Category: Telugu Worship Songs Lyrics

  • Jayam jayam halleluya జయం జయం హల్లెలూయ

    జయం జయం హల్లెలూయ జయం జయం ఇప్పుడే #2#
    మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడే
    సాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం#

    మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడే
    ఇమ్మానుయేలుకో జయం జయం ఇప్పుడే
    సాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం#

    మరియ కుమారునికి జయం జయం ఇప్పుడే
    మనయేసు స్వామికి జయం జయం ఇప్పుడే
    సాధువైన గొర్రెపిల్లకు జయం జయం ఇప్పుడే #జయం#

    ప్రభు యేసు నాదునికి జయం జయం ఇప్పుడే
    మరియ కుమారునికి జయం జయం ఇప్పుడే
    షాలోము రాజుకు జయం జయం ఇప్పుడే #జయం#


    Jayam Jayam Halleluya – Jayam Jayam ippude /2/
    Mana Yesu swamiki Jayam Jayam ippude
    Saadhuvaina gorrepillaku – Jayam Jayam ippude/Jayam/

    Mana Yesu swamiki Jayam Jayam ippude
    Emmaanuyeluko Jayam Jayam ippude
    Saadhuvaina gorrepillaku – Jayam Jayam ippude/Jayam/

    Mariya kumaaruniki Jayam Jayam ippude
    Mana Yesu swaamiki Jayam Jayam ippude
    Saadhuvaina gorrepillaku – Jayam Jayam ippude/Jayam/

    Prabhu Yesu naadhuniki – Jayam Jayam ippude
    Mariya kumaaruniki – Jayam Jayam ippude
    Shaalomu raajuku – Jayam Jayam ippude /Jayam/

  • Neelone rakshana నీలోనే రక్షణ

    నీలోనే రక్షణ నీలోనే నీరీక్షణ
    నీ వెలుగులో నే నడచెద
    నీ మార్గములో నే నిలిచెద
    క్షణకాలం ఈ లోకం
    చిరకాలం పరలోకం
    కలువరియే నా మార్గం
    పయనించెద నే ప్రభు కోసం
    హల్లేలూయా నే పాడెదా
    ఆనందముతో ఆడెదా
    ప్రతిదినము స్తుతియించెదా
    ప్రభుయేసుని నే ఘనపరచెదా


    Neelone rakshana neelone neerikshana
    nee velugulo ne nadachedha
    nee maargamulo ne nilichedha
    kshanakaalam ee lokam
    chirakaalam paralokam
    kaluvariye naa maargam
    payanincheda ne prabhu kosam
    hallelujah ne paadedhaa
    aanandamutho aadedhaa
    prathidinamu sthuthiyinchedaa
    prabhuyesuni ne ghanaparachedaa

  • Naalugu dhikkula నాలుగు దిక్కుల

    నాలుగు దిక్కుల చీకటి చీల్చి
    భూమిని రంగుల బంతిగ మార్చి
    చిక్కులు తీర్చగ చేతులు చాచి
    చుక్కల దారిన నేలకు వచ్చి
    కన్నీల చూపును కాంతిగ మలిచి
    కష్టాల దారికి కాపుగ నిలిచి
    మాములు మనిషిగ లోకుల కాచి

    అదిగో వచ్చాడయ్య యేసు
    మన ప్రాణాల తోడు
    అదిగో వచ్చాడంట చూదు
    తనలాంటోడు లేడు
    మన చీకట్లనే యేరు వాకిట్లో తెల్లారు
    వెలుగళ్ళే వేంచేసినాడు

    చుక్కలనుండి దిక్కులదాక
    తానే ఉన్నాడు
    వంచన తుంచి మంచిని పెంచే
    మారాజయ్యాడు
    ఎండలలోనే వెన్నెల్ల పూసే
    గొడుగై వస్తాడు
    ఆపదలోనే అండగ వచ్చి
    గుండెల నిండుగ పండగ తెచ్చి

    ఈ మట్టినే మార్చావుగా
    నీ నామముండే పరలోకమై
    నీ నెత్తురే పంచావుగా
    పాపాలు మాపే పరమాత్మవై
    శిరి వెన్నెల్లు చూసాక నీ రూపునా
    మా కన్నుల్లో కడతేరె ఆవేదన
    ఎంత కారుణ్యమో ఉంది నీ పేరునా
    తప్పు మన్నించి దయ చూపు నీ లాలన
    నీ మార్గాన్ని దరిచేరి శరనందున
    నీ కృపతోనే ఇకపైన జీవించిన

    ఆ పువ్వులు మా నవ్వులు
    నీ రాకతోనే పూసాయిల
    నీ చూపులో మా రాతలే
    మార్చేసి మళ్ళీ రాశావిలా
    నిత్యజీవాన్ని కరుణించు నీ తోడునా
    నువ్వు ఎడబాటు కాకుండ మా బ్రతుకున
    ఎన్ని కష్టాలు మోసావో మా వంతునా
    నే నేమిచ్చి తీర్చాలి నీ రుణమిల
    దైవమే కోరి పంపింది ఈ దీవెన
    అందుకున్నాము నీ ప్రేమలో పాలన


    Naalugu dhikkula cheekati cheelchi
    bhoomini rangula banthiga maarchi
    chikkulu theerchaga chethulu chaachi
    chukkala daarina nelaku vachi
    kanneela choopunu kaanthiga malichi
    kashtaala dhaariki kaapuga nilichi
    maamulu manishiga lokula kaachi

    adigo vachaadayya yesu
    mana praanaala thodu
    adigo vachaadanta choodu
    thanalaantodu ledu
    mana cheekatlaney yeru vaakitlo thellaaru
    velugalle venchesinaadu

    chukkalanundi dikkuladaaka
    thaaney unnaadu
    vanchana thunchi manchini penchey
    maaraajayyaadu
    endalaloney vennella poosey
    godugai vasthaadu
    aapadaloney andaga vachi
    gundela ninduga pandaga thechi

    ee mattiney maarchaavugaa
    nee naamamundey paralokamai
    nee netthurey panchaavugaa
    paapaalu maapey paramaathmavai
    siri vennellu choosaaka nee roopunaa
    maa kannullo kadatherey aavedhana
    entha kaarunyamo undi nee perunaa
    thappu manninchi daya choopu nee laalana
    nee maargaanni dharicheri sarananduna
    nee krupathoney ikapaina jeevinchina

    aa puvvulu maa navvulu
    nee raakathoney poosaayila
    nee choopulo maa raathaley
    maarchesi malli raasaavilaa
    nithyajeevaanni karuninchu nee thodunaa
    nuvvu edabaatu kaakunda maa brathukuna
    enni kashtaalu mosaavo maa vanthunaa
    ne nemichi theerchaali nee runamila
    daivamey kori pampindi ee deevena
    andukunnaamu nee premalo paalana

  • Neeve chalayya yesu నీవే చాలయ్యా యేసు

    నీవే చాలయ్యా యేసు నీవే చాలయ్యా (2)
    నా జీవితానికి నేవే మేలయ్యా
    ప్రేమించువాడవు పాలించువాడవు
    క్షమియించువాడవు నీవే యేసయ్యా (2)
    నా కన్నీటి లోయలో నను లేవదీసిన
    నీవే చాలయ్యా యేసు నీవే మేకయ్యా (2)

    ప్రేమించువారు లేక పక్షినైతిని
    దరిచేర్చేవారు లేక దూరమైతిని
    క్షమియించేచారు లేక దోషినైతిని
    పాప పరిహారము కోరి నిన్ను చేరితి
    నా పాపాన్ని నీ ఓర్చి నను మనిషి చేసిన

    నేను పుట్టకుముందే నీవు నన్ను చూచితివి
    రూపించ బడకముందే నన్ను ఎరిగితివి
    పిండముగా ఉన్నప్పుడే నన్ను ఏర్పరచితివి
    ఏ అర్హత లేకున్నా నన్ను ప్రేమించితివి
    నీ కల్వరి ప్రేమతో నన్ను గెలుచుకొన్నట్టి


    Neeve chalayya yesu nive chalayya (2)
    Na jivitaniki neve melayya
    Premimchuvadavu palimchuvadavu
    Kshamiyimchuvadavu nive yesayya (2)
    Na kanniti loyalo nanu levadisina
    Nive chalayya yesu nive mekayya (2)

    Premimchuvaru leka pakshinaitini
    Daricherchevaru leka duramaitini
    Kshamiyimchecharu leka doshinaitini
    Papa pariharamu kori ninnu cheriti
    Na papanni ni orchi nanu manishi chesina

    Nenu puttakumumde nivu nannu chuchitivi
    Rupimcha badakamumde nannu erigitivi
    Pimdamuga unnappude nannu erparachitivi
    E arhata lekunna nannu premimchitivi
    Ni kalvari premato nannu geluchukonnatti

  • Neeve na akarshana నీవే నా ఆకర్షణ

    నీవే నా ఆకర్షణ నీవే నా నిరీక్షణ నీవే నా భాగం యేసయ్య
    నీవే నా సంరక్షణ నీవే నా అదరణ నీవే సమస్తం యేసయ్యా
    నీవే నీవే యేసు నీవే విడిపోని ప్రేమయు నీవే
    నీవే నీవే యేసు నీవే మారిపోని స్నేహము నీవే

    శ్రమలలో నే పడినను బాధలలో మునిగినా
    నిందలెన్నో కలిగిన ఊబిలోన చిక్కుకున్న
    అదరణే కరువైన ఆశ్రయమే లేకున్న (2)

    వ్యాధులు నను చుట్టిన మరణమే వెంటాడిన
    వేదనులె పడినను అవమానమే ఎదురైనా
    సాతాను శోధించిన అగాధమే ఎదురైన (2)


    Neeve na akarshana neeve na nirikshana neeve na bagam yesayya
    Neeve na samrakshana nive na adarana neeve samastam yesayya
    Neeve neeve yesu neeve vidiponi premayu neeve
    Neeve neeve yesu neeve mariponi snehamu neeve

    Sramalalo ne padinanu badhalalo munigina
    Nimdalenno kaligina ubilona chikkukunna
    Adarane karuvaina asrayame lekunna (2)

    Vyadhulu nanu chuttina maraname vemtadina
    Vedanule padinanu avamaname eduraina
    Satanu sodhimchina agadhame eduraina (2)

  • Neevae naa praanamu neevae నీవే నా ప్రాణము నీవే

    నీవే నా ప్రాణము నీవే నా సర్వము
    నీవే నా జీవము యేసయ్యా (2)
    మరువలేను నీదు ప్రేమ
    విడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే||

    మార్గం నీవే సత్యం జీవం నీవే
    జీవించుటకు ఆధారం నీవే (2)
    అపాయము రాకుండా కాపాడువాడవు
    నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||

    తోడు నీవే నా నీడ నీవే
    నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2)
    బ్రతుకంతా నీ కొరకై జీవింతును
    నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||


    Neevae naa praanamu neevae naa sarvamu
    neevae naa jeevamu yaesayyaa (2)
    maruvalaenu needhu praem
    viduvalaenayyaa nee snaehm (3) ||neevae||

    maargm neevae sathym jeevm neevae
    jeevimchutaku aahaar neevae (2)
    apaayamu raakumdaa kaapaaduvaadavu
    ninu naenu aaraahimthun (2) ||neevae||

    thoadu neevae naa needa neevae
    nithym naa thoadugumde chelimi neevae (2)
    brathukmthaa nee korakai jeevimthunu
    ninu naenu aaraadhimthun (2) ||neevae||

  • Neevae naa priyuaodavu నీవే నా ప్రియుఁడవు

    నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవే
    యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి ||నీవే||

    పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన నా
    కొరకు విడిచితివి ||నీవే||

    నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల
    సిలువపై ||నీవే||

    నేనెవరిఁ బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ
    ప్రేమ నాకర్త ||నీవే||

    నీ సేవ నేఁ గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుఁడ నైన నే నెట్లు నిను
    విడుతు ||నీవే||

    సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కఁగం చేయుదువు
    ||నీవే||

    నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు
    ||నీవే||


    Neevae naa priyuaodavu yaesu prabhu
    neevae naa yodayuaodavu neevae
    yanaadhi dhaeva puthrumdavu neevae
    loaka mella naerpugao jaesithivi ||neevae||

    parammdhu neekumdu paramabhaagymbulu
    narakaayaththuaoda naina naa
    koraku vidichithivi ||neevae||

    neevae nanuao broava nenaru naethemchi
    neevoluka boasithivi nee nalla
    siluvapai ||neevae||

    naenevariao braemimthu nee kmte loakamuna
    nae nepudu maruvanu nee
    praema naakartha ||neevae||

    nee saeva naeao goari ninnae prathiparathu
    nee saevakuaoda naina nae netlu ninu
    viduthu ||neevae||

    sakalmbu naeledi chakkani raajavu sakalaadhikaarmbu
    chakkaogm chaeyudhuvu
    ||neevae||

    nee saevakula nella naerpugaa naeledhavu nee
    saevakulu pomdha nithya sahaaymbu
    ||neevae||

  • Nive nannun korukonnavu నీవే నన్నుకోరుకొన్నావు

    నీవే నన్నుకోరుకొన్నావు నీవే నన్ను చేరుకొన్నావు
    నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు
    ఎంతప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా (2)

    నీ అరచేతిలో నన్ను చెక్కుకొన్నావు నీ కృపలో నన్ను ఎన్నుకొన్నావు
    నీ రాజ్యములో నను దాచివుంచావు నీ నామములో నను రక్షించావు
    ఎంతప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా (2)

    నీ వాక్యముతో నను సుద్ధిచేసావు నీ రక్తముతో నను కడిగివేసావు
    నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు నీ ఆత్మతో నన్ను నింపివేసావు
    ఎంతప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా (2)


    Nive nannun korukonnavu nive nannu cherukonnavu
    Nive nannu vidipimchavu nive nannu viduvanannavu
    Emtaprema yesayya vimta prema nidayya (2)

    Ni arachetilo nannu chekkukonnavu ni krupalo nannu ennukonnavu
    Ni rajyamulo nanu dachivumchavu ni namamulo nanu rakshimchavu
    Emtaprema yesayya vimta prema nidayya (2)

    Ni vakyamuto nanu suddhichesavu ni raktamuto nanu kadigivesavu
    Ni vagdhanamuto nannu sthiraparachavu ni atmato nannu nimpivesavu
    Emtaprema yesayya vimta prema nidayya (2)

  • Neevae yehoavaa naa నీవే యెహోవా నా

    నీవే యెహోవా నా కాపరివి
    నాకేమి కొదువ లేదిలలోన

    పచ్చికగలచోట్ల నన్ను జేర్చి
    స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి
    నా ప్రాణమునకు సేదను దీర్చి
    నన్ను నడుపుము నీతిమార్గమున

    గాఢాంధకార లోయలయందు
    పడియుండి నేను సంచరించినను
    తోడైయుందువు నీ దుడ్డుకర్ర
    దండముతో నీ వాదరించెదవు

    శత్రువుల యెదుట నీవు నాకు
    నిత్యమగు విందు సిద్ధపరచి
    నాతల నూనెతో నంటియున్నావు
    నా గిన్నె నిండి పొర్లుచున్నది

    నిశ్చయముగా కృపాక్షేమములే
    వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్
    చిరకాలము యెహోవా మందిరమున
    స్థిరముగా నే నివసించెదను


    Neevae yehoavaa naa kaaparivi
    naakaemi kodhuva laedhilaloan

    pachchikagalachoatla nannu jaerchi
    svachchamagu jalamu thraaganichchi
    naa praaNamunaku saedhanu dheerchi
    nannu nadupumu neethimaargamun

    gaadaamdhakaara loayalaymdhu
    padiyumdi naenu smcharimchinanu
    thoadaiyumdhuvu nee dhuddukarr
    dhmdamuthoa nee vaadharimchedhavu

    shathruvula yedhuta neevu naaku
    nithyamagu vimdhu sidhdhaparachi
    naathala noonethoa nmtiyunnaavu
    naa ginne nimdi porluchunnadhi

    nishchayamugaa krupaakshaemamulae
    vachchu naa vemta nae brathuku dhinamul
    chirakaalamu yehoavaa mmdhiramun
    sthiramugaa nae nivasimchedhanu

  • Neeve hrudhaya saaradhi నీవే హృదయ సారధి

    నీవే హృదయ సారధి ప్రగతికి వారధి
    నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం
    నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా

    మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చి
    చిగురాశల దిశగా నను పయనింపజేసినా
    నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో
    కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే

    నీవు లేని జీవితం ప్రళయసాగరమే
    దిక్కు తోచని సమయములో నీవే దిక్సూచివై
    చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో
    కనుపాపగ నను కాచిన నా మంచి కాపరి

    చేరనైతి కోరనైతి స్నేహ సౌధము
    చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి
    చావైనా బ్రతుకైనా నీ కోసమే ప్రభు
    చాటింతును నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా


    Neeve hrudhaya saaradhi pragathiki vaaradhi
    nee snehame soubhaagyamu samkshema santhakam
    naa paatake soundharyamu neeve yesayyaa

    madhilo chedhu gnaapakaala vilaya vedhika koolchi
    chiguraasala disagaa nanu payanimpa jesinaa
    nee maatalu sthiraparachenu viswaasa premalo
    kalanainaa anukoni anuraaga bandhamaithive

    neevu leni jeevitham pralaya saagarame
    dhikku thochani samayamulo neeve dhiksoochivai
    chukkaaniga nadipinchumu aathmeeya yaathralo
    kanupaapaga nanu kaachina naa manchi kaapari

    cheranaithi koranaithi sneha soudhamu
    chirudivvega dharicheri cherchaavu sannidhi
    chaavainaa brathukainaa nee kosame prabhu
    chaatinthunu nee premanu pranuthinthu prema saagaraa