puthrunigaa jaesi aanMdha mosagenu

    veligiMche prabhuvu nannu aathmeeyamuganu
    viluvaina nagaramMdhu nannuchaerchukonunu

  • Na kanula vembadi kanniru నా కనుల వెంబడి కన్నీరు

    నా కనుల వెంబడి కన్నీరు రానీయకా. . నా ముఖములో దుంఖమే ఉండనీయకా
    చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా
    ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2)

    అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలగా మార్చి (2)
    నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2)
    చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా

    సంతృప్తి లేని నాజీవితములో సమృద్దినిచ్చి ఘన పరచినావు (2)
    నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2)
    చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా


    Na kanula vembadi kanniru raniyaka. . Na mukamulo dumkame umdaniyaka
    Chiru navvuto nimpina yesayya chiru navvuto nimpina yesayya
    Aradhana aradhana aradhana nike (2)

    Avamanalanu asirvadamuga nimdalannitini divenalaga marchi (2)
    Nenu vese prati adugulo nive na dipamai (2)
    Chiru navvuto nimpina yesayya chiru navvuto nimpina yesayya

    Samtrupti leni najivitamulo samruddinichchi gana parachinavu(2)
    Na muriki jivitanni mutyamuga marchi (2)
    Chiru navvuto nimpina yesayya chiru navvuto nimpina yesayya

  • Nee kanna niaoka vaerae vaelpulu నీ కన్న నిఁక వేరే వేల్పులు

    నీ కన్న నిఁక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా నీ
    కరుణ యను నెనరుచేతను నీదు సత్య సువార్త ద్వార ప్రాకటంబుగ
    నన్నుఁ బిలిచిన లోక రక్షక నీకు మ్రొక్కెద ||నీ కన్న||

    నిన్నుఁ దెలియక మున్ను నన్య దైవంబుల ననుసరించిన పాపము
    లన్ని పెనగొని నాదు హృదయపుఁ గన్ను ఁ గ్రమ్మి ప్రకాశ మియ్యక
    యున్న నీ విమలాత్మ వరమున నన్ను వెలిగిఁచిన దయానిధి ||నీ కన్న||

    వదలక నేఁ జేయు తుద లేని పాపము వదలించి ననుఁ బ్రోచితి
    తుదిదినంబునఁ గలుగు బాధలుఁ దొలఁగ జేయుట నీవ యని నా
    హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక ||నీ కన్న||

    నీ వాక్యార్థము నాలో నివసింపఁ జేసి నీ సేవకునిగఁ బ్రోవవే నీవె
    సత్యము నీవె జీవము నీవె మార్గము నీవె ద్వారము నీవు గాకిం కెవరు
    లేరు కావవే నను యేసునాయక ||నీ కన్న||


    Nee kanna niAOka vaerae vaelpulu laerayyaa
    nijamugaa naa yaesuvaa nee
    karuNa yanu nenaruchaethanu needhu
    sathya suvaartha dhvaara praakatMbuga
    nannuao bilichina loaka rakShka neeku mrokkedha ||nee kanna||

    ninnuao dheliyaka munnu nanya
    dhaivMbula nanusariMchina paapamu
    lanni penagoni naadhu hrudhayapuAO
    gannu AO grammi prakaasha miyyaka
    yunna nee vimalaathma varamuna nannu
    veligiAOchina dhayaaniDhi ||nee kanna||

    vadhalaka naeAO jaeyu thudha laeni
    paapamu vadhaliMchi nanuAO broachithi
    thudhidhinMbunAO galugu baaDhaluAO
    dholAOga jaeyuta neeva yani naa
    hrudhayamMdhuna naa nireekShNa padhilaparachina
    bhaktha paalaka ||nee kanna||

    nee vaakyaarThamu naaloa nivasiMpAO
    jaesi nee saevakunigAO broavavae neeve
    sathyamu neeve jeevamu neeve maargamu
    neeve dhvaaramu neevu gaakiM kevaru
    laeru kaavavae nanu yaesunaayaka ||nee kanna||