Category: Telugu Worship Songs Lyrics

  • Neeve naaku chaalunu yesu నీవే నాకు చాలును యేసు

    నీవే నాకు చాలును యేసు “8”

    ఒంటి నిండా బంగారమున్నాను
    అది నీకు సాటి రాగలదా “2”
    బంగారమా యేసయ్యా
    నా బంగారమా యేసయ్యా…( నీవే )

    కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను
    అది నీకు సాటి రాగాలదా…. “2”
    ధనమంతా నీవే యేసయ్య
    నా ధనమంతా నీవే యేసయ్య….( నీవే )

    కొండంతగా బలము ఉన్నాను
    అది నీకు సాటి రాగలదా… “2”
    బాలమంతా నీవే యేసయ్యా
    నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే )

    ప్రేమించే వారు ఎందరున్నాను
    వారు నీకు సాటి రాగలరా….. “2”
    ప్రేమమాయా యేసయ్య
    నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )


    neeve naaku chaalunu yesu
    neeve naaku chaalunu yesu

    onti nindaa bangaaramunnanu
    adhi neeku saati raagaladhaa
    bangaaramaa yesayya
    naa bangaaramaa yesayya

    kotlu kotlugaa dhanamunnanu
    adhi neeku saati raagaladhaa
    dhanamanthaa neeve yesayya
    naa dhanamanthaa neeve yesayya

    kondanthagaa balamunnanu
    adhi neeku saati raagaladhaa
    balamantha neeve yesayya
    naa balamantha neeve yesayya

    preminche vaaru endharunnanu
    vaaru neeku saati raagalaraa
    premaamayaa yesayya
    naa premaamayaa yesayya

  • Nadavaleni velalo endina edaarilo నడువలేని వేళలో ఎండినా ఎడారిలో

    నడువలేని వేళలో ఎండినా ఎడారిలో
    నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ..
    దారితెలియని యాత్రలో గాలిసంద్రపు అలలలో
    నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ.. ॥నడువలేని॥

    అలలతో నీవు కొట్టబడినా నడిసంద్రములో చిక్కుబడినా -2
    చెంతచేరి చెయ్యిచాపి జీవమిచ్చి నిలుపునుగా
    విడువనీ ప్రేమతో లేవనెత్తి నడుపునుగా-2
    ॥నడువలేని॥

    శ్రమలలో నీవు కృంగిపొయినా ఆప్తులంతా దూరమైన -2
    ఆధరించి సేదధీర్ఛి హృదయవంచలు తీర్చునుగా
    మరువనీ ప్రేమతో నిత్యము నిను నడుపునుగా -2 ॥నడువలేని॥


    nadavaleni velalo endina edaarilo
    neeku naaku thodu yesey ninnu nannu nadupunesu
    dhaari theliyani yaathralo gaali sandhrapu alalalo
    neeku naaku thodu yesey ninnu nannu nadupunesu

    alalatho neevu kottabadinaa nadi sandhramulo chikkubadinaa
    chentha cheri cheyyi chaapi jeevamichi nilipunugaa
    viduvani prematho levanethi nadupunugaa

    sramalalo neevu krungipoyinaa aapthulanthaa dhooramaina
    aadharinchi sedha deerchi hrudhaya vaanchalu theerchunugaa
    maruvani prematho nithyamu ninu nadupunugaa

  • Vande mataram vande mataram వందేమాతరం వందేమాతరం

    వందేమాతరం వందేమాతరం వందేమాతరం

    దేశం మన దేశం
    ఈ భారతదేశం
    ఈ దేశమును నీవు ప్రేమిస్తే
    ప్రార్ధించు నీవు మరువక
    యేసయ్యా వింటాడు
    మన దేశమును దీవిస్తాడు
    ఈ దేశం ఈ దేశం
    ఈ దేశం మన దేశం

    వందేమాతరం వందేమాతరం వందేమాతరం
    నీది ఇండియా నాది ఇండియా అందరి ఇండియా
    నీది ఇండియా నాది ఇండియా మనదే ఇండియా
    ఈ దేశం మన దేశం
    భారతదేశం


    vande mataram vande mataram vande mataram

    desham mana desham
    ee bhaarathadesham
    ee deshamunu neevu premisthe
    praardhinchu neevu maruvaka
    yesayyaa vintaadu
    mana deshamunu dheevisthaadu
    ee desham ee desham
    ee desham mana

    vandeamaataram vandeamaataram vandeamaataram
    needi india naadi india andari india
    needi india naadi india manadhe india
    ee desham mana desham
    bhaaratha desham

  • Naa dhehamunu nee aalayamugaa నా దేహమును నీ ఆలయముగా

    నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము
    నే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభు
    యేసు నాలో నీవు వుంటే నీ సంపదలు నా సొంతమే
    యేసు నీలో నేను వుంటే నా బ్రతుకంతా సంతోషమే
    నాలో నీ సన్నిధి ఉందని గ్రహియించు జ్ఞానమును కలిగుంచుము
    నా దేహమును భయముతో భక్తితో నీకోరకు పరిశుద్ధముగా దాచెద
    ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును
    నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము
    నీ జీవ ప్రవాహము ప్రవహించనీ నాలోని అణువణువు చిగురించును
    ఫలియించు ద్రాక్షావల్లి వలె నేను విస్తారముగా దేవా ఫలియింతును
    నా దీవెనగా నీవు ఉంటే నాకేమైనా కొదువుండునా
    ఈ లోకముకు నన్ను నీవు దీవెనగా మార్చు ప్రభు


    Naa dhehamunu nee aalayamugaa nirminchi nivasinchumu
    ne samarpinthunu neeku naa dhehamu sajeevayaagamugaa prabhu
    yesu naalo neevu unte nee sampadhalu naa sonthame
    yesu naalo neevu unte naa brathukanthaa santhoshame
    naalo nee sannidhi undhani
    grahiyinchi gnaanamunu kaliginchumu
    naa dhehamunu bhayamutho bhakthitho
    nee koraku parishuddamugaa dhaachedha
    ee lokamulo janamula edhuta maadhirigaa jeevinthunu
    naa dhehamutho nee naamamunu ghanaparathunu nithyamu
    nee jeeva pravaahamu pravahinchani
    naaloni anuvanuvu chigurinchunu
    phaliyinchu dhraakshaavalli vale
    nenu visthaaramugaa devaa phaliyinthunu
    naa dheevenagaa neevu unte naakemainaa kodhuvundunaa
    ee lokamuku nannu neevu deevenagaa maarchu prabhu

  • Prabhuvaa hithavathsaram ప్రభువా హితవత్సరం

    ప్రభువా హితవత్సరం మాకు ఇచ్చావయ్యా
    విడుదల సంవత్సరం ప్రకటించియున్నావయ్యా
    నిను విడువనని యెడబాయనని
    ఆశీర్వదించావయ్యా హల్లెలూయా

    లోకమంతటిని ముంచెత్తిన
    తెగులు చేతిలో పడనీయక
    పనిపాటులేవి లేకున్నను
    కరువనేది రానీయక
    అనుకూల స్థితిలో తిను దాని కంటే
    ప్రతికూల స్థితిలో సమృద్ధి నిచ్చావు
    నీకే స్తోత్రమయా ప్రియమైన యేసయ్య

    అవరోధమెంత ఎదురైనను
    ఆగకుండ నీ పరిచర్యను
    ఆశ్చర్య రీతిలో జరిగించావు
    అధిక మహిమను చూపించావు
    తండ్రి నీ సన్నిధికి నే దూరమైనా
    దయజూపి నను నీ దరి జేర్చినావు
    నీకే స్తోత్రమయా ప్రియమైన యేసయ్య


    prabhuvaa hithavathsaram maaku ichaavayyaa
    vidudhala samvathsaram prakatinchi yunnaavayyaa
    ninu viduvanani yedabaayanani
    aasirvadinchaavayyaa hallelujah

    lokamanthatini munchetthina
    thegulu chethilo padaneeyaka
    panipaatulevi lekunnanu
    karuvanedhi raaneeyaka
    anukoola sthithilo thinu dhaani kante
    prathikoola sthithilo samruddhi nichaavu
    neeke sthothramayaa priyamaina yesayya

    avarodhamentha edhurainanu
    aagakunaa nee paricharyanu
    aascharya reethilo jariginchaavu
    adhika mahimanu choopinchaavu
    thandri nee sannidhiki ne dhooramainaa
    dayajoopi nanu nee dhari jerchinaavu
    neeke sthothramayaa priyamaina yesayya

  • Ee jaathilo memu okarimey ఈ జాతిలో మేము ఒకరిమే

    ఈ జాతిలో మేము ఒకరిమే
    మన దేశమును ప్రేమిస్తున్నాం
    నిజ స్వేచ్ఛకై ప్రార్ధిస్తున్నాం
    క్రీస్తుకై బ్రతుకుచున్నాం

    జనగణమునకై ప్రతిజాతికై
    నిరంతరం ప్రార్ధిస్తున్నాం
    మా దేశముకై ప్రతిపౌరునికై
    మరింతగా ప్రార్ధిస్తున్నాం

    వందేమాతరం మాతరం
    యేసుదే ఈ తరం
    వందేమాతరం మాతరం
    యేసుకే అంకితం

    నీతిని భోదించే సేవకులను
    హింసించేవారికై ప్రార్ధిస్తున్నాం
    సువార్తను మతమని తలచి క్రీస్తు ప్రేమను
    నిందించేవారికై ధుఃఖిస్తున్నాం
    దూషించినా ద్వేషించినా
    క్రీస్తు ప్రేమనే ప్రకటిస్తున్నాం
    బాధించినా గాయపరచినా
    కల్వరి ప్రేమనే చూపిస్తున్నాం
    దేవా నా దేశమును రక్షించవా
    దేవా నా జాతిని దర్శించవా

    కులమత ద్వేషములు విద్రోహచర్యలు
    నశియించిపోవుటకే ప్రార్ధిస్తున్నాం
    ఉగ్రవాద దాడులు అంధకార ఆలోచనలు
    అంతరించిపోవుటకై ప్రార్ధిస్తున్నాం
    సుఖజీవము సౌభాగ్యము
    దేశములో ఉండాలని కోరుచున్నాం
    ఆనందము అనురాగము
    దేశములో ఉండుటకై ఆశిస్తున్నాం
    దేవా నా దేశమును రక్షించవా
    దేవా నా జాతిని దర్శించవా


    Ee jaathilo memu okarimey
    mana dhesamunu premisthunnaam
    nija swechakai praardhisthunnaam
    kreesthukai brathukuchunnaam

    janaganamunakai prathijaathikai
    nirantharam praardhisthunnaam
    maa dhesamukai prathi pourunikai
    marinthagaa praardhisthunnaam

    vande maatharam maatharam
    yesudhe ee tharam
    vande maatharam maatharam
    yesuke ankitham

    neethini bhodinche sevakulanu
    himsinchevaarikai praardhisthunnaam
    suvaarthanu mathamani thalachi kreesthu premanu
    nindhinchevaarikai dhukkisthunnaam
    dhooshinchinaa dhweshinchinaa
    kreesthu premaney prakatisthunnaam
    baadhinchinaa gaayaparachinaa
    kalvari premaney choopisthunnaam
    devaa naa dhesamunu rakshinchavaa
    devaa naa jaathini dharsinchavaa

    kulamatha dhweshamulu vidhrohacharyalu
    nasiyinchipovutakey praardhisthunnaam
    ugravaadha dhaadulu andhakaara aalochanalu
    antharinchi povutakai praardhisthunnaam
    sukhajeevamu saubhaagyamu
    dhesamulo undaalani koruchunnaam
    aanandhamu anuraagamu
    dhesamulo undutakai aasisthunnaam
    devaa naa dhesamunu rakshinchavaa
    devaa naa jaathini dharsinchavaa

  • Mahonnathamaina seeyonulona sadaa kaalamu మహోన్నతమైన సీయోనులోన సదా కాలము

    మహోన్నతమైన సీయోనులోన సదా కాలము
    నా యేసయ్యతో జీవించుటే (2) – నా ఆశ (2)
    విరిగిన మనస్సు నలిగిన హృదయం
    నాకు కావాలయ్యా..
    యేసయ్యా నాకు కావాలయ్యా (2)
    ఆరాధనా ఆరాధనా (2)
    ఆరాధనా ఆరాధనా (2) ||మహోన్నతమైన||

    లోకమంతయు నష్టముగా ఎంచి
    సంపాదించుకొంటిని – నా యేసయ్యను నేను (2)
    బ్రతుకు మూలమునైనా – చావు మూలమునైనా (2)
    ఘనపరతును నా దేవుని
    స్తుతియింతును నా దేవుని – (2) ||విరిగిన||

    మహా మహిమతో నీవొచ్చు సమయమున
    కన్నులారా చూచెదను – నా యేసయ్యను నేను (2)
    హింస మూలమునైనా – కరువు మూలమునైనా (2)
    సంతోషింతును నా యేసుతో
    ప్రకాశింతును ఆ మహిమలో – (2) ||విరిగిన||


    mahonnathamaina seeyonulona sadaa kaalamu
    naa yesayyatho jeevinchute (2) – naa aasha (2)
    virigina manassu naligina hrudayam
    naaku kaavaalayyaa..
    yesayyaa naaku kaavaalayyaa (2)
    aaraadhanaa aaraadhanaa (2)
    aaraadhanaa aaraadhanaa (2) ||mahonnathamaina||

    lokamanthayu nashtamugaa enchi
    sampaadinchukontini – naa yesayyanu nenu (2)
    brathuku moolamunainaa – chaavu moolamunainaa (2)
    ghanaparathunu naa devuni
    sthuthiyinthunu naa devuni – (2) ||virigina||

    mahaa mahimatho neevochchu samayamuna
    kannulaaraa choochedanu – naa yesayyanu nenu (2)
    himsa moolamunainaa – karuvu moolamunainaa (2)
    santhoshinthunu naa yesutho
    prakaashinthunu aa mahimalo – (2) ||virigina||

  • Noothanamainadi nee vaathsalyamu నూతనమైనది నీ వాత్సల్యము

    నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను
    ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను
    తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను
    నీ ప్రేమలో మార్పు లేదు (2)
    సన్నుతించెదను నా యేసయ్యా
    సన్నుతించెదను నీ నామము (2)

    గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు
    జరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు (2)
    విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్ను
    క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను||

    నా హీన దశలో – నీ ప్రేమ చూపి – పైకి లేపినావు
    ఉన్నత స్థలములో – నను నిలువబెట్టి – ధైర్యపరచినావు (2)
    మరువని దేవుడవు – నను మరువలేదు నీవు
    ఏ సమయమైననూ చేయి విడువవు (2) ||సన్నుతించెదను||

    నీ రెక్కల క్రింద – నను దాచినావు – ఆశ్రయమైనావు
    నా దాగు స్థలముగా – నీవుండినావు – సంరక్షించావు (2)
    ప్రేమించే దేవుడవు – తృప్తి పరచినావు నన్ను
    సమయోచితముగా ఆదరించినావు (2) ||సన్నుతించెదను||


    Noothanamainadi nee vaathsalyamu
    prathi dinamu nannu darshinchenu
    edabaayanidi nee kanikaramu
    nannentho preminchenu
    tharamulu maaruchunnanu – dinamulu gadachuchunnanu
    nee premalo maarpu ledu (2)
    sannuthinchedanu naa yesayyaa
    sannuthinchedanu nee naamamu (2)

    gadachina kaalamanthaa – nee krupa choopi – aadarinchinaavu
    jaragaboye kaalamanthaa – nee krupalona – nannu daachedavu (2)
    viduvani devudavu – edabaayaledu nannu
    kshanamainaa throsiveyavu (2) ||sannuthinchedanu||

    naa heena dashalo – nee prema choopi – paiki lepinaavu
    unnatha sthalamulo – nanu niluvabetti – dhairyaparachinaavu (2)
    maruvani devudavu – nanu maruvaledu neevu
    ae samayamainanu cheyi viduvavu (2) ||sannuthinchedanu||

    nee rekkala krinda – nanu daachinaavu – aashrayamainaavu
    naa daagu sthalamuga – neevundinaavu – samrakshinchaavu (2)
    preminche devudavu – thrupthi parachinaavu nannu
    samayochithamuga aadarinchinaavu (2) ||sannuthinchedanu||

  • Nee roopam naalona prathibimbamai velugani నీ రూపం నాలోన ప్రతిబింబమై వెలుగనీ

    నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ
    నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2)
    రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2)
    ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2)
    నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం||

    నా ముందు నీవు ఎడారులన్ని
    నీటి ఊటలుగా మార్చెదవే (2)
    దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2)
    ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం||

    నా పాప స్వభావం తొలగించుమయ్యా
    నీ మంచి ప్రేమ నాకీయుమా (2)
    నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి (2)
    హృదయాసీనుడా నా యేసయ్యా (2) ||నీ రూపం||

    అంధకారము వెలుగుగా మార్చి
    శాంతి మార్గములో నడిపెదవే (2)
    భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే (2)
    భుజమును తట్టి నడిపెదవే (2) ||నీ రూపం||


    nee roopam naalona – prathibimbamai velugani
    nee premaa nee karunaa – naa hrudilona pravahinchani (2)
    raajuvu neeve kadaa – nee daasuda nene kadaa (2)
    prabhu nee kosam prathi kshanam jeevinchani (2)
    nee roopamu naalo mudrinchani (2) ||nee roopam||

    naa mundu neevu edaarulanni
    neeti ootalugaa maarchedave (2)
    dukhamulo shaanthini ichchina yesayyaa (2)
    aasheervaadamu neeve raajaa (2) ||nee roopam||

    naa paapa swabhaavam tholaginchumayyaa
    nee manchi prema naakeeyumaa (2)
    neevu koreti aalayamai nenu undaali (2)
    hrudayaaseenudaa naa yesayyaa (2) ||nee roopam||

    andhakaaramu veluguga maarchi
    shaanthi maargamulo nadipedave (2)
    bhayapadina velalo thoduga nilichedave (2)
    bhujamunu thatti nadipedave (2) ||nee roopam||

  • yahovaa maaku thodugaa yesayya యెహోవా మాకు తోడుగా యేసయ్యా

    యెహోవా మాకు తోడుగా – యేసయ్యా మా ఇంట ఉండగా
    శుద్ధాత్మ మాకు నీడగా – త్రిత్వాత్మ మాకుండగా

    ఎడబాయలేదే నీ కృప మమ్ము – విడనాడ లేదెన్నడు
    వివరించలేము వర్ణించలేము – నీ ఆశ్చర్య కార్యాలను
    బహు వింతైన ప్రేమన్ – చూపావు మాపై
    చాలయ్య మా ఇంట – నీ సన్నిధి

    కమనీయమైన నీ ప్రేమ బంధం – కాచింది కనుపాపలా
    కృపవెంబడి కృపతో నింపావు మమ్ము – కష్టాల కన్నీళ్ళలో
    మా ప్రతి బంధకమును – విడిపించినావు
    చాలయ్య మా ఇంట – ఈ దీవెన


    yahovaa maaku thodugaa – yesayya maa inta undagaa
    shuddaathma maaku needagaa – thrithwaathma maakundagaa

    edabaayaledhe nee krupa mammu – vidanaada ledhennadu
    vivarinchalemu varninchalemu – nee aascharya kaaryaalanu
    bahu vinthaina preman – choopaavu maapai
    chaalayya maa inta – nee sannidhi

    kamaneeyamaina nee krupa bandham – kaachindhi kanupaapalaa
    krupa vembadi krupatho nimpaavu mammu – kashtaala kanneellalo
    maa prathi bandhakamunu – vidipinchinaavu
    chaalayya maa inta – ee dheevena