Category: Telugu Worship Songs Lyrics

  • Viluvaina premalo విలువైన ప్రేమలో

    విలువైన ప్రేమలో వంచన లేదు కల్వరి ప్రేమలో కల్మషం లేదు
    మధురమైన ప్రేమలో మరణం లేదు శాశ్వత ప్రేమలో శాపం లేదు
    యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు అద్భుత ప్రేమలో అరమరిక లేదు

    వాడిగల నాలుక చేసిన గాయం శోధన సమయం మిగిల్చిన భారం
    అణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో (2)
    నిలువ నీడ దొరికెనె నిజమైన ప్రేమలో (2)

    నా దోషములను మోసిన ప్రేమ నాకై సిలువను కోరిన ప్రేమ
    పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ (2)
    ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ (2)


    Viluvaina premalo vamchana ledu kalvari premalo kalmasham ledu
    Madhuramaina premalo maranam ledu sasvata premalo sapam ledu
    Yesayya premalo edabatu ledu adbuta premalo aramarika ledu

    Vadigala naluka chesina gayam sodhana samayam migilchina baram
    Anichiveyabadenu ascharya premalo (2)
    Niluva nida dorikene nijamaina premalo (2)

    Na doshamulanu mosina prema nakai siluvanu korina prema
    Parisuddha patraga marchina prema (2)
    Asirvadimchina atmiya prema (2)

  • Siluvapai vraelaadu సిలువపై వ్రేలాడు

    సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు
    నరులకై విలపించు నజరేయుడు
    ఆ దేవుడు చిందించిన రుధిర దారలే
    ఈ జగతిని విమోచించు జీవధారలు

    నిరపరాధి మౌనభుని దీనుడాయెను
    మాతృమూర్తి వేదననే ఓదార్చెను
    అపవాది అహంకార మణచి వేసెను
    పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ||

    కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను
    పాప జగతి పునాదులే కదలిపోయెను
    లోక మంత చీకటి ఆవరించెను
    శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను ||సిలువ||


    Siluvapai vraelaadu shreeyaesudu
    narulakai vilapimchu najaraeyudu
    aa dhaevudu chimdhimchina rudhira dhaaralae
    ee jagathini vimoachimchu jeevadhaaralu

    niraparaadhi maunabhuni dheenudaayenu
    maathrumoorthi vaedhananae oadhaarchenu
    apavaadhi ahmkaara manachi vaesenu
    pagavaari korakai prabhu praardhimchenu ||siluva||

    kaluvari giri kanneeLLathoa karigipoayenu
    paapa jagathi punaadhulae kadhalipoayenu
    loaka mantha cheekati aavarimchenu
    shreeyaesudu thalavaalchi kannumoosenu ||siluva||

  • Parishudha parishudha పరిశుద్ద పరిశుద్ద

    పరిశుద్ద పరిశుద్ద పరిశుద్ద ప్రభువా
    వర దూత-లైన నిన్ వర్నింపగలరా (2)

    పరిశుద్ద జనకుడ పర-మాత్మ రూపుడ (2 )
    నిరుపమ బల-బుద్ది నీతి ప్రభవా

    పరిశుద్ద తనయుడ నర రూప ధారుడ (2 )
    నరు-లను రాక్షించు కరుణా సముద్రా

    పరిశుద్ద మగు నాత్మ వర ము-లిడు నాత్మ (2)
    పర-మానంద ప్రేమ భక్తుల కిడుమా

    జనక కుమరాత్మ లను నెక దేవ (2)
    ఘన మహిమ చెల్లును దనరా నిత్యముగా


    Parishudhdha parishudhdha parishudhdha prabhuvaa
    vara dhutha-laina nin varnimpagalaraa (2)

    parishuddha janakuda para-maathma roopuda (2 )
    nirupama bala-budhdhi neethi prabhavaa

    parishudhdha thanayuda nara roopa dharuda (2 )
    naru-lanu raakshimchu karunaa samudhraa

    parishudhdha magu naathma vara mu-lidu naathma (2)
    para-maanaMdha prema bhakthula kidumaa

    janaka Kumaraathma lanu neka dheva (2)
    ghana mahima chellunu dhanaraa nithyamugaa

  • Maa dhaeva maa dhaeva needhu మా దేవ మా దేవ నీదు

    మా దేవ మా దేవ నీదు – విశ్వాస్యత చాల గొప్పది

    దయామయుండవు తండ్రివి నీవే
    తల్లిని మించిన దాతవు నీవే
    మాయా మమతల గాధలనుండి
    మమ్ములను రక్షించితివి

    కోడిపిల్లలను కాసెడు పగిది
    ఆపదలన్నింటి బాపితివయ్యా
    సర్వకాలముల యందున నీకే
    చక్కగ సంస్తుతులగు నీకే

    సింహపు పిల్లలు ఆకలి గొనిన
    సింహపు బోనులో నను వేసినను
    సిగ్గు కలుగకుండగ నను నీవు
    గాపాడుచునా వీ యిలలో

    మరణ లోయలదున నేనున్న
    తరుణములు నాకు విరోధమైన
    చ్రణముల్ పాడెడు విధమున నీవు
    నన్నొనార్చుచున్నావుగా

    వ్యాధులు నన్ను బాధించినను
    వ్యాకులములు హృదయములో నున్న
    వదలవు నన్నిల అనాథునిగ నెప్పుడు
    నను బ్రోచుచు నుందువుగా

    నీదు సత్యమాకాశము కంటె
    అత్యున్నతముగ స్థాపించబడె
    నీదు సత్యమును నీచుడనగు నా
    కనులకు ప్రత్యక్షపరచితివి

    పర్వతంబులు తొలగినగాని
    పలువిధ కొండలు తత్తరిల్లినను
    పావనుడా నీదు వెలలేనియట్టి
    కృప నను విడువదు హల్లెలూయ


    Maa dhaeva maa dhaeva needhu – vishvaasyatha chaala goppadhi

    dhayaamayumdavu thmdrivi neevae
    thallini mimchina dhaathavu neevae
    maayaa mamathala gaadhalanumdi
    mammulanu rakshimchithivi

    koadipillalanu kaasedu pagidhi
    aapadhalannimti baapithivayyaa
    sarvakaalamula ymdhuna neekae
    chakkaga smsthuthulagu neekae

    simhapu pillalu aakali gonin
    simhapu boanuloa nanu vaesinanu
    siggu kalugakumdaga nanu neevu
    gaapaaduchunaa vee yilaloa

    marana loayaladhuna naenunn
    tharunamulu naaku viroadhamain
    chranamul paadedu vidhamuna neevu
    nannonaarchuchunnaavugaa

    vyaadhulu nannu baadhimchinanu
    vyaakulamulu hrudhayamuloa nunn
    vadhalavu nannila anaathuniga neppudu
    nanu broachuchu numdhuvugaa

    needhu sathyamaakaashamu kmte
    athyunnathamuga sthaapimchabade
    needhu sathyamunu neechudanagu naa
    kanulaku prathyakshparachithivi

    parvathmbulu tholaginagaani
    paluvidha komdalu thaththarillinanu
    paavanudaa needhu velalaeniyatti
    krupa nanu viduvadhu hallelooy

  • Thalli thana biddanu తల్లి తన బిడ్డను

    తల్లి తన బిడ్డను మరచినా గాని
    మరువదయ్యా నీ ప్రేమ నన్ను
    పర్వతములు తొలగినా గాని
    విడువదయ్యా నీ కృప నన్ను (2)

    దుఃఖ దినములే దరి చేరినా
    దారి కానక నే చెదరినా (2)
    మరువదయ్యా నీ ప్రేమ నన్ను
    విడువదయ్యా నీ కృప నన్ను ||తల్లి||
    నశించిపోయిన నన్ను వెదకి రక్షించినావు
    పాపినైన నాకై నీ ప్రాణమునర్పించినావు (2)
    నీతిమంతుని కొరకైననూ
    ఒకరు చనిపోవుట అరుదుగా (2)
    ఏ మంచియు లేనట్టి నాకై
    ఎందుకయ్యా నీ త్యాగము (2) ||దుఃఖ దినములే||
    దారి తొలగిన నేను గొర్రె వలె తిరిగాను
    కాపరివైన నిన్ను కాదని వేసారినాను (2)
    నీవు చేసిన మేళ్లన్ని మరచి
    దూరమైతిని నిను నేను విడచి (2)
    అయిననూ నా రాక కొరకై
    వేచియుంటివా ఓ జాలి హృదయా (2) ||దుఃఖ దినములే||


    Thalli thana biddanu marachinaa gaani
    maruvadayyaa nee prema nannu
    parvathamulu tholaginaa gaani
    viduvadayyaa nee krupa nannu (2)
    dukha dinamule dari cherinaa
    daari kaanaka ne chedarinaa (2)
    maruvadayyaa nee prema nannu

    viduvadayyaa nee krupa nannu ||thalli||
    nashinchipoyina nannu vedaki rakshinchinaavu
    paapinaina naakai praanamunarpinchinaavu (2)
    neethimanthuni korakainanu
    okaru chanipovuta arudugaa (2)
    ae manchiyu lenatti naakai
    endukayyaa nee thyaagamu (2) ||dukha dinamule||
    daari tholagina nenu gorre vale thirigaanu
    kaaparivaina ninnu kaadani vesaarinaanu (2)
    neevu chesina mellanni marachi
    dooramaithini ninu nenu vidachi (2)
    ainanu naa raaka korakai
    vechiyuntivaa o jaali hrudayaa (2) ||dukha dinamule||

  • Siluvapai o snehituda సిలువపై ఓ స్నేహితుడా

    సిలువపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా /2/
    నా పాపముకై నా దోషముకై బలియైన నా యేసయ్య /2/సిలు/

    నా కొరకు త్యాగమూర్తివై బహు విలువైన నీ రక్తము /2/
    ధారలుగా నా భారముగా చిందించావులే నా యెదుట /2/
    నాదెంతో పాపము నీవు చేసే త్యాగము/2/సిలు/

    కఠినముగా ఈ లోకము నీదేహాన్ని దాహంతో నలిపారుగా /2/
    మౌనముగా మనసు గాయముతో కరిగిపోయావులే నా యెదుట /2/
    నాదెంతో పాపము నీవు చేసే త్యాగము /2/సిలు/


    Siluvapai o snehituda..
    Ninnentagaano himsinchitiraa.. /2/
    Naa paapamukai – Naa doshamukai
    Baliyeina na Yesayya.. /2/Siluvapai/

    Naa koraku tyaagamurthivai
    Bahu viluvaina nee rakthamu
    Dhaaraluga – naa bhaaramuga
    chindinchaavule naa yeduta /2/
    Naadento paapamu – Nivu chese tyaagamu /2/Siluvapai/

    Kathinamuga ee lokamu
    Nee dehaanni daahamto nalipaaruga /2/
    mounamuga mansu gaayamuto
    Karigipoyaavule naa yeduta /2/
    Naadento paapamu – Nivu chese tyaagamu /2/Siluvapai/

  • Premaamruta dhaaralu ప్రేమామృతధారలు

    ప్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవరు
    ఆ – ఆ – ఆ ప్రేమయె తానై నిలిచి – ప్రేమవాక్కులనే బలికి
    ప్రేమతో ప్రాణము బెట్టి – ప్రేమనగరికి చనియె /ప్రేమా/

    నిశ్చలమైన ప్రేమజీవికి – యిలలో తావేది
    ప్రేమ ద్రోహులేగాని – ప్రియమున చేరరు వాని
    చేరిన చెలికాడగురా ! – సమయమిదే పరుగిడరా ! /ప్రేమా/

    యెంత ఘోరపాపాత్ములనైన – ప్రేమించునురారా
    పాపభారముతో – రారా – పాదములపై బడరా
    పాపుల రక్షకుడేసు – తప్పక నిను రక్షించున్ /ప్రేమా/

    ఇంత గొప్ప రక్షణను – నిర్లక్షము చేసెదవేల
    రక్షణ దినమిదియేరా – తక్షణమే కనుగొనరా
    ఇదియే దేవుని వరము – ముదమారగ జేగొనుము /ప్రేమా/


    Premaamruta dhaaralu chindina mana Yesuku samamevaru
    aa – aa – aa premaye taanai nilachi – Premavaakkulane baliki
    Premato praanamu betti – premanagariki chaniye.. / Prema/

    Nischalamaina prema jeeviki – Ilalo taavedi
    Prema drohule gaani – Priyamuna cheraru vaani
    Cherina chelikaadaguraa – Samayamide parugidaraa.. /prema/

    Yenta ghora paapaatmulanina – Preminchunu raara
    Paapa bhaaramuto raara – Paadamulapai badaraa
    Paapula rakshakudesu – Tappaka ninu rakshinchun /Prema/

    Inta guppa rakshananu nirlakshyamu chesedavela
    Rakshana dinamidiyera – Takshaname kanugonaraa
    Idiye devuni varamu – Mudamaaraga Jegonumu / Prema/

  • Parishuddhatmuda parikinchu పరిశుద్దాత్ముడా పరికించు

    పరిశుద్దాత్ముడా పరికించు నన్నీ క్షణం
    పరిశుద్దాత్ముడా వెలిగించు నన్నీ దినం
    ప్రతిపాపము మలినంబును తొలగించు నాయందు యిపుడే
    ప్రసరించుము నీ వేలుగంతయు నాయాత్మ వెలుగొందునట్లు…
    నీయందు వికసించునట్లు…నాయాత్మ వెలుగొందునట్లు… /2/పరి/
    ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నాధా ఆరాధన /2/

    బలహీనతలందు బలమొందునట్లు కృపనిమ్ము శుద్దాత్ముడా
    విరిగిన నా హృదయం అంగీకరించు నీ నిత్య సహవాసమొంద
    నాలోన వసియించుమిపుడే… నీ నిత్య సహవాసమొంద…/2/ఆరా/

    ఈలోక ఆశల్ విడనాడునట్లు – నను మార్చు నీ రూపమునకు
    అనుదినము నాలో వికసించు నీవే – నాయాత్మ ఫలియించునట్లు
    జయమొంది జీవించునట్లు… నాయాత్మ ఫలియించునట్లు ../2/ఆరా/


    Parishuddhatmuda parikinchu nanne kshanam
    Parishudhhatmuda veliginchu nanne dinam
    Prati paapamu malinambunu tolaginchu naayandu ipude
    Prasarinchumu nee velugantayu – Na yatma velugondunatlu …
    Nee yandu vikasinchunatlu.. Na yatma velugondunatlu … /2/
    Aradhana neeke Aradhana – Aradhana nadha Aradhana /2/Pari/

    Balaheenatalandu Balamondunatlu – Krupanimmu shuddhatmuda..
    Virigina na hrudayam angeekarinchu – Ne nitya sahavasamonda .. /2/
    Naalona vasiyinchumipude .. Ne nitya
    sahavasamonda .. /2/Aradhana/

    Eeloka ashal vidanadunatlu – Nanu marchu ne roopamunaku
    Anudinamu naalo vikasinchu neeve – Na yatma phaliyinchunatlu
    Jayamondi jeevinchunatlu.. Nayatma
    phaliyinchunatlu.. /2/Aradhana/

  • Needento koruna నీదెంతొ కరుణ

    నీదెంతొ కరుణ కరుణామయా – నీదెంతొ జాలి నజరేయ, నజరేయ /2/

    మా పాపమంతా గాయాలుగా కాల్చావు నీమీన పూమాలగా /2/
    మాఖర్మమంతా ఆ సిలువగా మోసేవు తండ్రి నీ మోపునా /నీదెంతొ/

    ప్రభువా మా పాప ప్రక్షాళనముకై – వెలపోసినావు నీ రుధిరమే /2/
    దేవా మాఆత్మ పరిశుద్ధికై – బలిపెట్టినావు నీ ప్రాణమే! /నీదెంతొ/


    Needento karuna karunaamaya
    Needento jaali najareya, najareya /2/

    maa paapamanta gayaaluga
    kalchaavu neemeena poomaalagaa /2/
    Maa kharmamantaa aa siluvagaa
    mosevu tandri nee mopuna /needento/

    prabhuva maa paapa prakshaalanamukai
    velaposinaavu nee rudhirame /2/
    Deva maa aatma parishuddhikai
    Balipettinaavu nee praaname! /needento/

  • Kattabadda gaadida pillanu కట్టబడ్డ గాడిద పిల్లనునేను

    కట్టబడ్డ గాడిద పిల్లనునేను
    పట్టబడ్డాను అపవాదితోను /2/

    యేసయ్య నా నిజ యజమానుడు
    సాతాను మోసంతో నను లొంగదీసాడు
    అయినను యేసయ్య కరుణించాడు
    నను విడిపించ తన శిష్యులనంపాడు

    నా పైకి ఎక్కి నన్ను ధన్యుని చేసాడు
    యెరూషలేము వీధులవెంట యాత్రచేసాడు
    నా బ్రతుకు మార్చి నాకు ఘనత తెచ్చాడు
    ఆయన సేవ చేయ ఘనతను తెచ్చాడు


    Kattabadda gaadida pillanu nenu
    pattabaddanu apavaadi tonu /2/

    Yesayya naa nija yajamaanudu
    Saataanu mosamto nanu longadeesaadu
    Ayinanu Yesayya karuninchaadu
    Nanu vidipincha tana sishyula nampaadu

    Naapaiki yekki nannu dhanyuni chesaadu
    Yerushalemu veedhulaventa yaatra chesaadu
    Naa bratuku maarchi naaku ghanata techaadu
    Aayana seva cheya ghanatanu techhadu