Category: Telugu Worship Songs Lyrics

  • Mithramaa naa mithramaa మిత్రమా నా మిత్రమా

    మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే

    నీతో స్నేహం నాకు ప్రాణం నాతో బంధం అది నీ త్యాగం మిత్రమా నా మిత్రమా చిత్రము ఇది చిత్రము

    మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే

    స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం
    నా గుండెల్లో నిండావు నీవు నిండుగా `
    ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా ‘2’

    మట్టిని మనిషిగ మచినావు మనిషిని మమతతో నింపినావు మమతకు మంచిని నేర్పినావు మంచికి మనసును ఇచ్చినావు
    మట్టిని మనిషిగ మచినావు ఎందుకో మనిషిని మమతతో నింపినావు ఏమిటో మమతకు మంచిని నేర్పినావు ఎందుకో
    మనసుకు మనసును కలిపినావు
    ముత్యా బాటల్లో నడిచే నీవెక్కడ
    బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ ‘2’ ‘మిత్రమా’

    కంటినీరు తుడచినావు కంటికి రెప్పై నిలిచినావు వింతగ నన్ను వచినావు తండ్రివై నన్ను పిలిచినావు
    రతణా రాసులో నిలిచే నీవెక్కడ `
    బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడ ‘2’ ‘మిత్రమా’


    Mithramaa naa mithramaa chiththamaa idhi nee chithramaa mithramaa naa yaesayyaa chithramae emthoa chithramae

    Neethoa snaehm naaku praanam naathoa bmdhm adhi nee thyaagm mithramaa naa mithramaa chithramu idhi chithramu

    Mithramaa naa mithramaa chiththamaa idhi nee chithramaa mithramaa naa yaesayyaa chithramae emthoa chithramae

    Snaehm nee snaeham praanam naaku praanam nee snaeham naaku praanam praanam nee snaeham
    naa gumdelloa nimdaavu neevu nimdugaa `
    edha loathulloa nilichaavu naaku thoadugaa ‘2’

    Mattini manishiga machinaavu manishini mamathathoa nimpinaavu mamathaku manchini naerpinaavumanchiki manasunu ichchinaavu
    mattini manishiga machinaavu emdhukoa
    manishini mamathathoa nimpinaavu aemitoa
    mamathaku manchini naerpinaavu emdhukoa
    manasuku manasunu kalipinaavu
    muthyaa baatalloa nadichae neevekkad
    brathukmthaa muLLalloa gadipae naenekkada ‘2’ ‘mithramaa’

    Kmtineeru thudachinaavu kantiki reppai nilichinaavu vimthaga nannu vachinaavu thandrivai nannu pilichinaavu
    rathanaa raasuloa nilichae neevekkada `
    brathukMthaa muLLalloa nadichae naenekkada ‘2’ ‘mithramaa’

  • Medunna middunna మేడున్నా మిద్దున్నా

    మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా
    నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా

    సిరి ఉందని తూలనాడినా బలముందని విర్రవీగినా
    తీర్పునందు చిక్కెదవన్నా మార్పునొంద త్వరపడుమన్నా

    అందముతో అతిశయించినా సుందరునని గర్వించినా
    చివరకు ఇది మన్నగునన్నా ఆపై నీ గతి ఏమన్నా

    చుదువులలో శిఖరమెక్కినా పదవులలో పైకి ఎదిగినా
    హృదయం ప్రభుకీయకున్నా నరకమే గతి ఇది నిజమన్నా


    Medunna middunna pedda gaddemida nivunna
    Nilo yesanna lekunna nikunnadamta sunna

    Siri umdani tulanadina balamumdani virravigina
    Tirpunamdu chikkedavanna marpunomda tvarapadumanna

    Aamdamuto atisayimchina sumdarunani garvimchina
    chivaraku idi mannagunanna apai ni gati emanna

    Chuduvulalo sikaramekkina padavulalo paiki edigina
    Hrudayam prabukiyakunna narakame gati idi nijamanna

  • Matadu na prabuva మాటాడు నా ప్రభువా

    మాటాడు నా ప్రభువా నాతో మాటాడు నా ప్రభువా
    నీ మాటలే జీవపు ఊటలు నీ పలుకులే ప్రాణాధారాలు

    సమరయ స్త్రీతో మాటాడావు సకల పాపములు హరియించావు
    జీవ జలములు త్రాగనిచ్చావు జీవితమునే మార్చివేసావు

    చచ్చిన లాజరును చక్కగ పిలిచావు బయటకు రమ్మని ఆదేశించావు
    కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు మళ్ళీ బ్రతుకును దయచేసావు


    Matadu na prabuva nato matadu na prabuva
    Ni matale jivapu utalu ni palukule pranadharalu

    Samaraya strito matadavu sakala
    papamulu hariyimchavu
    Jiva jalamulu traganichchavu
    jivitamune marchivesavu

    Chachchina lajarunu chakkaga
    pilichavu bayataku rammani adesimchavu
    Kullina savamuku jivamunichchavu
    malli bratukunu dayachesavu

  • Mattivira vattivira మట్టివిరా వట్టివిరా

    మట్టివిరా వట్టివిరా మన్నువురా మన్నవురా
    కాయము మాయము ఖాయమురా అయ్యయ్యో!

    అటుచేసి ఇటుచేసి అందరిని మోసం చేసి
    సంఘాన్ని రెండుగ చీల్చావే అయ్యయ్యో
    నీ గోతిలో నువ్వే పడ్డావే అయ్యయ్యో!

    నువు వేసిన వేషాలు నువు చేసిన మోసాలు
    నరకాగ్నికి నిను చేర్చునులే అయ్యయ్యో
    నరకాగ్నిలో కాలిపోదువులే అయ్యయ్యో!

    నీ బ్రతుకు దెరువుకోసం బైబిల్ చేతబట్టి
    పమార్ధం మర్చిపోయావే అయ్యయ్యో
    ఆత్మలతో ఆడుకొన్నావే అయ్యయ్యో!

    సువార్త సేవకోసం పంపిన సొమ్ములన్నీ
    సొంతానికి ఖర్చు చేశావే అయ్యయ్యో
    శాపాన్ని తెచ్చుకున్నావే అయ్యయ్యో!

    పాపాన్ని పాతిపెట్టి దోషాన్ని దాచిపెట్టి
    దొరలాగ తిరుగుచున్నావే అయ్యయ్యో
    తొందరలో దొరకిపోతావే అయ్యయ్యో!

    నీ పాపం ఒప్పుకుంటే ఆ పాపం విడిచిపెడితే
    పరలోకం నిన్ను చేర్చునులే యేసయ్యా
    నీ పాపం కడిగివేయునులే మెస్సయ్యా!


    Mattivira vattivira mannuvura mannavura
    Kayamu mayamu kayamura ayyayyo!

    Atuchesi ituchesi amdarini mosam chesi
    Samganni remduga chilchave ayyayyo
    Ni gotilo nuvve paddave ayyayyo!

    Nuvu vesina veshalu nuvu chesina mosalu
    Narakagniki ninu cherchunule ayyayyo
    Narakagnilo kalipoduvule ayyayyo!

    Ni bratuku deruvukosam baibil chetabatti
    Pamardham marchipoyave ayyayyo
    Atmalato adukonnave ayyayyo!

    Suvarta sevakosam pampina sommulanni
    Somtaniki karchu chesave ayyayyo
    Sapanni techchukunnave ayyayyo!

    Papanni patipetti doshanni dachipetti
    Doralaga tiruguchunnave ayyayyo
    Tomdaralo dorakipotave ayyayyo!

    Ni papam oppukumte a papam vidichipedite
    Paralokam ninnu cherchunule yesayya
    Ni papam kadigiveyunule messayya!

  • Maeghamu meedha మేఘము మీద

    మేఘము మీద యేసురాజు వేగ మిలకువచ్చున్

    సిద్ధముగా నుండువారల జేర్చును శీఘ్రముగా దిగును

    ప్రభువు తానే ఆర్భాటముతో ఈ భువికి వచ్చున్
    ఇక్కడ నమ్మినవారలు ఎగురుచు ఈ భువి విడచెదరు

    క్రీస్తునందు మృతులగు వారు లేచి వెళ్ళుదురు
    నిలిచియుండు పరిశుద్ధులందరు మాయమై పోయెదరు

    వేల వేలగు ఆయన మాటలు రాకను దెల్పెను
    ప్రవక్తలపొస్తలులు దానిని గూర్చియే ప్రకటించిరి

    పాట్లుపడెడు వారల కేసు ప్రతిఫలమిచ్చును
    చేరు మనకు సంపూర్ణశక్తిని చెలువుగ నొసగును

    ఆయన తెల్పిన గురుతులన్నియు నెరవేరుచున్నవి
    రాకడ గడియ నెవరు యెరుగరు తండ్రికే తెలియును

    వేయి యేండ్లు యేసు యిలలో రాజ్యము యేలును
    నీతి సమాధానములుండు నాయన రాజ్యములో

    హల్లెలూయా గీతముపాడి ఆర్భాటించెదము
    వల్లభుడిదిగో వచ్చెడు వేళ సమీపమాయెను


    Maeghamu meedha yaesuraaju vaega milakuvachchun

    Sidhdhamugaa numduvaarala jaerchunu sheeghramugaa dhigunu

    Prabhuvu thaanae aarbhaatamuthoa ee bhuviki vachchun
    ikkada namminavaaralu eguruchu ee bhuvi vidachedharu

    Kreesthunmdhu mruthulagu vaaru laechi velludhuru
    nilichiyumdu parishudhDhulmdharu maayamai poayedharu

    Vaela vaelagu aayana maatalu raakanu dhelpenu
    pravakthalaposthalulu dhaanini goorchiyae prakatimchiri

    Paatlupadedu vaarala kaesu prathiphalamichchunu
    chaeru manaku smpoorNashakthini cheluvuga nosagunu

    Aayana thelpina guruthulanniyu neravaeruchunnavi
    raakada gadiya nevaru yerugaru thmdrikae theliyunu

    Vaeyi yaemdlu yaesu yilaloa raajyamu yaelunu
    neethi samaadhaanamulumdu naayana raajyamuloa

    Hallelooyaa geethamupaadi aarbhaatimchedhamu
    vallabhudidhigoa vachchedu vaeLa sameepamaayenu

  • Maeghmbupai nekki మేఘంబుపై నెక్కి

    మేఘంబుపై నెక్కి మేలుగ ప్రభు క్రీస్తు యాకసంబున కేగెను
    ప్రాకటముగను ఆత్మనంది ప్రజ్ఞ మీరగ సాక్ష్యమిచ్చి యేక దీక్షను యేసు
    రాకకు నెదురు జూడుడటంచు ప్రభువు ||మేఘంబు||

    యూదయ్య సమరయ్య ప్రాంతంబులంతట నాదు వార్తను జాటరే
    భూదిగంతము వరకు మీరు భూరి
    సాక్షులగుచు నాకు సాదరంబుగ సత్య
    విశ్వా సంబులన్ మనుడంచు ప్రభువు ||మేఘంబు||

    గలిలయ్యులార మీ రాశతో నెందుకు తిలకించు చున్నారట్లు
    వెలయపరమున కెట్లు నేగెనొ యిలకు
    నా ప్రభువట్లెమరల యలర వచ్చుట
    మీరు గాంచెద రంచు దూతలు బల్కిరపుడె ||మేఘంబు||

    శ్రీ సంఘ మిదివిను మా యేసు ప్రభు క్రీస్తే భాసిల్ల మఱి వచ్చును
    యేసు ప్రభుని యడుగు జాడల యేపు మీరగ నడచు కొనుచు నీసు
    రక్షణ నిలకుజాటుచు నెదురు జూడుము యేసు కొఱకే ||మేఘంబు||


    Maeghmbupai nekki maeluga prabhu
    kreesthu yaakasmbuna kaegenu
    praakatamuganu aathmanmdhi prajny meeraga
    saakshyamichchi yaeka dheekshnu yaesu
    raakaku nedhuru joodudatmchu prabhuvu ||maeghmbu||

    Yoodhayya samarayya praamthmbulmthata
    naadhu vaarthanu jaatarae
    bhoodhigmthamu varaku meeru bhoori
    saakshulaguchu naaku saadharmbuga sathya
    vishvaa smbulan manudmchu prabhuvu ||maeghmbu||

    Galilayyulaara mee raashathoa nemdhuku
    thilakimchu chunnaaratlu
    velayaparamuna ketlu naegeno yilaku naa
    prabhuvatlemarala yalara vachchuta
    meeru gaamchedha rmchu dhoothalu balkirapude ||maeghmbu||

    Shree smgha midhivinu maa yaesu prabhu
    kreesthae bhaasilla mari vachchunu
    yaesu prabhuni yadugu jaadala yaepu
    meeraga nadachu konuchu neesu
    rakshna nilakujaatuchu nedhuru joodumu yaesu korakae ||maeghmbu||

  • Maeghaa roodumdai మేఘా రూఢుండై

    మేఘా రూఢుండై – ప్రభుయేసు, అతి వేగముగా నేతెంచున్
    ఏతెంచున్ ఏతెంచున్
    ఆకాశమునుండే వాడైన యేసు యిలకు నేతెంచున్

    ఆకాశమందాయనను – సంధింప
    ఏకముగ నేగుదురు – నిజ విశ్వాసులందరు

    పాపబంధకముల్ ఆయనే త్రుంచున్
    పాపముల నెడబాపున్ ప్రభుయేసే నినురక్షించున్

    రక్తముచే విమోచన మొంది
    యేసుతో నేగ నాయత్తమా? క్రీస్తేసే – నీకై రాగన్

    శాశ్వత జీవము నిచ్చును నీకు
    తండ్రితో నైక్యపర్చునిన్ – నదాతనతోనే నిన్నుంచున్


    Maeghaa roodumdai – prabhuyaesu, athi vaegamugaa naethemchun
    aethemchun aethemchun
    aakaashamunumdae vaadaina yaesu yilaku naethemchun

    aakaashammdhaayananu – smdhimp
    aekamuga naegudhuru – nija vishvaasulmdharu

    paapabmdhakamul aayanae thrumchun
    paapamula nedabaapun prabhuyaesae ninurakshimchun

    rakthamuchae vimoachana momdhi
    yaesuthoa naega naayaththamaa kreesthaesae – neekai raagan

    shaashvatha jeevamu nichchunu neeku
    thmdrithoa naikyaparchunin – nadhaathanathoanae ninnumchun

  • Maakartha gatti dhurgamu మాకర్త గట్టి దుర్గము

    మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు
    సంప్రాప్తమైన కష్టములన్నిటి నణంచు
    ఆ పాత శత్రువెంతో క్రూరుఁడు
    తదాయుధములుపాయ శక్తులు అతం డసమానుండు.

    మేమో నశించిపోదుము మా శక్తి నిష్ఫలంబు
    మాకై ప్రభుని శూరుఁడు యుద్దంబు చేసిపెట్టు
    అతం డెవ్వఁడు యేసు క్రీస్తను మా రక్షకుండు
    మరొక్కఁ డెవ్వడు అతండె గెల్పుపొందు

    ప్రపంచ మంతటన్ గ్రమ్ము పిశాచు లేమి చేయు
    మమ్మెల్ల మ్రింగనున్నను మాకేల భేతివేయు
    ఈ లోకాధిపుఁడుగ్రుఁడైనను దానేమి చేయుఁ
    దీర్పొందె నతఁడు నశించు మాటతోనే.

    వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచ లేఁడు.
    దైవాత్మ తోడగుం గదా తా నిన్న నేఁడు రేపు.
    మా కుటుంబము మా కీర్తి, యాస్తి, ప్రాణంబు పోయినన్
    నష్టంబు వానిదె రాజ్యంబు మాది యౌను.


    Maakartha gatti dhurgamu nae nammu aayudhmbu
    smpraapthamaina kashtamulanniti nanmchu
    aa paatha shathruvemthoa krooruaodu
    thadhaayudhamulupaaya shakthulu athm dasamaanumdu.

    maemoa nashimchipoadhumu maa shakthi nishphlmbu
    maakai prabhuni shooruaodu yudhdhmbu chaesipettu
    athm devvaodu yaesu kreesthanu maa rakshkumdu
    marokkao devvadu! athmde gelpupomdhu

    prapmcha mmthatan grammu pishaachu laemi chaeyu
    mammella mrimganunnanu maakaela bhaethivaeyu
    ee loakaadhipuaodugruaodainanu dhaanaemi chaeyuao
    dheerpomdhe nathaodu nashimchu maatathoanae.

    vaakymbu nithyamae gadhaa viroadhi vmcha laeaodu.
    dhaivaathma thoadagum gadhaa thaa ninna naeaodu raepu.
    maa kutumbamu maa keerthi, yaasthi, praanmbu poayinan
    nashtmbu vaanidhe raajymbu maadhi yaunu.

  • Maakanugrahimchina dhaiva మాకనుగ్రహించిన దైవ

    మాకనుగ్రహించిన దైవ వాక్యములచే
    మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా

    రక్షణ నొందిన వారికి దేవుడు
    ఒసగిన శక్తిని యెరిగి జీవింతుము

    రక్షణ కృపలు ప్రభువిచ్చినవే
    అతిశయింపలేము అంతయు కృపయే
    అమూల్యమైన సిలువశక్తిచే
    ఖాళీయైన మమ్మును నింపె

    పాప మృతులమైన మమ్మును లేపెను
    ప్రేమతో మమ్ము ప్రభుతోనే లేపెను
    పరలోక పదవి పాపులకిచ్చె
    పునరుత్థాన శక్తిచే కలిగె

    మరణ పునరుత్థాన మందైక్యతచే
    బలాతిశయమున్ పొందెదము
    విశ్వసించు మనలో తన శక్తి యొక్క
    మితిలేని మహాత్మ్యము తెలిసికొనెదము

    సర్వాధికారము ఆధిపత్యముల కంటె
    శక్తి ప్రభుత్వము లన్నిటికంటే
    అన్ని నామములలో హెచ్చింపబడిన
    యుగ యుగములలో మేలైన నామమున

    తనశక్తిని బయలుపరచుటకు
    ఏర్పరచుకొనెను బలహీనులను
    ఎన్నికైన్వారిని వ్యర్థపరచుటకు
    నీచులైనవారిని ఏర్పరచుకొనెన్

    యుద్ధోపరణముల్ ఆత్మీయమైనవి
    మానక ప్రభువు విధేయులమగుటే
    దుర్గములన్నిటిన్ పడగొట్టు నదియే
    ప్రభు యేసు నొసగిన భాగ్యము యిదియే


    Maakanugrahimchina dhaiva vaakyamulachae
    maa manoanaethramulu veligimpumayyaa

    rakshna nomdhina vaariki dhaevudu
    osagina shakthini yerigi jeevimthumu

    rakshna krupalu prabhuvichchinavae
    athishayimpalaemu amthayu krupayae
    amoolyamaina siluvashakthichae
    khaaleeyaina mammunu nimpe

    paapa mruthulamaina mammunu laepenu
    praemathoa mammu prabhuthoanae laepenu
    paraloaka padhavi paapulakichche
    punaruthThaana shakthichae kalige

    marana punaruththaana mmdhaikyathachae
    balaathishayamun pomdhedhamu
    vishvasimchu manaloa thana shakthi yokk
    mithilaeni mahaathmyamu thelisikonedhamu

    sarvaadhikaaramu aadhipathyamula kante
    shakthi prabhuthvamu lannitikmtae
    anni naamamulaloa hechchimpabadin
    yuga yugamulaloa maelaina naamamun

    thanashakthini bayaluparachutaku
    aerparachukonenu balaheenulanu
    ennikainvaarini vyarThaparachutaku
    neechulainavaarini aerparachukonen

    yudhmhoaparaNamul aathmeeyamainavi
    maanaka prabhuvu vimhaeyulamagutae
    dhurgamulannitin padagottu nadhiyae
    prabhu yaesu nosagina bhaagyamu yidhiyae

  • Mangalamuga paadudee మంగళముగ పాడుడీ

    మంగళముగ పాడుడీ – కృప సత్యంబును
    రంగుగ జ్ఞానమిచ్చెడు దివ్యవాక్యము
    విజయ సత్యవేదము – మంగళ నిత్యదీపము

    అమృతము అద్భుతము దివ్యసత్యము

    సువి శేషమును ప్రకటింపు – కృప సత్యంబును
    పాప ఘోరంబు తెల్పును – దివ్యవాక్యము
    పరలోక వర్షము – జ్ఞాన నింపుదలయును

    దేవుడేసు హర్షించెడు – కృపసత్యంబును
    జీవ మంగళ వాక్యముల్ – దివ్యవాక్యముల్
    యేసు నన్నుచూడు – నిత్యము శుద్ధీకరించు

    రెండుయంచుల ఖడ్గము – కృప సత్యంబును
    ఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యము
    యోచనల్ చూపుదర్పణము – కలితిలేని జ్ఞానము

    ఆత్మకాహారమిదియే – కృప సత్యంబును
    పాపికి జీవపానము – దివ్యవాక్యము
    పాదములకు దీపము – కాళ్ళకు మంచి వెల్గును

    విశ్వాసుల సువార్తయే – కృప సత్యంబును
    నిశ్చయమైన పునాదియే – దివ్యవాక్యము
    విడుదలనిచ్చు సత్యము – ఉన్నతలోక సత్యము

    హల్లెలూయ పాడెద – కృప సత్యంబును
    అపవిత్రతను పోగొట్టున్ దివ్యవాక్యము
    ప్రభువు నామమిదియే – నాదు ఆస్తియునిదే


    Mangalamuga paadudee – krupa sathymbunu
    rmguga jnyaanamichchedu dhivyavaakyamu
    vijaya sathyavaedhamu – mangala nithyadheepamu

    Amruthamu adhbhuthamu dhivyasathyamu

    Suvi shaeshmunu prakatimpu – krupa sathymbunu
    paapa ghoarmbu thelpunu – dhivyavaakyamu
    paraloaka varShmu – jnyaana nimpudhalayunu

    Dhaevudaesu harshimchedu – krupasathymbunu
    jeeva mmgaLa vaakyamul – dhivyavaakyamul
    yaesu nannuchoodu – nithyamu shudhdheekarimchu

    Remduymchula khadgamu – krupa sathymbunu
    ullamul karigimchedu dhivyavaakyamu
    yoachanal choopudharpanamu – kalithilaeni jnyaanamu

    Aathmakaahaaramidhiyae – krupa sathymbunu
    paapiki jeevapaanamu – dhivyavaakyamu
    paadhamulaku dheepamu – kaallaku mmchi velgunu

    Vishvaasula suvaarthayae – krupa sathymbunu
    nishchayamaina punaadhiyae – dhivyavaakyamu
    vidudhalanichchu sathyamu – unnathaloaka sathyamu

    Hallelooya paadedha – krupa sathymbunu
    apavithrathanu poagottun dhivyavaakyamu
    prabhuvu naamamidhiyae – naadhu aasthiyunidhae