Category: Telugu Worship Songs Lyrics

  • Mana prabhuyaesu vachchedu మన ప్రభుయేసు వచ్చెడు

    మన ప్రభుయేసు వచ్చెడు వేళ
    మన సంతోష హృదయాలు చాల వెలసె

    భూదిగంత నివాసులారా
    పదిలముగ ప్రభు యేసుని చూచి
    ముదముగ రక్షణ మరి పొందుడి

    వారాయన తట్టు చూడగనే
    వారలకు వెలుగు కలిగెను
    వారి ముఖంబులు లజ్జింపకుండెన్

    మన విశ్వాసమునకు కర్తయు
    కొనసాగించెడి యేసుని చూచి
    వినయమున పరుగిడు పందెమున

    శిష్యులు కన్నులెత్తి చూడగను
    యేసే కనిపించెను వింతగను
    మోషే ఏలియాలు మరుగైరి

    ప్రభుయేసే మన పరిమళ ప్రియుడు
    మురిసెదము మన ప్రభువునందు
    మెరిసే మహిమలు మన భాగ్యమదే

    మంచి కాపరి మన ప్రభుయేసు
    మనకై తనదు ప్రాణము నిచ్చెను
    వినుడి మన రక్షకుని పిలుపు

    ఆనందముతో ఆర్భాటముతో
    అందమగు శ్రీ యేసుని జూచి
    హల్లెలూయా యని పాడెదము


    Mana prabhuyaesu vachchedu vaeL
    mana santhoasha hrudhayaalu chaala velase

    Bhoodhigantha nivaasulaaraa
    padhilamuga prabhu yaesuni choochi
    mudhamuga rakshna mari pomdhudi

    Vaaraayana thattu choodaganae
    vaaralaku velugu kaligenu
    vaari mukhmbulu lajjimpakunden

    Mana vishvaasamunaku karthayu
    konasaagimchedi yaesuni choochi
    vinayamuna parugidu pandhemun

    Shishyulu kannuleththi choodaganu
    yaesae kanipimchenu vimthaganu
    moashae aeliyaalu marugairi

    Prabhuyaesae mana parimaLa priyudu
    murisedhamu mana prabhuvunmdhu
    merisae mahimalu mana bhaagyamadhae

    Manchi kaapari mana prabhuyaesu
    manakai thanadhu praanamu nichchenu
    vinudi mana rakshkuni pilupu

    Aanmdhamuthoa aarbhaatamuthoa
    amdhamagu shree yaesuni joochi
    hallelooyaa yani paadedhamu

  • Mana dhaeshmbuna మన దేశంబున క్రీస్తు

    మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీలంచు
    మరువకమ్మ పనిబూని ప్రభుకొరకు పరదేశంబులయందు ఘనురాండ్రు
    చేయుపనుల్ వినలేదమ్మా?||

    సాటియైనటువంటి సాయంబవై పతికి లోటులేకుండ నెపుడు లోబడు
    మమ్మ పాటుపడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటుము మదిలోన
    బోధ నమ్ములమ్మ||

    అన్నపానములందు నలవాటులందు నీ పన్యులకు మాదిది వగుదు
    వమ్మ నిన్ను నీ పనుల గమ నించి పరీక్షించు చున్నవారింట బైట
    నున్నారమ్మ||

    ఘనుఁడౌ దేవుని వాక్య మును జదివియో వినియో దిన మేకాంతముగ
    ప్రార్థించు మమ్మ నినువలెను నీ పొరుగు నెలఁతుల ప్రేమింపవలె
    వినుమ దూషింపక దీ వించు మమ్మ||

    పనులెన్నో నీ కున్న ప్రభు యేసు శుభవార్త దినమున కొక్కరికైన
    దెల్పుమమ్మ ఒనరంగా నేఁడాది కొక యాత్మనైన నిక నెనరుతో రక్షింప
    నేర్చుకొమ్మ||

    ఎల్లసేవకుల కొర కెల్లప్పుడు ప్రార్థింప తల్లుల సమాజమునకు చెల్లు
    నమ్మ పల్లెలో శుభవార్త ప్రభవింపవలెనన్న తల్లులే మంచి సా
    ధనములమ్మ ||


    Mana dhaeshmbuna kreesthu suvaartha
    vyaapimchutaku maargambu sthreelmchu
    maruvakamma panibooni prabhukoraku
    paradhaeshmbulaymdhu ghanuraamdru
    chaeyupanul vinalaedhammaa||

    Saatiyainatuvmti saaymbavai pathiki
    loatulaekumda nepudu loabadu
    mamma paatupadi nee suthula
    bhayabhakthithoa pemchi naatumu madhiloana
    boadha nammulamma||

    Annapaanamulmdhu nalavaatulmdhu
    nee panyulaku maadhidhi vagudhu
    vamma ninnu nee panula gama nimchi
    pareekshimchu chunnavaarimta baita
    nunnaaramma||

    Ghanuaodau dhaevuni vaakya munu
    jadhiviyoa viniyoa dhina maekaamthamuga
    praarthimchu mamma ninuvalenu nee
    porugu nelaothula praemimpavale
    vinuma dhooShimpaka dhee vimchu mamma||

    Panulennoa nee kunna prabhu yaesu
    shubhavaartha dhinamuna kokkarikaina
    dhelpumamma onarMgaa naeaodaadhi koka
    yaathmanaina nika nenaruthoa rakshimpa
    naerchukomma||

    Ellasaevakula kora kellappudu praarthimpa
    thallula samaajamunaku chellu
    namma palleloa shubhavaartha prabhavimpavalenanna
    thallulae manchi saa Dhanamulamma ||

  • Mana dhaevuni మన దేవుని పట్టణమందాయన

    మన దేవుని పట్టణమందాయన – పరిశుద్ధ పర్వతమందు
    యెహోవా గొప్పవాడును – బహు కీర్తనీయుడై యున్నాడు

    ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన – సీయోను పర్వతము
    ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది

    దాని నగరులలో దేవుడాశ్రయముగా – ప్రత్యక్షంబగుచున్నాడు
    రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి – భ్రమపడి త్వరగా వెళ్ళిరి

    అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ – వేదన పట్టెను
    తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల – పగులగొట్టుచున్నావు

    సైన్యము లధిపతి యెహోవా దేవుని – పట్టణమునందు
    మనము వినినట్టి రీతిగా జరుగుట – మనము చూచితిమి

    మన దేవుడు నిత్యముగా దానిని స్థిర – పరచియున్నాడు
    దేవా నీ ఆలయ మందున నీ కృపను ధ్యానించితిమి

    దేవా నీ నామము ఎంత గొప్పదో – నీ సత్కీర్తియును
    భూదిగంతముల వరకు అంత – గొప్పదై యున్నది

    ఈ దేవుడు సదాకాలము మనకు – దేవుడై యున్నాడు
    మనల నడిపించును మరణపర్యంతము – హల్లెలూయా ఆమెన్


    Mana dhaevuni pattanammdhaayana
    parishudhdha parvathammdhu
    yehoavaa goppavaadunu
    bahu keerthaneeyudai yunnaadu

    Uththara dhikkuna mahaaraaju pattanamaina
    seeyoanu parvathamu
    unnathamai amdhamugaa sarvabhoomiki
    santhoashamichchu chunnadhi

    Dhaani nagarulaloa dhaevudaashrayamugaa
    prathyakshmbaguchunnaadu
    raajulaekamugaa koodi aashcharyapadi
    bhramapadi thvaragaa velliri

    Achchata vaarala vaNakunu prasaviMchu sthree
    vaedhana pattenu
    thoorpu gaalini raepi tharsheeshu oadala
    pagulagottuchunnaavu

    Sainyamu ladhipathi yehoavaa dhaevuni
    pattanamundhu
    manamu vininatti reethigaa jaruguta
    manamu choochithimi

    Mana dhaevudu nithyamugaa dhaanini
    sthira – parachiyunnaadu
    dhaevaa nee aalaya mandhuna nee
    krupanu dhyaanimchithimi

    Dhaevaa nee naamamu entha goppadhoa
    nee sathkeerthiyunu
    bhoodhigmthamula varaku atha
    goppadhai yunnadhi

    Ee dhaevudu sadhaakaalamu manaku
    dhaevudai yunnaadu
    manala nadipimchunu maranaparymthamu
    hallelooyaa aamen

  • Mana jeevitha manthayu మన జీవిత మంతయు

    మన జీవిత మంతయు – అనుక్షణము యుద్ధమే
    ఇదియే సిలువ మార్గము – మహిమ రాజ్యమొందను

    ఈ యాత్రలో ముందుకు – సాగిన తోడ్పడి
    యేసుడే నడుపును మనలను – తన మార్గమునందున

    ఆ సిలువ మార్గము – ఎంతో యిరుకైనది
    క్రీస్తునే గురిగా నుంచిన – విజయము నిశ్చయము

    ఇహమందు శ్రమలు – రానున్న మహిమలో
    ఎన్నదగినవి కావుగా – క్రీస్తే దుఃఖము బాపును

    ఈ జగతులో కష్టముల్ – బాధలు కలిగిన
    ధైర్యము విడువక యుందుము – జయించె ప్రభువు ఇహమును


    Mana jeevitha manthayu – anukshnamu yudhdhamae
    idhiyae siluva maargamu – mahima raajyamomdhanu

    Ee yaathraloa mumdhuku – saagina thoadpadi
    yaesudae nadupunu manalanu – thana maargamunmdhun

    Aa siluva maargamu – emthoa yirukainadhi
    kreesthunae gurigaa numchina – vijayamu nishchayamu

    Ihamandhu shramalu – raanunna mahimaloa
    ennadhaginavi kaavugaa – kreesthae dhuhkhamu baapunu

    Ee jagathuloa kashtamul – baadhalu kaligin
    dhairyamu viduvaka yundhumu – jayimche prabhuvu ihamunu

  • Madhuramaina prematho మధురమైన ప్రేమతో

    మధురమైన ప్రేమతో నన్ను ప్రేమించితివి
    ఆశ్చర్యమైన నీ కృపతో నన్ను మన్నించితివి
    మొదటి ప్రేమ కోల్పోయిన
    లోకాన్ని ఆశించి నిను విడచిన
    నీ కరములు చాచితివి
    నీ చెంతకు చేర్చుకొంటివి
    నీ ప్రేమ నాపై తరగనిది
    నీ కృప నన్ను విడువనిది

    నిన్నే కీర్తించెద
    నిన్నే స్తుతించెద
    నిన్నే స్మరించెద జీవితకాలమంత
    నిన్నే పూజించెద
    నిన్నే హెచ్చించెద
    నిన్నే నిన్నే సేవించెదను

    ఆత్మకు ప్రతికూలమైన
    శరీర క్రియలు వాంఛించినా
    నీ వాక్యమునకు దూరమై
    దురాశలు వెంటాడినా
    శుద్ధాత్మను తోడుగనిచ్చి
    నన్ను ఆత్మఫలముతో నింపితివి

    ప్రేమలేని జీవితముతో
    మ్రోగెడు కంచువలె నేనుండినా
    కృపావరములులెన్నో కలిగుండినా
    గణగణలాడు తాళమునైయుండగా
    విశ్వాస నిరీక్షణ ప్రేమలు
    నా హృదయములో నిలిపితివి


    Madhuramaina prematho nannu preminchithivi
    aascharyamaina nee krupatho nannu manninchithivi
    modhati prema kolpoyina
    lokaanni aasinchi ninu vidachina
    nee karamulu chaachithivi
    nee chenthaku cherchukontivi
    nee prema naapai tharaganidhi
    nee krupa nannu viduvanidhi

    ninne keerthincheda
    ninne sthuthincheda
    ninne smarincheda jeevithakaalamantha
    ninne poojincheda
    ninne hechincheda
    ninne ninne sevinchedhanu

    Aathmaku prathikoolamaina
    sareera kriyalu vaanchinchinaa
    nee vaakyamunaku dhooramai
    dhuraasalu ventaadinaa
    suddhaathmanu thoduganichi
    nannu aathmaphalamutho nimpithivi

    Premaleni jeevithamutho
    mrogedu kanchuvale nenundinaa
    krupaa varamululenno kaligundinaa
    ganaganalaadu thaalamunai yundagaa
    viswaasa nireekshana premalu
    naa hrudayamulo nilipithivi

  • Madhuram madhuram madhuram మధురం మధురం మధురం

    మధురం మధురం మధురం యేసునాధ కథ మధురం ||మన||

    మధురమే మన ప్రభు యేసుని నామం మానవాళికదే
    మాధుర్యమనామం పాపిని బ్రోచెడి పావన నామం పరమున జేర్చే
    పరిశుద్ధనామం ||మన||

    మారని దేవుని మాటయే మధురం మదిలోదలచిన కలతను
    దీర్చున్ ఎదలో బాధను బాపున్ నిరతం నమ్మిననరులకు
    నెమ్మది నిచ్చున్ ||మ||

    పగలురేయి ప్రార్థించుటే మధురం పరిశుద్ధుల సహవాసమే
    మధురం అపోస్తలుల సద్భోదయే మదురం మధురాతి
    మధురం పరిశుద్ధ రుధిరం ||మ||

    జుంటితేనెయ ధారలకంటే కమ్మనిది ప్రభు క్రీస్తుని
    వార్యం ఆదియందు ఆ వాక్యమే ఉండెన్ వాక్యమే
    ప్రియప్రభు యేసుగ మారెన్ ||మ||

    అందరిలో అతిసుందరుడతడు ఆది దేవుని ఏకైక సుతుడు
    ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త అవతరించె భువిన్ అందరి కొరకే ||మ||

    యేసే క్రీస్తుగ నెరిగిన మేము పరుగిడితిమి పాపము నుండి
    దూరం పొందితిమి ఆత్మానందభాగ్యం ప్రకటించుటే
    మా ప్రధానధ్యేయం ||మ||


    Madhuram Madhuram Madhuram
    yaesunaadha katha madhuram ||mana||

    Madhuramae mana prabhu yaesuni
    naamam maanavaaLikadhae
    maadhuryamanaamam paapini broachedi
    paavana naamam paramuna jaerchae
    parishudhdhanaamam ||mana||

    Maarani dhaevuni maatayae madhuram
    madhiloadhalachina kalathanu
    dheerchun edhaloa baaDhanu baapun
    niratham namminanarulaku
    nemmadhi nichchun ||ma||

    Pagaluraeyi praarthimchutae
    madhuram parishudhdhula sahavaasamae
    madhuram apoasthalula sadhbhoadhayae
    madhuram madhuraathi
    madhuram parishudhDha rudhirm ||ma||

    Jumtithaeneya dhaaralakmtae
    kammanidhi prabhu kreesthuni
    vaarym aadhiymdhu aa vaakyamae umden vaakyamae
    priyaprabhu yaesuga maaren ||ma||

    Amdhariloa athisumdharudathadu
    aadhi dhaevuni aekaika suthudu
    aashcharyakarudaa aaloachana
    kartha avatharimche bhuvin amdhari korakae ||ma||

    Yaesae kreesthuga nerigina
    maemu parugidithimi paapamu numdi
    dhoorm pomdhithimi aathmaanmdhabhaagym
    prakatimchutae
    maa pradhaanadhyaeym ||ma||

  • Madhuram madhuram na priya మధురం మధురం నా ప్రియ

    మధురం మధురం నా ప్రియ యేసు
    నీ ప్రేమలో నను నే మరచితినయ్యా

    వాడిన పువ్వులు వికసింప చేసి
    పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ
    చెదరిన మనసులో చెలిమతో కూర్చి
    సేదదీర్చెడి యేసుని ప్రేమ

    సాసనిసస నిసనిపాపస నిసనిపాపనిసా
    సససగ రిరిరిని సససని రిరినిస నిసనిపాపనిసా

    మధురం . . మధురం . .
    అతిమధురం నీ నామం
    కలువరి గిరికరుదెంచితి ప్రభుతో
    కలుషమెల్ల బాపే కమణీయమైనా
    కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలుపే
    ఎటులనే . . మరతునో . .
    ప్రభుని ప్రేమ ఇలలో


    Madhuram madhuram na priya yesu
    Ni premalo nanu ne marachitinayya

    Vadina puvvulu vikasimpa chesi
    Parimalamichchedi yesuni prema
    chedarina manasulo chelimato kurchi
    Sedadirchedi yesuni prema

    Sasanisasa nisanipapasa nisanipapanisa
    Sasasaga riririni sasasani ririnisa nisanipapanisa

    Madhuram . . Madhuram . .
    Atimadhuram ni namam
    Kaluvari girikarudemchiti prabuto
    Kalushamella bape kamaniyamaina
    Kaluvari premaku sakshiga nanu nilupe
    Etulane . . Maratuno . .
    Prabuni prema ilalo

  • Madhuram amaram మధురం అమరం

    మధురం అమరం నీ ప్రేమ యేసు అమృత ధార నీ కరుణ
    అగాధ సముద్రము ఆర్పజాలనిది నదీ ప్రవాహము ముంచి వేయనిది
    రక్షణ మార్గం నీ దివ్య వాక్యం పాపికి విడుదల నీ సిలువ

    నిన్ను నేను చేరలేని ఘెరపాపమందుండగా
    నన్ను నీలో చేర్చుకొనుటకై నీ రక్తాన్నే కార్చితివే
    నీ ప్రేమే మాటే కాదు అది క్రియలతోను
    నన్ను ఫలియింపజేయుచున్నది
    నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం
    నిన్ను ఎల్లవేళలలో నేను స్తుతియింతును

    నా యందు నీకు ఉన్న ప్రేమ ఈ లోకాన్ ఉన్న ప్రేమ కన్న
    ఈ లోక సౌఖ్యాలకన్న ఎంతో శ్రేష్ఠమైనది
    ఆ ప్రియమైన ప్రేమతో జీవింపజేయుచు నన్ను నడిపించుచున్నావయ్యా
    నా కీర్తన నా జీవితం నా సర్వము నీకే ఎల్లవేళలలో నేను చెల్లింతును


    Madhuram amaram ni prema yesu amruta dhara ni karuna
    Agadha samudramu arpajalanidi nadi pravahamu mumchi veyanidi
    Rakshana margam ni divya vakyam papiki vidudala ni siluva

    Ninnu nenu cheraleni gerapapamamdumdaga
    Nannu nilo cherchukonutakai ni raktanne karchitive
    Ni preme mate kadu adi kriyalatonu
    nannu paliyimpajeyuchunnadi
    Nive margam nive satyam nive jivam
    ninnu ellavelalalo nenu stutiyimtunu

    Na yamdu niku unna prema e lokan unna prema kanna
    e loka saukyalakanna emto sreshthamainadi
    A priyamaina premato jivimpajeyuchu
    nannu nadipimchuchunnavayya
    Na kirtana na jivitam na sarvamu
    nike ellavelalalo nenu chellimtunu

  • Madhura madhuramu మధుర మధురము

    మధుర మధురము యేసు నామం ….2
    స్తుతికి యోగ్యము ప్రభుని నామం …. 2
    మధుర మధురము యేసు నామం – మధుర మేసుని నామం

    స్వర్గము వీడి – జగమున కరిగి
    సిలువలో రక్తము – చిందించెను

    సిలువపై సైతానును ఓడించి
    తొలగించెను నరక శిక్షను

    పాపులకు విమోచన మొసగి
    నేర్పుగ తండ్రితో నైక్యము చేసెన్

    రక్తముచే మమ్ము శుద్ధుల జేసెన్
    దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్

    ఆత్మలో వారసులుగ మమ్ము జేసెన్
    దేవుని మందిరముగ నిర్మించెన్


    Madhura madhuramu yaesu naamam ….2
    sthuthiki yoagyamu prabhuni naamam …. 2
    madhura madhuramu yaesu naamam – madhura maesuni naamam

    Svargamu veedi – jagamuna karigi
    siluvaloa rakthamu – chimdhimchenu

    Siluvapai saithaanunu oadimchi
    tholagimchenu naraka shikshnu

    Paapulaku vimoachana mosagi
    naerpuga thmdrithoa naikyamu chaesen

    Rakthamuchae mammu shudhdhula jaesen
    dhaevuni puthrulugaa mammu maarchen

    Aathmaloa vaarasuluga mammu jaesen
    dhaevuni mandhiramuga nirmimchen

  • Madhyapaana priyulu మద్యపాన ప్రియులు

    మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార మీరా మత్తులోనే మునిఁగి
    పోకుండి మద్యపానము చేయువారికిఁ దథ్యముగఁ బ్రాప్తించుఁ గీడులు
    కొద్దియైనన్ రుచిని జూడఁగఁ గోరఁ దగ దని తలఁచుకొనుఁడి ||మద్య||

    రక్త మంతయుఁ జెడును సుమ్మండి ప్రియులారా మీరు శక్తిహీనులగుదు
    రిల నుండి శక్యిహీనులె గాక మఱి మీ భక్తి దొలఁగి పోవునండి
    ముక్తిమార్గము దెలియదండి ముందు గతికి హీనమండి ||మద్య||

    బుద్ధిబలములు కొద్ది వౌనండి ప్రియులారా
    మీరు మొద్దు లగుదురనియు
    నమ్ముండి హద్దు మిరుచుఁ ద్రాగువారికిఁ గొద్దికాలమె జీవమండి
    శ్రద్ధగల్గి మద్యపానము రద్దు చేయుట తగినదండి ||మద్య||

    మచ్చునకును త్రాగఁబోకుండి ప్రియులార మీరీ తుచ్ఛమైన పనులు
    వీడుండీ హెచ్చుగాఁ దిని త్రాగువారికి వచ్చు రోగము కుదురదండి
    చచ్చుటకు నిది హేతువని మదిఁ గచ్చితముగను
    దెలిసికొనుఁడి ||మద్య||

    ఆలుబిడ్డల మేలుఁగోరుండి ప్రియులారా వారి మేలుఁ గోరినఁ ద్రాగంఁ
    బోకుండి మేలు లెఱింగి పిలుచు క్రీస్తుని జాలిచూపులు దెలిసికొనుఁడి
    కాలయాపనఁ జేయకుండి కర్త యేసని నమ్ముకొనఁడి ||మద్య||

    ఘన ధనములు నిలువఁబోవండి ప్రియులార నీచ తనము మీకు
    మూల మౌనండి తనవిఁదీర్చుదు
    మద్యమండి ఘనుల కొంపలు గూల్చు
    నండి ఘనముగాఁ బ్రభువాక్యసారము
    వినయమతితో ఁ గ్రోలరండి ||మద్య||


    Madhyapaana priyulu gaakumdi priyulaara
    meeraa maththuloanae muniaogi
    poakumdi madhyapaanamu chaeyuvaarikiao
    dhathyamugao braapthimchuao geedulu
    kodhdhiyainan ruchini joodaogao goarao
    dhaga dhani thalaochukonuaodi ||madhya||

    Raktha manthayuao jedunu summandi
    priyulaaraa meeru shakthiheenulagudhu
    rila numdi shakyiheenule gaaka mari
    mee bhakthi dholaogi poavunmdi
    mukthimaargamu dheliyadhmdi mumdhu
    gathiki heenammdi ||madhya||

    Budhdhibalamulu kodhdhi vaunmdi
    priyulaaraa meeru modhdhu lagudhuraniyu
    nammumdi hadhdhu miruchuao dhraaguvaarikiao
    godhdhikaalame jeevammdi
    shradhdhagalgi madhyapaanamu radhdhu
    chaeyuta thaginadhmdi ||madhya||

    Machchunakunu thraagaoboakumdi
    priyulaara meeree thuchchamaina panulu
    veedumdee hechchugaaao dhini thraaguvaariki
    vachchu roagamu kudhuradhmdi
    chachchutaku nidhi haethuvani madhiao
    gachchithamuganu dhelisikonuaodi ||madhya||

    Aalubiddala maeluaogoarumdi priyulaaraa
    vaari maeluao goarinao dhraagmao
    boakumdi maelu lerimgi piluchu kreesthuni
    jaalichoopulu dhelisikonuaodi
    kaalayaapanao jaeyakumdi kartha yaesani
    nammukonaodi ||madhya||

    Ghana dhanamulu niluvaoboavmdi
    priyulaara neecha thanamu meeku
    moola maunmdi thanaviaodheerchudhu
    madhyammdi ghanula kompalu goolchu
    nandi ghanamugaaao brabhuvaakyasaaramu
    vinayamathithoa ao groalarmdi ||madhya||