Category: Telugu Worship Songs Lyrics

  • Naa korakuao chanipoayi నా కొఱకుఁ చనిపోయి

    నా కొఱకుఁ చనిపోయి నాఁడ ఆద యాకరుండిరు వంక దొంగలతోడ
    ||నా కొఱకు||

    ఆలకింపగను మనసార నాకు నానదే యా దయామృత సారధార
    భూలోకమునఁదనివిఁ దీర నిట్టి పుణ్యాత్ము నేమఱక
    పూజింతు మీర ||నా కొఱకు||

    కన్న తలిదండ్రులకు నైన యింత ఘన వత్సలత నేఁ గల్గుటంగాన
    విన్నదియులేదు చెవులూన స్వామి విక్రయంబై కొర్త వేదనలతోను ||నా
    కొఱకు||

    కీటకమువంటి ననుఁ బ్రోవ సొంత కీలాలమర్పించి ఖేదపడిచావ
    వాటమా తన కిటులఁ గావ నేను వర్ణింపఁ గన్నీరు వరదలైపోవ
    ||నా కొఱకు||

    ఘోరముగ నినుపమేకులను గ్రుచ్చి కొంకకానిర్దయుల్ గొల్గొతా
    మనలను మారణంబగు నవస్థలను బెట్ట మాదృశాత్మన్గావ
    మౌనమైయిలను ||నా కొఱకు||

    ఏమి బహుమతుల నర్పింతు నట్టి స్వామిమేళ్లల్ల నా స్వాంతమున
    నుంతున్ ప్రేమ భావమున వర్తింతున్ నిత్య కామితార్థం బిడు
    కర్తను భజింతున్ ||నా కొఱకు||

    చేయనిఁక పాప సంగతము నాఁడు సిలువపైఁ జచ్చిన శ్రీకరుని
    కతము పాయ కాబ్రభుసత్యవ్రతము నాధు ప్రాణాంత మౌదాఁక ప్రార్థింతు
    సతము ||నా కొఱకు||


    Naa korakuao chanipoayi naaAOda aadha
    yaakaruMdiru vMka dhoMgalathoada
    ||naa koRaku||

    aalakiMpaganu manasaara naaku naanadhae
    yaa dhayaamrutha saaraDhaara
    bhooloakamunAOdhaniviAO dheera nitti
    punyaathmu naemaRaka poojiMthu meera ||naa koRaku||

    kanna thalidhMdrulaku naina yiMtha
    ghana vathsalatha naeAO galgutMgaana
    vinnadhiyulaedhu chevuloona svaami
    vikrayMbai kortha vaedhanalathoanu ||naa
    koRaku||

    keetakamuvMti nanuAO broava soMtha
    keelaalamarpiMchi khaedhapadichaava
    vaatamaa thana kitulAO gaava naenu
    varnimpao ganneeru varadhalaipoava
    ||naa koRaku||

    ghoaramuga ninupamaekulanu gruchchi
    koMkakaanirdhayul golgothaa
    manalanu maaraNMbagu navasThalanu
    betta maadhrushaathmangaava
    maunamaiyilanu ||naa koRaku||

    aemi bahumathula narpiMthu natti
    svaamimaeLlalla naa svaaMthamuna
    nuMthun praema bhaavamuna varthiMthun
    nithya kaamithaarThM bidu
    karthanu bhajiMthun ||naa koRaku||

    chaeyaniAOka paapa sMgathamu naaAOdu
    siluvapaiAO jachchina shreekaruni
    kathamu paaya kaabrabhusathyavrathamu
    naaDhu praaNaaMtha maudhaaAOka praarThiMthu
    sathamu ||naa koRaku||

  • Naa korikalu theeripoaye నా కోరికలు తీరిపోయె

    నా కోరికలు తీరిపోయె ప్రియ యేసులో
    నా ప్రాణప్రియుని యందు అవి తీరుచున్నవి

    పెంటగ కనుపించె ఈ లోకమంతయు
    ప్రభుని చూడ నా హృదయము ఆశపడినది

    తీర్చును ఆకలిని జీవాహారంబుతో
    తృప్తిని యిచ్చినాకు తన శాంతి నొసగును

    తీర్చును నా దాహమును జీవజలంబుతో
    నీరుకట్టిన తోటవలె వృద్ధి చేయును

    బలహీనతలయందు తన బలమునిచ్చును
    కొల్లగ శక్తి నిచ్చి విజయముతో నడుపును

    నిరీక్షణను కలిగి స్వాస్థ్యమును పొందెదన్
    నను పుత్రునిగా జేసి ఆనంద మొసగెను

    వెలిగించె ప్రభువు నన్ను ఆత్మీయముగను
    విలువైన నగరమందు నన్నుచేర్చుకొనును


    Naa korikalu theeripoaye priya yaesuloa
    naa praaNapriyuni yMdhu avi theeruchunnavi

    pemtaga kanupiMche ee loakamMthayu
    prabhuni chooda naa hrudhayamu aashapadinadhi

    theerchunu aakalini jeevaahaarMbuthoa
    thrupthini yichchinaaku thana shaaMthi nosagunu

    theerchunu naa dhaahamunu jeevajalMbuthoa
    neerukattina thoatavale vrudhDhi chaeyunu

    balaheenathalayMdhu thana balamunichchunu
    kollaga shakthi nichchi vijayamuthoa nadupunu

    nireekShNanu kaligi svaasThyamunu poMdhedhan
    nanu puthrunigaa jaesi aanMdha mosagenu

    veligiMche prabhuvu nannu aathmeeyamuganu
    viluvaina nagaramMdhu nannuchaerchukonunu

  • Na kanula vembadi kanniru నా కనుల వెంబడి కన్నీరు

    నా కనుల వెంబడి కన్నీరు రానీయకా. . నా ముఖములో దుంఖమే ఉండనీయకా
    చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా
    ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2)

    అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలగా మార్చి (2)
    నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2)
    చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా

    సంతృప్తి లేని నాజీవితములో సమృద్దినిచ్చి ఘన పరచినావు (2)
    నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2)
    చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా


    Na kanula vembadi kanniru raniyaka. . Na mukamulo dumkame umdaniyaka
    Chiru navvuto nimpina yesayya chiru navvuto nimpina yesayya
    Aradhana aradhana aradhana nike (2)

    Avamanalanu asirvadamuga nimdalannitini divenalaga marchi (2)
    Nenu vese prati adugulo nive na dipamai (2)
    Chiru navvuto nimpina yesayya chiru navvuto nimpina yesayya

    Samtrupti leni najivitamulo samruddinichchi gana parachinavu(2)
    Na muriki jivitanni mutyamuga marchi (2)
    Chiru navvuto nimpina yesayya chiru navvuto nimpina yesayya

  • Nee kanna niaoka vaerae vaelpulu నీ కన్న నిఁక వేరే వేల్పులు

    నీ కన్న నిఁక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా నీ
    కరుణ యను నెనరుచేతను నీదు సత్య సువార్త ద్వార ప్రాకటంబుగ
    నన్నుఁ బిలిచిన లోక రక్షక నీకు మ్రొక్కెద ||నీ కన్న||

    నిన్నుఁ దెలియక మున్ను నన్య దైవంబుల ననుసరించిన పాపము
    లన్ని పెనగొని నాదు హృదయపుఁ గన్ను ఁ గ్రమ్మి ప్రకాశ మియ్యక
    యున్న నీ విమలాత్మ వరమున నన్ను వెలిగిఁచిన దయానిధి ||నీ కన్న||

    వదలక నేఁ జేయు తుద లేని పాపము వదలించి ననుఁ బ్రోచితి
    తుదిదినంబునఁ గలుగు బాధలుఁ దొలఁగ జేయుట నీవ యని నా
    హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక ||నీ కన్న||

    నీ వాక్యార్థము నాలో నివసింపఁ జేసి నీ సేవకునిగఁ బ్రోవవే నీవె
    సత్యము నీవె జీవము నీవె మార్గము నీవె ద్వారము నీవు గాకిం కెవరు
    లేరు కావవే నను యేసునాయక ||నీ కన్న||


    Nee kanna niAOka vaerae vaelpulu laerayyaa
    nijamugaa naa yaesuvaa nee
    karuNa yanu nenaruchaethanu needhu
    sathya suvaartha dhvaara praakatMbuga
    nannuao bilichina loaka rakShka neeku mrokkedha ||nee kanna||

    ninnuao dheliyaka munnu nanya
    dhaivMbula nanusariMchina paapamu
    lanni penagoni naadhu hrudhayapuAO
    gannu AO grammi prakaasha miyyaka
    yunna nee vimalaathma varamuna nannu
    veligiAOchina dhayaaniDhi ||nee kanna||

    vadhalaka naeAO jaeyu thudha laeni
    paapamu vadhaliMchi nanuAO broachithi
    thudhidhinMbunAO galugu baaDhaluAO
    dholAOga jaeyuta neeva yani naa
    hrudhayamMdhuna naa nireekShNa padhilaparachina
    bhaktha paalaka ||nee kanna||

    nee vaakyaarThamu naaloa nivasiMpAO
    jaesi nee saevakunigAO broavavae neeve
    sathyamu neeve jeevamu neeve maargamu
    neeve dhvaaramu neevu gaakiM kevaru
    laeru kaavavae nanu yaesunaayaka ||nee kanna||

  • Naa kimtha proathsaahaa నా కింత ప్రోత్సాహా

    నా కింత ప్రోత్సాహా నందంబుల్ గల్గుట కే కర్త ఘనమైన హేతువై
    యుండు నాకు గల యున్నత కతమ్మే నాధుఁ డగును నేను మురియు
    శ్రీకరంబగు నామ మేది సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

    ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది యెవరు నా కంఠంబు నెత్తెన్
    పాటలతో ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును
    చివరకున్ స్నేహంబు కలిపిరి సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

    నేను నా విధు లెల్ల నిశ్చయంబుగ నెఱుఁగ జ్ఞాన మిచ్చుచునుండు
    జ్ఞాని యెవ్వారు వాని యెడల నను యధార్థ పరునిగాఁ గావించి యవినా
    చే నెరవేర్పించు నెవరు సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

    ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి యెవరు నా శోకంబు నెగురఁ
    గొట్టిరి ఎవరు నా హృదయంపు మూర్ఛను నీడ్చి సేదను దీర్చి మనసు
    చివుకు మను గాయంబు మాన్పిరి సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

    మరణంలో నాకుఁ జిర జీవ మెవ్వారు మరణంబునకె గొప్ప మరణ
    మెవ్వారు విరివిలేని మహిమ సేలు దరిని నుండఁగ నన్నుఁ జెంతను
    స్థిరముగ స్థాపించు నెవరు సిల్వఁబడ్డ యేసు క్రీస్తే ||నా కింత||

    నన్ను రక్షింప మరణం బొందియు సమాధి నెన్నటికిని గెల్చి యున్న
    ప్రభునందు నున్న విశ్వాంసబె నాకు నుత్సవంబును గలుగ జేయును
    చెన్నగు నా ప్రభు విఁ కెవ్వరు సిల్వఁ బడ్డ యేసు క్రీస్తే ||నా కింత||


    Naa kimtha proathsaahaa nMdhMbul galguta
    kae kartha ghanamaina haethuvai
    yuMdu naaku gala yunnatha kathammae
    naaDhuAO dagunu naenu muriyu
    shreekarMbagu naama maedhi silvAObadda
    yaesu kreesthae ||naa kiMtha||

    evaru naa bhakthiki hithamainatti
    punaadhi yevaru naa kMTMbu neththen
    paatalathoa evaru naa paapamula bhaaramu
    neththukoni dhaevuniki naakunu
    chivarakun snaehMbu kalipiri silvAObadda
    yaesu kreesthae ||naa kiMtha||

    naenu naa viDhu lella nishchayMbuga
    neRuAOga jnYaana michchuchunuMdu
    jnYaani yevvaaru vaani yedala nanu yadhaartha
    parunigaaAO gaaviMchi yavinaa
    chae neravaerpiMchu nevaru silvAObadda
    yaesu kreesthae ||naa kiMtha||

    evaru naa shathruvu nedhiriMchi gelchiri
    yevaru naa shoakMbu negurAO
    gottiri evaru naa hrudhayMpu moorChanu
    needchi saedhanu dheerchi manasu
    chivuku manu gaayMbu maanpiri silvAObadda
    yaesu kreesthae ||naa kiMtha||

    maraNMloa naakuAO jira jeeva mevvaaru
    maraNMbunake goppa maraNa
    mevvaaru virivilaeni mahima saelu dharini
    nuMdAOga nannuAO jeMthanu
    sthiramuga sThaapiMchu nevaru silvAObadda
    yaesu kreesthae ||naa kiMtha||

    nannu rakShiMpa maraNM boMdhiyu samaaDhi
    nennatikini gelchi yunna
    prabhunMdhu nunna vishvaaMsabe naaku
    nuthsavMbunu galuga jaeyunu
    chennagu naa prabhu viAO kevvaru silvao
    badda yaesu kreesthae ||naa kiMtha||

  • Na kentho anamdam నా కెంతో ఆనందం

    నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
    నీలో నేనుండుటే అదే నా ధన్యతయే

    ఏ అపాయము నను సమీపించక
    ఏ రోగమైనను నా దరికి చేరక
    నీవు నడువు మార్గములో నా పాదము జారక
    నీ దూతలే నన్ను కాపాడితిరా

    నా వేదనలో నిన్ను వేడుకొంటిని
    నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని
    నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
    నా కన్న తండ్రివై కాపాడుచుంటివా


    Na kentho anamdam ni sannidhi prabuva
    Nilo nenumdute ade na dhanyataye

    A apayamu nanu samipimchaka
    A rogamainanu na dariki cheraka
    Nivu naduvu margamulo na padamu jaraka
    Ni dutale nannu kapaditira

    Na vedanalo ninnu vedukomtini
    Na rodanalo niku morxrxa pettitini
    Na kannitini tudichi ni kaugita cherchitiva
    Na kanna tamdrivai kapaduchumtiva

  • Na asha nito umdalani నా ఆశ నీతో ఉండాలని

    నా ఆశ నీతో ఉండాలని
    నా ఆశ నీలా ఉండాలని
    నా ఆశ నీతో నిలవాలని
    నా ఆశ నిన్ను చూడాలని
    ఏ . . ఓ . . ఏ . . ఓ . .

    నీతోనే స్నేహం చేయాలని
    నాలో ఎంతో ఆశ ఉన్నది
    నీ ప్రేమ కౌగిలిలో ఉండాలని
    నాలో ఎంతో ఆశ ఉన్నది (2)
    నా శిక్షను నీవు పొందావులే
    నా కొరకు ప్రాణం పెట్టావులే
    నీ ప్రేమతో నను నింపావులే
    నిజమైన స్నేహం నీదే

    నీలాంటి స్నేహితుడు ఉన్నాడని
    నిను గూర్చి అందరికి చెప్పాలని
    నీ పనిలో నిత్యం సాగాలని
    నీ కొరకు సాక్షిగా ఉండాలని (2)
    నీ ఆత్మతో నను నింపుము నీ వరము
    నాకు దయచేయుము
    నీ పాత్రగా నను వాడుకో
    నీ సాక్షిగా నింపుము


    Na asha nito umdalani
    Na asha nila umdalani
    Na asha nito nilavalani
    Na asha ninnu chudalani
    Ye . . Oo . . Ye . . Oo . .

    Nitone sneham cheyalani
    Nalo emto asha unnadi
    Ni prema kaugililo umdalani
    Nalo emto asha unnadi (2)
    Na sikshanu nivu pomdavule
    Na koraku pranam pettavule
    Ni premato nanu nimpavule
    Nijamaina sneham nide

    Nilamti snehitudu unnadani
    Ninu gurchi amdariki cheppalani
    Ni panilo nityam sagalani
    Ni koraku sakshiga umdalani (2)
    Ni atmato nanu nimpumu ni varamu
    Naku dayacheyumu
    Ni patraga nanu vaduko
    Ni sakshiga nimpumu

  • Ni aradhana hrudaya నీ ఆరాధన హృదయ

    నీ ఆరాధన హృదయ ఆలాపనా
    ఆత్మతో సత్యముతో . .
    ఆరాధించెదను ఆరాధించెదను
    ఆరాధన యేసు ఆరాధన
    ఆరాధన క్రీస్తు ఆరాధన

    అరుణోదయమున ఆరాధన సూర్యాస్తమయమున ఆరాధన
    దినమెల్ల నీ నామం కీర్తించిన నా ఆశ తీరునా (2)

    స్తోత్రము చేయు పెదవులతొ తంబుర సితార నాధముతో
    విరిగి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు (2)


    Ni aradhana hrudaya alapana
    Atmato satyamuto . .
    Aradhimchedanu aradhimchedanu
    Aradhana yesu aradhana
    Aradhana kristu aradhana

    Arunodayamuna aradhana suryastamayamuna aradhana
    Dinamella ni namam kirtimchina na asa tiruna (2)

    Stotramu cheyu pedavulato tambura sitara nadhamuto
    Virigi naligina hrudayamuto aradhanaku yogyudavu (2)

  • Nee aathmatho nannu నీ ఆత్మతో నన్ను

    నీ ఆత్మతో నన్ను నడిపించయా
    నీ మార్గము నాకు చూపించయా
    నీ సత్యము నాలో కలిగించయ్యా
    నీ చిత్తము నాయందు నెరవేర్చయ్యా
    నీ ప్రేమ చూపించయా
    నీ స్వరము వినిపించయా
    నీ సన్నిధిలోకి నను చేర్చయా
    శుధ్ధాత్మను కృమ్మరించయా
    కరుణించు దేవా కృపచూపుమయ్యా
    నా తోడు నీవై నడిపించేసయ్యా
    నీ ఆత్మతో నన్ను నడిపించయా

    చెదిరిపోయి నీనుండి విడిపోతిని
    దారితప్పి గురిలేక తిరుగుచున్నాను
    నీ స్వరము వినిపించయా
    నీ ముఖము చూపించయా
    నీ మార్గములో నడిపించయా
    అద్దరికి నను చేర్చయా

    నీ సన్నిధి త్రోసివేసి పారిపోతిని
    లోకాశలకు లొంగి పడిపోతిని
    నీ ప్రేమ చూపించయా
    నీ వాత్సల్యం దయచేయయా
    నీ రక్తముతో నను కడుగయ్యా
    నిత్య రాజ్యములో నను చేర్చయా


    Nee aathmatho nannu nadipinchayaa
    nee maargamu naaku choopinchayaa
    nee sathyamu naalo kaliginchayaa
    nee chitthamu naayandu neraverchayyaa
    nee prema choopinchayaa
    nee swaramu vinipinchayaa
    nee sannidhiloki nannu cherchayaa
    shuddathmanu kummarinchayaa
    karuninchu deva krupa choopumayyaa
    naa thodu neevai nadipinchesayyaa
    nee aathmatho nannu nadipinchayaa

    chedharipoyi neeyandu vidipothini
    dhaari thappi guri leka thiruguchunnnanu
    nee swaramu vinipinchayaa
    nee mukhamu choopinchayaa
    nee maargamuloa nadipinchayaa
    addariki nanu cherchayaa

    nee sannidhi throsivesi paaripothini
    lokaasalaku longi padipothini
    nee prema choopinchayaa
    naa vaathsalyam dhayacheyayaa
    nee rakthamutho nanu kadugayyaa
    nithya raajyamulo nanu cherchayaa

  • Ni madhilo nanu talachu నీ మధిలో నను తలచు

    నీ. . .మధిలో నను తలచు ప్రభువా
    నీ. . .మధిలో నను తలచు నా ప్రభువా
    నను తలచిన తరుణములో నా పాపము పరిహరించు (2)

    ప్రాపంచిక వ్యసనములో నే చిక్కితినో ప్రభువా (2)
    నను విడుదల చేయుమయా పరిశుద్ధుని చేయుమయా (2)

    అనురాగపు వీక్షణతో నా దు:ఖము బాపుమయా (2)
    ప్రియ సేవకుడను నేనై సవి చూతును విశ్రాంతి (2)

    చీకటిలో కలతలలో నను బాయకుమో దేవా (2)
    చూపించుము నా ప్రభువా నీ స్వర్గపు మార్గమును (2)


    Ni. . .madhilo nanu talachu prabuva
    Ni. . .madhilo nanu talachu na prabuva
    Nanu talachina tarunamulo na papamu pariharimchu (2)

    Prapamchika vyasanamulo ne chikkitino prabuva (2)
    Nanu vidudala cheyumaya parisuddhuni cheyumaya (2)

    Anuragapu vikshanato na du:Kamu bapumaya (2)
    Priya sevakudanu nenai savi chutunu visramti (2)

    Chikatilo kalatalalo nanu bayakumo deva (2)
    Chupimchumu na prabuva ni svargapu margamunu (2)