Udayinche Divya Rakshakudu ఉదయించె దివ్య రక్షకుడు

ఉదయించె దివ్య రక్షకుడు
ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను
రక్షణ వెలుగు నీయను – (2) ||ఉదయించె||

ఘోరాంధకారమున దీపంబు లేక
పలు మారు పడుచుండగా (2)
దుఃఖ నిరాశ యాత్రికులంతా
దారి తప్పియుండగా (2)
మార్గదర్శియై నడిపించువారు (2)
ప్రభు పాద సన్నిధికి
దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు
ఉదయించె ఈ ధరలో – (3) ||ఉదయించె||

పరలోక తండ్రి కరుణించి మనల
పంపేను క్రీస్తు ప్రభున్ (2)
లోకాంధులకు దృష్టినివ్వ
అరుదెంచె క్రీస్తు ప్రభువు (2)
చీకటి నుండి దైవ వెలుగునకు (2)
తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంగలములను తెంప
ఉదయించె రక్షకుడు – (3) ||ఉదయించె||


Udayinche Divya Rakshakudu
Ghoraandhakaara Lokamuna
Mahima Kreesthu Udayinchenu
Rakshana Velugu Neeyanu – (2) ||Udayinche||

Ghoraandhakaaramuna Deepambu Leka
Palu Maaru Paduchundagaa (2)
Dukha Niraasha Yaathrikulanthaa
Daari Thappiyundagaa (2)
Maargadarshiyai Nadipinchuvaaru (2)
Prabhu Paada Sannidhiki
Divya Rakshakudu Prakaasha Velugu
Udayinche Ee Dharalo – (3) ||Udayinche||

Paraloka Thandri Karuninchi Manala
Pampenu Kreesthu Prabhun (2)
Lokaandhulaku Drushtinivva
Arudenche Kreesthu Prabhuvu (2)
Cheekati Nundi Daiva Velugunaku (2)
Thechche Kreesthu Prabhuvu
Saathaanu Shrungalamulanu Thempa
Udayinche Rakshakudu – (3) ||Udayinche||


Posted

in

by

Tags:

Comments

Leave a Reply