Category: Telugu Worship Songs Lyrics

  • Yaajaka dharmamu యాజక ధర్మము

    యాజక ధర్మము నెరిగి – యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు

    ఆది ప్రధాన యాజకు డహరోను ప్రభునికే ముంగురుతు
    అతని కుమారులు విశ్వాసులకు ప్రాపుగ ముంగురుతు

    ప్రధాన యాజకుడు మనయేసే – యాజకులము మనమే
    పరమ పిలుపులో నిలిచినవారే స్థిరముగ నుండెదరు

    నాదాబు యనగా మనసున్నవాడని – అబీహువు నా తండ్రి
    ఎలియేజరనగ దేవుడు నా బలము ఈతామారు ఖర్జూర భూమి

    అహరోను ధరించిన వస్త్రములేడు – వాని యర్ధమేమి
    ప్రభుయేసు వాని యందున్న వాడు రక్షింపబడిన వారును

    పతకము, ఏఫోదు, విచిత్రమైన దట్టీ – నిలువుటంగీ, పాగ
    మేలిమి బంగరు రేకు, విచిత్ర – మైన చొక్కా ఏడును

    ఆయనతోడ వేయి వత్సరములు ఆనందముతో నేలుచు
    యాజకులందరు భాగ్యశాలులై హల్లెలూయ పాడెదరు


    Yaajaka dharmamu nerigi
    yaesunikae saeva praemathoa nonarimpudu

    Aadhi pradhaana yaajaku daharoanu prabhunikae munguruthu
    athani kumaarulu vishvaasulaku praapuga munguruthu

    Pradhaana yaajakudu manayaesae
    yaajakulamu manamae
    parama pilupuloa nilichinavaarae
    sthiramuga nundedharu

    Naadhaabu yanagaa manasunnavaadani
    abeehuvu naa thandri
    eliyaejaranaga dhaevudu naa balamu
    eethaamaaru kharjoora bhoomi

    Aharoanu dharinchina vasthramulaedu
    vaani yardhamaemi
    prabhuyaesu vaani yundhunna vaadu
    rakshimpabadina vaarunu

    Pathakamu, aephoadhu, vichithramaina dhattee
    niluvutangee, paag
    maelimi bangaru raeku, vichithra
    maina chokkaa aedunu

    Aayanathoada vaeyi vathsaramulu
    aanandhamutho naeluchu
    yaajakulandharu bhaagyashaalulai
    hallelooya paadedharu

  • Mahimonnatudu మహిమోన్నతుడు

    మహిమోన్నతుడు మహిమాన్వితుడు
    మరణం గెల్చిన మృత్యుంజయుడు
    అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్జానసంపన్నుడు
    ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన
    హల్లెలూయ హల్లెలూయ రాజుల రాజుకే హల్లెలూయ

    సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము చేసిన సర్వోపకారి
    నీతిమంతుని ప్రేమించువాడు ఇశ్రాయేలును కాపాడువాడు

    నిత్యం వశియించువాడు అమరుడు
    ఆయనే మారం, సత్యం, జీవము ఆయనే
    నమ్మినవారిని రక్షించువాడు నిత్యజీవం దయచేయువాడు


    Mahimonnatudu mahimanvitudu
    maranam gelchina mrutyumjayudu
    Advitiyudu ati sumdarudu adhika jjanasampannudu
    Aradhana aradhana prabu yesu kristuke aradhana
    Halleluya halleluya rajula rajuke halleluya

    Sarvamu nerigina sarvadhikari sarvamu chesina sarvopakari
    Nitimamtuni premimchuvadu israyelunu kapaduvadu

    Nityam vasiyimchuvadu amarudu
    ayane maram, satyam, jivamu ayane
    Namminavarini rakshimchuvadu nityajivam dayacheyuvadu

  • Mahimayuthudu మహిమయుతుడు

    మహిమయుతుడు మా యేసు రాజు
    మహిమదూత సైన్యము తోడ
    ఇహకు వచ్చున్ మహానందము

    ఇమ్మహి అతిశయిల్లు – దూతలు ఆర్భటించ
    దూత వెల్గుతోడ మేఘముపై యేసు
    సమ్మతిన్ రాగా సంధింతుము వేగ
    ఆ … ఆనందము

    బూరశబ్దించగానే – వాంచలు తీరుటకు
    మిత్రునిచెంత భక్తులందరు చెరి
    హర్షంబుతోడ పాడి స్తుతింతుము
    ఆ … ఆనందము

    భూమి గోత్రములును – దేశాధికారులును
    ఇమ్మానుయేలుచే న్యాయ తీర్పుపొంద
    ఇమ్ముగ మేమును చేరుదు మచ్చట
    ఆ … ఆనందము

    వేయేండ్ల రాజ్యమున భూలోక రాజ్యములు
    తీరిన పిదప మిత్రునితో మేము
    జయప్రదులమై నిత్యమేలుదుము
    ఆ … ఆనందము


    Mahimayuthudu maa yaesu raaju
    mahimadhootha sainyamu thoad
    ihaku vachchun mahaanandhamu

    Immahi athishayillu – dhoothalu aarbhatinch
    dhootha velguthoada maeghamupai yaesu
    sammathin raagaa sandhinthumu vaeg
    aa … aanandhamu

    Boorashabdhinchagaanae – vaanchalu theerutaku
    mithrunichentha bhakthulandharu cheri
    harshambuthoada paadi sthuthinthumu
    aa … aanandhamu

    Bhoomi goathramulunu – dhaeshaadhikaarulunu
    immaanuyaeluchae nyaaya theerpupondh
    immuga maemunu chaerudhu machchat
    aa … aanandhamu

    Vaeyaendla raajyamuna bhooloaka raajyamulu
    theerina pidhapa mithrunithoa maemu
    jayapradhulamai nithyamaeludhumu
    aa … aanandhamu

  • Mahaaraajaa yaesu మహారాజా యేసు

    మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాక

    ఘనత ప్రభావము నీదే నిత్యరాజ్యము నీదే

    కన్యగర్భమున జన్మించ సంకల్పించుకొన్నావే
    పాపమెల్ల నాశము చేయ పాపి రూపము దాల్చితివే

    సిలువశ్రమలను సహించి మరణము రుచించితివే
    ప్రాణము పెట్టి మము రక్షించి తండ్రిని తృప్తిపరచితివే

    పాప మరణ నరకమునుండి రక్షింప సంకల్పించి
    త్రియేక దేవునితో జేర్చ చెడుగు తీసి వేసితివే

    పాపీ దేవునిచే మారు మనస్సును పొందుమా
    ఆత్మానుగ్రహ కాలమున వచ్చి రక్షణ పొందుమా


    Mahaaraajaa yaesu neekae mahima kalugu gaak

    Ghanatha prabhaavamu needhae nithyaraajyamu needhae

    Kanyagarbhamuna janmincha sankalpinchukonnaavae
    paapamella naashamu chaeya paapi roopamu dhaalchithivae

    Siluvashramalanu sahinchi maranamu ruchinchithivae
    praanamu petti mamu rakshinchi thandrini thrupthiparachithivae

    Paapa marana narakamunundi rakshimpa samkalpinchi
    thriyaeka dhaevunithoa jaercha chedugu theesi vaesithivae

    Paapee dhaevunichae maaru manassunu pondhumaa
    aathmaanugraha kaalamuna vachchi rakshna pondhumaa

  • Mahaavaidhyumdu మహావైద్యుండు

    మహావైద్యుండు వచ్చెను – బ్రజాళి బ్రోచు యేసు
    సహాయ మియ్యవచ్చెను – సంధింపరండి యేసున్

    మాధుర్యంపు నామము – మోదమిచ్చుగానము
    వేదవాక్య సారము – యేసు దివ్యయేసు

    మీపాపమెల్ల బోయెను – మేలొందు డేసు పేరన్
    గృపా సంపూర్ణ మొందుడి – యపార శాంతుడేసు

    వినుండి గొర్రెపిల్లను – విశ్వాసముంచి యేసున్
    ఘనంబుగన్ స్తుతించుడి – మనంబుప్పొంగ యేసున్

    ఆ రమ్యమైన నామము – అణంచు నెల్ల భీతిన్
    శరణ్యులైనవారి నా – దరించు నెంత ప్రీతిన్

    ఓ యన్నలారా – పాడుడీ యౌదార్యతన్ సర్వేశున్
    ఓ యమ్మలారా మ్రొక్కుడీ – ప్రియాతి ప్రియుడేసు

    ఓ పిల్లలారా కొల్వుడీ – యౌన్నత్యరాజు నేసున్
    దపించువారి దాతయౌ – దయామయున్ శ్రీ యేసు

    శ్రీయేసుకై యర్పించుడీ – మీ యావజ్జీవమును
    ప్రియంపు దాసులౌచుచు – రయంబు కొల్వుడేసున్


    Mahaavaidhyundu vachchenu – brajaali broachu yaesu
    sahaaya miyyavachchenu – sandhimparanndi yaesun

    Maadhuryampu naamamu – moadhamichchugaanamu
    vaedhavaakya saaramu – yaesu dhivyayaesu

    Meepaapamella boayenu – maelondhu daesu paeran
    grupaa sampoorna mondhudi – yapaara shaamthudaesu

    Vinundi gorrepillanu – vishvaasamunchi yaesun
    ghanambugan sthuthinchudi – manambupponga yaesun

    Aa ramyamaina naamamu – anamchu nella bheethin
    sharanyulainavaari naa – dharimchu nentha preethin

    Oa yannalaaraa – paadudee yaudhaaryathan sarvaeshun
    oa yammalaaraa mrokkudee – priyaathi priyudaesu

    Oa pillalaaraa kolvudee – yaunnathyaraaju naesun
    dhapinchuvaari dhaathayau – dhayaamayun shree yaesu

    Shreeyaesukai yarpinchudee – mee yaavajjeevamunu
    priyampu dhaasulauchuchu – rayambu kolvudaesun

  • Mukthi ganarae ముక్తిఁ గనరే

    ముక్తిఁ గనరే మీ మనంబుల శక్తిగల రక్షకుని పలుకులు ముక్తిసాధన
    ములకు మూలము భక్తిగొని యానంద మొందరే ||ముక్తి||

    పాపభారము క్రింద శ్రమపడు పాపులారా రండు నేనే ప్రాపు నెమ్మది
    మీకిడుదునని పరమరక్షకుఁ డాన తిచ్చెను ||ముక్తి||

    ఇచ్ఛయించెడు వాఁడు యిచటికి వచ్చి జీవజలంబు రుచిగా పుచ్చు
    కొనుగా కనుచుఁ బల్కెను సచ్ఛరితుఁడు మనుష్య పుత్రుఁడు ||ముక్తి||

    ఆకసమునందుండి యిటు దిగి లోకమునకుఁ జీవము నొసఁగునది
    ఈ కడనె యున్న దది నేనను యేసు ప్రభు వాక్కు మధురాన్నము ||ముక్తి||

    నేనె మార్గము నేనె సత్యము నేనె జీవము నావలననే గాని యెపఁడును
    తండ్రి యొద్దికి రానలవిగాదని వచించెను ||ముక్తి||

    జీవజలము నుద్రావుటకు మీ భావన లనెడి పాత్ర ముంచుచు చేవఁ
    గొని పానించుచు నిరత జీవమును వెలుఃగొంది బ్రతుకను ||ముక్తి||

    ఎక్కడను యిటువంటి ప్రభువును మక్కువను వేసారి వెతకిన చిక్క(బో
    డిటువచ్చి జూడుడి గ్రక్కునను జేసట్టు డిప్పుడే ||ముక్తి||


    Mukthi ganarae mee manambula shakthigala
    rakshkuni palukulu mukthisaadhana
    mulaku moolamu bhakthigoni yaanandha momdharae ||mukthi||

    Paapabhaaramu krindha shramapadu paapulaaraa
    randu naenae praapu nemmadhi
    meekidudhunani paramarakshku daana thichchenu ||mukthi||

    Ichchayimchedu vaadu yichatiki vachchi
    jeevajalambu ruchigaa puchchu
    konugaa kanuchu balkenu sachcharithudu
    manushya puthrudu ||mukthi||

    Aakasamunandhundi yitu dhigi loakamunaku
    jeevamu nosagunadhi
    ee kadane yunna dhadhi naenanu yaesu prabhu
    vaakku madhuraannamu ||mukthi||

    Naene maargamu naene sathyamu naene
    jeevamu naavalananae gaani yepadunu
    thandri yodhdhiki raanalavigaadhani
    vachinchenu ||mukthi||

    Jeevajalamu nudhraavutaku mee bhaavana
    lanedi paathra munchuchu chaeva
    goni paaninchuchu niratha jeevamunu
    veluhgondhi brathukanu ||mukthi||

    Ekkadanu yituvanti prabhuvunu makkuvanu
    vaesaari vethakina chikka(boa
    dituvachchi joodudi grakkunanu
    jaesattu dippudae ||mukthi||

  • Moodu dashaabdaala మూడు దశాబ్దాల

    మూడు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని
    దీవించిన దేవా నీకు వందనం (2)
    వందనం వందనం…
    వందనం నీకే మా వందనం (2) దేవా ||మూడు దశాబ్దాల||

    పాపులమైన మమ్మును
    వెదకి రక్షించినందుకు
    ఏమియు లేని మాకు
    అన్నిటిని నొసగినందుకు (2) ||వందనం||

    బలవంతులుగా చేసి
    మూడు బాణాలను ఇచ్చినందుకు
    మా భోజనపు బల్ల చుట్టు
    ఒలీవ మొక్కల వలె పెంచినందుకు (2) ||వందనం||

    మా కష్టాలలో, దుఃఖాలలో
    మమ్ము కాచిన దేవా
    మా వ్యాధులను, బాధలను
    తీర్చిన దేవా (2) ||వందనం||


    Moodu Dashaabdaala Vaivaahika Jeevithaanni
    Deevinchina Devaa Neeku Vandanam (2)
    Vandanam Vandanam…
    Vandanam Neeke Maa Vandanam (2) Devaa ||Moodu Dashaabdaala||

    Paapulamaina Mammunu
    Vedaki Rakshinchinanduku
    Emiyu Leni Maaku
    Annitini Nosaginanduku (2) ||Vandanam||

    Balavanthulugaa Chesi
    Moodu Baanaalanu Ichchinanduku
    Maa Bhojanapu Balla Chuttu
    Oliva Mokkala Vale Penchinanduku (2) ||Vandanam||

    Maa Kashtaalalo, Dukhaalalo
    Mammu Kaachina Devaa
    Maa Vyaadhulanu, Baadhalanu
    Theerchina Devaa (2) ||Vandanam||

  • Muddha banti poosene ముద్ద బంతి పూసెనె

    ముద్ద బంతి పూసెనె – కొయిలమ్మ కూసెనె
    ఆఅనన్డమ్ వెల్లివిరిసెనె – (ఏఎ బన్దమ్ నిట్యమ్ నిలిచెనె)(2)/2/

    ప్రెల్లనె ఈ బన్దమ్ – ఆనురాగపు అనుబన్దమ్
    ఠీయనైన మకరన్డమ్ – ఇగిరిపొని సుమగన్దమ్ /2/
    ఠొడుగా ఈడు జొడుగ – జన్టగ కనుల పన్టగ /2/
    Pఅన్డాలి బ్రటుకు నిన్డాలి – డామ్పట్యమె వెలుగుటున్డాలి /2/ముడ్డ/

    దెవుడె యెర్పరచిన డివ్యమైన డీబన్దమ్
    క్రీస్టు ఎసు సన్ఘమునకు పొల్చబడిన సమ్బన్దమ్ /2/
    ఢెవుడె జట చెయగా – సాద్యమ వెరు చెయగా /2/
    కలటలె లెక సాగాలి – కలలన్ని నిజము కావాలి /2/ముడ్డ/


    Muddha banthi poosene – Koyilamma Koosene
    Aanandam vellivirisene – (Ee bandham nityam nilichene)(2)/2/

    Prellane ee bandham – Anuraagapu anubandham
    Teeyanaina makarandam – igiriponi sumagandham /2/
    Todugaa eedu joduga – jantaga kanula pantaga /2/
    Pandaali bratuku nindaali – daampatyame velugutundaali /2/mudda/

    dhevude yerparachina divyamaina deebandham
    Kreestu Yesu sanghamunaku polchabadina sambandham /2/
    Devude jata cheyagaa – saadhyama veru cheyagaa /2/
    Kalatale leka saagaali – kalalanni nijamu kaavaali /2/mudda/

  • Mahimathoa mana మహిమతో మన

    మహిమతో మన యేసు ఇహమునకు వేంచేయున్ సహోదరులారా
    మన మా మహిమలో వెలుఁగుదుము ||మహిమతో||

    మోములు వంచి యేసు నామము నుతియించు పామరులమైన మనలఁ
    బ్రేమతోఁ గప్పినాఁడే ||మహిమతో||

    పాత్రులమా మనము శత్రులమే కాదా మిత్రులన్ జేసిన వి చిత్రము
    తెలియలేము ||మహిమతో||

    శిరముల పైని జీవ కిరీటములతోను బరమ దేవుని వరములు మురి
    యుచు మరువలేము ||వచుహిమతో||

    వీణెలతో మనము నాణెమైన పాట ఋణము చెల్లింపలేమని యణఁ
    గి మణఁగి పాడుదుము ||మహిమతో||


    Mahimathoa mana yaesu ihamunaku
    vaenchaeyun sahoadharulaaraa
    mana maa mahimaloa velugudhumu ||mahimathoa||

    Moamulu vanchi yaesu naamamu nuthiyinchu
    paamarulamaina manala
    braemathoa gappinaadae ||mahimathoa||

    Paathrulamaa manamu shathrulamae kaadhaa
    mithrulan jaesina vi chithramu
    theliyalaemu ||mahimathoa||

    Shiramula paini jeeva kireetamulathoanu
    barama dhaevuni varamulu muri
    yuchu maruvalaemu ||vachuhimathoa||

    Veenelathoa manamu naamemaina paata
    runamu chellimpalaemani yana
    gi managi paadudhumu ||mahimathoa||

  • Mahimathoa nimdina మహిమతో నిండిన

    మహిమతో నిండిన మా రాజా – మహిమతో తిరిగి వచ్చువాడా
    శరీరమును దాని క్రియలెల్లను
    ఆశతో వాక్యముచే తొలగించుము – వచ్చి తొలగించుము

    ఆకస ఆసనమును వీడి – లోకమును జూడ వచ్చితివి
    ఇంపుగ వాసము చేయుటకు
    సొంపుగ లోన – ప్రవేశించుము ప్రవేశించుము

    గుడారమున వసించితివి తోడ నిలిచితివి మేఘమువలె
    కొఱతలేక జనుల నడిపితివి
    వాక్య ప్రకారము కోరి రమ్ము – నేడు కోరి రమ్ము

    ఇశ్రాయేలీయులతో నేగితివి ఎజ్రాతోడనే యుంటివి
    సొలమోను గుడులో వసియించితివి
    కాలమెల్ల మాతో నుండుము మాతో నుండుము

    గిరిపైన చూపిన మాదిరిని మరువక సొంపుగ చేసితివి
    అక్కరగా మనము లోబడిన
    చక్కగా మనలను పాలించును యేసు

    భూమ్యాకాశములు పట్టని వ్యోమపీఠుడు భువికి వచ్చెన్
    నీతితో రాజ్యము నేలుటకు
    జ్యోతితోడ లోన వచ్చునేసు నేడు వచ్చు నేసు

    హల్లెలూయ పాట చాటింపన్ ఆశతో నిన్నాహ్వానింపన్
    ఫలము లనేకము లర్పించన్
    ఎల్లరిలోన ప్రవేశించుము ప్రవేశించుము


    Mahimathoa nindina maa raajaa
    mahimathoa thirigi vachchuvaadaa
    shareeramunu dhaani kriyalellanu
    aashathoa vaakyamuchae tholaginchumu
    vachchi tholaginchumu

    Aakasa aasanamunu veedi – loakamunu jooda vachchithivi
    impuga vaasamu chaeyutaku
    sompuga loana – pravaeshinchumu pravaeshinchumu

    Gudaaramuna vasimchithivi thoada nilichithivi maeghamuvale
    korathalaeka janula nadipithivi
    vaakya prakaaramu koari rammu – naedu koari rammu

    Ishraayaeleeyulathoa naegithivi ejraathoadanae yuntivi
    solamoanu guduloa vasiyinchithivi
    kaalamella maathoa nundumu maathoa nundumu

    Giripaina choopina maadhirini maruvaka sompuga chaesithivi
    akkaragaa manamu loabadin
    chakkagaa manalanu paalinchunu yaesu

    Bhoomyaakaashamulu pattani vyoamapeetudu bhuviki vachchen
    neethithoa raajyamu naelutaku
    jyoathithoada loana vachchunaesu naedu vachchu naesu

    Hallelooya paata chaatimpan aashathoa ninnaahvaanimpan
    phalamu lanaekamu larpimchan
    ellariloana pravaeshinchumu pravaeshinchumu