Category: Telugu Worship Songs Lyrics

  • Kontha Yedamu Neevainaa కొంత యెడము నీవైనా

    కొంత యెడము నీవైనా నే సాగలేను
    నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను
    కొంత యెడము నీవైనా

    మరచిన వేళలో మది నీ పలుకులు
    సడలి కట్టడలు మలినము తలపులు (2)
    ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2)
    మరియొక్క మారు మన్నించు విభుడా (2) ||కొంత యెడము||

    కనులకు మోహము కమ్మిన క్షణము
    వినుట మరచె నీ స్వరమును హృదయము (2)
    కమ్మిన పొరలు కరిగించుటకు (2)
    నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2) ||కొంత యెడము||

    మదము, మత్సరములు సోకిన తరుణము
    పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2)
    నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2)
    నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2) ||కొంత యెడము||

    మనుజ రూపమున మహిలో నిలిచి
    మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి (2)
    నను వరియించగ రానున్న ప్రియుడా (2)
    నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా (2) ||కొంత యెడము||


    Kontha Yedamu Neevainaa Ne Saagalenu
    Nimishamaina Ninnu Vidichi Ne Brathukalenu
    Kontha Yedamu Neevainaa

    Marachina Velalo Madi Nee Paluku
    Sadali Kattadalu Malinamu Thalapulu (2)
    Premanu Panche Prema Roopudaa (2)
    Mari Yokka Maaru Manninchu Vibhudaa (2) ||Kontha Yedamu||

    Kanulaku Mohamu Kammina Kshanamu
    Vinuta Marache Nee Searamunu Hrudayamu (2)
    Kammina Poralu Kariginchutaku (2)
    Nadupu Nee Vaipuku Hrudi Velugutaku (2) ||Kontha Yedamu||

    Madamu Mathsaramulu Sokina Tharunamu
    Paashamu Premaku Vigathamu Praapthamu (2)
    Nirathamu Sthiramuga Nunna Akshayudaa (2)
    Nilupumu Nee Krupalo Nannu Raksakudaa (2) ||Kontha Yedamu||

    Manuja Roopamuna Mahilo Nilichi
    Manishi-kasaadhyamou Maranamu Gelichi (2)
    Nanu Variyinchaga Raanunna Priyudaa (2)
    Ninnedurukonaga Mathi Niyyu Varudaa (2) ||Kontha Yedamu||

  • Yesu Naathaa Devaa యేసు నాథా దేవా

    యేసు నాథా దేవా
    వందనాలు రాజా.. వందనాలు
    రాజాధి రాజా నీకే వందనాలు
    రవి కోటి తేజా నీకే వందనాలు (2) ||యేసు నాథా||

    పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావు
    పరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి (2)
    పన్నెండు గుమ్మముల…
    పట్టణమే నాకు కట్టిపెట్టినావా ||రాజాధి రాజా||

    నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు
    నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు (2)
    నీ నీతి నీ రాజ్యం…
    నిండైన నా భాగ్యమే ||రాజాధి రాజా||

    హీనుని దీవించి ఘనునిగా చేసావు
    నీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు (2)
    నా సల్లనయ్యా…
    నా యన్న నీవే నా యేసయ్యా ||రాజాధి రాజా||

    కన్ను మిన్ను గానకుండా నిన్ను మీరిపోయాను
    చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు (2)
    నీ మనసే వెన్నయ్యా…
    నా కన్న తండ్రి నా యేసయ్యా ||రాజాధి రాజా||


    Yesu Naathaa Devaa
    Vandanaalu Raajaa.. Vandanaalu
    Raajaadhi Raajaa Neeke Vandanaalu
    Ravi Koti Thejaa Neeke Vandanaalu (2) ||Yesu Naathaa||

    Paapini Karuninchi Praana Daanamichchaavu
    Parama Jeevamichchi Paraloka Raajyamichchi (2)
    Pannendu Gummamula…
    Pattaname Naaku Kattipettinaavaa ||Raajaadhi Raajaa||

    Neechuni Preminchi Nee Praanamichchaavu
    Nee Neethi Naakichchi Nithya Raajyamichchaavu (2)
    Nee Neethi Nee Raajyam…
    Nindaina Naa Bhaagyame ||Raajaadhi Raajaa||

    Heenuni Deevinchi Ghanuniga Chesaavu
    Nee Rudhirame Kaarchi Naa Runamu Deerchaavu (2)
    Naa Sallanayyaa…
    Naa Yanna Neeve Naa Yesayyaa ||Raajaadhi Raajaa||

    Kannu Minnu Gaanakundaa Ninnu Meeripoyaanu
    Chinnabuchchukokundaa Nannu Samakoorchaavu (2)
    Nee Manase Vennayyaa…
    Naa Kanna Thandri Naa Yesayyaa ||Raajaadhi Raajaa||

  • Konthasamayamae కొంతసమయమే

    కొంతసమయమే మిగిలినది – క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్
    లేశమైనను జాగుచేయడు

    ప్రభు వచ్చువరకు కనిపెట్టుము – నిశ్చయముగా ఆయన వచ్చును
    ప్రభురాక నెవరు ప్రేమింతురో వారిని ప్రభువు కొనిపోవును

    ఆయన రాకడ సమీపము – సహవాసములో నిలిచియుండి
    ప్రభు వాక్యమునకు లోబడియు – ఆయన కొరకై కనిపెట్టెదం

    అడుగంటుచున్నది ఆత్మీయత – అందరి ప్రేమలు చల్లారెగా
    కన్నులు తెరచి మేల్కొనుడి – విడువబడిన మీగతి యేమగున్

    నోవహు కాలమున్ స్మరియింతుము – సమస్తమును దిద్దుకొని
    విడుదల దిన మాసన్నమాయె – విమోచనా విశ్రాంతి నిచ్చు


    Konthasamayamae migilinadhi
    kreesthaesu prabhuvu thirigi vachchun
    laeshamainanu jaaguchaeyadu

    Prabhu vachchuvaraku kanipettumu
    nishchayamugaa aayana vachchunu
    prabhuraaka nevaru praeminthuroa
    vaarini prabhuvu konipoavunu

    Aayana raakada sameepamu
    sahavaasamuloa nilichiyundi
    prabhu vaakyamunaku loabadiyu
    aayana korakai kanipettedham

    Adugantuchunnadhi aathmeeyatha
    andhari praemalu challaaregaa
    kannulu therachi maelkonudi
    viduvabadina meegathi yaemagun

    Noavahu kaalamun smariyinthumu
    samasthamunu dhidhdhukoni
    vidudhala dhina maasannamaaye
    vimoachanaa vishraamthi nichchu

  • Kantini goppa కంటిని గొప్ప

    కంటిని గొప్ప ముత్యము – పొందితి హర్షము
    తింటిని జీవాహారము – గ్రోలితి స్నేహము

    మాత పితృడు యేసుడ – ద్భుత రాజాయనే
    గుడ్డలు చుట్టబడెను – మందల కాపరి

    ఆదియంత రహితుడు – జ్యోతిర్మయ ప్రభు
    నార్తులకు నాయకుడు – జాతిగోత్రరహితుడు

    యూదా గోత్రంపు సింహమా – పితృల దైవమా
    నాథా నా హేమ మకుటమా – పాదముల బడితిమి

    కర్తాదికర్త యేసువా – రాజాధిరాజవు
    షారోను రోజా పుష్పమా – మరలవత్తువు

    మార్గం సత్యం జీవమా – రోషంపు దేవుడా
    కుంకని యాజకుండవు – ప్రకాశమయుడా

    హల్లెలూయాకు పాత్రుడా – ఎల్లరి రక్షకా
    రాతి గుండె కరిగింతువు – నీవే సమస్తము


    Kantini goppa muthyamu – pondhithi harshmu
    thintini jeevaahaaramu – groalithi snaehamu

    Maatha pithrudu yaesuda – dhbhutha raajaayanae
    guddalu chuttabadenu – mandhala kaapari

    Aadhiyantha rahithudu – jyoathirmaya prabhu
    naarthulaku naayakudu – jaathigoathrarahithudu

    Yoodhaa goathranpu simhamaa – pithrula dhaivamaa
    naaThaa naa haema makutamaa – paadhamula badithimi

    Karthaadhikartha yaesuvaa – raajaadhiraajavu
    Shaaroanu roajaa pushpamaa – maralavaththuvu

    Maargam sathyam jeevamaa – roashampu dhaevudaa
    kunkani yaajakundavu – prakaashamayudaa

    Hallelooyaaku paathrudaa – ellari rakshkaa
    raathi gunde kariginthuvu – neevae samasthamu

  • Odduchaeri nee yedhuta ఒడ్డుచేరి నీ యెదుట

    ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా
    ఒక్క యాత్మనైన లేక సిగ్గుపడి పోదునా

    ఒక్క యాత్మనైన నేను – రక్షించక యేసువా
    వట్టి చేతులతో నిన్ను – దర్శించుట తగునా

    ఆత్మలందు వాంఛలేక – సోమరులై కాలమున్
    వ్వర్థపర్చు వారన్నాట – చింతతోడ నిల్తురు

    యేసువా నా స్వరక్షణ – నిశ్చయంబు ఐనదే
    అయిన ఫలితంబు చూడ – కష్టపడక పోతినే

    కాలమెల్ల గడ్చిపోయెన్ – మోసపోతి నేనయ్యో
    గడ్చినట్టి కాలమైతే – ఏడ్చినను వచ్చునా

    భక్తులార ధైర్యముతో – లేచి ప్రకాశించుడీ
    ఆత్మలెల్ల యేసునొద్ద – చేరునట్లు చేయుడీ


    Odduchaeri nee yedhuta nilchunapdu rakshkaa
    okka yaathmanaina laeka siggupadi poadhunaa

    Okka yaathmanaina naenu – rakshinchaka yaesuvaa
    vatti chaethulathoa ninnu – dharshinchuta thagunaa

    Aathmalandhu vaanChalaeka – soamarulai kaalamun
    vvarthaparchu vaarannaata – chinthathoada nilthuru

    Yaesuvaa naa svarakshna – nishchayanbu ainadhae
    ayina phalithanbu chooda – kashtapadaka poathinae

    Kaalamella gadchipoayen – moasapoathi naenayyoa
    gadchinatti kaalamaithae – aedchinanu vachchunaa

    Bhakthulaara dhairyamuthoa – laechi prakaashimchudee
    aathmalella yaesunodhdha – chaerunatlu chaeyudee

  • Okkokka ganta ఒక్కొక్క గంట

    యేసూ నా ప్రభువా – నీ ప్రేమ లేకున్న
    నా యాత్మ కేదియు – విశ్రాంతి నియ్యదు

    ఒక్కొక్క గంట నేను – నిన్నాశించుకొందు
    నీ యాశీర్వాదమిమ్ము – నా రక్షకా

    యేసూ, రేబగళ్ళు – నాయొద్ద నుండుము
    నాతో నీ వుండిన – ఏ భయముండదు

    సుఖంబు బొందగా – నిన్నే యాశింతును
    దుఃఖంబు నొందగా నీవే శరణ్యము

    నీదు మార్గమందున – నే నడ్వనేర్పుము
    నీ మాట చొప్పున – నన్నున్ దీవించుము

    నిన్నే యాశింతును – యేసూ నా ప్రభువా
    నీ వంటి వాడనై – నన్నుండ జేయుము


    Yaesoo naa prabhuvaa – nee praema laekunn
    naa yaathma kaedhiyu – vishraanthi niyyadhu

    Okkokka ganta naenu – ninnaashinchukondhu
    nee yaasheervaadhamimmu – naa rakshkaa

    Yaesoo, raebagaLLu – naayodhdha nundumu
    naathoa nee vundina – ae bhayamundadhu

    Sukhambu bondhagaa – ninnae yaashinthunu
    dhuhkhmbu nondhagaa neevae sharanyamu

    Needhu maargamandhuna – nae nadvanaerpumu
    nee maata choppuna – nannun dheevinchumu

    Ninnae yaashinthunu – yaesoo naa prabhuvaa
    nee vanti vaadanai – nannunda jaeyumu

  • Aikyaparachumayya ఐక్యపరచుమయ్యా

    ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
    సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను
    మధుర ప్రేమతో మనసులు కలువ
    హృదయ సీమలే ఒకటిగ నిలువ
    నీ దీవెనలే పంపుమా

    ఆనందముతోడ దు:ఖమునే గెల్వ
    చిరునవ్వుతోడ కష్టముల నోర్వ
    సంసార నావను సరిగా నడిపించ
    నీవే సహాయమీయుమా

    ప్రార్ధనా జీవితము సమాధనము
    భక్తి విశ్వాసము నీతి న్యాయము
    నీవు చేపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం
    అనుగ్రహించి నడిపించుమా

    ఇహలోకభోగముపై మనసుంచక
    పరలోక భాగ్యముపై క్ష్యముంచగ
    నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై
    సాగే కృప దయచేయుమా


    Aikyaparachumayya ee vadhuvarulanu
    Saukyamichchikayumu navadampatulanu
    Madhura premato manasulu kaluva
    Hrudaya simale okatiga niluva
    Ni divenale pampuma

    Anamdamutoda du:Kamune gelva
    Chirunavvutoda kashtamula norva
    Samsara navanu sariga nadipimcha
    Nive sahayamiyuma

    Prardhana jivitamu samadhanamu
    Bakti visvasamu niti nyayamu
    Nivu chepina kanikaram nivu nerpina satvikam
    Anugrahimchi nadipimchuma

    Ehalokabogamupai manasumchaka
    Paraloka bagyamupai kshyamumchaga
    Nikemto ishtulai dharalo ni sakshulai
    Sage krupa dayacheyuma

  • Aemi naenu samarpimthu ఏమి నేను సమర్పింతు

    ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి
    సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు
    నీకు ||నేమి||

    నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ
    దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము
    ||నేమి||

    అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను
    వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు
    ||ఏమి||

    నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ
    జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి
    నాలించు ||మేమి||

    నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచు కొందును
    నేను సిగ్గు నొంది నిజముగఁ గుందుచు నేను వేఁడుకొందు నీ
    క్షమాపణ కొరకు ||నేమి||

    నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని
    మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు
    ||డేమి||


    Aemi naenu samarpinthu yaesoo
    yetlu ninnu sthuthiyinthu aemi
    samarpinthu heenuda nagu naenu
    gaamithaarthamu lella galugjaeyu neeku ||naemi||

    Naenu maargamu dhappiyundga nannu
    neevu kantivi karuna nindga
    dheenapaapulanu dhrudamug broavanu dhaana
    michchithivi thanara nee praanamu ||naemi||

    Andhari kora keevu thechchina migula
    andhamaina nithya rakshna andhi ninnu
    vinathi pomdhug jaesedha nondhu maa
    naa nuthi nuththama prabhu kreesthu ||aemi||

    Nee yandhae yaanandha modhaga yaesu
    needhaina yaathma naakandhga
    jaeyu manchu neeku jaesedh braarThana
    naayandhu dhayachaesi naa manavinaalinchu ||maemi||

    Naenu jaesina yaghamu lellanu gartha
    nee yedhut dhalanchu kondhunu
    naenu siggu nondhi nijamug gundhuchu
    naenu vaedukondhu nee kshmaapana koraku ||naemi||

    Nannu neevu sthiraparachumu kartha
    yannita nanu balaparuchumu thinnani
    maargamuna dhrudamuga naeguchu ninnu nae
    sthuthiyinthu ninduga nellappu ||daemi||

  • Aemi thechchi ninnu ఏమి తెచ్చి నిను

    ఏమి తెచ్చి నిను దర్శింతునయా
    ఏ రీతిగా నిను పూజింతునయా
    వినయముగా నీ సన్నిధి మ్రొక్కి
    స్తుతియాగము చేతునయా

    వెండి బంగారములు నీవే గదా
    కొండపైని పశువులు నీ వశమే గదా
    విరిగిన మనస్సు నలిగిన హృదయం
    నీవు కోరిన దూపమాయ ||ఏమి||

    ప్రథమ ఫలములు నీ సేవకీయనా
    దహన బలుల నైవేద్యమీయనా
    సజీవయాగముగా దేహమర్పించుట
    నీదు దృష్టికి యుక్తమయా ||ఏమి||

    మంచి తైలముతో అభిషేకించనా
    ఎంచి కానుకలిచ్చి భజయించనా
    న్యాయముగా నడచుట కనికరము చూపుట
    నీకిష్టమైన యాగమయా ||ఏమి||


    Aemi thechchi ninu dharshinthunayaa
    ae reethigaa ninu poojinthunayaa
    vinayamugaa nee sannidhi mrokki
    sthuthiyaagamu chaethunayaa

    Vendi bangaaramulu neevae gadhaa
    kondapaini pashuvulu nee vashamae gadhaa
    virigina manassu naligina hrudhayam
    neevu koarina dhoopamaaya ||aemi||

    Prathama phalamulu nee saevakeeyanaa
    dhahana balula naivaedhyameeyanaa
    sajeevayaagamugaa dhaehamarpinchut
    needhu dhrushtiki yukthamayaa ||aemi||

    Manchi thailamuthoa abhishaekinchanaa
    enchi kaanukalichchi bhajayimchanaa
    nyaayamugaa nadachuta kanikaramu chooput
    neekishtamaina yaagamayaa ||aemi||

  • Chalu chalu చాలు చాలు చాలు

    చాలు చాలు చాలు
    నాకు యేసు చాలు చాలు చాలు (2)

    అమ్మ నాన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్న
    నన్ను తన కౌగిట్లో తను హత్తుకుంటాడు

    అక్కా అన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్న
    నాతో ఆటలాడి సరదాగా వుంటాడు


    Chalu chalu chalu
    Naku yesu chalu chalu chalu (2)

    Amma nanna kanna na yesuni prema minna
    Nannu tana kaugitlo tanu hattukumtadu

    Akka anna kanna na yesuni prema minna
    Nato ataladi saradaga vumtadu