Category: Telugu Worship Songs Lyrics

  • Aascharyakarudu Aalochanakartha ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

    ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
    నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
    తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
    తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) ||ఆశ్చర్యకరుడు||

    తన చేతిలో రోగాలు లయమైపోయెను
    తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
    తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
    నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) ||ఆశ్చర్యకరుడు||

    మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
    మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
    తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
    తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) ||ఆశ్చర్యకరుడు||


    Aascharyakarudu Aalochanakartha
    Nithyudagu Thandri Samaadhaana Kartha (2)
    Thanavanti Goppa Devudu Evarunnaarilalo
    Thana Saatainaa Dheetainaa Devudu Ledilalo (2) ||Aascharyakarudu||

    Thana Chethilo Rogaalu Layamaipoyenu
    Thana Chooputho Dayyaalu Vilvilalaadenu (2)
    Thana Maatatho Prakruthine Shaasinchinavaadu (2)
    Neetipai Teevigaa Nadachinavaadathadu (2) ||Aascharyakarudu||

    Manakosam Thana Praanaanne Bali Ichchinavaadathadu
    Manakosam Sajeevudai Lechinavaadathadu (2)
    Thana Shaanthine Panchipettina Shaanthamoorthy Yesu (2)
    Thana Sarvaanne Dhaarabosinaa Thyaagasheeli Kreesthu (2) ||Aascharyakarudu||

  • Aascharyakarudaa Sthothram ఆశ్చర్యకరుడా స్తోత్రం

    ఆశ్చర్యకరుడా స్తోత్రం
    ఆలోచన కర్తా స్తోత్రం (2)
    బలమైన దేవా నిత్యుడగు తండ్రి
    సమాధాన అధిపతి స్తోత్రం (2)
    ఆహాహా.. హల్లెలూయా (7)
    ఆహా ఆమెన్

    కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
    కృపతో రక్షించితివి స్తోత్రం (2)
    నీ రక్తమిచ్చి విమోచించినావే
    నా రక్షణ కర్తా స్తోత్రం (2)
    ఆహాహా.. హల్లెలూయా (7)
    ఆహా ఆమెన్


    Aascharyakarudaa Sthothram
    Aalochana Karthaa Sthothram (2)
    Balamaina Devaa Nithyudavagu Thandri
    Samaadhaana Adhipathi Sthothram (2)
    Aahaahaa.. Hallelooyaa (7)
    Aahaa Aamen

    Krupaa Sathya Sampoornudaa Sthothram
    Krupatho Rakshinchithivi Sthothram (2)
    Nee Rakthamichchi VimochiAnchinaave
    Naa Rakshana Karthaa Sthothram (2)
    Aahaahaa.. Hallelooyaa (7)
    Aahaa Aamen

  • Aascharyakarudaa (Yesanna) ఆశ్చర్యాకరుడా

    ఆశ్చర్యాకరుడా
    నా ఆలోచన కర్తవు (2)
    నిత్యుడగు తండ్రివి
    నా షాలేము రాజువు (2)

    సింహపు పిల్లలైనా
    కొదువ కలిగి ఆకలిగొనినా (2)
    నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా
    నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||

    విత్తని పక్షులను
    నిత్యము పోషించుచున్నావు (2)
    నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా
    నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||

    చీకటి తొలగే
    నీతి సూర్యుడు నాలో ఉదయించె (2)
    నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను
    నీవున్నంతవరకు (2) ||ఆశ్చర్యాకరుడా||


    Aascharyakarudaa
    Naa Aalochanakarthavu (2)
    Nithyudagu Thandrivi
    Naa Shaalemu Raajuvu (2)

    Simhapu Pillalainaa
    Koduva Kaligi Aakaligoninaa (2)
    Nee Pillalu – Aakalitho Alamatinthuraa
    Neevunnantha Varaku (2) ||Aascharyakarudaa||

    Vitthani Pakshulanu
    Nithyamu Poshinchuchunnaavu (2)
    Nee Pillalu – Vaatikante Shreshtule Kadaa
    Neevunnantha Varaku (2) ||Aascharyakarudaa||

    Cheekati Tholage
    Neethi Sooryudu Naalo Udayinche (2)
    Ne Saakshigaa – Velugumayamai Thejarilledanu
    Neevunnantha Varaku (2) ||Aascharyakarudaa||

  • Aascharyakarudaa Aalochanakartha ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త

    ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
    బలవంతుడైన దేవుడా
    నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి
    మనకై జన్మించెను (2)
    వి విష్ యు హ్యాపీ క్రిస్మస్
    మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
    హోసన్నా హల్లలూయా
    క్రిస్మస్ బాలునికే (2) ||ఆశ్చర్యకరుడా||

    ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై
    స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్
    అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై
    ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్

    ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు
    దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2)
    దొంగలను మార్చి దయచూపినావు (2)
    ధవళ వస్త్రములు ధరింప చేసి
    ధన్యుని చేసావు ||వి విష్||

    నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు
    నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు (2)
    నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2)
    నీతో నిరతం జీవించుటకు
    నిత్య జీవమియ్య అరుదెంచినావు ||వి విష్||


    Aascharyakarudaa Aalochanakartha
    Balavanthudaina Devudaa
    Nithyudagu Thandri – Samaadhaana Adhipathi
    Manakai Janminchenu (2)
    We wish you Happy Christmas
    Merry Merry Christmas (2)
    Hosannaa Hallelujah
    Christmas Baalunike (2) ||Aascharyakarudaa||

    Angels we have heard on High
    Singing Sweetly over the Plains
    And the Mountains in reply
    Echoing their joyous strains

    Dharapai Enno – Aascharyakaaryamulu Cheyutaku
    Daridrula Dari Cheri – Dhanavanthulugaa Cheyutaku (2)
    Dongalanu Maarchi Dayachoopinaavu (2)
    Davala Vasthramulu Dharimpa Chesi
    Dhanyuni Chesaavu ||We wish||

    Nithyudagu Thandrigaa – Nireekshananu Ichchutaku
    Neethi Nyaayamulu Nerpi – Nannu Neevu Nadipinchutaku (2)
    Nee Nithya Maargamulo Shaanthinichchaavu (2)
    Neetho Niratham Jeevinchutaku
    Nithya Jeevamiyya Arudenchinaavu ||We wish||

  • Aascharya Kaaryamul Cheyunu Yesu ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు

    ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు (2)
    అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము
    నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2) ||ఆశ్చర్య||

    రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా
    యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను
    జాలరుల మదిలో ఆనందమే
    యేసుతో పనిలో ఆశ్చర్యమే (2)
    హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||

    కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం
    యేసు మాట నిలుచును తరతరాలు
    తండ్రిలా పోషించి దీవించును
    తల్లిలా ఆదరించి ప్రేమించును (2)
    హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||


    Aascharya Kaaryamul Cheyunu Yesu (2)
    Adbhuthamulatho Ninnu Nadupunu – Praarthinchumaa Nithyamu
    Nee Maargamu Nee Bhaaramu Samarpinchumaa Prabhuku (2) ||Aascharya||

    Raathranthaa Vala Vesinaa Phalithamemi Raaledugaa
    Yesayyaa Chinna Maata Cheppaga Valalu Nindenu
    Jaalarula Madilo Aanandame
    Yesutho Panilo Aascharyame (2)
    Hosannaa Jayamu Neeke – Raajuvu Neevegaa (2) ||Aascharya||

    Kanulatho Choosevi Undalevu Chirakaalam
    Yesu Maata Niluchunu Tharatharaalu
    Thandrilaa Poshinchi Deevinchunu
    Thallilaa Aadarinchi Preminchunu (2)
    Hosannaa Jayamu Neeke – Raajuvu Neevegaa (2) ||Aascharya||

  • Aashapadaku Ee Lokam Kosam ఆశపడకు ఈ లోకం కోసం

    ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా
    ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా
    మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా ||ఆశపడకు||

    ఆశలు రేపే సుందర దేహం – మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మా
    దేహం కోరేదేదైనా – అది మట్టిలోనే పుట్టిందమ్మా (2)
    వెండి బంగారు వెలగల వస్త్రం
    పరిమళ పుష్ప సుగంధములు (2)
    మట్టిలోనుండి వచ్చినవేనని
    మరువబోకు నా చెల్లెమ్మా (2) ||ఆశపడకు||

    అందమైన ఓ సుందర స్త్రీకి – గుణములేక ఫలమేమమ్మా
    పంది ముక్కున బంగారు కమ్మీ – పెట్టిన ఫలితం లేదమ్మా (2)
    అందమైన ఆ దీనా షెకెములు
    హద్దులేక ఏమయ్యిందమ్మా (2)
    అంతరంగమున గుణముకలిగిన
    శారా చరిత్రకెక్కిందమ్మా (2) ||ఆశపడకు||

    జాతి కొరకు ఉపవాస దీక్షతో – పోరాడిన ఎస్తేరు రాణిలా
    నీతి కొరకు తన అత్తను విడువక – హత్తుకున్న రూతమ్మ ప్రేమలా (2)
    కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి
    తన కురులతో తుడిచిన మగ్దలీనలా (2)
    హన్నా వలె మన దోర్కా వలె
    ప్రిస్కిల్ల వోలె విశ్వాస వనితలా (2)
    వారి దీక్షయే వారసత్వమై
    అనంత రాజ్యపు నిత్య స్వాస్థ్యమై (2)
    పవిత్రమైన హృదయము కలిగి
    ప్రభువు కొరకు జీవించాలమ్మా (2) ||ఆశపడకు||


    Aashapadaku Ee Lokam Kosam Chellemmaa
    Aashinchedi Edainaa Adi Mattenammaa
    Manishi Aashinchedi Edainaa Adi Mattenammaa ||Aashapadaku||

    Aashalu Repe Sundara Deham – Matti Bomma O Chellemmaa
    Deham Korededainaa – Adi Mattilone Puttindammaa (2)
    Vendi Bangaaru Velagala Vasthram
    Parimala Pushpa Sugandhamulu (2)
    Mattilonundi Vachchinavenani
    Maruvaboku Naa Chellemmaa (2) ||Aashapadaku||

    Andamaina O Sundara Sthreeki – Gunamuleka Phalamemammaa
    Pandi Mukkuna Bangaru Kammee – Pettina Phalitham Ledammaa (2)
    Andamaina Aa Deena Shekemulu
    Hadduleka Emayyindammaa (2)
    Antharangamuna Gunamukaligina
    Shaaraa Charithrakekkindammaa (2) ||Aashapadaku||

    Jaathi Koraku Upavaasa Deekshatho
    Poraadina Estheru Raanilaa
    Neethi Koraku Thana Atthanu Viduvaka
    Hatthukunna Roothamma Premalaa (2)
    Kanneellatho Prabhu Kaallu Kadigi
    Thana Kurulatho Thudichina Magdaleenalaa (2)
    Hannaa Vale Mana Dorkaa Vale
    Priskilla Vole Vishwaasa Vanithalaa (2)
    Vaari Deekshaye Vaarasathvamai
    Anantha Raajyapu Nithya Swaasthyamai (2)
    Pavithramaina Hrudayamu Kaligi
    Prabhuvu Koraku Jeevinchaalammaa (2) ||Aashapadaku||

  • Aashatho Nee Koraku ఆశతో నీ కొరకు

    ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .
    నూతన బలముతో నను నింపినావు (2)
    బలహీనులను బలపరచువాడా
    కృంగిన వారిని లేవనెత్తువాడా (2)
    యేసయ్యా నా ఆశ్రయమా
    యేసయ్యా నీకే ఆరాధన (2) ||ఆశతో||

    సొమ్మసిల్లక అడుగులు తడబడక
    నడిచెద నీ వెంట జీవితమంతా (2)
    లోకము నన్ను ఆకర్షించినా
    వెనుదిరుగక నేను సాగెద నీ వెంట (2) ||యేసయ్యా||

    అలయక నేను పరుగెత్తెదను
    అంతము వరకు ఆత్మల రక్షణకై (2)
    సిద్ధము చేసిన బహుమానముకై
    గురియొద్దకే నేను సాగెదనయ్యా (2) ||యేసయ్యా||

    రెక్కలు చాపి పక్షి రాజువలెనే
    పైకెగెరెద నీ పరిశుద్ధులతో (2)
    పరవశించెదను నీ ముఖమును చూచి
    ప్రణమిల్లెద నీ పాదముల చెంత (2) ||యేసయ్యా||


    Aashatho Nee Koraku Eduru Choochuchundagaa
    Noothana Balamutho Nanu Nimpinaavu (2)
    Balaheenulanu Balaparachuvaadaa
    Krungina Vaarini Levaneththuvaadaa (2)
    Yesayyaa Naa Aashrayamaa
    Yesayyaa Neeke Aaraadhana (2) ||Aashatho||

    Sommasillaka Adugulu Thadabadaka
    Nadicheda Nee Venta Jeevithamanthaa (2)
    Lokamu Nannu Aakarschinchinaa
    Venudirugaka Nenu Saageda Nee Venta (2) ||Yesayyaa||

    Alayaka Nenu Parugeththedanu
    Anthamu Varaku Aathmala Rakshanakai (2)
    Siddhdhamu Chesina Bahumaanamukai
    Guriyoddake Nenu Saagedanayyaa (2) ||Yesayyaa||

    Rekkalu Chaapi Pakshi Raaju Valene
    Paikegereda Nee Parishuddhulatho (2)
    Paravashinchedanu Nee Mukhamunu Choochi
    Pranamilleda Nee Paadamula Chentha (2) ||Yesayyaa||

  • Aalayamlo Praveshinchandi ఆలయంలో ప్రవేశించండి

    ఆలయంలో ప్రవేశించండి అందరు
    స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
    మీ బ్రతుకులో పాపమా కలతలా
    మీ హృదయంలో బాధలా కన్నీరా
    మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం ||ఆలయంలో||

    దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
    వెదికే వారికంతా కనబడు దీపము
    యేసు రాజు మాటలే వినుట ధన్యము
    వినుట వలన విశ్వాసం అధికమధికమై
    ఆత్మలో దాహము తీరెను రారండి
    ఆనందమానందం హల్లెలూయా ||ఆలయంలో||

    ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
    జీవ వృక్షంబుగా ఫలియించాలని
    పెదవితో పలికెదం మంచి మాటలే
    హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
    నింపెదం నిండెదం కోరెదం పొందెదం
    ఆనందమానందం హల్లెలూయా ||ఆలయంలో||


    Aalayamlo Praveshinchandi Andaru
    Swaagatham Suswaagatham Yesu Naamamlo
    Mee Brathukulo Paapamaa Kalathalaa
    Mee Hrudayamlo Baadhalaa Kanneeraa
    Mee Kanneeranthaa Thudichi Veyu Raaju Yesu Kosam ||Aalayamlo||

    Deeksha Swabhaavamtho Dhyaana Swabhaavamai
    Vedike Vaarikanthaa Kanabadu Deepamu
    Yesu Raaju Maatale Vinuta Dhanyamu
    Vinuta Valana Vishwaasam Adhikamadhikamai
    Aathmalo Daahamu Theerenu Raarandi
    Aanandamaanandam Hallelooyaa ||Aalayamlo||

    Prabhu Yesu Maatale Pedavilo Maatalai
    Jeeva Vrukshambugaa Phaliyinchaalani
    Pedavitho Palikedam Manchi Maatale
    Hrudayamanthaa Yesu Prabhuni Prema Maatalai
    Nimpedam Nindedam Koredam Pondedam
    Aanandamaanandam Hallelooyaa ||Aalayamlo||

  • Aasha Theera Naa Yesu Swaamini
    ఆశ తీర నా యేసు స్వామిని

    ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను
    ఆత్మతో సత్యముతో స్తుతించెదను
    ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము
    ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ||

    దుప్పి నీటికై ఆశపడునట్లుగా
    దేవుని కొరకై ఆశ పడుచున్నాను
    దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)
    దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత||

    లోక ఆశలు లయమైపోవును
    లోకులెవ్వరు కాపాడలేరు
    లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)
    లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత||


    Aasha Theera Naa Yesu Swaamini Kolichedanu
    Aathmatho Sathyamutho Sthuthinchedanu
    Entha Dhanyamu Yesuni Vedakuta Entha Dhanyamu
    Entha Bhaagyamu Yesuni Nammuta Entha Bhaagyamu ||Aasha||

    Duppi Neetikai Aashapadunatlugaa
    Devuni Korakai Aasha Paduchunnaanu
    Devuni Sannidhini Nithyamundunatlugaa (2)
    Dina Dinamaashatho Kanipettuchunnaanu ||Entha||

    Loka Aashalu Layamaipovunu
    Lokulevvaru Kaapaadaleru
    Lopaalu Saricheyu Prabhuve Aadhaaram (2)
    Lobadu Vaarini Paramuna Cherchunu ||Entha||

  • Aao Khushi Se ఆవో ఖుషీ సే

    ఆవో ఖుషీ సే హమ్ సబ్ గాయే – ఏక్ మధుర్థం గీత్
    ప్రభు యేషు నే జనమ్ లియా – ఝుమ్ ఉఠా సంగీత్
    ధర్తీ గాయే అంబర్ గాయే – ప్రభు ఈషూ కే గీత్
    పాప్ మిఠానే ప్రేమ్ బడానే – ఆయా మన్ కా మీట్
    హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా
    స స ని ద ప – గ ప ద ని గ ప ద (2)
    గ ప గ స ని ని స
    స గ ప ని స స – స గ ప ని స స
    స గ ప ని స స స స స స

    శాంతి కా ఏక్ తారా ఆయా
    శుభ్ సందేశ ఉస్ నే లాయా
    బేతలెహెమ్ కీ పునీత్ ఘర్ పర్
    ఈషూ ఆయా ఈషూ ఆయా
    మా మరియా కే గోద్ మే సారే
    విశ్వ కా పాలన్ హారా ఆయా
    దేఖ్ గడరియే…
    దేఖ్ గడరియే నాచ్ ఉఁటే సబ్ – ఈషూ ఆయా ఈషూ ఆయా
    ఈషూ ఆయా ఈషూ ఆయా – (2)
    స్వర్గ్ సే ఉత్ రా గోశాలే మే – విశ్వ హువా సుర్బీత్
    ప్రభు ఈషూ కే రూప్ మే జన్మ – జీవన్ కా సంగీత్

    ధర్తీ గాయే అంబర్ గాయే – ప్రభు యేషు కే గీత్
    పాప్ మిఠానే ప్రేమ్ బడానే – ఆయా మన్ కా మీట్
    హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా
    స స ని ద ప – గ ప ద ని గ ప ద (2)
    గ ప గ స ని ని స
    స గ ప ని స స – స గ ప ని స స
    స గ ప ని స స స స స స

    జబ్ జబ్ విశ్వ మే ఝులుమ్ బడా థా
    తబ్ తబ్ ఈషూ నే జనమ్ లియా హై
    దుఖియో కా హర్ దుఖ్ హర్నే కో
    ఈషూ ఆయా ఈషూ ఆయా
    సత్య అహింస ఔర్ ధరమ్ హిత్
    ప్రాణో కా బలిదాన్ కియా హై
    మానవతా కా…
    మానవతా కా జ్యోతి జలాకర్ – హమ్ కో యే వర్దాన్ దియా
    హమ్ కో యే వర్దాన్ దియా – (2)
    దానవతా కో చోడో అబ్ తో – కర్లో సబ్ సే ప్రీత్
    ప్రభు ఈషూ కే రాహే పే చల్ కే – బన్ జావో జగ్జీత్

    ధర్తీ గాయే అంబర్ గాయే – ప్రభు ఈషూ కే గీత్
    పాప్ మిఠానే ప్రేమ్ బడానే – ఆయా మన్ కా మీట్
    హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా
    స స ని ద ప – గ ప ద ని గ ప ద (2)
    గ ప గ స ని ని స
    స గ ప ని స స – స గ ప ని స స
    స గ ప ని స స స స స స


    Aao Khushi Se Hum Sab Gaaye – Ek Madhurtham Geeth
    Prabhu Yeshu Ne Janam Liyaa – Jhum Utaa Sangeeth
    Dharthi Gaaye Ambar Gaaye – Prabhu Yeshu Ke Geeth
    Paap Mitaane Prem Badaane – Aayaa Man Kaa Meet
    Haallelujah Haallelujah Haallelujah Haallelujah
    Sa Sa Ni Da Pa – Ga Pa Da Ni Ga Pa Da (2)
    Ga Pa Ga Sa Ni Ni Sa
    Sa Ga Pa Ni Sa Sa – Sa Ga Pa Ni Sa Sa
    Sa Ga Pa Ni Sa Sa Sa Sa Sa Sa

    Shaanthi Ka Ek Thaara Aayaa
    Shubh Sandesha Usne Laayaa
    Bethalehem Ki Puneeth Ghar Par
    Yeshu Aayaa Yeshu Aayaa
    Maa Mariyaa Ke Godh Me Saare
    Vishwa Kaa Paalan Haaraa Aayaa
    Dekh Gadariye…
    Dekh Gadariye Naach Ute Sab – Yeshu Aayaa Yeshu Aayaa
    Yeshu Aayaa Yeshu Aayaa – (2)
    Swarg Se Uthraa Goshaale Me – Vishwa Huaa Surbeeth
    Prabhu Yeshu Ke Roop Me Janma – Jeevan Kaa Sangeeth

    Dharthi Gaaye Ambar Gaaye – Prabhu Yeshu Ke Geeth
    Paap Mitaane Prem Badaane – Aayaa Man Kaa Meet
    Haallelujah Haallelujah Haallelujah Haallelujah
    Sa Sa Ni Da Pa – Ga Pa Da Ni Ga Pa Da (2)
    Ga Pa Ga Sa Ni Ni Sa
    Sa Ga Pa Ni Sa Sa – Sa Ga Pa Ni Sa Sa
    Sa Ga Pa Ni Sa Sa Sa Sa Sa Sa

    Jab Jab Vishwa Me Jhulum Badaa Thaa
    Thab Thab Yeshu Ne Janam Liyaa Hai
    Dukhiyo Kaa Har Dukh Harne Ko
    Yeshu Aaayaa Yeshu Aayaa
    Sathya Ahimsa Aur Dharam Hith
    Praano Kaa Balidaan Kiyaa Hai
    Manavathaa Ka…
    Maanavathaa Ka Jyothi Jalaakar – Hum Ko Ye Vardaan Diyaa
    Hum Ko Ye Vardaan Diyaa – (2)
    Daanavathaa Ko Chodo Ab Tho – Karlo Sab Se Preeth
    Prabhu Yeshu Ke Raahe Pe Chal Ke – Ban Jaao Jagjeeth

    Dharthi Gaaye Ambar Gaaye – Prabhu Yeshu Ke Geeth
    Paap Mitaane Prem Badaane – Aayaa Man Kaa Meet
    Haallelujah Haallelujah Haallelujah Haallelujah
    Sa Sa Ni Da Pa – Ga Pa Da Ni Ga Pa Da (2)
    Ga Pa Ga Sa Ni Ni Sa
    Sa Ga Pa Ni Sa Sa – Sa Ga Pa Ni Sa Sa
    Sa Ga Pa Ni Sa Sa Sa Sa Sa Sa