Category: Telugu Worship Songs Lyrics

  • Gaadaamdhakaaramuloa గాఢాంధకారములో

    గాఢాంధకారములో నేను తిరిగినను
    నేనేల భయపడదూ – నా యేసు
    నాతోడుండగా ||గాడాం||

    నాకున్న మనుజుల్లెలా నన్ను విడచినను
    నాదేవ ఎప్పుడైనా నన్ను విడచితివా
    నా హృదయ కమలములా నిను నేను నిలిపెదను
    నీ పాద పద్మములా నా దేవ కొలిచెదను||గాఢాం||

    ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను
    నిన్ను తలచినచో నన్ను విడనాడు
    అన్ని కాలములా నిన్ను స్మరియింతు
    ఎన్నో రానివయ్యా నీకున్న సుగుణములు ||గాఢం||


    GaaDaaMDhakaaramuloa naenu thiriginanu
    naenaela bhayapadadhoo – naa yaesu
    naathoaduMdagaa ||gaadaaM||

    naakunna manujullelaa nannu vidachinanu
    naadhaeva eppudainaa nannu vidachithivaa
    naa hrudhaya kamalamulaa ninu naenu nilipedhanu
    nee paadha padhmamulaa naa dhaeva kolichedhanu||gaaDaaM||

    ennennoa aapadhalu nannu chuttinanu
    ninnu thalachinachoa nannu vidanaadu
    anni kaalamulaa ninnu smariyiMthu
    ennoa raanivayyaa neekunna suguNamulu ||gaaDM||

  • Dhayagalayaesu paapikaashrayudaa దయగలయేసు పాపికాశ్రయుడా

    దయగలయేసు పాపికాశ్రయుడా
    ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము

    ఓ ప్రభూ నీకు విరోధముగా పాపము చేసిన దురితుండను
    నీచుడనై నిన్ను వేధించితిన్ ఓ నాథా పాపిని క్షమించుము

    లోకాశలన్నియు శోధించగా నా కాయమంతయు క్షీణించెను
    నా కాశ్రయంబు నీవే ప్రభూ ఓ నాథా పాపిని మన్నించుము

    నా ధనము ఘనము నా సర్వము నా దేవా పాపముకై వ్యయపరచితిన్
    ఓ దేవా నేను రిక్తుండను నా దురితంబులను బాపుమా

    అందరు నాకు బంధువులని ఎందరో స్నేహంబు చేసిరి
    అందరు నన్ను విడువంగను నా తండ్రీ నా కాశ్రయంబిమ్ము

    మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరియైనది
    నీ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు ఓ యేసువా

    ఈ నాడే నీ మాట నేవిందును ఎన్నడు నిన్ను విడువను
    ఈ నాడే నన్ను క్షమించుము నా పేరు గ్రంధమందు వ్రాయుము


    Dhayagalayaesu paapikaashrayudaa
    priya prabhu dhroahini karuNiMchumu

    oa prabhoo neeku viroaDhamugaa
    paapamu chaesina dhurithuMdanu
    neechudanai ninnu vaeDhiMchithin
    oa naaThaa paapini kShmiMchumu

    loakaashalanniyu shoaDhiMchagaa
    naa kaayamMthayu kSheeNiMchenu
    naa kaashrayMbu neevae prabhoo
    oa naaThaa paapini manniMchumu

    naa Dhanamu ghanamu naa sarvamu
    naa dhaevaa paapamukai vyayaparachithin
    oa dhaevaa naenu rikthuMdanu naa dhurithMbulanu baapumaa

    aMdharu naaku bMDhuvulani eMdharoa snaehMbu chaesiri
    aMdharu nannu viduvMganu naa thMdree naa kaashrayMbimmu

    marugaina naadhu paapMbulaku narakMbu naaku sariyainadhi
    nee rakthamuthoa kadugumaa mari naaku dhikkevaru oa yaesuvaa

    ee naadae nee maata naeviMdhunu ennadu ninnu viduvanu
    ee naadae nannu kShmiMchumu naa paeru grMDhamMdhu vraayumu

  • Dhayagala yaesu prabhoo దయగల యేసు ప్రభూ

    దయగల యేసు ప్రభూ – నిన్ను యెరుగ కృపనిమ్ము
    సర్వజనము నీ పునరుత్థాన శక్తిని గ్రహియింప

    యౌవనులయందు కలిగించుము నీ భయము మరి వణకును
    నీ రక్షణను కొనసాగింప జేయుము ఓ ప్రభువా !

    నీ మాటలు వినిపించుము నీ మార్గములలో నడిపించు
    నిలుపుము నీదు సాక్షులు గాను యౌవన జనములను

    అపవిత్రజనముల మధ్యలో నీ వాక్యమును ప్రకటింప
    కుమ్మరించుము పరిశుద్ధాత్మను యౌవనజనములపై

    నీ సంఘమునందు నిలుచుండి నీ దర్శనము గుర్తెరిగి
    ఎల్లప్పుడునూ ఆనందింప జేయుము యౌవనులను

    నీ మరణ పునరుత్థానములో పాలి వారినిగా జేసి
    శ్రమలయందు నిన్ను కొనియాడ జేయుము యౌవనులను

    నీ రాకడకై తీర్చుము ప్రభువా నిర్దోషులుగ యువజనుల
    నీతి ఫలములు గల వారినిగా నింపుము మా ప్రభువా

    ఉన్నత పిలుపును మరి గుర్తెరిగి నీ బహుమానములను పొంద
    పరుగిడనిమ్ము నీ గురియందే హల్లెలూయ పాటలతో


    Dhayagala yaesu prabhoo – ninnu yeruga krupanimmu
    sarvajanamu nee punaruthThaana shakthini grahiyiMp

    yauvanulayMdhu kaligiMchumu nee bhayamu mari vaNakunu
    nee rakShNanu konasaagiMpa jaeyumu oa prabhuvaa !

    nee maatalu vinipiMchumu nee maargamulaloa nadipiMchu
    nilupumu needhu saakShulu gaanu yauvana janamulanu

    apavithrajanamula maDhyaloa nee vaakyamunu prakatiMp
    kummariMchumu parishudhDhaathmanu yauvanajanamulapai

    nee sMghamunMdhu niluchuMdi nee dharshanamu gurtherigi
    ellappudunoo aanMdhiMpa jaeyumu yauvanulanu

    nee maraNa punaruthThaanamuloa paali vaarinigaa jaesi
    shramalayMdhu ninnu koniyaada jaeyumu yauvanulanu

    nee raakadakai theerchumu prabhuvaa nirdhoaShuluga yuvajanul
    neethi phalamulu gala vaarinigaa niMpumu maa prabhuvaa

    unnatha pilupunu mari gurtherigi nee bahumaanamulanu poMdh
    parugidanimmu nee guriyMdhae hallelooya paatalathoa

  • Dhappigonina vaaralaaraa దప్పిగొనిన వారలారా

    దప్పిగొనిన వారలారా దప్పితీర్చుకొన రండి రండి

    అను పల్లవి: కాసు రూకలు లేకున్నను త్రాగను రండి

    యెషయా యిరువదియైదు ఆరవ వచనము చదివి
    త్రాగుచు తృప్తి పొందను రండి రండి

    క్రొవ్విన పదార్థమును పాత ద్రాక్షారసమును
    క్రొవ్వు మెదడు గలవాటిని తినుటకు రండి

    నేనే జీవపానమును – నేనే పరమాహారమును
    రూకలను వ్యర్థము చేయక – రండి రండి

    నా మాంసమే పరమాహారం – నే చిందించిన రక్తమేపానం
    తిని త్రాగిన వారికి కల్గును నిత్యజీవం

    ద్రాక్షారసము ఓదార్చున్ – జల్దరు తృప్తిపరచున్
    నీకు నూనె ఉజ్జీవమునిచ్చున్నిచ్చున్

    గొఱ్ఱెపిల్లలు దూడలును – తినువారికి చంపబడెను
    వ్యర్థసాకులను చెప్పక రండి రండి

    సర్వసమృద్ధిలోన దేవుడున్నాడు రండి
    హల్లెలూయ పాటలుండును రండి రండి


    Dhappigonina vaaralaaraa dhappitheerchukona rMdi rMdi

    kaasu rookalu laekunnanu thraaganu rMdi

    yeshyaa yiruvadhiyaidhu aarava vachanamu chadhivi
    thraaguchu thrupthi poMdhanu rMdi rMdi

    krovvina padhaarThamunu paatha dhraakShaarasamunu
    krovvu medhadu galavaatini thinutaku rMdi

    naenae jeevapaanamunu – naenae paramaahaaramunu
    rookalanu vyarThamu chaeyaka – rMdi rMdi

    naa maaMsamae paramaahaarM – nae chiMdhiMchina rakthamaepaanM
    thini thraagina vaariki kalgunu nithyajeevM

    dhraakShaarasamu oadhaarchun – jaldharu thrupthiparachun
    neeku noone ujjeevamunichchunnichchun

    goRRepillalu dhoodalunu – thinuvaariki chMpabadenu
    vyarThasaakulanu cheppaka rMdi rMdi

    sarvasamrudhDhiloana dhaevudunnaadu rMdi
    hallelooya paataluMdunu rMdi rMdi

  • Dhappigonina vaanipai దప్పిగొనిన వానిపై

    దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే
    ఎండియున్న భూమిపై జలముల్ – ప్రవహింప జేయునాయనే

    వడిగల జలములలో దారిన్ – నిర్మించును ఆ ప్రభువే
    అడవులలో రాజబాటలను – స్థాపించును మన ప్రభువే

    మన సంతతిపై ఆత్మన్ – కుమ్మరించును మన ప్రభువే
    తన ఆత్మలో వారిని నింపి – నిర్మించును సంఘముగా

    నీటికాలువలయొద్ద – నిరవంజి చెట్లవలె
    గడ్డిలో యెదుగునట్లు – వారు వర్ధిల్లెదరు

    కరుణాపీఠము పై నుండి – మాట్లాడెను మన దేవుడే
    పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే

    ఆకాశము తెరువబడగా – మాట్లాడెను మన దేవుడే
    ఒక శబ్దముచే తన సుతుని – ఘనపరచెను మన దేవుడే

    మందసమున్ దేవుని ప్రజలు – మందిరమందుంచగనే
    మందిరమున్ క్రమ్మెను ప్రభుని – తేజోమహిమంతటను

    తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ – సేవింతురు హర్షముతో
    దిన దినము దేవునికొల్చి – హల్లెలూయ పాడెదరు


    Dhappigonina vaanipai neetin kummariMchunu aa prabhuvae
    eMdiyunna bhoomipai jalamul – pravahiMpa jaeyunaayanae

    vadigala jalamulaloa dhaarin – nirmiMchunu aa prabhuvae
    adavulaloa raajabaatalanu – sThaapiMchunu mana prabhuvae

    mana sMthathipai aathman – kummariMchunu mana prabhuvae
    thana aathmaloa vaarini niMpi – nirmiMchunu sMghamugaa

    neetikaaluvalayodhdha – niravMji chetlavale
    gaddiloa yedhugunatlu – vaaru varDhilledharu

    karuNaapeeTamu pai nuMdi – maatlaadenu mana dhaevudae
    paraloakamu nuMdi svaramun vinipiMchenu mana dhaevudae

    aakaashamu theruvabadagaa – maatlaadenu mana dhaevudae
    oka shabdhamuchae thana suthuni
    ghanaparachenu mana dhaevudae

    mandhasamun dhaevuni prajalu – mMdhiramMdhuMchaganae
    mandhiramun krammenu prabhuni – thaejoamahimMthatanu

    thana prajalellappudu kreesthun – saeviMthuru harShmuthoa
    dhina dhinamu dhaevunikolchi – hallelooya paadedharu

  • Dhaaniyaelvale దానియేల్వలె సాహసించుడి

    దానియేల్వలె సాహసించుడి యొంటరిగా నిల్వ దానియేల్వలె
    సాహసించుడి దానియేల్వలె సాహసించుచు జ్ఞానులై దృఢ కార్యముఁ
    గలిగి దీనులై యా దృఢ కార్యం బిఁకఁ బూని తెల్పను సాహసించుడి
    ||దానియేల్||

    నిక్కమగు కార్యమునందు నిలిచి దైవాజ్ఞ లెలఁ గ్రక్కున గైకొను
    జనములగాంచి చక్కఁగ వారిని ఘనపర్చుచు సంతతము నెనరుఁ పించుచు
    మిక్కిలి దానియేల్సంఘమును మెచ్చుచు నంగీకరించుఁడీ ||దానియేల్||

    ధారుణిపైని నగరములలో మరణించిరిగా కడు శూరులనఁబడువా
    రనేకులు వారు దానియేల్సంఘమును గని కోరి యేకీభవించినమది
    వారలే ప్రభుదేవుని భట పరి వారమునఁబడి యుందురు నిజ మిఁక
    ||దానియేల్||

    కాన నీ సువిశేషమును జెండ పైకెత్తుఁడీ సై తానుని నెదిరించను రండి
    దీనిని దీని శ్రేణులను యు ద్ధానికి రారమ్మని పిలిచి దానియేల్సంఘము
    పక్షమునఁ బూని జయధ్వనులనుఁ జేయుటకై ||దానియేల్||


    Dhaaniyaelvale saahasiMchudi yoMtarigaa nilva dhaaniyaelvale
    saahasiMchudi dhaaniyaelvale saahasiMchuchu
    jnYaanulai dhruDa kaaryamuAO
    galigi dheenulai yaa dhruDa kaaryM biAOkAO
    booni thelpanu saahasiMchudi
    ||dhaaniyael||

    nikkamagu kaaryamunMdhu nilichi dhaivaajnY lelAO grakkuna gaikonu
    janamulagaaMchi chakkAOga vaarini ghanaparchuchu
    smthathamu nenaruAO piMchuchu
    mikkili dhaaniyaelsMghamunu mechchuchu
    nmgeekariMchuAOdee ||dhaaniyael||

    DhaaruNipaini nagaramulaloa maraNiMchirigaa kadu shoorulanAObaduvaa
    ranaekulu vaaru dhaaniyaelsMghamunu
    gani koari yaekeebhaviMchinamadhi
    vaaralae prabhudhaevuni bhata pari
    vaaramunAObadi yuMdhuru nija miAOka
    ||dhaaniyael||

    kaana nee suvishaeShmunu jeMda paikeththuAOdee
    sai thaanuni nedhiriMchanu rMdi
    dheenini dheeni shraeNulanu yu dhDhaaniki
    raarammani pilichi dhaaniyaelsMghamu
    pakShmunAO booni jayaDhvanulanuAO jaeyutakai ||dhaaniyael||

  • Dhinamu gathiyimchenu దినము గతియించెను

    దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె నిఁ
    కమా మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై ఘనుఁడ దేవా ||దినము||

    సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుఁజూపె ప్రభువా
    దొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము ||దినము||

    కటికి చీఁకటులు దిక్తటములఁ గలిపియు త్కటములైన నీ చెం
    గట నున్న నెట్టి సంకటమేని మమ్ముఁ దాఁకుటకు జంకు ||దినము||

    తలఁపువలనను నోటి పలుకువలనను జెనఁటి పనులవల్ల మేము
    వలచి చేసిన పాపముల నెల్ల క్షమియింపుమ లఘక్షాంతి ||దినము||

    ముమ్మరమ్మగు శోధ నమ్ములపై విజయమ్మునొంద నీ దినమ్ము
    మాకు సామర్ధ్యమొసఁగితివి వంద నమ్ము దేవ ||దినము||

    ఈ దినము మాకు సమ్మోదంబుతో నిచ్చి యాదుకొన్న వరమౌ
    నీ దివ్యదానముల కై దేవ! మా కృతజ్ఞతను గొమ్ము ||దినము||

    అలసిన మా దేహములకు వలసిన నిదురఁ గలుగఁజేసి నీదూ
    తల హస్తములలో మమ్ములను దాఁచుము భద్రముగను దేవ ||దినము||

    అరుణోదయముననిన్నర్చించు కొఱకు నీ కరము సాఁచి మమ్ము
    త్వరగా మేల్కొల్పుము స్వాస్థ్య ప్రదాతవై పరమదేవ ||దినము||

    దాత వీవె లోక త్రాత వీవె మాకు నేత వీవె యేసు నీతి
    సూర్యుండవి ఖ్యాతి మహిమలు నీకె కలుగుఁగాక ||దినము||


    Dhinamu gathiyiMchenu dhinanaaDhuAOda
    paraadhri venukadaaAOge niAO
    kamaa munimaapu sMsthavamuAO gonumu
    smpreethimai ghanuAOda dhaevaa ||dhinamu||

    saravinMbaraveeDhi sMja keMjaayalu
    muruvuAOjoope prabhuvaa
    dhoramu nee mukhakaaMthi kiraNa jaalamu
    maapai neRaparammu ||dhinamu||

    katiki cheeAOkatulu dhikthatamulAO
    galipiyu thkatamulaina nee cheM
    gata nunna netti sMkatamaeni mammuAO
    dhaaAOkutaku jMku ||dhinamu||

    thalAOpuvalananu noati palukuvalananu
    jenAOti panulavalla maemu
    valachi chaesina paapamula nella
    kShmiyiMpuma laghakShaaMthi ||dhinamu||

    mummarammagu shoaDha nammulapai
    vijayammunoMdha nee dhinammu
    maaku saamarDhyamosAOgithivi vMdha
    nammu dhaeva ||dhinamu||

    ee dhinamu maaku sammoadhMbuthoa nichchi
    yaadhukonna varamau
    nee dhivyadhaanamula kai dhaeva! maa
    kruthajnYthanu gommu ||dhinamu||

    alasina maa dhaehamulaku valasina
    nidhurAO galugAOjaesi needhoo
    thala hasthamulaloa mammulanu dhaaAOchumu
    bhadhramuganu dhaeva ||dhinamu||

    aruNoadhayamunaninnarchiMchu koRaku
    nee karamu saaAOchi mammu
    thvaragaa maelkolpumu svaasThya pradhaathavai
    paramadhaeva ||dhinamu||

    dhaatha veeve loaka thraatha veeve
    maaku naetha veeve yaesu neethi
    sooryuMdavi khyaathi mahimalu
    neeke kaluguAOgaaka ||dhinamu||

  • Dhinadhinamuku dhikku దినదినముకు దిక్కు

    దినదినముకు దిక్కు నీవే మా దేవుఁడా మమ్ము కనిపెట్టి కాపాడ
    నెపుడు కర్త వీవే కర్త వీవే ||దినదినమునకు||

    పనికిమాలిన వారము పాపిష్ఠులము నీదు కనికరమును జూచి కృపతోఁ
    గావు మమ్ముఁ గావు మమ్ము ||దినదినమునకు||

    పాప మైన లోక మైన పిశాచక మైన మమ్ముఁ భట్టి రక్షింప వచ్చినఁ
    బ్రాపు నీవే ప్రాపు నీవే ||దినదినమునకు||

    కష్టములు కాని శోధనలు మమ్ముఁ జుట్టు కొనఁగ నీ కృపనెంతో
    చూపుదువే చూపుదువే ||దినదినమునకు||

    నిందలైన దెబ్బ లైన నీదు నామమున మేము పొందఁబోవు కాలమందుఁ
    దండ్రి వీవే తండ్రి వీవే ||దినదినమునకు||

    సత్యమైన వాక్య మిచ్చి సారమును దెల్పి నీదు నిత్యజీవ మార్గ మందు
    నిలిపితివే నిలిపితివే ||దినదినమునకు||

    ఆసఁ గొల్పి యాత్మలో నా క్యానుభవ మొందించి నీకు దాసులపై
    బ్రతుకునట్లు ధైర్య మిమ్ము ధైర్య మిమ్ము ||దినదినమునకు||

    విశ్వాస నిరీక్షణ ప్రేమ లింపుగా మాకు నీవు శాశ్వతముగఁ బంపించుమీ
    శ్రేష్టముగను శ్రేష్ఠముగను ||దినదినమునకు||


    Dhinadhinamuku dhikku neevae maa
    dhaevuAOdaa mammu kanipetti kaapaada
    nepudu kartha veevae kartha veevae ||dhinadhinamunaku||

    panikimaalina vaaramu paapiShTulamu
    needhu kanikaramunu joochi krupathoaAO
    gaavu mammuAO gaavu mammu ||dhinadhinamunaku||

    paapa maina loaka maina pishaachaka
    maina mammuAO bhatti rakShiMpa vachchinAO
    braapu neevae praapu neevae ||dhinadhinamunaku||

    kaShtamulu kaani shoaDhanalu mammuAO
    juttu konAOga nee krupaneMthoa
    choopudhuvae choopudhuvae ||dhinadhinamunaku||

    niMdhalaina dhebba laina needhu naamamuna
    maemu poMdhAOboavu kaalamMdhuAO
    dhMdri veevae thMdri veevae ||dhinadhinamunaku||

    sathyamaina vaakya michchi saaramunu dhelpi
    needhu nithyajeeva maarga mMdhu
    nilipithivae nilipithivae ||dhinadhinamunaku||

    aasAO golpi yaathmaloa naa kyaanubhava
    moMdhiMchi neeku dhaasulapai
    brathukunatlu Dhairya mimmu Dhairya mimmu ||dhinadhinamunaku||

    vishvaasa nireekShNa praema liMpugaa maaku
    neevu shaashvathamugAO bMpiMchumee
    shraeShtamuganu shraeShTamuganu ||dhinadhinamunaku||

  • Dhaathruthvamunu galigi దాతృత్వమును గలిగి

    దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱు
    గుదమ ||దాతృ||

    శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ
    ||దాతృ||

    సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ
    ||దాతృ|

    గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు
    నేర్పింతమ ||దాతృ||

    సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ
    ||దాతృ||

    ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ
    బోధింతమ ||దాతృ||

    విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో
    దర్శింతము ||దాతృ||

    దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ ||దాతృ||

    పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ
    ||దాతృ||

    వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ
    ||దాతృ||

    వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ ||దాతృ||


    Dhaathruthvamunu galigi perugudhama Dhanamu
    Dhaathri dhaevuni dhMchu neRu
    gudhama ||dhaathru||

    shakthikolAOdhi kaankalarpiMthama mana
    bhukthinuMdi koMthAO dheeyudhama
    ||dhaathru||

    sMthoaShmuga niyya saagudhama mana
    ssMthatithoaAO jaeya naegu dhama
    ||dhaathru||

    garvaghanamulu veedi yarpiMthama yurvi sarva maayanMdhu
    naerpiMthama ||dhaathru||

    sMgha saevaku sommu samakoorthama kreesthu
    sMgha yakkaRa lanni theerchudhama
    ||dhaathru||

    prathiyaadhivaara midhi madhi nuMthama dheeni
    prathi sMghasThuAOdu chaeya
    boaDhiMthama ||dhaathru||

    viDhiAO dhalAOchi dhurbalula rakShiMthama sMgha
    viDhavaaLi dhaanamuthoa
    dharshiMthamu ||dhaathru||

    dhikkulaeni janula dheeviMthama vaari yakkaRalaloa
    maeluAO gaaviMthama ||dhaathru||

    puchchukonutakMte nichchudhama maRala nichchu
    thMdriki sthuthula nichchedhama
    ||dhaathru||

    vedhajalli yabhivrudhdhi poMdhudhama moakSh padhavu
    lanu bhaviMpAO barugidudhama
    ||dhaathru||

    varDhillina koladhi chelliMthamu loaka vyarTha
    kharchulanella maLliMthama ||dhaathru||

  • Dhaatumu yordhaanun దాటుము యొర్దానున్

    దాటుము యొర్దానున్ యాత్రికుడా
    నాలుగు ఘడియలకే అతిథివి నీవిచట

    ఇహలోకములో సుఖమే లేదు గడ్డిని బోలినదే
    జీవిత మంతయును

    నీడలు క్షణములో మారినరీతిన్ జీవితముండు గదా
    ఆవిరి సమమే గదా

    వ్యర్థము వ్యర్థము మాయలోకములోని సర్వమును
    చెత్తను బోలినదే

    కన్నులెత్తి చూడుము క్రీస్తున్ ఆయనే సర్వములో
    మహోన్నతుండు

    సిలువను మోసి సాగుము ప్రియుడా చేరుదువు నీవు
    కానాను దేశమున

    వాక్యము మార్గము జూపును నీకు క్రీస్తునే గురిగా
    నుంచుకొనుము సదా


    Dhaatumu yordhaanun yaathrikudaa
    naalugu ghadiyalakae athiThivi neevichat

    ihaloakamuloa sukhamae laedhu gaddini boalinadhae
    jeevitha mMthayunu

    needalu kShNamuloa maarinareethin jeevithamuMdu gadhaa
    aaviri samamae gadhaa

    vyarThamu vyarThamu maayaloakamuloani sarvamunu
    cheththanu boalinadhae

    kannuleththi choodumu kreesthun aayanae sarvamuloa
    mahoannathuMdu

    siluvanu moasi saagumu priyudaa chaerudhuvu neevu
    kaanaanu dhaeshamun

    vaakyamu maargamu joopunu neeku kreesthunae gurigaa
    nuMchukonumu sadhaa