Category: Telugu Worship Songs Lyrics

  • Kodi kuyu vela కోడి కూయు వేళ

    కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/
    జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/

    కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయి
    తీయనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి /2/
    అక్క అన్న తమ్ముడు చెల్లి …
    మనం కలసిపోదామా… యేసుని చెంతకు మనం కలసిపోదామా…
    కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/
    జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/

    కొత్త కొత్త కధలు ఎన్నో చెబుతారు
    బైబిల్ వాక్యములు మరెన్నో నేర్పిస్తారు /2/
    అక్క అన్న తమ్ముడు చెల్లి …
    మనం కలసిపోదామా… యేసుని చెంతకు మనం కలసిపోదామా…
    కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/
    జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/
    జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/
    జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/


    Kodi kuyu vela parugulettedam
    bible chetapattukuni sunday schooluku /2/
    jhoom lala u….. jhoom lala u…../2/

    Kammanaina maatalu yenno vuntaayi
    teeyanaina paatalu yennenno vastaayi /2/
    akka anna tammudu chili…
    manam kalasipodama… yesuni chentaku manam kalasipodamaa…
    kodi kuyu vela parugulettedam
    bible chetapattukuni sunday schooluku /2/
    jhoom lala u….. jhoom lala u…../2/

    Kotta kotta kadhalu yenno chebutaaru
    bible vaakyamulu marenno nerpistaaru /2/
    akka anna tammudu chili…
    manam kalasipodama… yesuni chentaku manam kalasipodamaa…
    kodi kuyu vela parugulettedam
    bible chetapattukuni sunday schooluku /2/
    jhoom lala u….. jhoom lala u…../2/
    jhoom lala u….. jhoom lala u…../2/
    jhoom lala u….. jhoom lala u…../2/

  • Koti kiranamula కోటి కిరణముల

    కోటి కిరణముల కాంతిని మించిన శాంతివి
    నీవేనయ్యా విశ్రాంతివి నీవేనయ్యా
    నీవే నా మార్గము నీవే నా సర్వము
    నీవే నా ఆధారము నీవే ఆశ్రయము

    పిండమునై నేనుండగా
    నీవు అండగా నిలిచితివే
    మెండైన నీదు దీవెనలొసగి
    తండ్రిగ చూచితివే ప్రేమతో బ్రోచితివే

    తల్లియు తండ్రియు విడచిన గాని
    నీ కృప వీడకను
    దాతవు నీవై తోడుగా నుండి
    ఆధారమైనావులే జీవనాధారమైనావులే


    Koti kiranamula kamtini mimchina samtivi
    Nivenayya visramtivi nivenayya
    Nive na margamu nive na sarvamu
    Nive na adharamu nive asrayamu

    Pimdamunai nenumdaga
    Nivu amdaga nilichitive
    Memdaina nidu divenalosagi
    Tamdriga chuchitive premato brochitive

    Talliyu tamdriyu vidachina gani
    Ni krupa vidakanu
    Datavu nivai toduga numdi
    Adharamainavule jivanadharamainavule

  • Haallelooyaa aaraadhana హాల్లేలూయా ఆరాధన

    హాల్లేలూయా ఆరాధన
    రాజాధి రాజు యేసునకే
    మహిమయు ఘనతయు
    సర్వాధికారి క్రీస్తునకే (2)
    చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ
    ఆ ప్రభుని కీర్తించెదం
    నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో
    స్తోత్రార్పణ చేసెదం ||హాల్లేలూయా||

    రూపింప బడక ముందే
    నన్ను ఎరిగితివి
    నా పాదములు జారకుండా
    రక్షించి నడిపితివి (2) ||చప్పట్లు||

    అభిషేక వస్త్రము నిచ్చి
    వీరులుగా చేసితివి
    అపవాది క్రియలను జయించే
    ప్రార్థన శక్తినిచ్చితివి (2) ||చప్పట్లు||


    Haallelooyaa aaraadhana
    raajaadhi raaju yesunake
    mahimayu ghanathayu
    sarvaadhikaari kreesthunake (2)
    chappatlu kottuchu – paatalu paaduchu
    aa prabhuni keerthinchedam
    naatyamu cheyuchu – uthsaaha dhwanulatho
    sthothraarpana chesedam ||haallelooyaa||

    Roopimpa badaka munde
    nannu erigithivi
    naa paadamulu jaarakundaa
    rakshinchi nadipithivi (2) ||chappatlu||

    Abhisheka vasthramu nichchi
    veerulugaa chesithivi
    apavaadi kriyalanu jayinche
    praarthana shakthinichchithivi (2) ||chappatlu||

  • Sumdhara rakshkaa సుందర రక్షకా

    సుందర రక్షకా!
    సృష్టియొక్క నాధా
    దేవమానవ పుత్రుఁడా
    నిన్నుఁ బ్రేమింతున్
    సదా సేవింతున్
    మదాత్మతోఁ గిరీటమా.

    మైదాన మంతయుఁ
    పచ్చిక బయళ్లు
    నొప్పగఁ బూచుచున్నవి
    ఐనను యేసుతో
    నాయన కాంతిలో
    దుఃఖములేనివారము.

    సూర్యుని కాంతియుఁ
    చంద్రుని శాంతియు
    ఎంతో శ్రేష్ఠమైయున్నవి.
    అట్లవి యున్న
    అన్నిటి కన్న
    యేసుని కాంతి గొప్పది.

    ఆనంద రక్షకా!
    ప్రజల నాధుఁడా
    దేవమానవ పుత్రుఁడా
    మహిమ, ఘనత
    స్తుతి, యారాధన
    నిరంతరంబు నీకగున్.


    Sundhara rakshkaa!
    srushtiyokka naadhaa
    dhaevamaanava puthrudaa
    ninnu braeminthun
    sadhaa saevinthun
    madhaathmathoa gireetamaa.

    Maidhaana manthayu
    pachchika bayaLlu
    noppag boochuchunnavi
    ainanu yaesuthoa
    naayana kaanthiloa
    dhuhkhamulaenivaaramu.

    Sooryuni kaanthiyu
    chandhruni shaanthiyu
    enthoa shraeshtamaiyunnavi.
    atlavi yunna
    anniti kanna
    yaesuni kaanthi goppadhi.

    Aanandha rakshkaa!
    prajala naadhuda
    dhaevamaanava puthruda
    mahima, ghanatha
    sthuthi, yaaraadhana
    nirantharanbu neekagun.

  • Samakoorchumu thandri సమకూర్చుము తండ్రి

    సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను ద్వరలోఁ దమ
    ప్రియ కొమరుఁడు శ్రమలకుఁ బూర్వం బమితాసక్తితో నడిగిన విధ
    మున ||సమ||

    దేశము రక్షణకై తండ్రి దేవుని మహిమార్థం నిజముగ వాసిగఁ
    గూర్పను భాసుర ఐక్యం బాశతో నిన్నిటు నడుగుచునుండఁగ ||సమ||

    యేసుని నామమున్ మమ్ముల నేకముజేయు మిఁకఁ దండ్రి
    నీ సిలువను జూ చుచు మే మిలలో వాసిగఁ బ్రేమతో వర్థిల్లుటకై
    ||సమ||


    Samakoorchumu thandri kraisthava
    sabhaloa naikyathanu dhvaraloa dhama
    priya komarudu shramalaku boorvam
    bamithaasakthithoa nadigina vidha muna ||sama||

    Dhaeshamu rakshnakai thandri dhaevuni
    mahimaardham nijamuga vaasiga
    goorpanu bhaasura aikyam baashathoa
    ninnitu naduguchunundga ||sama||

    Yaesuni naamamun mammula naekamujaeyu mika dhandri
    nee siluvanu joo chuchu mae milaloa
    vaasiga braemathoa varthillutakai ||sama||

  • Sanghamaa saagumaa సంఘమా సాగుమా

    సంఘమా సాగుమా
    ప్రభు ప్రేమలో సాగుమా
    పరిశుద్ధుల సంఘమై
    ప్రభు రాకడ వరకును

    క్రీస్తు ప్రేమ హతమార్చిన
    సౌలు పౌలుగా మారెనే
    పరిశుద్ధుల సంఘమునకై
    పత్రికలు వ్రాసెనే
    ప్రభు యేసుని వార్తను
    ఊరూరా చాటెనే
    తుది శ్వాస వరుకు
    ప్రభు కొరకై జీవింపసాగెనే

    పాపుల కొరకై ప్రభు యేసు
    ఈ లోకమునకొచ్చెనే
    పరలోకమే స్థిరమని
    ప్రకటింప సాగనే
    హృదయ శుద్ధి గలవారే
    దేవుని చూతురని చెప్పెనే
    సిద్ధపడిన వధువు సంఘమునకై
    ప్రభు మరల రానుండెనే


    Sanghamaa saagumaa
    prabhu premalo saagumaa
    parisuddhula sanghamai
    prabhu raakada varakunu

    Kreesthu prema hathamaarchina
    saulu paulugaa maareney
    parisuddhula sanghamunakai
    pathrikalu vraaseney
    prabhu yesuni vaarthanu
    oorooraa chaateney
    thudi swaasa varuku
    prabhu korakai jeevimpasaageney

    Paapula korakai prabhu yesu
    ee lokamunakocheney
    paralokamey sthiramani
    prakatimpa saaganey
    hrudaya shuddhi galavaarey
    devuni choothurani cheppeney
    siddhapadina vadhuvu sanghamunakai
    prabhu marala raanundeney

  • Yehoavaa saevakulaaraa యెహోవా సేవకులారా

    యెహోవా సేవకులారా స్తుతించుడి
    ఆయన నామమును స్తుతించుడి

    యెహోవా మందిర ఆవరణములలో
    నిలుచుండు వారలారా మీరు

    యెహోవా దయాళుడు ఆయన నామమును
    కీర్తించుడి అది మనోహరము
    యాకోబును తనకొర కేర్పరచుకొని
    ఇశ్రాయేలును స్వకీయ ధనముగా కొనెన్

    యెహోవా సకల దేవతల కంటెను
    గొప్పవాడని నేనెరుంగుదున్
    భూమ్యాకాశములు మహా సముద్రము
    లందాయన కిష్టమైనవి చేసెను

    భూమి దిగంతముల నుండి ఆవిరి
    లేవజేసి వాన కురియునట్లు
    మెరుపును పుట్టించి తన నిధులలో నుండి
    గాలిని బయలు వెళ్ళఁజేయు వాడాయనే

    ఐగుప్తు జనుల తొలిచూలులను
    పశువుల తొలిచూలుల జంపెను
    ఫరో యెదుట వాని ఉద్యోగుల యెదుట
    సూచనల మహాత్కార్యముల జేసె

    అన్యులనేకులను శక్తిగల
    రాజులనేకులను చంపెను
    అమోరీయుల రాజైన సీహోనును
    బాషాను రాజగు ఓగును చంపెను

    కనాను రాజ్యముల పాడుచేసియు
    నిశ్రాయేలేయుల కప్పగించెను
    యెహోవా నీ నామము నిత్యముండున్
    నీ జ్ఞాపకార్థము తర తరములకును

    యెహోవా తనదగు ప్రజలకు తానే
    న్యాయము తీర్చును హల్లెలూయ
    తన వారగు తన సేవకులను బట్టి
    సంతాపము నొందు నాయనల్లేలూయ


    Yehoavaa saevakulaaraa sthuthinchudi
    aayana naamamunu sthuthinchudi

    Yehoavaa mandhira aavaranamulaloa
    niluchundu vaaralaaraa meeru

    Yehoavaa dhayaaLudu aayana naamamunu
    keerthinchudi adhi manoaharamu
    yaakoabunu thanakora kaerparachukoni
    ishraayaelunu svakeeya dhanamugaa konen

    yehoavaa sakala dhaevathala kantenu
    goppavaadani naenerungudhun
    bhoomyaakaashamulu mahaa samudhramu
    landhaayana kishtamainavi chaesenu

    Bhoomi dhiganthamula nundi aaviri
    laevajaesi vaana kuriyunatlu
    merupunu puttinchi thana nidhulaloa nundi
    gaalini bayalu velljaeyu vaadaayanae

    Aigupthu janula tholichoolulanu
    pashuvula tholichoolula jampenu
    pharoa yedhuta vaani udhyoagula yedhut
    soochanala mahaathkaaryamula jaese

    Anyulanaekulanu shakthigal
    raajulanaekulanu champenu
    amoareeyula raajaina seehoanunu
    baashaanu raajagu oagunu champenu

    Kanaanu raajyamula paaduchaesiyu
    nishraayaelaeyula kappaginchenu
    yehoavaa nee naamamu nithyamundun
    nee jnyaapakaarthamu thara tharamulakunu

    Yehoavaa thanadhagu prajalaku thaanae
    nyaayamu theerchunu hallelooy
    thana vaaragu thana saevakulanu batti
    santhaapamu nondhu naayanallaelooy

  • Yehoavaaku kroththa యెహోవాకు క్రొత్త కీర్తన

    యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి
    యెహోవాను స్తుతించుడి

    భక్తులు కూడుకొను సమాజములో
    స్తోత్రగీతము పాడుడి

    ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను
    బట్టి సంతోషించెదరు గాక
    సీయోను జనులు తమ రాజును బట్టి
    ఆనందించుచు నుందురు గాక

    నాట్యముతో వారు తన నామమును
    శ్రేష్ఠముగా స్తుతింతురు గాక
    తంబురతోను సితారాతోను
    తనివి తీర పాడుదురు గాక

    యెహోవా ఆయన ప్రజల యందు
    మహా ప్రేమ కలిగినవాడు
    ఆయన బీదలను రక్షణతో
    అందముగ అలంకరించును

    భక్తులందరును ఘనతనొంది
    నిత్యము ప్రహర్షింతురు గాక
    సంతోషభరితులై పడకల మీద
    వింత గానము చేతురు గాక


    Yehoavaaku kroththa keerthana paadudi
    yehoavaanu sthuthinchudi

    Bhakthulu koodukonu samaajamuloa
    sthoathrageethamu paadudi

    Ishraayaeleeyulu thama srushtikarthanu
    batti santhoashinchedharu gaak
    seeyoanu janulu thama raajunu batti
    aanandhinchuchu nundhuru gaak

    Naatyamuthoa vaaru thana naamamunu
    shraeshtamugaa sthuthinthuru gaak
    thamburathoanu sithaaraathoanu
    thanivi theera paadudhuru gaak

    Yehoavaa aayana prajala yandhu
    mahaa praema kaliginavaadu
    aayana beedhalanu rakshnathoa
    andhamuga alankarinchunu

    Bhakthulandharunu ghanathanondhi
    nithyamu praharshinthuru gaak
    santhoshbharithulai padakala meedh
    vintha gaanamu chaethuru gaak

  • Yehoavaaku paadudi యెహోవాకు పాడుడి

    యెహోవాకు పాడుడి పాటన్
    అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని

    భూమియందంతట ప్రచురము చేయుడి
    ఆటంకము లేక దీని ప్రకటించుడి

    సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు
    అతి ఘనుండై నీ మధ్య – వసియించు చున్నాడు

    యెహొవా మన నీతి ౠజువు చేసెనని
    సీయోనులో క్రియలు వివరించెదము రండి

    శూన్య పట్టణములు నిండనందువలన
    యెహోవా నేనేయని వారు గ్రహించెదరు

    యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలె
    నింపెద మనుజులతో వారి పట్టణములను

    మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరు
    నీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు


    Yehoavaaku paadudi paatan
    athi shraeshta kaaryamulanu chaesina vaadani

    Bhoomiyandhanthata prachuramu chaeyudi
    aatankamu laeka dheeni prakatinchudi

    Seeyoanu vaasulaaraa ishraayaelu dhaevudu
    athi ghanundai nee madhya – vasiyinchu chunnaadu

    Yehovaa mana neethi trjuvu chaesenani
    seeyoanuloa kriyalu vivarinchedhamu randi

    Shoonya pattanamulu nindanndhuvalan
    yehoavaa naenaeyani vaaru grahinchedharu

    Yerooshlaem pandugaloa gorrela mandhalavale
    nimpedha manujulathoa vaari pattanamulanu

    Mandhira samrudhdhichae thrupthi pondhedharu
    nee yaanandha nadhiloa dhappi theerchukondhuru

  • Yehoavaanu gaanamu యెహోవాను గానము

    యెహోవాను గానము చేసెదము యేకముగా
    మనకు రక్షకుడాయనే – ఆయన మహిమ పాడెదము
    ఆయనను అర్ణించెదము – ఆయనే దేవుడు మనకు

    యుద్ధశూరుడేహోవా – నా బలము నా గానము
    నా పితరుల దేవుడు – ఆయన పేరు యెహోవాను

    ఫరోరథముల సేనలను – తన శ్రేష్ఠాధిపతులను
    ఎర్ర సముద్రములోన – ముంచివేసె నెహోవా

    నీ మహిమాతిశయమున – కోపాగ్ని రగులజేసి
    చెత్తవలె దహించెదవు – నేపై లేచువారిని

    దోపుడు సొమ్ము పంచుకొని – ఆశ తీర్చుకొందును
    నా కత్తి దూసెదను – అని శత్రువనుకొనెను

    వేల్పులలో నీ సముడెవడు – పరిశుద్ధ మహానీయుడా
    అద్భుతమైన పూజ్యుడా – నీవంటి వాడెవడు?

    ఇశ్రాయేలీయులంతా – ఎంతో సురక్షితముగా
    సముద్రము మధ్యను – ఆరిన నేలను నడచిరి


    Yehoavaanu gaanamu chaesedhamu yaekamugaa
    manaku rakshkudaayanae – aayana mahima paadedhamu
    aayananu arninchedhamu – aayanae dhaevudu manaku

    Yudhdhashoorudaehoavaa – naa balamu naa gaanamu
    naa pitharula dhaevudu – aayana paeru yehoavaanu

    Pharoarathamula saenalanu – thana shraeshtaadhipathulanu
    erra samudhramuloana – munchivaese nehoavaa

    Nee mahimaathishayamuna – koapaagni ragulajaesi
    cheththavale dhahinchedhavu – naepai laechuvaarini

    Dhoapudu sommu panchukoni – aasha theerchukondhunu
    naa kaththi dhoosedhanu – ani shathruvanukonenu

    Vaelpulaloa nee samudevadu – parishudhdha mahaaneeyudaa
    adhbhuthamaina poojyudaa – neevanti vaadevadu

    Ishraayaeleeyulanthaa – entho surakshithamugaa
    samudhramu madhyanu – aarina naelanu nadachiri