Author: admin

  • adi thala meeda poyabadi
    అది తల మీద పోయబడి

    అది తల మీద పోయబడి
    అహరోను గడ్డము మీదుగా కారినా…
    సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
    ఎంత మేలు – ఎంత మనోహరము
    సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
    ఎంత మేలు – ఎంత మనోహరము
    అది తల మీద పోయబడి
    అహరోను గడ్డము మీదుగా కారినా…
    పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు||

    సంఘ సహవాసములో సహోదరులు
    మత్సరము ద్వేషము అసూయతో నిండి (2)
    వాక్యమును విడచి ఐక్యత లోపించి
    తొలగిపోయిరి… ప్రభు కృప నుండి
    సహవాసము పరిహాసమాయెను – (2) ||సహోదరులు||

    సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి
    స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2)
    క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి
    అపహసించిరి… సువార్త సేవను
    పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2) ||సహోదరులు||


    adi thala meeda poyabadi
    aharonu gaddamu meedugaa kaarinaa…
    sahodarulu aikyatha kaligi nivasinchuta
    entha melu – entha manoharamu
    sahodarilu aikyatha kaligi nivasinchuta
    entha melu – entha manoharamu
    adi thala meeda poyabadi
    aharonu gaddamu meedugaa kaarinaa
    parimalamu – parimala thailamu – (2) ||sahodarulu||

    sangha sahavaasamulo sahodarulu
    mathsaramu dweshamu asooyatho nindi (2)
    vaakyamunu vidachi aikyatha lopinchi
    tholagipoyiri… prabhu krupa nundi
    sahavaasamu parihaasamaayenu – (2) ||sahodarulu||

    siluva veuabadina yesu rakshana marachi
    swasthathalu deevenalu adbhuthamulu (2)
    kshayamaina vaati koraku – akshayudagu prabhunu vadili
    apahasinchiri… suvaartha sevanu
    parishuddhaathmudu parihaasamondenu – (2) ||sahodarulu||

  • ade ade aa roju
    అదే అదే ఆ రోజు

    అదే అదే ఆ రోజు
    యేసయ్య ఉగ్రత రోజు
    ఏడేండ్ల శ్రమల రోజు
    పాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే||

    సూర్యుడు నలుపయ్యే రోజు
    చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)
    భూకంపం కలిగే రోజు
    దిక్కు లేక అరచే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||

    వ్యభిచారులు ఏడ్చే రోజు
    మోసగాళ్ళు మసలే రోజు (2)
    అబద్ధికులు అరచే రోజు
    దొంగలంతా దొరికే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||

    పిల్ల జాడ తల్లికి లేక
    తల్లి జాడ పిల్లకు లేక (2)
    చేట్టుకొక్కరై పుట్టకొక్కరై
    అనాథలై అరచే రోజు
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||

    ఓ మనిషి యోచింపవా
    నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
    బలము చూసి భంగ పడకుమా
    ధనము చూసి దగా పడకుమా
    ఆ రోజు శ్రమ నుండి
    తప్పించే నాథుడు లేడు ||అదే అదే||


    Ade Ade Aa Roju
    Yesayya Ugratha Roju
    Edendla Shramala Roju
    Paapulanthaa Edche Roju ||Ade Ade||

    Suryudu Nalupayye Roju
    Chandrudu Erupayye Roju (2)
    Bhookampam Kalige Roju
    Dikku Leka Arache Roju
    Aa Roju Shrama Nundi
    Thappinche Naathudu Ledu ||Ade Ade||

    Vyabhichaarulu Edche Roju
    Mosagaallu Masale Roju (2)
    Abadhdhikulu Arache Roju
    Dongalanthaa Dorike Roju
    Aa Roju Shrama Nundi
    Thappinche Naathudu Ledu ||Ade Ade||

    Pilla Jaada Thalliki Leka
    Thalli Jaada Pillaku Leka (2)
    Chettukokkarai Puttakokkarai
    Anaathalai Arache Roju
    Aa Roju Shrama Nundi
    Thappinche Naathudu Ledu ||Ade Ade||

    O Manishi Yochimpavaa
    Nee Brathuku Elaa Unnado (2)
    Balamu Choosi Bhanga Padakumaa
    Dhanamu Choosi Dagaa Padakumaa
    Aa Roju Shrama Nundi
    Thappinche Naathudu Ledu ||Ade Ade||

  • athymtha sumdharumdunu
    అత్యంత సుందరుండును

    అత్యంత సుందరుండును
    ఎల్లరి కాంక్షణీయుడు
    దేవాది దేవుడైన మా
    కల్వరి యేసు నాథుడు

    పల్లవి: కల్వరి నాథుడా – నన్ను జయించితి
    రక్షింప మృతుడైన – కల్వరి యేసు నాథుడా

    గాయపడి శ్రమలతో
    పాపదుఃఖము మోసితివి
    సిల్వలో మరణించితివి
    దుఃఖ కల్వరి నాథుడా

    శాంతి జీవము నీయను
    ఖైదీల విమోచనమునకై
    రక్తపు ఊట తెరచితివి
    ప్రేమ కల్వరి నాథుడా

    తెచ్చిన ఈవులెల్లను
    మేలుకొరకు మనకిచ్చి
    ప్రేమనదిని పోసెను
    దయాకల్వరి నాథుడా

    మహిమ పూర్ణుడగు నిన్ను
    కండ్లార చూతుమనుటయే
    ఇచ్చట మా ఆదరణ
    సాటిలేని కల్వరి ప్రభూ

    స్పటిక సముద్ర తీరమున
    నీ ప్రేమయందు మున్గుచు
    నీ వలె నుందు నిత్యము
    మహిమ కల్వరి నాథుడా


    athyMtha suMdharuMdunu
    ellari kaaMkShNeeyudu
    dhaevaadhi dhaevudaina maa
    kalvari yaesu naaThudu

    Chorus: kalvari naaThudaa – nannu jayiMchithi
    rakShiMpa mruthudaina – kalvari yaesu naaThudaa

    gaayapadi shramalathoa
    paapadhuHkhamu moasithivi
    silvaloa maraNiMchithivi
    dhuHkha kalvari naaThudaa

    shaaMthi jeevamu neeyanu
    khaidheela vimoachanamunakai
    rakthapu oota therachithivi
    praema kalvari naaThudaa

    thechchina eevulellanu
    maelukoraku manakichchi
    praemanadhini poasenu
    dhayaakalvari naaThudaa

    mahima poorNudagu ninnu
    kMdlaara choothumanutayae
    ichchata maa aadharaN
    saatilaeni kalvari prabhoo

    spatika samudhra theeramun
    nee praemayMdhu munguchu
    nee vale nuMdhu nithyamu
    mahima kalvari naaThudaa

  • adugudi meeru mana prabhuvichun
    అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్

    అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ – తప్పక యిచ్చున్
    అడిగెడి ప్రతివాడు పొందున్

    1. భక్తులుభక్తులు విశ్వాసముతో – ప్రార్థించి పొందిరి
      వారి జీవితముల నెంచి చూచి
      మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
    2. మనలో తన శక్తికొలది – అనుగ్రహించును
      ఊహకుమించి చేయు దేవునిని
      మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
    3. మన ప్రార్థనల నాలకించి – సంతృప్తి చెందును
      తన నామమునకు మహిమ కలుగ
      మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
    4. ఇదివరకు మీరేమియు – అడుగకుంటిరి
      మీరానంద భరితులగునట్లు
      మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
    5. దేవుని కేదైనను – చేయ నసాధ్యమా
      సర్వశక్తిగల మన దేవునడిగి
      ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు

    1. adugudi meeru mana prabhuvichchun – thappaka yichchun
      adigedi prathivaadu poMdhun
    2. bhakthulubhakthulu vishvaasamuthoa – praarThiMchi poMdhiri
      vaari jeevithamula neMchi choochi
      mee maelu korakai praarThiMchi poMdhu
    3. manaloa thana shakthikoladhi – anugrahiMchunu
      oohakumiMchi chaeyu dhaevunini
      mee maelu korakai praarThiMchi poMdhu
    4. mana praarThanala naalakiMchi – sMthrupthi cheMdhunu
      thana naamamunaku mahima kalug
      mee maelu korakai praarThiMchi poMdhu
    5. idhivaraku meeraemiyu – adugakuMtiri
      meeraanMdha bharithulagunatlu
      mee maelu korakai praarThiMchi poMdhu
    6. dhaevuni kaedhainanu – chaeya nasaaDhyamaa
      sarvashakthigala mana dhaevunadigi
      prabhu mahima korakai praarThiMchi poMdhu
  • adugudi meeku ivvabadunu
    అడుగుడి మీకు ఇవ్వబడును

    అడుగుడి మీకు ఇవ్వబడును
    వెదకుడి మీకు దొరుకును (2)
    తట్టుడి మీకు తీయబడును (2)
    అని యేసుడు మీతో చెప్పుచుండగా
    అడగక వెదకక తట్టక తిరుగుచుందురా
    తిరుగుచుందురా మీరు తిరుగుచుందురా ||అడుగుడి||

    అడగమని నా యేసు మీకు చెప్పగా
    అడగక ఈ ఆగడాలు దేనికి (2)
    ఈ క్షణమే యేసయ్యను చేరుకో
    అడిగి నీ దీవెనలు పొందుకో
    పొందుకో దీవెనలు పొందుకో ||అడుగుడి||

    వెదకమని నా ప్రభువు మీకు చెప్పగా
    వెదకక ఈ వాదులాట దేనికి (2)
    వెంటనే యేసయ్యను వేడుకో
    పోగొట్టుకున్న ఫలములన్ని దొరుకును
    దొరుకును నీ ఫలములన్ని దొరుకును ||అడుగుడి||

    తట్టమని నా తండ్రి మీకు చెప్పగా
    తట్టక ఈ తడవులాట దేనికి (2)
    తక్షణమే తండ్రి తట్టు తిరుగుము
    తెరువబడిన మార్గములో సాగుము
    సాగుము మార్గములో సాగుము ||అడుగుడి||


    Adugudi Meeku Ivvabadunu
    Vedakudi Meeku Dorukunu (2)
    Thattudi Meeku Theeyabadunu (2)
    Ani Yesudu Meetho Cheppuchundagaa
    Adagaka Vedakaka Thattaka Thiruguchunduraa
    Thiruguchunduraa Meeru Thiruguchunduraa ||Adugudi||

    Adagamani Naa Yesu Meeku Cheppagaa
    Adagaka Ee Aagadaalu Deniki (2)
    Ee Kshaname Yesayyanu Cheruko
    Adigi Nee Deevenalu Ponduko
    Ponduko Deevenalu Ponduko ||Adugudi||

    Vedakamani Naa Prabhuvu Meeku Cheppagaa
    Vedakaka Ee Vaadulaata Deniki (2)
    Ventane Yesayyanu Veduko
    Pogottukunna Phalamulanni Dorukunu
    Dorukunu Nee Phalamulanni Dorukunu ||Adugudi||

    Thattamani Naa Thandri Meeku Cheppagaa
    Thattaka Ee Thadavulaata Deniki (2)
    Thakshaname Thandri Thattu Thirugumu
    Theruvabadina Maargamulo Saagumu
    Saagumu Maargamulo Saagumu ||Adugudi||

  • aduguchunnaa moa dhaeva kadu
    అడుగుచున్నా మో దేవ కడు

    అడుగుచున్నా మో దేవ కడు దయను గావఁ జెడుగుల మైన మేము
    ని న్నడుగుటకు నే బిడియ మొందము అడుగుఁడి మీ కిడియెద నంచు
    నాన తిచ్చిన వాగ్దానమునఁ గని ||యడుగు||

    1. వేడు కలరఁగఁ గూడి నిను గొని యాడి యడిగెడు నీదు భక్తులఁ గోడు
      గని దయతోడ నెప్పుడు వీడక నెరవేర్తు వని ని ||న్నడుగు||
    2. సారె సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు భారమందుఁ జేరి నిను
      మఱచితిమి గద మా క్రూరత నెడ బాపు మని ని ||న్నడుగు||
    3. దుష్టుడు మాతోడఁ బోరఁగ శ్రేష్ఠ మగు మానిష్ఠ తోడుత కష్ట మనక
      వాని గెల్వఁ బుష్టిని బుట్టించు మని ని ||న్నడుగు||
    4. తోర మగు విశ్వాస నిరీక్షణ కూరిమి విమలాత్మ వరములు వారక
      హృదయాంతరంబులఁ జేరిచి మము వెలిగించు మని ని ||న్నడుగు||
    5. మోద మొప్పఁగ నీదు వాక్యము మేదినిపై బోధపరచెడు బోధ కులపై
      శోధనంబులు పొర్లి రాకుండాదరింప ||నడుగు||
    6. దురితముల చే భరితు లయ్యెడు నరులపై నీ కరుణఁ జూపి
      గురుతరంబగు మారు పుట్టుక వరముఁ గుమ్మరించు మని ని ||న్నడుగు||
    7. రోగములచే సేగి నొందుచు జాగు సేయక నినుఁ దలఁచుచు బాగు
      గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించు మని ని ||న్నడుగు||
    8. ధరణిపైని మరణ మయ్యెడు తరుణమందో కరుణా కలితా పరమ
      పురమునందుఁజేరి వర సుఖంబు లనుభవింప ||న్నడుగు||

    aduguchunnaa moa dhaeva kadu dhayanu gaavAO jedugula maina maemu
    ni nnadugutaku nae bidiya moMdhamu aduguAOdi mee kidiyedha nMchu
    naana thichchina vaagdhaanamunAO gani ||yadugu||

    1. vaedu kalarAOgAO goodi ninu goni yaadi yadigedu needhu bhakthulAO goadu
      gani dhayathoada neppudu veedaka neravaerthu vani ni ||nnadugu||
    2. saare saareku ninnu vidichi ghoara dhurithapu bhaaramMdhuAO jaeri ninu
      maRachithimi gadha maa krooratha neda baapu mani ni ||nnadugu||
    3. dhuShtudu maathoadAO boarAOga shraeShTa magu maaniShTa thoadutha kaShta manaka
      vaani gelvAO buShtini buttiMchu mani ni ||nnadugu||
    4. thoara magu vishvaasa nireekShNa koorimi vimalaathma varamulu vaaraka
      hrudhayaaMtharMbulAO jaerichi mamu veligiMchu mani ni ||nnadugu||
    5. moadha moppAOga needhu vaakyamu maedhinipai boaDhaparachedu boaDha kulapai
      shoaDhanMbulu porli raakuMdaadhariMpa ||nadugu||
    6. dhurithamula chae bharithu layyedu narulapai nee karuNAO joopi
      gurutharMbagu maaru puttuka varamuAO gummariMchu mani ni ||nnadugu||
    7. roagamulachae saegi noMdhuchu jaagu saeyaka ninuAO dhalAOchuchu baagu
      goaruchu nunna bhakthula roagamulu vedaliMchu mani ni ||nnadugu||
    8. DharaNipaini maraNa mayyedu tharuNamMdhoa karuNaa kalithaa parama
      puramunMdhuAOjaeri vara sukhMbu lanubhaviMpa ||nnadugu||
  • adavi vrukshmulaloa
    అడవి వృక్షములలో

    అడవి వృక్షములలో – జల్ధరు వృక్షము మెట్లున్నదో
    పరిశుద్ధుల మధ్యలో – అతి శ్రేష్టుడైన నా ప్రభువు
    పొడెద నా ప్రియుని జీవకాలమెల్ల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను||2||

    1.దూషణ ఇరుకులలో – నన్ను సుగంధముగా – మార్చెను ||2||
    నీ కృపలో నన్ను నడిపి – నీ వెలుగుతో నింపితివి||పొడెద||

    2.నా కష్టతరంగములో – దు:ఖ సాగరములోనుండగా
    నీకుడి హస్తము చాపి – భయపడకని పలికితివే ||పొడెద||

    3.ఆనంద భరితుడనై – నీ ప్రేమలో నుండుటకు
    నీ సర్వము – నా కతి మధురం –
    నీ ముఖము మనోహరము|| పొడెద||

    4.నీ చిత్తము – చేయుటకు
    నన్ను నీకు సమర్పించెదన్‌
    నా పరుగును తుద ముట్టించి
    నీ సన్నిధిలో – నిలిచెదన్‌||పొడెద||


    adavi vrukShmulaloa – jalDharu vrukShmu metlunnadhoa
    parishudhDhula maDhyaloa – athi shraeShtudaina naa prabhuvu
    podedha naa priyuni jeevakaalamella araNya yaathraloa
    kruthajnYthathoa paadedhanu||2||

    1.dhooShNa irukulaloa – nannu sugMDhamugaa – maarchenu ||2||
    nee krupaloa nannu nadipi – nee veluguthoa niMpithivi||podedha||

    2.naa kaShtatharMgamuloa – dhu:kha saagaramuloanuMdagaa
    neekudi hasthamu chaapi – bhayapadakani palikithivae ||podedha||

    3.aanMdha bharithudanai – nee praemaloa nuMdutaku
    nee sarvamu – naa kathi maDhurM –
    nee mukhamu manoaharamu|| podedha||

    4.nee chiththamu – chaeyutaku
    nannu neeku samarpiMchedhan‌
    naa parugunu thudha muttiMchi
    nee sanniDhiloa – nilichedhan‌||podedha||

  • ambaraanni daate sambaraalu nedu
    అంబరాన్ని దాటే సంబరాలు నేడు

    అంబరాన్ని దాటే సంబరాలు నేడు
    నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2)
    రండయ్యో రండి రండి దావీదు పురముకు (2)
    రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని||

    దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
    ఏకైక తనయుని పంపెను ఈ దినము (2)
    పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2)
    అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో||

    దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
    శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2)
    లోకాల కారకుడు లోకమున పుట్టెను (2)
    మనిషి మరణము ఆయువు తీరెను (2) ||రండయ్యో||


    ambaraanni daate sambaraalu nedu
    ningilo chukka butti vachchindi manaku thodu (2)
    randayyo randi randi daaveedu puramuku (2)
    raaraaju putti ila pilichenu koluvuku (2) ||ambaraanni||

    devudu enthagaano preminchi lokamu
    ekaika thanayuni pampenu ee dinamu (2)
    pashuvula paakalo odigenu shishuvugaa (2)
    avatharinche nedu loka rakshakunigaa (2) ||randayyo||

    devaadi devudu manishigaa maarina vela
    shaapaalu paapaalu raddaayina shubhavela (2)
    lokaala kaarakudu lokamunu puttenu (2)
    manishi maranamu aayuvu theerenu (2) ||randayyo||

  • andhudaa raavaa aramarayaela
    అంధుడా రావా అరమరయేల

    అంధుడా రావా అరమరయేల అడుగోనయ్య! అయ్యో అడుగో యేసయ్య…

    1. నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను వెలిగింపను నరుదెంచె
      ఖ్యాతిగ సిలువలో కరములు జూచి కన్నీనరొలుకుచు నినుపిలిచె…||అ||
    2. మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి జయ
      మొందే పరమందలి తండ్రియు దూతలుగని కరములెత్తి జయధ్వనులిడిరె ||అ||
    3. ధైర్యముచెడెను సృష్టికిని ఆ దైవ మరణమును తిలకించా
      ధైర్యము చెడెను అధికారులకును దాతను చేరను గఠినంబా ||అ||
    4. లోకపు జ్ఞానము వ్యర్థమని యిక శోక మొందడి దినములని
      జాగినయేల యేసును చేరి జయమని పాడుము అభయమని ||అ||
    5. పావనయేసుని పదముల చేరుము పాపములను తొలగించు
      నిదే జీవము నిచ్చును భావము మార్చును దేవ దేవుని కరుణ యిదే ||అ||
    6. హల్లెలూయ పాటలు పాడుదము ఆనందముతో ప్రభు
      చాటుదము అలరాకడకై తలలెత్తుదము ఆ ప్రభురాగా వెళ్ళుదము ||అ||

    andhudaa raavaa aramarayaela adugoanayya! ayyoa adugoa yaesayya…

    1. neethisooryudu nirmalajyoathi ninu veligiMpanu narudheMche
      khyaathiga siluvaloa karamulu joochi kanneenarolukuchu ninupiliche ||a||
    2. maraNapushakthini maarkoniyaesu maraNamunuMdi jaya
      moMdhae paramMdhali thMdriyu dhoothalugani karamuleththi jayaDhvanulidire ||a||
    3. Dhairyamuchedenu sruShtikini aa dhaiva maraNamunu thilakiMchaa
      Dhairyamu chedenu aDhikaarulakunu dhaathanu chaeranu gaTinMbaa ||a||
    4. loakapu jnYaanamu vyarThamani yika shoaka moMdhadi dhinamulani
      jaaginayaela yaesunu chaeri jayamani paadumu abhayamani ||a||
    5. paavanayaesuni padhamula chaerumu paapamulanu tholagiMchu
      nidhae jeevamu nichchunu bhaavamu maarchunu dhaeva dhaevuni karuNa yidhae ||a||
    6. hallelooya paatalu paadudhamu aanMdhamuthoa prabhu
      chaatudhamu alaraakadakai thalaleththudhamu aa prabhuraagaa veLLudhamu ||a||
  • amdhakaaraloakamunaku velugunivva
    అంధకారలోకమునకు వెలుగునివ్వ

    అంధకారలోకమునకు – వెలుగునివ్వ ప్రభువు వచ్చెను
    స్తుతి మహిమ ప్రభునకే

    నిష్కళంక బలి నిర్దోష ప్రభువే
    అమూల్యరక్తమేగ ముక్తిమార్గము
    ఏమి యర్పించెదము దానికి బదులుగా
    స్తుతి మహిమ ప్రభునకే

    మృత్యువుపై జయమునొంది మన ప్రభువు
    ప్రార్థించుచుండె తండ్రి కుడిప్రక్కను
    ఏమి యర్పించెదము దానికి బదులుగా
    స్తుతి మహిమ ప్రభునకే

    జీవజ్యోతి రక్షకా నీవే ప్రతిఫలం
    నీవే ప్రేమ సత్యానంద ధైర్యము
    సర్వమందు నమ్మదగిన వాడవు నీవే
    స్తుతి మహిమ ప్రభునకే


    andhakaaraloakamunaku – velugunivva prabhuvu vachchenu
    sthuthi mahima prabhunakae

    niShkaLMka bali nirdhoaSh prabhuvae
    amoolyarakthamaega mukthimaargamu
    aemi yarpiMchedhamu dhaaniki badhulugaa
    sthuthi mahima prabhunakae

    mruthyuvupai jayamunoMdhi mana prabhuvu
    praarThiMchuchuMde thMdri kudiprakkanu
    aemi yarpiMchedhamu dhaaniki badhulugaa
    sthuthi mahima prabhunakae

    jeevajyoathi rakShkaa neevae prathiphalM
    neevae praema sathyaanMdha Dhairyamu
    sarvamMdhu nammadhagina vaadavu neevae
    sthuthi mahima prabhunakae