Category: Telugu Worship Songs Lyrics

  • Maaru manassu మారు మనస్సు

    మారు మనస్సు పొందుము – ప్రభుని రాజ్యము సమీపించెను

    యెహోవా దేవుని రాజ్యము మహోన్నతమై వ్యాపించెను
    తన రాజ్యప్రభావమున్ తన ప్రజలు – తన శౌర్యమునెంతో చాటెదరు

    ఆయన రాజ్యము శాశ్వతము ఆత్మలో దీనులగువారు
    ఆ రాజ్య వాసులగుదురు – ఆయనకే మా వందన స్తుతులు

    నూతన జన్మానుభవము ద్వారా చూతురు ఆ రాజ్యంబును
    ఆత్మ జన్మమును గలవారై – ఆ రాజ్యములోన చేరెదరు

    రక్తమాంసంబులు దానిని స్వతంత్రించు కొనజాలవు
    స్వాస్థ్యం పాపులకసలే లేదు – దుష్టులకందులో భాగములేదు

    అంధకార రాజ్యమునుండి పొందుగా తన రాజ్యంబునకు
    ప్రభుదెచ్చె ప్రియమారగ మనల – ప్రశంస స్తుతి చెల్లించెదము


    Maaru manassu pomdhumu
    prabhuni raajyamu sameepimchenu

    Yehoavaa dhaevuni raajyamu
    mahoannathamai vyaapimchenu
    thana raajyaprabhaavamun thana prajalu
    thana shauryamunemthoa chaatedharu

    Aayana raajyamu shaashvathamu
    aathmaloa dheenulaguvaaru
    aa raajya vaasulagudhuru
    aayanakae maa vandhana sthuthulu

    Noothana janmaanubhavamu dhvaaraa choothuru aa raajymbunu
    aathma janmamunu galavaarai
    aa raajyamuloana chaeredharu

    Rakthamaamsmbulu dhaanini svathmthrimchu konajaalavu
    svaasthym paapulakasalae laedhu
    dhushtulakmdhuloa bhaagamulaedhu

    Amdhakaara raajyamunumdi pomdhugaa thana raajymbunaku
    prabhudhechche priyamaaraga manala
    prashmsa sthuthi chellimchedhamu

  • Mariyaku suthuduga మరియకు సుతుడుగ

    మరియకు సుతుడుగ ధరను జన్మించి
    ఇమ్మానుయేలాయెన్

    నిరుపేదగాను పశువుల పాకలో
    తేజోమయ ప్రభు భువుని శిశువుగ బుట్టెను

    పాపసంకటము పోగొట్ట ధరను – ప్రాపకుడు నరునిగ బేత్లెహేమున
    పాపపరిహారుడు నరుల మిత్రుడు – అవనిలో జన్మించెన్

    ఆకాశచుక్క భాసిల్లుచుండ – వీకతో దీనోపకారుడు వెలసెన్
    హీన సైతానుడు కూలిపోవగన్ – ప్రియముతో ఉదయించెన్

    దూత గణములు గీతముల్ పాడ – క్షితిలో నరులు మంగళము పాడ
    కన్య మరియమ్మ పాడెను లాలి – పుణ్యుడు జన్మించగా


    Mariyaku suthuduga dharanu janminchi
    immaanuyaelaayen

    Nirupaedhagaanu pashuvula paakaloa
    thaejoamaya prabhu bhuvuni shishuvuga buttenu

    Paapasmkatamu poagotta dharanu
    praapakudu naruniga baethlehaemun
    paapaparihaarudu narula mithrudu
    avaniloa janminchen

    Aakaashachukka bhaasilluchumda
    veekathoa dheenoapakaarudu velasen
    heena saithaanudu koolipoavagan
    priyamuthoa udhayimchen

    Dhootha ganamulu geethamul paada
    kshithiloa narulu mangalamu paad
    kanya mariyamma paadenu laali
    punyudu janmimchagaa

  • Mariya tanayudata మరియ తనయుడట

    మరియ తనయుడట మనుజ రూపుడట
    మాన వాళి నిజదేవుడట
    ఇది మరి తలచిన మరువక కొలచిన
    మానవాళి నిజ దేవుడట

    దావీదు అను పట్టణమునకు
    పరుగు పరుగునా పొదామా (2)

    పొత్తి గుడ్డలట చిన్ని తొట్టెలట
    పశుల పాకలో పుట్టెనట (2)


    Mariya tanayudata manuja rupudata
    Mana vali nijadevudata
    Idi mari talachina maruvaka kolachina
    Manavali nija devudata

    Davidu anu pattanamunaku
    Parugu paruguna podama (2)

    Potti guddalata chinni tottelata
    Pasula pakalo puttenata (2)

  • Meeraemi vedhakuchunnaaru మీరేమి వెదకుచున్నారు

    మీరేమి వెదకుచున్నారు
    సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే

    నా చెడు మార్గమును విడచితిని – నీచపు జీవితమును విడచితిని
    ఆయన దొరకు కాలమునందు – వేడగ క్షమియించి కడిగె నన్ను

    యెహోవా యొద్ద వరమడిగితిని – యెహోవా ప్రసన్నత చూడ
    బహుకాంక్షించి మందిరములో – ఇహమందు వసియింప గోరుదున్

    ఆయన రాజ్యమున్ వెదకుచున్నాను – తానే సమస్తము విత్తుననె గదా
    క్రీస్తుతో లేపబడిన చింతించక – పై నున్న వాటినే నే వెదకెదను

    దేవుని చిత్తము నే నెరుగుచును – ఆత్మచే దానిని నెర వేర్చెదను
    సీయోను పర్వతముపై నున్న – గొర్రె పిల్లను నే వెంబడించెదను

    ప్రార్థన సహవాసమును పొంది – రొట్టెను విరుచుటలో యెడ తెగక
    దేవుని వాక్య ఖడ్గము బూని – సేవను చేతుము సంఘమునందు


    Meeraemi vedhakuchunnaaru
    sooryuni krimdha jarugu kriyal vyarthamae

    Naa chedu maargamunu vidachithini
    neechapu jeevithamunu vidachithini
    aayana dhoraku kaalamunMdhu
    vaedaga kshmiyimchi kadige nannu

    Yehoavaa yodhdha varamadigithini
    yehoavaa prasannatha chood
    bahukaamkshimchi mandhiramulo
    ihammdhu vasiyimpa goarudhun

    Aayana raajyamun vedhakuchunnaanu
    thaanae samasthamu viththunane gadhaa
    kreesthuthoa laepabadina chimthimchaka
    pai nunna vaatinae nae vedhakedhanu

    Dhaevuni chiththamu nae neruguchunu
    aathmachae dhaanini nera vaerchedhanu
    seeyoanu parvathamupai nunna
    gorre pillanu nae vembadimchedhanu

    Praarthana sahavaasamunu pomdhi
    rottenu viruchutaloa yeda thegak
    dhaevuni vaakya khadgamu booni
    saevanu chaethumu sanghamunandhu

  • Maranamunaku మరణమునకు

    మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా మరణ మొంది
    యేసు ప్రభువు మఱల బ్రతికి లేచెరా ||మరణ||

    క్షయమందు విత్తఁబడి య క్షయమునందు
    లేచురా ప్రియుడు క్రీస్తునందు
    మృతులు పెం పొసంగు ధన్యులు ||మరణ||

    లౌకిక దేహము విడి పర లోక దేహి యగునురా భీకర యోర్దాను
    యేసు ప్రేమతో దాఁటించురా ||మరణ||

    ధరణి దుఃఖ బాధ లన్ని ధరణియందె విడుతుము
    పరమ దేవుని డుండునట్టి
    పరదైసునకుఁ బోదుము ||మరణ||

    గగన వీధినండి యేసుఁ గ్రక్కున వేం చేయురా జగతి సర్వ మృతుల
    నొక్క క్షణములో బ్రతికించురా ||మరణ||

    బూర రావ మాలకించి భూమి యెల్ల వణఁకురా వారధిలో మృతులు
    జీవ ధారులై లేచెదరురా ||మరణ||

    భక్తులు విశ్వాసమునకు ఫలము నొందఁ బోదురు ముర్తి కిరీటము
    ధరించి రక్తితో జీవింతురు ||మరణ||

    కరుణలేని మరణమునకు వెరవకుండ నుండుఁడి మరణవిజయుఁడైన
    ప్రభుని చరణములు నుతించుఁడీ ||మరణ||


    Maranamunaku vijaya maedhi marana
    moadipoayeraa marana momdhi
    yaesu prabhuvu marala brathiki laecheraa ||marana||

    Kshyammdhu viththaobadi ya kshyamunmdhu
    laechuraa priyudu kreesthunmdhu
    mruthulu pem posmgu dhanyulu ||marana||

    Laukika dhaehamu vidi para loaka dhaehi
    yagunuraa bheekara yoardhaanu
    yaesu praemathoa dhaatinchuraa ||marana||

    Dharani dhuhkha baaDha lanni dharaniymdhe
    viduthumu parama dhaevuni dumdunatti
    paradhaisunaku boadhumu ||maraNa||

    Gagana veedhinmdi yaesu grakkuna
    vaem chaeyuraa jagathi sarva mruthula
    nokka kshnamulo brathikimchuraa ||marana||

    Boora raava maalakimchi bhoomi yella
    vanakuraa vaaradhiloa mruthulu
    jeeva dhaarulai laechedharuraa ||marana||

    Bhakthulu vishvaasamunaku phlamu
    nomdha boadhuru murthi kireetamu
    dharimchi rakthithoa jeevimthuru ||marana||

    Karunalaeni maranamunaku veravakumda
    nundudi maranavijayudaina
    prabhuni charanamulu nuthimchudee ||marana||

  • Maranamun jayimchi మరణమున్ జయించి

    మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు మహిమ దేహ
    మొనరఁ దాల్చెను ధర సమాధి
    బంధములను ధన్యముగను త్రెంచి లేచి
    కొఱత లన్ని తీర్చి జీవ వరము లియ్య వసుధపైని ||మరణమున్||

    మరియయును సలోమి మొదలగు మగువలు సబాతు మరు
    దినోదయమునఁ బ్రియ మగు గురుని
    దేహమునకుఁ బూయఁ బరిమళంపుఁ
    దైలములను సరగఁ దీసికొని సమాధి కరుగుదెంచి కనులఁజూడ
    ||మరణమున్||

    నేఁడు ప్రభుసమాధి ముఖముపై నున్న రాయి నెవఁడు దీయు కరుణను
    మనకై చేడియ లిట్లనుచు వేగఁ జేరి యా సమాధి మూఁత వీడి యుంటఁ
    జూచి మిగుల విస్మయమ్ము నంది రపుడు ||మరణమున్||

    వారు తెల్ల నిలువుటంగిఁతో గూర్చున్న పడుచు వానిఁ జూచి మిగుల
    భయముతోఁ జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ లార
    భయపడకు డటంచు నూరడించె నుచితముగను ||మరణమున్||

    కొరత పైని మరణ మొందిన నజరేయుఁ డేసు కొరకు మిగుల వెదకు
    చుండిన తరుణులార మీ ప్రభుండు తిరిగి బ్రతికె నిక్క మిద్ది సరగపేతు
    రాది శిష్య సమితితోడఁ జెప్పుడనియె ||మరణమున్||

    మానితముగ మీకిట ముందు ప్రభు వనిన యట్లు కానఁబడును
    గలిలైయ మందుఁ గాన వెళ్లుడంచు భాసి తానరుండు పల్క వినుచు
    దీన జనులు జడిసి మిగుల దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్||

    మొదట మగ్దలేనే మరియకుఁ గనఁబడె నటంచు సుదతి దెల్పె శిష్య
    వరులకు కొదువలేని సంతసమునఁ గోర్కె దీరఁ బ్రభునిఁ జూడఁ
    బదిలమైన యత్నములకుఁ బరఁగఁ జేసి చూచి రపుడు ||మరణమున్||

    అంతఃశత్రు వైన మరణమును ప్రభువు గెల్చె సంతసించి సన్నుతింతము
    వంత లేల భక్తులార వాస్తవముగ మనల నిటుల నంత్య దినము నందు
    లేపు నమల దేహముల నొసంగు ||మరణమున్||


    Maranamun jayimchi laechenu mana
    prabhuvu naeaodu mahima dhaeha
    monarao dhaalchenu dhara samaadhi
    bandhamulanu dhanyamuganu thremchi laechi
    koratha lanni theerchi jeeva varamu
    liyya vasudhapaini ||maranamun||

    Mariyayunu saloami modhalagu maguvalu sabaathu maru
    dhinoadhayamunao briya magu guruni
    dhaehamunakuao booyao barimalmpuao
    dhailamulanu saragao dheesikoni samaadhi
    karugudhemchi kanulaojooda ||maranamun||

    Naeaodu prabhusamaadhi mukhamupai nunna
    raayi nevaodu dheeyu karunanu
    manakai chaediya litlanuchu vaegao jaeri
    yaa samaadhi mooaotha veedi yumtao
    joochi migula vismayammu nmdhi rapudu ||maranamun||

    Vaaru thella niluvutmgiaothoa goorchunna
    paduchu vaaniao joochi migula
    bhayamuthoaao jaeraraaka nilichiyunna
    vaari nathadugaamchi yamma laara
    bhayapadaku datmchu nooradimche nuchithamuganu ||maranamun||

    Koratha paini marana momdhina najaraeyuao
    daesu koraku migula vedhaku
    chumdina tharunulaara mee prabhumdu thirigi
    brathike nikka midhdhi saragapaethu
    raadhi shishya samithithoadao jeppudaniye ||maranamun||

    Maanithamuga meekita mumdhu prabhu
    vanina yatlu kaanaobadunu
    galilaiya mandhu gaana veLludmchu
    bhaasi thaanarumdu palka vinuchu
    dheena janulu jadisi migula dhigulu
    nomdhi vanaki rapudu ||maranamun||

    Modhata magdhalaenae mariyakuao ganaobade
    natmchu sudhathi dhelpe shishya
    varulaku kodhuvalaeni santhasamuna goarke
    dheerao brabhuniao joodao
    badhilamaina yathnamulaku baraga jaesi
    choochi rapudu ||maranamun||

    Amthhshathru vaina maranamunu prabhuvu
    gelche santhasinchi sannuthinthamu
    vantha laela bhakthulaara vaasthavamuga
    manala nitula nanthya dhinamu nandhu
    laepu namala dhaehamula nosmgu ||maranamun||

  • Maargamai unna yesu మార్గమై ఉన్న యేసు

    మార్గమై ఉన్న యేసు
    నీ మార్గములో నను నడుపు
    జీవమై ఉన్న క్రీస్తు
    నీ జీవముతో నను నింపు
    సత్య మానలో వసియించుమా
    నీ రూపముకు మార్చుమా
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ

    గమ్యం లేని ప్రయాణం
    నీ నుండి చేసెను దూరం
    నా జీవితములో పాపం
    హరించివేసెను జీవం
    సత్య స్వరూపమా కనిపించవా
    నే నిన్ను చూడగ కనులీయవా
    నీ చెంతకే చేర్చవా

    అంతే లేని ఈ లోకం
    పాపం శాపముకు మూలం
    లోకం దాని వైభోగం
    గాఢందకార విశాలం
    జీవన దాయకా కృప చూపవా
    నీ నిత్య జీవమే వరమీయవా
    నీ కాంతిలో నిలుపవా


    Maargamai unna yesu
    nee maargamulo nanu nadupu
    jeevamai unna kreesthu
    nee jeevamutho nanu nimpu
    sathya maanalo vasiyinchumaa
    nee roopamuku maarchumaa
    oo oo oo oo oo oo

    Gamyam leni prayaanam
    nee nundi chesenu dhooram
    naa jeevithamulo paapam
    harinchivesenu jeevam
    sathya swaroopamaa kanipinchavaa
    ne ninnu choodaga kanuleeyavaa
    nee chenthake cherchavaa

    Anthey leni ee lokam
    paapam shaapamuku moolam
    lokam daani vaibhogam
    gaadandhakaara vishaalam
    jeevana daayakaa krupa choopavaa
    nee nithya jeevame varameeyavaa
    nee kaanthilo nilupavaa

  • Margam satyam jeevam kristesani మార్గం సత్యం జీవం క్రీస్తేసని

    మార్గం సత్యం జీవం
    క్రీస్తేసని చాటేద్దాం
    చేయి చేయి కలిపి
    ప్రభు రాజ్యం కట్టేద్దాం (2)

    సృష్ఠికి కారకుడు
    జనులందరికి రక్షకుడు
    శాంతి స్ధాపకుడు
    మహా దేవుడు యేసుతడ
    పదరా ఈ వార్తను చాటుతు దేశాదేశాలకు
    ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు

    రాజుల రాజుతడు
    ప్రతి ప్రభువుకు ప్రభువతడు
    రానైయున్నాడు
    కొదమ సింహమై ఓనాడు
    పదరా ఈ వార్తను చాటుతు దేశాదేశాలకు
    ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు


    Margam satyam jeevam
    Kristesani chateddam
    cheyi cheyi kalipi
    Prabu rajyam katteddam (2)

    Srushthiki karakudu
    Janulamdariki rakshakudu
    Samti sdhapakudu
    Maha devudu yesutada
    Padara I vartanu chatutu desadesalaku
    Edure ledimka manaku atma unnamduku

    Rajula rajutadu
    Prati prabuvuku prabuvatadu
    Ranaiyunnadu
    Kodama simhamai onadu
    Padara I vartanu chatutu desadesalaku
    Edure ledimka manaku atma unnamduku

  • Margam jeevam nive మార్గం జీవం నీవే

    మార్గం జీవం నీవే దేవా నిన్ను స్తుతించి పాడగ
    జయం జయం జయం నాదె జయం నా సర్వము నీవేగ
    ఓ దేవా. . నీవే నా యెహొవా నీకేనా అర్పణ ఎల్లప్పుడు
    నాతో నీవుండగా నా తోడుగా ఓ . . విజయం . . నాదే . .

    సత్యం నీవే బలం నీవే సమస్త మంతయు నీవే
    నీవే నీవే నీవే దేవా నీవే నా సర్వము నీవేగా . .
    ఓ దేవా. . నీవే నా యెహొవా నీకేనా అర్పణ ఎల్లప్పుడు
    నాతో నీవుండగా నా తోడుగా ఓ . . విజయం . . నాదే . .


    Margam jeevam nive deva ninnu stutimchi padaga
    Jayam jayam jayam nade jayam na sarvamu nivega
    O deva. . Nive na yehova nikena arpana ellappudu
    Nato nivumdaga na toduga O . . Vijayam . . Naade . .

    Satyam nive balam nive samasta mamtayu nive
    Nive nive nive deva nive na sarvamu nivega . .
    O deva. . Nive na yehova nikena arpana ellappudu
    Nato nivumdaga na toduga O . . Vijayam . . Naade . .

  • Meerae loakamunaku మీరే లోకమునకు

    మీరే లోకమునకు వెలుగు
    లోకమునకు ఉప్పు మీరే

    మనుజులు మీదు మంచి క్రియలను
    కని తండ్రిని మహిమ పరచగ
    వినయమున మీ వెలుగు వారికి
    కనబడగా ప్రకాశించుడి

    కొండమీద నుండు పట్టణము
    ఉండనేరదు మరుగైనిజముగ
    దండిగ మనదు తండ్రి స్వరూపము
    ఉండగ మీలో ప్రకాశించుడి

    దేవుని వాక్యము వెలుగై యున్నది
    జీవించుడి వెలుగును కలిగి
    పావనమగు సహవాసము కలిగి
    దేవుని ఆత్మలో నిండి వర్థిల్లెదరు

    మరణచ్చాయలో మీరుండగ
    పరమ వెలుగు ప్రకాశించెను
    పరిగిడె చీకటి వెలుగుదయించగ
    పరిశుద్దాత్మ ఫలములు పొందిన

    మీరికమీదట పరదేశులును
    పరజనులుగ నుండక యుందురు
    పరిశుద్దులతో నేకపౌరులై
    దేవుని గృహమునై యున్న

    రాత్రి పగలు భేదము లేక
    చంద్రుని సూర్యుని కాంతియు లేక
    ప్రభువగు దేవుడు ప్రకాశించును
    యుగయుగముల కాయన రాజ్యము

    ప్రభువగు దేవుడే జీవమై యుండియు
    ఉప్పుగా జేసెను మిమ్మును తనకై
    ఉప్పును బోలి సారము కలిగి
    ప్రభుయేసునకే హల్లెల్లూయ పాడుడి


    Meerae loakamunaku velugu
    loakamunaku uppu meerae

    Manujulu meedhu manchi kriyalanu
    kani thandrini mahima parachag
    vinayamuna mee velugu vaariki
    kanabadagaa prakaashimchudi

    Komdameedha numdu pattanamu
    umdanaeradhu marugainijamug
    dhmdiga manadhu thandri svaroopamu
    umdaga meeloa prakaashimchudi

    Dhaevuni vaakyamu velugai yunnadhi
    jeevimchudi velugunu kaligi
    paavanamagu sahavaasamu kaligi
    dhaevuni aathmaloa nimdi varthilledharu

    Maranachchaayaloa meerumdag
    parama velugu prakaashimchenu
    parigide cheekati velugudhayimchag
    parishudhdhaathma phalamulu pomdhin

    Meerikameedhata paradhaeshulunu
    parajanuluga numdaka yumdhuru
    parishudhdhulathoa naekapaurulai
    dhaevuni gruhamunai yunn

    Raathri pagalu bhaedhamu laek
    chandhruni sooryuni kaamthiyu laek
    prabhuvagu dhaevudu prakaashimchunu
    yugayugamula kaayana raajyamu

    Prabhuvagu dhaevudae jeevamai yumdiyu
    uppugaa jaesenu mimmunu thanakai
    uppunu boali saaramu kaligi
    prabhuyaesunakae hallellooya paadudi