Category: Telugu Worship Songs Lyrics

  • Anyajanulaela laechi gallaththu chaeyuchunnaaru
    అన్యజనులేల లేచి గల్లత్తు చేయుచున్నారు

    అన్యజనులేల లేచి – గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల

    జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి

    భూలోక రాజులు లేచి – వారేకముగా ఆలోచించి
    వారి పాశములను తెంపి – పారవేయుద మనుచున్నారు

    ఆకాశ వాసుండు – వారిని – అపహసించుచున్నాడు – నవ్వి
    వారలతో పల్కి కోపముతో – వారిని తల్లడిల్ల చేయును

    పరిశుద్ధమైన – నాదు – పర్వతమగు సీయోను మీద
    నారాజునాసీనునిగా జేసి – యున్నానని సెలవిచ్చెను

    కట్టడ వివరింతు – నాకు – యిట్లు చెప్పెను యెహోవాయందు
    నీవు నా కుమారుండవు – నిన్ను నేను కనియున్నాను

    నన్ను అడుగుము – నీకు – జనముల భూమిని స్వాస్థ్యముగా
    దిగంతముల వరకు స్వాస్థ్యముగా నొసంగెదను నీకు

    ఇనుప దండముతో – నీవు – వారిని నలుగగొట్టెదవు
    కుండను పగులగొట్టునట్లు – వారిని పగులగొట్టెదవు

    ఓ రాజులారా – మీరు – జ్ఞానవంతులై యుండుడి
    ఓ భూపతులారా – మీరు – నాభోద నొందుడి నేడే


    Anyajanulaela laechi – gallaththu chaeyuchunnaaru anyajanulaela

    Janamulaela vyarThamaina dhaani thalMchuchunnavi

    Bhooloaka raajulu laechi – vaaraekamugaa aaloachiMchi
    vaari paashamulanu theMpi – paaravaeyudha manuchunnaaru

    Aakaasha vaasuMdu – vaarini – apahasiMchuchunnaadu – navvi
    vaaralathoa palki koapamuthoa – vaarini thalladilla chaeyunu

    ParishudhDhamaina – naadhu – parvathamagu seeyoanu meedh
    naaraajunaaseenunigaa jaesi – yunnaanani selavichchenu

    Kattada vivariMthu – naaku – yitlu cheppenu yehoavaayMdhu
    neevu naa kumaaruMdavu – ninnu naenu kaniyunnaanu

    Nannu adugumu – neeku – janamula bhoomini svaasThyamugaa
    dhigMthamula varaku svaasThyamugaa nosMgedhanu neeku

    Inupa dhMdamuthoa – neevu – vaarini nalugagottedhavu
    kuMdanu pagulagottunatlu – vaarini pagulagottedhavu

    Oa raajulaaraa – meeru – jnYaanavMthulai yuMdudi
    oa bhoopathulaaraa – meeru – naabhoadha noMdhudi naedae

  • Annivaelalaa aadharinchedi aathmaroopee
    అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ

    అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం
    ఎన్ని తీరుల నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఋణం

    పడిపోయియుండగా నను తిరిగి లేపితివి
    స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి
    పోగొట్టుకున్నదంత ఇచ్చితివి
    రెట్టింపు శోభ మరల తెచ్చితివి

    నిను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా
    సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినా
    నూరంతల దీవెనలు పంపెదవు –
    సమృద్ధితో నను నింపెదవు


    AnnivaeLalaa aadharinchedi aathmaroopee neekae vndhanm
    enni theerula ninnu kolichinaa theerchalaenu naenu nee runm

    Padipoayiyundagaa nanu thirigi laepithivi
    Sthiraparachi dheevinchagaa nee karamu chaapithivi
    poagottukunnadhntha ichchithivi
    rettinpu shoabha marala thechchithivi

    Ninu venbadinchagaa shramalennoa kaliginaa
    suvaartha chaatinchagaa unnavannee poayinaa
    noornthala dheevenalu pnpedhavu –
    samrudhdhithoa nanu nimpedhavu

  • Annaa mana yaesu prabhuni
    అన్నా మన యేసు ప్రభుని

    అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు ఎన్న రాని మన
    యఘము లన్ని సడలించి ప్రోచు ||నన్న||

    మన దోషములకు బదులుగ మరణావస్థల నొందెను తన
    దివ్యావయముల ర క్తము చిందించెను భువిపై ||నన్న||

    నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను విజయం బగు
    నతని పాద రజయుగ్మును స్మరించు ||మన్న||

    దిక్కు మాలిన వారికి దిక్కై మార్గముఁజూపెను చక్కనీ గుణముల సొం
    పెక్కి వర్తించె నహహ ||యన్న||

    ఈలాటి దయాసముద్రు నిల నెందైనను గానము నీలోఁ గల దుర్గుణాది
    జాలంబులఁ గడఁ ద్రోయును ||అన్న||

    మృతి గెల్చిన వాఁడే దు రిత జీవులఁ బ్రోవఁ దగును మృతి నొంది
    నశించు లోక మూఢాత్ముల కేలఁ గల్గు ||నన్న||


    Annaa mana yaesu prabhuni kanna rakShkuAOdu laeAOdu enna raani mana
    yaghamu lanni sadaliMchi proachu ||nanna||

    mana dhoaShmulaku badhuluga maraNaavasThala noMdhenu thana
    dhivyaavayamula ra kthamu chiMdhiMchenu bhuvipai ||nanna||

    nija rakShkuAOdithAOdae mana vrujinaadhulAO barimaarpanu vijayM bagu
    nathani paadha rajayugmunu smariMchu ||manna||

    dhikku maalina vaariki dhikkai maargamuAOjoopenu chakkanee guNamula soM
    pekki varthiMche nahaha ||yanna||

    eelaati dhayaasamudhru nila neMdhainanu gaanamu neeloaAO gala dhurguNaadhi
    jaalMbulAO gadAO dhroayunu ||anna||

    mruthi gelchina vaaAOdae dhu ritha jeevulAO broavAO dhagunu mruthi noMdhi
    nashiMchu loaka mooDaathmula kaelAO galgu ||nanna||

  • Anni naamamula kanna ghanamaina
    అన్ని నామముల కన్న ఘనమైన

    అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా
    అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా
    యెహోవ ఈరే అని పిలువబడినవాడ (2)
    నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల||

    దేవతలకన్నా దయగలవాడవు
    క్షమించు మనసున్న మహారాజువు (2)
    ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు
    ప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల||

    గాలి తుఫానులను ఆపినవాడవు
    నీటిపై నడచిన నిజ దేవుడవు (2)
    జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు
    శాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల||


    Anni naamamula kanna ghanamaina naamamu needhi yaesu naaThaa
    aMdharini praemiMchu aadharaNa karthavayyaa praaNa naaThaa
    yehoava eerae ani piluvabadinavaada (2)
    neekae sthoathramulu neekae sthoathramulu (2) ||anni naamamula||

    Dhaevathalakannaa dhayagalavaadavu
    kShmiMchu manasunna mahaaraajuvu (2)
    praemaamayudavu prabhuvagu dhaevudavu
    praaNamu pettina prabhu yaesuvu ||anni naamamula||

    Gaali thuphaanulanu aapinavaadavu
    neetipai nadachina nija dhaevudavu (2)
    jaanathoa aakaashaanni kolichinavaadavu
    shaaMthi samaaDhaanM nosagae dhaevudavu ||anni naamamula||

  • anni kaalmbula nunna yehoavaa
    అన్ని కాలంబుల నున్న యెహోవా

    అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నఁదరంబయో కన్న
    తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు||నన్ని||

    నిన్నుఁ బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగఁ జేసిన బలుఁడ
    వీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలు
    ప్రభుఁడ వీవె అన్ని జీవుల నెఱిఁగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం
    డవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకునేఁజాలుదునా||యన్ని||

    పుట్టింప నీవంచుఁ బోషింప నీవంచుఁ గిట్టింప నీవంచు గీర్తింతును
    నట్టి పనికి మాలి నట్టి మానవుల చే పట్టి రక్షింపం బాధ్యుండ వంచు
    దట్టమైన కృపను దరిఁజేర్చ నాకిచ్చి పట్టయి నిలచియుండు ప్రభుఁడ
    వంచుఁ గట్టడచేఁ గడ ముట్టుదనుక నా పట్టుకొలఁది నిన్నుఁ బ్రస్తుతింతు ||నన్ని||

    కారుణ్యనిధి వీవు కఠినాత్ముఁడను నేను భూరి శుద్ధుఁడ వీవు పాపి
    నేను సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న దారిద్రుఁడే లేఁడు
    తరచి చూడ సార సద్గుణముల సంపన్నుఁడవు నీవు ఘోర దుర్గుణ
    సంచారి, నేను ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు నేర మెన్నకప్రోవ నెర నమ్మితి ||నన్ని||


    Anni kaalMbula nunna yehoavaa ni nennAOdharMbayoa kanna
    thMdri vanne kekkina moakSh vaasaaLi sannuthu lunnathamai yuMda munne neeku ||nanni||

    NinnuAO brakatana saeya nikhila loakamulanu bannugAO jaesina baluAOda
    veeve unna loakMbula -nudugaka karuNaa sM-pannathathoa naelu
    prabhuAOda veeve anni jeevula neRiAOgi yaahaara michchuchu nunna sarvajnYuM
    davu neevae enna shakyamugaaka unna lakShNamula sannuthiMchutakunaeAO jaaludhunaa ||yanni||

    puttiMpa neevMchuAO boaShiMpa neevMchuAO gittiMpa neevMchu geerthiMthunu
    natti paniki maali natti maanavula chae patti rakShiMpM baaDhyuMda vMchu
    dhattamaina krupanu dhariAOjaercha naakichchi pattayi nilachiyuMdu prabhuAOda
    vMchuAO gattadachaeAO gada muttudhanuka naa pattukolAOdhi ninnuAO brasthuthiMthu ||nanni||

    kaaruNyaniDhi veevu kaTinaathmuAOdanu naenu bhoori shudhDhuAOda veevu paapi
    naenu saara bhaagyuda veevu jagathiloa naakanna dhaaridhruAOdae laeAOdu
    tharachi chooda saara sadhguNamula sMpannuAOdavu neevu ghoara dhurguNa
    sMchaari, naenu ae reethi sthuthiyiMthu nae reethi saeviMthu naera mennakaproava nera nammithi ||nanni||

  • Adhikaaramu pomdhi yumtini prabhu
    అధికారము పొంది యుంటిని ప్రభూ

    అధికారము పొంది యుంటిని – ప్రభూ
    పరలోకమందును భూమి మీదను – నీవు

    అన్నిటిలో నత్యధిక జయము నొందుచున్నాము
    మనల ప్రేమించిన యేసు క్రీస్తు ప్రభువు ద్వారనే
    కనుల కగుపరచిన విజయముకై సన్నుతింతుము

    విశ్వసించు మనయందు తన శక్తిని గూర్చి
    అపరిమితమైన ప్రబావమును – యెరిగి యున్నాము
    తిరిగి లేచిన ప్రభువును చూచి హర్షించెదము

    మనల బలపరచు ప్రభువునందు బలము నొందుచు
    ప్రభున కింపైన కార్యములను చేయుచుంటిమి
    తనదు పునరుత్థాన బలమును పొగడెదమెపుడు

    క్రీస్తు మరణములో సమానాను-భవము కలిగియు
    కష్ట నష్టములలో పాలివారమగుట యెరిగియు
    ఆత్మ ప్రాణ శరీరములతో ఆరాధింతము

    మనల స్థిరపరచిన శక్తిగల దేవునికి
    తనదు ప్రియ పుత్రుడు యేసుక్రీస్తు ద్వారనే తనకు
    నిరతంబును మహిమ ఘనత హల్లెలూయామెన్


    Adhikaaramu poMdhi yuMtini – prabhoo
    paraloakamMdhunu bhoomi meedhanu – neevu

    annitiloa nathyaDhika jayamu noMdhuchunnaamu
    manala praemiMchina yaesu kreesthu prabhuvu dhvaaranae
    kanula kaguparachina vijayamukai sannuthiMthumu

    vishvasiMchu manayMdhu thana shakthini goorchi
    aparimithamaina prabaavamunu – yerigi yunnaamu
    thirigi laechina prabhuvunu choochi harShiMchedhamu

    manala balaparachu prabhuvunMdhu balamu noMdhuchu
    prabhuna kiMpaina kaaryamulanu chaeyuchuMtimi
    thanadhu punaruthThaana balamunu pogadedhamepudu

    kreesthu maraNamuloa samaanaanu-bhavamu kaligiyu
    kaShta naShtamulaloa paalivaaramaguta yerigiyu
    aathma praaNa shareeramulathoa aaraaDhiMthamu

    manala sThiraparachina shakthigala dhaevuniki
    thanadhu priya puthrudu yaesukreesthu dhvaaranae thanaku
    nirathMbunu mahima ghanatha hallelooyaamen

  • advitheeya sathya devudu
    అద్వితీయ సత్య దేవుడు

    అద్వితీయ సత్య దేవుడు
    క్రీస్తేసే నిత్య జీవము
    వెలుగైన జీవము
    వెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ||
    పాపమునకు జీతం
    మరణం నిత్య మరణం
    యేసులో కృపదానం
    జీవం నిత్య జీవం (2)
    హల్లెలూయా హల్లెలూయ (2) ||అద్వితీయ||


    advitheeya sathya devudu
    kreesthese nithya jeevamu
    velugaina jeevamu
    veliginchuchunnaadu (2) ||advitheeya||
    paapamunaku jeetham
    maranam nithya maranam
    yesulo krupadaanam
    jeevam nithya jeevam (2)
    hallelooyaa hallelooya (2) ||advitheeya||

  • adhymtharahithudavagu maa jyoathi
    అద్యంతరహితుడవగు మా జ్యోతి

    అద్యంతరహితుడవగు మా జ్యోతి
    మేదిని ప్రభూ నిన్ స్తుతింతుము – మేదిని
    నా దీన కాపరి నీతి కృపానిధి
    శుధ్ధ దివ్యగత్రుడా

    మనోహరమగు నీ కృప పొందను
    మానవు లెల్లరము చేరితిమి – మానవు
    ఆత్మరూప కృపామయా నీ కరుణా
    వరముల మాకీయుమా

    పాలచే కడుగబడిన – ధవళాక్షుడా
    వళ్లిపూలయందు తిరుగువాడా – వళ్లి
    షాలేము రాజా షారోను రోజా
    శాంత భూపతివి నీవే

    లక్షల దూతల స్తుతుల నందువాడా
    అక్షయ హేమమకుట ధారుడా – అక్షయ
    హేమ కిరీటధారులమై స్వర్గంబు
    చేర కడవరి వర్షమీ

    క్రొత్త యెరూషలేం నగర రాజా
    రత్నాల పునాది వేసితివి – రత్నాల
    ధీరతతో నీ సాక్ష్యము చాటను
    స్థిరమగునాత్మ నిమ్ము

    శ్రేష్ఠురాలా పావురమా నిరుపమాన
    ఇష్టంపురూప లావణ్యవతీ – ఇష్ట
    అట్లంచు పిల్చు దివ్య ధ్వనికి మమ్ము
    పాత్రులుగా చేయుమా


    adhyMtharahithudavagu maa jyoathi
    maedhini prabhoo nin sthuthiMthumu – maedhini
    naa dheena kaapari neethi krupaaniDhi
    shuDhDha dhivyagathrudaa

    manoaharamagu nee krupa poMdhanu
    maanavu lellaramu chaerithimi – maanavu
    aathmaroopa krupaamayaa nee karuNaa
    varamula maakeeyumaa

    paalachae kadugabadina – DhavaLaakShudaa
    vaLlipoolayMdhu thiruguvaadaa – vaLli
    Shaalaemu raajaa Shaaroanu roajaa
    shaaMtha bhoopathivi neevae

    lakShla dhoothala sthuthula nMdhuvaadaa
    akShya haemamakuta Dhaarudaa – akShy
    haema kireetaDhaarulamai svargMbu
    chaera kadavari varShmee

    kroththa yerooShlaeM nagara raajaa
    rathnaala punaadhi vaesithivi – rathnaal
    Dheerathathoa nee saakShyamu chaatanu
    sThiramagunaathma nimmu

    shraeShTuraalaa paavuramaa nirupamaan
    iShtMpuroopa laavaNyavathee – iSht
    atlMchu pilchu dhivya Dhvaniki mammu
    paathrulugaa chaeyumaa

  • adhyntha rahitha prabhuvaa
    అద్యంత రహిత ప్రభువా

    అద్యంత రహిత ప్రభువా
    రాజులకు రాజా ప్రభు యేసూ నీవే సదా

    ఆది జనకుడు ఏదేను తోటలో – శోధనలో పడి వేధించినపుడు
    ఆశలన్ని అడిఆశలుగా జేసె – అధములను నీవు ఆవరింతువు
    అమృతమూర్తి నీవే – ప్రభూ – సాటి నీకెవరు?

    స్థానము విడచి తన మహిమ విడచి – అనుదినము నిను దూషించు వైరి
    ప్రధానత్వమును పాదుచెసికొని – నీ ప్రభుత్వమున్ నిరాకరించిన
    నీచున్ ప్రేమించితివి – ప్రభూ – సాటి నీకెవరు?

    పిలిచితివి ఇశ్రాయేలు సంతతిని – వేలకొలది వాగ్దానములతో
    కలిమియందున కలతలందున – తొలగిపోయిన తల్లడిల్లిన
    చల్లగా కాచితివి – ప్రభూ – సాటి నీకెవరు?

    రాజ్యమేలిరి రారాజు లెందరో – రాజనగరుల రత్నాల సిరులతో
    రాజ్యకాంక్షతో రణములు సలిపిరి – రథములను చూచి సదయున్ మరచిన
    నిత్య సాత్వీకుడవు – ప్రభూ – సాటి నీకెవరు?

    పరమ జనకుని పలు వాక్కు లెన్నియో
    ధరను ప్రజలను ప్రవచించు కొరకై
    నిర్ణయించితివి దైవజనులను – పేరాశ కలిగి పెడత్రోవ నడచిన
    కరుణించితివి వారిన్ – ప్రభూ – సాటి నీకెవరు?

    పాడెదన్ ప్రభూ నీ ప్రేమగీతం
    పడిచెడిన నన్ను ప్రేమించితివివని
    కడిగిన ప్రభు – కలుషమునెల్ల – విడచిన నేను నీ జాడలన్నియు
    నడిపించె నీవికుడు – ప్రభూ – సాటి నీకెవరు?


    adhyntha rahitha prabhuvaa
    raajulaku raajaa prabhu yaesoo neevae sadhaa

    aadhi janakudu aedhaenu thoataloa – shoaDhanaloa padi vaeDhiMchinapudu
    aashalanni adiaashalugaa jaese – aDhamulanu neevu aavariMthuvu
    amruthamoorthi neevae – prabhoo – saati neekevaru?

    sThaanamu vidachi thana mahima vidachi – anudhinamu ninu dhooShiMchu vairi
    praDhaanathvamunu paadhuchesikoni – nee prabhuthvamun niraakariMchin
    neechun praemiMchithivi – prabhoo – saati neekevaru?

    pilichithivi ishraayaelu sMthathini – vaelakoladhi vaagdhaanamulathoa
    kalimiyMdhuna kalathalMdhuna – tholagipoayina thalladillin
    challagaa kaachithivi – prabhoo – saati neekevaru?

    raajyamaeliri raaraaju leMdharoa – raajanagarula rathnaala sirulathoa
    raajyakaaMkShthoa raNamulu salipiri – raThamulanu choochi sadhayun marachin
    nithya saathveekudavu – prabhoo – saati neekevaru?

    parama janakuni palu vaakku lenniyoa
    Dharanu prajalanu pravachiMchu korakai
    nirNayiMchithivi dhaivajanulanu – paeraasha kaligi pedathroava nadachin
    karuNiMchithivi vaarin – prabhoo – saati neekevaru?

    paadedhan prabhoo nee praemageethM
    padichedina nannu praemiMchithivivani
    kadigina prabhu – kaluShmunella – vidachina naenu nee jaadalanniyu
    nadipiMche neevikudu – prabhoo – saati neekevaru?

  • adhbhutha shakthikaladhu
    అద్భుత శక్తికలదు

    అద్భుత శక్తికలదు రక్తములో – గొఱ్ఱెపిల్ల రక్తములో
    అద్భుత శక్తికలదు రక్తములో – పరిశుద్ధ రక్తములో
    శాంతి ప్రేమానంద నిత్యజీవము – గొఱ్ఱెపిల్ల రక్తములో
    శాంతి ప్రేమానంద నిత్య జీవము – యేసు ప్రశస్త రక్తములో


    adhbhutha shakthikaladhu rakthamuloa – goRRepilla rakthamuloa
    adhbhutha shakthikaladhu rakthamuloa – parishudhDha rakthamuloa
    shaaMthi praemaanMdha nithyajeevamu – goRRepilla rakthamuloa
    shaaMthi praemaanMdha nithya jeevamu – yaesu prashastha rakthamuloa