Category: Telugu Worship Songs Lyrics

  • Tamdri parama tamdri nive ma తండ్రి పరమ తండ్రి నీవే మా

    తండ్రి పరమ తండ్రి నీవే మా ప్రియ తండ్రి
    నీవే సమస్తం రక్షణ కేడెం
    ఆశ్రయ స్ధానం రక్షణ శృంగం

    కష్ట కాలములో అదరించు నాధ
    కృంగిన వేళలో అదుకొను దేవా
    నా హృదయముతో స్తుతించెదను
    నీ కృప నిరతం తల పోయుదును
    కములెత్తి స్తుతించెదను

    ఊహించలేని ఈవుల నొసగి
    కంటిపాపలా కాపాడు తండ్రి
    ప్రేమతో పలచి స్ధిరపరచితివి
    విడువని కృపతో అదరించితివి
    కల్వరి నాధా స్తుతించెదను


    Tamdri parama tamdri nive ma priya tamdri
    Nive samastam rakshana kedem
    Asraya sdhanam rakshana srumgam

    Kashta kalamulo adarimchu nadha
    Krumgina velalo adukonu deva
    Na hrudayamuto stutimchedanu
    Ni krupa niratam tala poyudunu
    Kamuletti stutimchedanu

    Uhimchaleni ivula nosagi
    Kamtipapala kapadu tamdri
    Premato palachi sdhiraparachitivi
    Viduvani krupato adarimchitivi
    Kalvari nadha stutimchedanu

  • Tamdri kumara suddhatmuda తండ్రి కుమార శుద్ధాత్ముడా

    తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా
    ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో

    సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా
    నా కొరకే బలియైన దేవా నిన్నే నే ఆరాధింతున్

    జీవాధిపతియైన తేజోమయుడా
    సర్వోన్నతుడా . . . . నిన్నే నే ఆరాధింతున్


    Tamdri kumara suddhatmuda triyeka devuda
    Aradhimtunu ninne atmato satyamuto

    Srushtikarta ninne satya svarupuda
    Na korake baliyaina deva ninne ne aradhimtun

    Jivadhipatiyaina tejomayuda
    Sarvonnatuda . . . . Ninne ne aradhimtun

  • Dhaevaa tharatharamulaku దేవా తరతరములకు

    దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే

    మా దోషములను నీవు నీ యెదుట – నుంచుకొని యున్నావు
    నీ ముఖకాంతిలో మా రహస్య పా-పములు కనబడుచున్నవి

    మా దినములన్ని గడిపితిమి – నీ యుగ్రత భరించుచు
    నిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము

    డెబ్బది సంవత్సరములేగా – మాదు ఆయుష్కాలము
    అధిక బలమున్న యెడల యెనుబది – సంవత్సరములగును

    అయినను వాటి వైభవమంత – ఆయాసమే దుఃఖమే
    అది త్వరగా గతించును మే-మెగిరి పోయెదము

    నీకే జెందవలసినట్టి భయము – కొలది పుట్టినట్టి
    నీదు ఆగ్రహ క్రోధ బలము – ఎవ్వరికి తెలియున్

    మాకు నీ జ్ఞాన హృదయమును – కలుగునట్లు చేయుము
    మాదినములు లెక్కించుటకు – మాకు నీవే నేర్పుము


    Dhaevaa tharatharamulaku maani
    vaasa sThalamu neevae

    maa dhoaShmulanu neevu nee yedhuta – nuMchukoni yunnaavu
    nee mukhakaaMthiloa maa rahasya paa-pamulu kanabaduchunnavi

    maa dhinamulanni gadipithimi – nee yugratha bhariMchuchu
    nittoorpulu vidachinatlu maa jee-vithamu jarupukoMdhumu

    debbadhi sMvathsaramulaegaa – maadhu aayuShkaalamu
    aDhika balamunna yedala yenubadhi – sMvathsaramulagunu

    ayinanu vaati vaibhavamMtha – aayaasamae dhuHkhamae
    adhi thvaragaa gathiMchunu mae-megiri poayedhamu

    neekae jeMdhavalasinatti bhayamu – koladhi puttinatti
    needhu aagraha kroaDha balamu – evvariki theliyun

    maaku nee jnYaana hrudhayamunu – kalugunatlu chaeyumu
    maadhinamulu lekkiMchutaku – maaku neevae naerpumu

  • Dhaeva gorrepilla siluvaloa samasinapudu దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడు

    దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడు
    పాప పరిహారార్థ ఊట తెరచెన్
    పాపి నీవు ఆరక్తమందు నిలచియున్నావా!
    ఇపుడు విడుదలను కోరి పొందెదవా!

    పల్లవి: రక్తమందు రక్తమందు
    పాపి నీవు ఆ రక్తమందు నిలిచియున్నావా
    రక్తమందు రక్తమందు – ఇపుడు విడుదలను కోరి పొందెదవా

    అపవిత్రుడైనను అక్రమస్తుడైనను
    ఆ పవిత్రరక్తము శుద్ధిచేయును
    ఏలు పాపమైనను – అతిక్రమమైనను
    ఏలికచే మన్నింపబడి యున్నావా

    ప్రియులారా యను ప్రభుని పిల్పు వింటివా
    మాయవేషమంతయు వీడియున్నావా
    పాప బంధము లింక నిన్ను కట్టియున్నవా
    శాపలోకముపై జయ మొందుచున్నావా

    ఆత్మజీవ శరీరంబుల నర్పించితివా
    అల్పవిషయములోను సత్యమున్నదా
    నాడు మరణించిన యేసులేచియున్నాడు
    నేడుయేసున్ చేరిన యభయ మిచ్చును

    పంచఖండములను రక్షించుట కొరకు
    పంచగాయ మొందిన ప్రభుని చూడుమా
    ఇంచుకైన త్రోయడు డాసినట్టి వారల
    మించు సత్యములను కోరి వెదకుము

    రేపు రేపు యనుట నమ్మిక కానేరదు
    మాపు మరణించిన నెచటి కేగుదువు
    ప్రాపకుండగు యేసుని చిత్తమును జరిపిన
    శ్రీ పాలుండు నిన్నుత్తముండని మెచ్చును

    హల్లెలూయా పాడుము శక్తిగల యేసుకు
    కల్ల కార్యములను విడచివేయుము
    చెల్లచెదరగును కష్టము లచ్చోటను
    కొల్లగా ననుభవింతువు సుఖంబును


    Dhaeva gorrepilla siluvaloa samasinapudu
    paapa parihaaraarTha oota therachen
    paapi neevu aarakthamMdhu nilachiyunnaavaa!
    ipudu vidudhalanu koari poMdhedhavaa!

    Chorus: rakthamMdhu rakthamMdhu
    paapi neevu aa rakthamMdhu nilichiyunnaavaa
    rakthamMdhu rakthamMdhu – ipudu vidudhalanu koari poMdhedhavaa

    apavithrudainanu akramasthudainanu
    aa pavithrarakthamu shudhDhichaeyunu
    aelu paapamainanu – athikramamainanu
    aelikachae manniMpabadi yunnaavaa

    priyulaaraa yanu prabhuni pilpu viMtivaa
    maayavaeShmMthayu veediyunnaavaa
    paapa bMDhamu liMka ninnu kattiyunnavaa
    shaapaloakamupai jaya moMdhuchunnaavaa

    aathmajeeva shareerMbula narpiMchithivaa
    alpaviShyamuloanu sathyamunnadhaa
    naadu maraNiMchina yaesulaechiyunnaadu
    naeduyaesun chaerina yabhaya michchunu

    pMchakhMdamulanu rakShiMchuta koraku
    pMchagaaya moMdhina prabhuni choodumaa
    iMchukaina throayadu daasinatti vaaral
    miMchu sathyamulanu koari vedhakumu

    raepu raepu yanuta nammika kaanaeradhu
    maapu maraNiMchina nechati kaegudhuvu
    praapakuMdagu yaesuni chiththamunu jaripin
    shree paaluMdu ninnuththamuMdani mechchunu

    hallelooyaa paadumu shakthigala yaesuku
    kalla kaaryamulanu vidachivaeyumu
    chellachedharagunu kaShtamu lachchoatanu
    kollagaa nanubhaviMthuvu sukhMbunu

  • Dhaeva kumaaraa dheenoapakaara దేవ కుమారా దీనోపకారా

    దేవ కుమారా దీనోపకారా నా వంక
    దయఁజూప నా యన్న రారా||దేవ||

    వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ
    కరుణచే రక్షింపవయ్యా||దేవ||

    పాపుల పాలిటి పరమదయాళూ దీవించు
    నీ దయ దీనునికిపుడు||దేవ||

    వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవే
    యేసు నామావతారా||దేవ||

    భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే
    నజరేతువాఁడా||దేవ||

    కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము
    వాని చే తిని వీడ వలదు||దేవ||

    మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ
    బాపవే ఇమ్మానుయేలా||దేవ||


    dhaeva kumaaraa dheenoapakaaraa naa vMka
    dhayAOjoopa naa yanna raaraa||dhaeva||

    vrukShmuAO baasina pakShi naenayyaa
    akSheeNa karuNachae rakShiMpavayyaa||dhaeva||

    paapula paaliti paramadhayaaLoo
    dheeviMchu nee dhaya dheenunikipudu||dhaeva||

    vinuthiMthu sadhguNa vmala vchaaa
    nanuAObroavavae yaesu naamaavathaaraa||dhaeva||

    bhajanAOjaesedha ninnu nija rakShkuMda
    vijayamuAOjaeyavae najaraethu
    vaaAOdaa||dhaeva||

    kanikara mathyMtha karuNayuAOgaladhu ninu nammu
    vaani chae thini veeda valadhu||dhaeva||

    mahaneeya guNamaNi mMditha dhaevaa ihabaaDha
    baapavae immaanuyaelaa||dhaeva||

  • Dhaeva kaavavae naedu mammulan దేవ కావవే నేడు మమ్ములన్

    దేవ కావవే నేడు మమ్ములన్ నీవెరాత్రి కాచినావు నీకు స్తోత్రము ||దేవ||

    ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య
    నేడు నీదు కఱుణ తోడను ||దేవ||

    నేటి కార్యముల్ నేడె చేయగా సూటియైన త్రోవ
    మాకు చూపుమోప్రభో ||దేవ||

    చెడ్డ కార్యముల్ చేయకుండను దొడ్డబుద్ధి నిచ్చి
    మమ్ము నుద్ధరించుము దేవ ||దేవ||


    Dhaeva kaavavae naedu mammulan neeveraathri
    kaachinaavu neeku sthoathramu ||dhaeva||

    aapadhalu mamun aMtakuMdanu kaavumayya
    naedu needhu kaRuNa thoadanu ||dhaeva||

    naeti kaaryamul naede chaeyagaa sootiyaina
    throava maaku choopumoaprabhoa ||dhaeva||

    chedda kaaryamul chaeyakuMdanu dhoddabudhDhi nichchi
    mammu nudhDhariMchumu dhaeva ||dhaeva||

  • Dhaaruna magu marana vaaridhi దారుణ మగు మరణ వారిధి

    దారుణ మగు మరణ వారిధి దాఁట నె వ్వారి శక్యము సోదర ఘోర
    మగు కెరటములవలె వి స్తారముగ
    నేరములు పైఁగొని పారు చుండునప్పు
    డద్దరిఁ జేరు టెట్లు దారిఁ గనరే ||దారుణ||

    ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావు
    ఎక్కడైనను నోడ గనుఁగొని యెక్కిపోద
    మని తలంచినఁ జెక్క నిర్మతమైన
    యోడ లక్కఱకు రావేమి సేతుము ||దారుణ||

    మంగళ ధ్వనులతో శృంగారపురము వె లుంగుచున్నది ముందట
    పొంగి పారుచు మరణ నది త రంగములఁ
    జెలంగుచున్నది భంగపడకుఁడి
    మనకు క్రీస్తు సువార్తయను పెను నావ యిదిగో ||దారుణ||

    వాద రహితుండైన యాది దేవుఁడు దాని నాధుం డనం బరఁగును
    బాధ లొందిన నరుల నందరిఁ జేరఁదీసిన
    క్రీస్తు యేసు నాధుఁడే నావి
    కుఁ డు క్రైస్తవ వేదమే చుక్కాని దీవికి ||దారుణ||

    మానవు లందరు మరణాంబుధిని దాఁట మహనీయ మగు నావ యిదె
    దీనిలో నెక్కుటకు ముందే మానుగ వాక్యమును విని సు జ్ఞాన
    మొందినవారు క్రైస్తవ స్నాన మను పత్రికను బొందరె ||దారుణ||

    విదితంబుగా నిందు విజ్ఞాన బోదకుల్ వినిపించుదురు వాక్యముఁ
    గొదగొనిన యాత్మములు తృప్తిఁ గొనును బ్రభు భోజనములోనే
    హృదయములలో దేవునాత్మ యెపుడు దీపంబై వెలుంగును ||దారుణ||

    పలువిధ సంగీత ములతో సాగుచు మనము నలయ కుండఁగఁ బోదు
    ము బలముగల యీ యలలు దాఁటి పరమ పురద్వారముల వెలుపల
    గలిసికొని పరిశుద్ధ జనమును గడకు మోక్షము చేరుకొందుము ||దారుణ||

    కరుణామయుని సభలోఁ జొరకపోయిన నిత్య నరక మంత మందున
    మరియు నంత్య దినపు బాధలు విరివిగ వినఁ గోరువారలు మరణ
    మొందక మును ప్రత్యక్షీ కరుణ మను గ్రంథమను వినరే ||దారుణ||


    DhaaruNa magu maraNa vaariDhi dhaaAOta
    ne vvaari shakyamu soadhara ghoara
    magu keratamulavale vi sthaaramuga
    naeramulu paiAOgoni paaru chuMdunappu
    dadhdhariAO jaeru tetlu dhaariAO ganarae ||dhaaruNa||

    okka pettuna negasi chakka velLudha mana
    nee rekka lakkaRaku raavu
    ekkadainanu noada ganuAOgoni yekkipoadha
    mani thalMchinAO jekka nirmathamaina
    yoada lakkaRaku raavaemi saethumu ||dhaaruNa||

    mMgaLa Dhvanulathoa shruMgaarapuramu
    ve luMguchunnadhi muMdhata
    poMgi paaruchu maraNa nadhi tha rMgamulAO
    jelMguchunnadhi bhMgapadakuAOdi
    manaku kreesthu suvaarthayanu penu naava yidhigoa ||dhaaruNa||

    vaadha rahithuMdaina yaadhi dhaevuAOdu
    dhaani naaDhuM danM barAOgunu
    baaDha loMdhina narula nMdhariAO jaerAOdheesina
    kreesthu yaesu naaDhuAOdae naavi
    kuAO du kraisthava vaedhamae chukkaani dheeviki ||dhaaruNa||

    maanavu lMdharu maraNaaMbuDhini
    dhaaAOta mahaneeya magu naava yidhe
    dheeniloa nekkutaku muMdhae maanuga
    vaakyamunu vini su jnYaana
    moMdhinavaaru kraisthava snaana manu
    pathrikanu boMdhare ||dhaaruNa||

    vidhithMbugaa niMdhu vijnYaana
    boadhakul vinipiMchudhuru vaakyamuAO
    godhagonina yaathmamulu thrupthiAO
    gonunu brabhu bhoajanamuloanae
    hrudhayamulaloa dhaevunaathma yepudu
    dheepMbai veluMgunu ||dhaaruNa||

    paluviDha sMgeetha mulathoa saaguchu
    manamu nalaya kuMdAOgAO boadhu
    mu balamugala yee yalalu dhaaAOti
    parama puradhvaaramula velupala
    galisikoni parishudhDha janamunu
    gadaku moakShmu chaerukoMdhumu ||dhaaruNa||

    karuNaamayuni sabhaloaAO jorakapoayina
    nithya naraka mMtha mMdhuna
    mariyu nMthya dhinapu baaDhalu viriviga
    vinAO goaruvaaralu maraNa
    moMdhaka munu prathyakShee karuNa manu
    grMThamanu vinarae ||dhaaruNa||

  • Dhaaritholagithivaela rakshna దారితొలగితివేల రక్షణ

    దారితొలగితివేల (2) రక్షణ మార్గము వెదకు (2)

    పాపమందే జన్మించితివి (2)
    పాపమందే జీవించితివి (2) ఎరుగకున్నావు (2)….

    పాప ఫలితము ఘోరమరణము
    నరకదండన అగ్ని గుండము మారు మనస్సు నొందు….

    నేడే యేసుని వాక్యము వినుము
    నేడే ప్రభుని స్వరము వినుము తన చిత్తము నెరుగు….

    నీవు నశించుట కోరడు ప్రభువు
    తరుణముండగ వేడుకొనుము ఎరుగు నీ స్థితిని….

    అందరిని మారుమనస్సును
    పొందుమని ప్రభువాజ్ఞాపించె పశ్చాత్తాపపడుము….

    ఒప్పుకొనుము నీ పాపమును
    క్షమాపణకై వేడుకొనుము రక్షణ పొందెదవు….

    విశ్వాసముతో అడిగిన యెడల
    పొందితివని నిశ్చయముగ నెరుగు గొప్ప రక్షణ యిదియే


    Dhaaritholagithivaela (2) rakShNa maargamu vedhaku (2)

    paapamMdhae janmiMchithivi (2)
    paapamMdhae jeeviMchithivi (2) erugakunnaavu (2)….

    paapa phalithamu ghoaramaraNamu
    narakadhMdana agni guMdamu maaru manassu noMdhu….

    naedae yaesuni vaakyamu vinumu
    naedae prabhuni svaramu vinumu thana chiththamu nerugu….

    neevu nashiMchuta koaradu prabhuvu
    tharuNamuMdaga vaedukonumu erugu nee sThithini….

    aMdharini maarumanassunu
    poMdhumani prabhuvaajnYaapiMche pashchaaththaapapadumu….

    oppukonumu nee paapamunu
    kShmaapaNakai vaedukonumu rakShNa poMdhedhavu….

    vishvaasamuthoa adigina yedal
    poMdhithivani nishchayamuga nerugu goppa rakShNa yidhiyae

  • Dhorakuthaavuraa sahoadharaa దొరకుతావురా సహోదరా

    దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా, నీవు
    తరిమి తరిమి కీడుచేయ పరుగులెత్తినగాని తుదకు ||దొ||

    చిన్న చూపు చూచి తమ్ముని కన్నెఱుంగక చంపినగాని
    అన్న కయీను దేవుని హస్తమునకు దొరికిన రీతిగా ||దొ||

    వరములొందిన తమ్ముని జంప వలయునని పంతముగబట్టి
    నరకవచ్చిలోబడి యేడ్చిన దురిత చరితుని యేశావువలె ||దొ||

    భక్త దావీదును బట్టి ప్రాణము దీయగ దలచిన తన
    శక్తితో తరిమిన రాజగు సౌలు దొరికినరీతిగాను ||దొ||

    విగ్రహమునకు మ్రొక్కని దైవ పిల్లల నగ్నిలోపడవైచి
    ఆగ్రహించిన నెబుకద్నెజరు గడ్డిమోసి దొరికిన విధముగ ||దొ||

    క్రైస్తవులను బట్టి కొట్టి ఖైదులో వేయదలచినను
    వాస్తవమగు వెలుగును జూచి ప్రభుని చాటిని పౌలుబోలి ||దొ||

    కీడుచేయబోకు మెపుడు కీడు నీకే కీడు కీడు
    కీడు చేసినమేలుచేసి కీడును జయింపకపోతే ||దొ||

    మాటలు కుదిరితే మాటలు కోటలు కుదురును నీకు
    మాటలలో లోటుంటే నోటిమాట తప్పకుండ ||దొ||

    దొంగతనము వ్యభిచారమునకు లొంగి శాపగ్రస్తులునై
    దొంగిలించిన దశమభాగమే లొంగుట కారణమని తుదకు ||దొ||

    కొంతయిచ్చిన దశభాగ మంత యిదియని తప్పుకున్న
    కొంతయిచ్చిన కయీనువలె కొంతయిచ్చిన అననియవలె ||దొ||

    చెడుగుచేసి బదులు దానిని చేసినారని చెప్పమన్న వడిగ
    దేవుని న్యాయమనెడి పరమత్రాసులో నిలువండి ||దొ||


    Dhorakuthaavuraa sahoadharaa!
    dhorukuthaavuraa, neevu
    tharimi tharimi keeduchaeya
    paruguleththinagaani thudhaku ||dho||

    chinna choopu choochi thammuni
    kanneRuMgaka chMpinagaani
    anna kayeenu dhaevuni hasthamunaku
    dhorikina reethigaa ||dho||

    varamuloMdhina thammuni jMpa
    valayunani pMthamugabatti
    narakavachchiloabadi yaedchina
    dhuritha charithuni yaeshaavuvale ||dho||

    bhaktha dhaaveedhunu batti praaNamu
    dheeyaga dhalachina thana
    shakthithoa tharimina raajagu saulu
    dhorikinareethigaanu ||dho||

    vigrahamunaku mrokkani dhaiva pillala
    nagniloapadavaichi
    aagrahiMchina nebukadhnejaru gaddimoasi
    dhorikina viDhamuga ||dho||

    kraisthavulanu batti kotti khaidhuloa
    vaeyadhalachinanu
    vaasthavamagu velugunu joochi prabhuni
    chaatini pauluboali ||dho||

    keeduchaeyaboaku mepudu keedu neekae keedu keedu
    keedu chaesinamaeluchaesi keedunu jayiMpakapoathae ||dho||

    maatalu kudhirithae maatalu koatalu kudhurunu neeku
    maatalaloa loatuMtae noatimaata thappakuMda ||dho||

    dhoMgathanamu vyabhichaaramunaku
    loMgi shaapagrasthulunai
    dhoMgiliMchina dhashamabhaagamae
    loMguta kaaraNamani thudhaku ||dho||

    koMthayichchina dhashabhaaga mMtha
    yidhiyani thappukunna
    koMthayichchina kayeenuvale
    koMthayichchina ananiyavale ||dho||

    cheduguchaesi badhulu dhaanini
    chaesinaarani cheppamanna vadiga
    dhaevuni nyaayamanedi paramathraasuloa niluvMdi ||dho||

  • Parimapuri kalpabhooja niratha పరిమపురి కల్పభూజ నిరత

    పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ
    వరస్తుతి సల్పెదము రాజ

    జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమ
    ననిపి మము కనికరించు||పరమ||

    నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచు
    వారిఁ బావనులఁ జేయు సదా ||పరమ||

    కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను
    దలంచు బలము గల ప్రభుఁడ వీవే ||పరమ||

    ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై
    తానును బడఁద్రొక్కివేయు ||పరమ||

    అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా
    కరుణించు మమును ||పరమ||


    Parimapuri kalpabhooja niratha bhoonarula
    pooja yurutharachitha mahimathaeja
    varasthuthi salpedhamu raaj

    janaka sutha shudhDhaathma yanu paerita
    yaekaathma ghanathara sMrakSh praema
    nanipi mamu kanikariMchu||parama||

    neevae maa praapuvMchu neranammi ymdhu
    mmchu bhaavMbuna dhalAOchu
    vaariAO baavanulAO jaeyu sadhaa ||parama||

    kaluShMbulanu hariMpa nila saithaanunu
    jayiMpa balumaaru ninu
    dhalMchu balamu gala prabhuAOda veevae ||parama||

    ee loaka paapanarulu chaala ninu nammi
    marala dhoolichae dhaaruNa sai
    thaanunu badAOdhrokkivaeyu ||parama||

    alpaa oa maegayunu naadhyMthMbulunu
    kalpaaMtha sThaayuvaina karthaa
    karuNiMchu mamunu ||parama||