Category: Telugu Worship Songs Lyrics

  • Mahima sarvoannathamaina మహిమ సర్వోన్నతమైన

    మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహి
    సమాధానానుగ్రహము గల్గున్ర్పభో ||మహిమ||

    నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచు
    నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ||

    ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి
    పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ||

    వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి
    వినుతింతుము సత్ర్వభో ||మహిమ||

    జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల
    జనకుని కుమారుడ ప్రభో ||మహిమ||

    ధర పాపములమోయు వరపుణ్య శీలుండా కరుణించి మా
    బీద మొరలాలించుము ప్రభో ||మహిమ||

    తండ్రియైన దేవుని దక్షిణ్ భాగమున గూర్చుండి యున్నావు
    కృపజూపుమి సత్ర్పభో ||మహిమ||

    పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవే
    దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ||మహిమ||

    పరమ జనకుని మహిమన్ పరిశుద్దాత్మైక్యంబై
    సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ||మహిమ||


    Mahima sarvoannathamaina dhaivamunaki mmahi
    samaadhaanaanugrahamu galgunrpabhoa ||mahima||

    Ninnu sthoathrinchuchu ninnu boojinchuchu
    ninnu mahimaparchuchunnaamu loaka prabhoa ||mahima||

    Prabhuvaina dhaevundaa paramandalapu
    raajaa prabalambu gala thandri
    parishudhambagu prabhoa ||mahima||

    Vinayambutho needhu ghana mahimaarthambai vandhanamularpinchi
    vinuthinthumu sathrvabhoa ||mahima||

    Janithaika puthrudagu ghana kreesthaesu
    prabhu dhaevuni gorrepilla
    janakuni kumaaruda prabhoa ||mahima||

    Dhara paapamulamoayu varapunya sheelundaa karunimchi maa
    beedha moralaalinchumu prabhoa ||mahima||

    Thandriyaina dhaevuni dhakshin bhaagamuna goorchundi yunnaavu
    krupajoopumi sathrpabhoa ||mahima||

    Parishudhudavu neevae parama prabhudavu neevae
    dhurithaathmulanu gaana maranambaithivi prabhoa ||mahima||

    Parama janakuni mahiman parishudhdhaathmaikymbai
    sarani maakai yunna sarvoannatha prabhoa ||mahima||

  • Mahima raaju మహిమ రాజు

    మహిమ రాజు సన్నిధిన్ మకుటధారులై
    నిత్యజీవ శాంతిలో నిలిచి యుందుము

    హల్లెలూయ పాట పాడెదము (2)
    పాడెదము పాడెదము హల్లెలూయ పాట

    శాంతి నాథుడేసుని సముఖములో
    సంతసమే నిత్యము చింతలేదుగా

    నా ప్రభువు తుడుచును నా కన్నీటిని
    ప్రేమతోడ మందను పోషించును

    సంతసమున దూతలు సంస్తుతించగా
    పాడి మోక్షమందున మోదమొందెదన్

    శత్రువునకు వెరువనేల సోదరులారా
    దైవపుత్రులారా నిద్ర లేచి పాడుడి

    యేసురాక వార్త మ్రోగె భాసురంబుగా
    వచ్చుచున్నాడేసు సంఘ వధువు కొరకు

    తెల్లవస్త్రములు లేక వెళ్ళజాలవు
    రక్తములో కడుగుము వస్త్రములను


    Mahima raaju sannidhin makutadhaarulai
    nithyajeeva shanthilo nilichi yundhumu

    Hallelooya paata paadedhamu (2)
    paadedhamu paadedhamu hallelooya paat

    Shanthi naadhudaesuni samukhamuloa
    santhasamae nithyamu chinthalaedhugaa

    Naa prabhuvu thuduchunu naa kanneetini
    praemathoada mundhanu poashinchunu

    Santhasamuna dhoothalu samsthuthinchagaa
    paadi moakshmandhuna moadhamomdhedhan

    Shathruvunaku veruvanaela soadharulaaraa
    dhaivaputhrulaaraa nidhra laechi paadudi

    yaesuraaka vaartha mroage bhaasurambugaa
    vachchuchunnaadaesu sangha vandhuvu koraku

    Thellavasthramulu laeka vellajaalavu
    rakthamuloa kadugumu vasthramulanu

  • Mahima mahima mahima మహిమ మహిమ మహిమ

    మహిమ మహిమ మహిమ యనుచు శిశువులు నిర్మల వినోద
    ధ్వనులు నిలుతురు అహమ మా
    యఘంబు లెల్ల నణ(చె వీని నామమనుచు
    బహు విధంబులైన పాట ల్బాడుచు నాడుచు వేఁడుచు గూడుచు ||మహిమ||

    శత సహస్ర సంఖ్య మించి బాల సం చయము ప్రభుని గద్దె చుట్టున
    నతులితంబు లైన కాంతి గతుల నమర మింటఁ బాడ నీతీరు నెవరు
    దెచ్చి రచటి కేగతిఁ దాఁగూడి మ్రోగఁగ సాగిరి ||మహిమ||

    వింతయైన మతులు జేయఁగా నెవఁడు తనదు విలువలేని నల్లఁ
    జల్లగ సమసెనో యఘంబు లట్టి జనకుఁడైన ప్రభువు నెదుట నమల
    కోమలంబులైన యాటలఁ బాటల మీటుచుఁ జాటుచు ||మహిమ||

    తాము ప్రభుని కృపను మిగులను జూచి యతని దయను లోక మందు
    వేడ్కను బ్రేమఁజెంది యిపుడు గొఱ్ఱె పిల్లయైన ప్రభువు నెదుట దాము
    మోద మలర నిలిచి వేమరు దామెల్ల నా మోముఁ బ్రేమించి ||మహిమ||


    Mahima mahima mahima yanuchu
    shishuvulu nirmala vinoadha
    dhvanulu niluthuru ahama maa
    yaghambu lella nana(che veeni naamamanuchu
    bahu vidhmbulaina paata lbaaduchu
    naaduchu vaeduchu gooduchu ||mahima||

    Shatha sahasra sankhya mimchi baala
    sam chayamu prabhuni gadhdhe chuttuna
    nathulithanbu laina kaanthi gathula
    namara minta baada neetheeru nevaru
    dhechchi rachati kaegathi dhaagoodi
    mroagaga saagiri ||mahima||

    Vinthayaina mathulu jaeygaa nevadu
    thanadhu viluvalaeni nalla
    jallaga samasenoa yaghambu latti
    janakudaina prabhuvu nedhuta namala
    komalambulaina yaatala baatala meetuchu
    jaatuchu ||mahima||

    Thaamu prabhuni krupanu migulanu
    joochi yathani dhayanu loaka mandhu
    vaedkanu braemjendhi yipudu gorre
    pillayaina prabhuvu nedhuta dhaamu
    moadha malara nilichi vaemaru dhaamella
    naa moamu braeminchi ||mahima||

  • Mahima prabunike మహిమ ప్రభునీకే

    మహిమ ప్రభునీకే ఘనత ప్రభు నీకే (2)
    స్తుతి మహిమ ఘనతయు ప్రభవము నీకే ప్రభు
    ఆరాధన . . ఆరాధన . . (2)
    నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే (2)

    అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివి
    రాజలవలే యాజకుని వలే నీకై పిలిచితివి (2)
    ఆరాధన . . ఆరాధన . . (2)

    వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించుదైవమా
    ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాధుడా (2)
    ఆరాధన . . ఆరాధన . . (2)


    Mahima prabunike ganata prabu neeke (2)
    Stuti mahima ganatayu prabavamu nike prabu
    Aradhana . . Aradhana . . (2)
    Na priyudu yesunike na priyudu devunike (2)

    Amulyamaina ni raktamuto vidudala nichchitivi
    Rajalavale yajakuni vale nikai pilichitivi (2)
    Aradhana . . Aradhana . . (2)

    Veluguga trovan todaiyumdi nadipimchudaivama
    Prema saktito agnito veligimchu abishekanadhuda (2)
    Aradhana . . Aradhana . . (2)

  • Mahima noppu మహిమ నొప్పు

    మహిమ నొప్పు జనక నీకు మహిత సుతునకు మహిమ గలుగు
    శుద్ధాత్మకును మహా యుగములు ||మహిమ||

    లోక సృష్టి మునుపు నిన్ను నాకసేనలు ప్రాకటంబుగా నుతించెఁ బ్రజ్ఞ
    మీరంగ ||మహిమ||

    సకల సృష్టివలన దేవ సకల యుగముల సకల మహిమ గలుగు నీకు
    సకల కాలము ||మహిమ||


    Mahima noppu janaka neeku mahitha
    suthunaku mahima galugu
    shudhdhaathmakunu mahaa yugamulu ||mahima||

    Loaka srushti munupu ninnu naakasaenalu
    praakatmbugaa nuthimche brajny
    meeranga ||mahima||

    Sakala srushtivalana dhaeva sakala
    yugamula sakala mahima galugu neeku
    sakala kaalamu ||mahima||

  • Mahima ghanatha sthuthi మహిమ ఘనత స్తుతి

    మహిమ, ఘనత, స్తుతి ప్రభావము – నీకే కలుగును గాక ఆ. ఆ.
    నీకే కలుగును గాక మా దేవా – నీకే కలుగును గాక !

    బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు – నీ దానములే జ్ఞాన స్వరూపి (2)
    జగమును సౄష్టించి – నిర్వహించు వాడవు (2)
    నీ జ్ఞానమును – వివరింపతరమా (2)
    నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా – నీ జ్ఞానముతో నింపు మమ్ము

    వెండి బంగారు అష్టైశ్వర్యములు – నీ దానములే శ్రీ మంతుడా
    శ్రేష్ఠ ఈవులనిచ్చు – జ్యోతీర్మయుడవు
    నీ మహిమైశ్వర్యం – వివరింపతరమా
    నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా – నీ మహిమైశ్వర్యమిమ్ము

    అధిక బలము సంపూర్ణ శక్తి – నీ దానములే యుద్దశూరుడా
    నీ కసాద్యమైనది లేదే యెహోవా
    నీ సర్వశక్తిని – వివరింపతరమా
    నీ సర్వశక్తితో నింపు మా దేవా – నీ సర్వశక్తితో నింపు

    శాశ్వతమైనది నీ మధుర ప్రేమ – జ్ఞానమునకు మించు ప్రేమాస్వరూపీ
    కొలువగలేము నీ – ఘనప్రేమను
    సాటిలేని నీ ప్రేమన్ వివరింపతరమా
    నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా – నీ ప్రేమతో నింపు మమ్ము

    ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని – అగాధ సముద్రముల్ జ్వాలామయుడా
    మరణమంత బలమైన – నీ ప్రేమ ధాటిని
    అగపె ప్రేమను – వివరింప తరమా
    అగపే ప్రేమతో నింపు మా దేవా – అగపే ప్రేమతో నింపు


    Mahima, ghanatha, sthuthi prabhaavamu
    neekae kalugunu gaaka aa. aa.
    neekae kalugunu gaaka maa dhaevaa
    neekae kalugunu gaaka !

    Budhdhi, jnyaana sarva sampadhalu
    nee dhaanamulae jnyaana svaroopi (2)
    jagamunu sroashtinchi – nirvahinchu vaadavu (2)
    nee jnyaanamunu – vivarimpatharamaa (2)
    nee jnyaanamuthoa nimpu mammu maadhaevaa
    nee jnyaanamuthoa nimpu mammu

    Vendi bangaaru ashtaishvaryamulu
    nee dhaanamulae shree manthudaa
    shraeshta eevulanichchu – jyoatheermayudavu
    nee mahimaishvaryam – vivarimpatharamaa
    nee mahimaishvaryamimmu maa dhaevaa
    nee mahimaishvaryamimmu

    Adhika balamu sampoorna shakthi
    nee dhaanamulae yudhdhashoorudaa
    nee kasaadhyamainadhi laedhae yehoavaa
    nee sarvashakthini – vivarimpatharamaa
    nee sarvashakthithoa nimpu maa dhaevaa
    nee sarvashakthithoa nimpu

    Shaashvathamainadhi nee madhura praema
    jnyaanamunaku mimchu praemaasvaroopee
    koluvagalaemu nee – ghanapraemanu
    saatilaeni nee praeman vivarimpatharamaa
    nee praemathoa nimpu mammu maa dhaevaa
    nee praemathoa nimpu mammu

    Aarpagalaemu nee praema agnini
    agaadha samudhramul jvaalaamayudaa
    maranamantha balamaina – nee praema dhaatini
    agape praemanu – vivarimpa tharamaa
    agapae praemathoa nimpu maa dhaevaa
    agapae praemathoa nimpu

  • Mahoannathuni మహోన్నతుని

    మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు
    సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు

    ఆయనే నా కోట ఆశ్రయము నే నమ్ముకొను దేవుడు
    రక్షించు వేటకాని ఉరి నుండి – పాడు తెగులు నుండి

    తన రెక్కలతో నిను కప్పును నీకు ఆశ్రయంబగును
    ఆయన సత్యంబు నీ కేడెమును డాలునై యున్నది

    రేయి భయమునకైనా పగటిలో నెగురు బాణమునకైనా
    చీకటిలో తిరుగు తెగులునకైనా – నీవు భయపడవు

    మధ్యాహ్నములో పాడుచేయు రోగమునకు భయపడవు
    నీ ప్రక్కను వేయి మంది పడినను నీవు భయపడవు

    నీ కుడిప్రక్కను పదివేల మంది కూలిపోయినను – నీవు భయపడవు
    అపాయము నీ దాపున కేమాత్రము రాదు భయపడవు

    భక్తిహీనులకు కల్గు ప్రతిఫలము నీవు చూచెదవు
    మహోన్నతునే ఆశ్రయముగా చేసి వసించు చున్నావు

    నీ గుడారమున కపాయము తెగులు సమీపించదు
    నీ మార్గంబులలో నిను కాపాడను దూతలకు చెప్పున్

    నీ పాదములకు రాయి తగుల నీక నిన్నెత్తు కొందురు
    సింహములను నాగుల భుజంగములను అణగ ద్రొక్కెదవు

    నన్నెరిగి ప్రేమించె గాన నేను వాని ఘనపరతున్
    నా నామమున మొఱ్ఱపెట్టగా నేను ఉత్తరమిచ్చెదను

    శ్రమలో తోడై విడిపించి వాని గొప్ప చేసెదను
    దీర్ఘాయువుతో తృప్తిపరచి – నా రక్షణ చూపెదను


    Mahoannathuni chaatuna vasiyimchuvaadae dhanyumdu
    sarvashakthuni needanu vishramimchu vaadae dhanyumdu

    Aayanae naa koata aashrayamu nae nammukonu dhaevudu
    rakshimchu vaetakaani uri numdi – paadu thegulu numdi

    Thana rekkalathoa ninu kappunu neeku aashrayambagunu
    aayana sathyambu nee kaedemunu daalunai yunnadhi

    Raeyi bhayamunakainaa pagatiloa neguru baanamunakainaa
    cheekatiloa thirugu thegulunakainaa – neevu bhayapadavu

    Madhyaahnamuloa paaduchaeyu roagamunaku bhayapadavu
    nee prakkanu vaeyi mandhi padinanu neevu bhayapadavu

    Nee kudiprakkanu padhivaela mandhi koolipoayinanu
    neevu bhayapadavu
    apaayamu nee dhaapuna kaemaathramu raadhu bhayapadavu

    Bhakthiheenulaku kalgu prathiphalamu neevu choochedhavu
    mahoannathunae aashrayamugaa chaesi vasimchu chunnaavu

    Nee gudaaramuna kapaayamu thegulu sameepimchadhu
    nee maargambulaloa ninu kaapaadanu dhoothalaku cheppun

    Nee paadhamulaku raayi thagula neeka ninneththu kondhuru
    simhamulanu naagula bhujangamulanu anaga dhrokkedhavu

    Nannerigi praemimche gaana naenu vaani ghanaparathun
    naa naamamuna morrapettagaa naenu uththaramichchedhanu

    Shramaloa thoadai vidipimchi vaani goppa chaesedhanu
    dheerghaayuvuthoa thrupthiparachi – naa rakshna choopedhanu

  • Mahaathmuaodaina మహాత్ముఁడైన

    మహాత్ముఁడైన నా ప్రభు
    విచిత్ర సిల్వఁ జూడ నా
    యాస్తిన్ నష్టంబుగా నెంచి
    గర్వం బణంగఁ ద్రొక్కుదున్.

    నీ సిల్వ గాక యో దేవా
    దేనిన్ బ్రేమింప నీయకు
    నన్నాహరించు సర్వమున్
    నీ సిల్వకై త్యజింతును.

    శిరంబు పాద హస్తముల్
    నూచించు దుఃఖ ప్రేమలు
    మరెన్నడైన గూడెనా
    విషాదప్రేమ లీ గతిన్

    ముండ్లన్ దుర్మార్గులల్లిన
    కిరీట మేసు కుండినన్
    ఈ భూకిరీటములన్నీ
    దానం దూగంగఁ జాలు నే

    లోకంబు నే నర్పించిన
    నయోగ్యమైన యీవి యౌ
    వింతైన యేసు ప్రేమకై
    నా యావజ్జీవ మిత్తును.

    రక్షింపఁ బడ్డ లోకమా
    రక్షింపఁ జావుఁ బొందిన
    రక్షకుఁ డేసునిన్ సదా
    రావంబుతోడఁ గొల్వుమా


    Mahaathmudaina naa prabhu
    vichithra silvajooda naa
    yaasthin nashtambugaa nenchi
    garvam banamga dhrokkudhun.

    Nee silva gaaka yoa dhaevaa
    dhaenin braemimpa neeyaku
    nannaaharimchu sarvamun
    nee silvakai thyajimthunu.

    Shirambu paadha hasthamul
    noochimchu dhuhkha praemalu
    marennadaina goodenaa
    vishaadhapraema lee gathin

    Mundlan dhurmaargulallina
    kireeta maesu kumdinan
    ee bhookireetamulannee
    dhaanam dhoogamga jaalu nae

    Loakambu nae narpimchina
    nayoagyamaina yeevi yau
    vimthaina yaesu praemakai
    naa yaavajjeeva miththunu.

    Rakshimpa badda loakamaa
    rakshimpa jaavu bondhina
    rakshku daesunin sadhaa
    raavambuthoada golvumaa

  • Yoodhaa sthuthigoathrapu యూదా స్తుతిగోత్రపు

    యూదా స్తుతిగోత్రపు సింహమా
    యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా
    నీవేకదా నా ఆరాధనా
    ఆరాధనా స్తుతి ఆరాధనా- ఆరాధనా స్తుతి ఆరాధనా

    నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
    అహమును అణచి అధికారులను అధముల జేసిన నీకు
    అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది ||యూదా||

    నీ నీతికిరణాలకై నా దిక్కుదెసలన్నీ నీవేనని
    అనతి కాలాన ప్రథమఫలముగా పక్వపరచిన నీకు
    అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది ||యూదా||

    నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
    అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీ
    అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది ||యూదా||


    Yoodhaa sthuthigoathrapu simhamaa
    yaesayyaa naa aathmeeyapragathi nee svaadheenamaa
    neevaekadhaa naa aaraadhanaa
    aaraadhanaa sthuthi aaraadhanaa
    aaraadhanaa sthuthi aaraadhanaa

    Nee prajala nemmadhikai raajaajny maarchimdhi neevaenani
    ahamunu anachi adhikaarulanu adhamula jaesina neeku
    asaadhyamainadhi aemunnadhi
    asaadhyamainadhi aemunnadhi ||yoodhaa||

    Nee neethikiranaalakai naa dhikkudhesalannee neevaenani
    anathi kaalaana praThamaphalamugaa pakvaparachina neeku
    asaadhyamainadhi aemunnadhi
    asaadhyamainadhi aemunnadhi ||yoodhaa||

    Nee vaarasathvamukai naa jayamu koarimdhi neevaenani
    athyunnathamaina simhaasanamunu naakichchutaloa nee
    asaadhyamainadhi aemunnadhi
    asaadhyamainadhi aemunnadhi ||yoodhaa||

  • Yaakoabu dhaevudaapadha యాకోబు దేవుడాపద

    యాకోబు దేవుడాపద కాలంబుల యందు
    నిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక!

    పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చును
    సీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును

    నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచు
    నీ దహన బలులను అంగీకరించును గాక

    నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచన
    యంతటిని సఫలము చేసి నిన్ను గాచును

    నీ రక్షణను బట్టి మేము యుత్సహింతుము
    మా దేవుని నామమున ధ్యజము నెత్తెదము

    నీ ప్రార్థనలన్ని యెహోవా సఫలపరచును
    యెహోవా తన అబిషిక్తుని రక్షించును గాక

    రక్షించి దక్షిణ హస్తబలమును చూపును
    యుత్తరమిచ్చును పరిశుద్ధ స్థలము నుండి

    అతిశయ పడుదురు రథ గుఱ్ఱములతో
    యెహోవా నామములో మనము అతిశయింతుము

    వారు కృంగి నేలమీదపడి లేవకున్నారు
    మనము లేచి చక్కగా నిలుచుచున్నాము


    Yaakoabu dhaevudaapadha kaalmbula ymdhu
    ninnudhdharimchi nee kuththaramu nichchunu gaaka!

    Parishudhdha sthalamunumdi neeku saayamichchunu
    seeyoanuloanumdi yehoavaa ninnaadharimchunu

    Nee naivaedhyamulanni jnypthi numchukonuchu
    nee dhahana balulanu amgeekarinchunu gaak

    Nee koarika sidhdhimpajaesi nee yaaloachan
    yanthatini saphalamu chaesi ninnu gaachunu

    Nee rakshnanu batti maemu yuthsahimthumu
    maa dhaevuni naamamuna dhyajamu neththedhamu

    Nee praarthanalanni yehoavaa saphalaparachunu
    yehoavaa thana abishikthuni rakshimchunu gaak

    Rakshimchi dhakshina hasthabalamunu choopunu
    yuththaramichchunu parishudhdha sthalamu numdi

    Athishaya padudhuru ratha gurramulatho
    yehoavaa naamamuloa manamu athishayimthumu

    Vaaru krumgi naelameedhapadi laevakunnaaru
    manamu laechi chakkagaa niluchuchunnaamu