Category: Telugu Worship Songs Lyrics

  • Idi kamaneeya kalyaana raagam ఇది కమనీయ కళ్యాణ రాగం

    ఇది కమనీయ కళ్యాణ రాగం
    అనురాగ దాంపత్య జీవనం
    సంతోష సౌభాగ్య సంధ్యా రాగం
    అభిమానులందించు దీవెన గానం

    ప్రేమానురాగాలు పంచెడి గృహమై
    బంధుజనాలికి ప్రీతికరముగా
    ప్రార్ధన సహవాస ఫలములను పొందుచు
    ప్రభు యేసు సేవలో పయనించుడి

    మధురిమలొలికే మమతల మనువు
    దేవాధి దేవుని దీవెన సిరులు
    కుటుంబ పరివారం పరిచర్యకంకితం
    వైవాహిక జీవనం విభుడేసుకంకితం


    Idi kamaneeya kalyaana raagam
    anuraaga dhaampathya jeevanam
    santhosha soubhaagya sandhyaa raagam
    abhimaanulandhinchu deevena gaanam

    premaanu raagaalu panchedi gruhamai
    bandhujanaaliki preethikaramugaa
    praardhana sahavaasa phalamulanu pondhuchu
    prabhu yesu sevalo payaninchudi

    madhurimalolike mamathala manuvu
    devaadhi devuni dheevena sirulu
    kutumbha parivaaram paricharyakankitham
    vaivaahika jeevanam vibhudesukankitham

  • Naa yesu raajaa sthothramu నా యేసు రాజా స్తోత్రము

    నా యేసు రాజా స్తోత్రము
    స్తోత్రము స్తోత్రము
    నే జీవించుదాక ప్రభు

    కరుణాసంపన్నుడా
    బహు జాలిగల ప్రభువా
    దీర్గశాంతం ప్రేమా కృపయు
    నిండియుండు ప్రభువా

    స్తుతి ఘన మహిమలెల్ల
    నీకే చెల్లింతుము
    ఇంపుగ స్తోత్రబలులు చెల్లించి
    ఆరాధనా చేసెదం

    పిలచెడి వారికెల్ల
    దరిలో నున్నవాడా
    మనసార పిలిచే స్వరములు వినిన
    విడుదల నిచ్చువాడా


    Naa yesu raajaa sthothramu
    sthothramu sthothramu
    ne jeevinchudhaaka prabhu

    karunaa sampannudaa
    bahu jaaligala prabhuvaa
    dheergashaantham premaa krupayu
    nindiyundu prabhuvaa

    sthuthi ghana mahimalella
    neeke chellinthumu
    impuga sthothra balulu chellinchi
    aaraadhanaa chesedam

    pilachedi vaarikella
    dharilo nunnavaadaa
    manasaara piliche swaramulu vinina
    vidudhala nichuvaadaa

  • Thandrine vidachi intine marachi తండ్రి నే విడచి ఇంటినే మరచి

    తండ్రి నే విడచి ఇంటినే మరచి
    ఆస్తి లో వాటాని అడిగావే నాయని
    ఒంటరివై మిగిలిపోయావా
    బంధాన్ని తెంచుకున్నావా
    సిన్నోడా ఊరుమీలేక నువ్వు నలిగావా
    సిన్నోడా మాట ఒగ్గేసి దూరాన పోయావా
    తోడు లేక నీడ లేక చావలేక బ్రతుకుతున్నావా

    ఉన్నోడు లేనోడు అయినోడు కానోడు
    నీ చెంత చేరి జల్సాలు చేసే
    లోకంలో మోసపోయావా
    తోడు లేక తల్లడిల్లావా
    సిన్నోడా శిమ్మ సీకట్లో ఎన్ని ఇక్కట్లు రా
    సిన్నోడా తాళలేవురా ఆలస్యమెందుకు రా
    నీ కోసం వేచి ఉన్న నీ తండ్రి దరికి నీవు చేరరా

    విలువైన బంధం కరువైన వేళ
    బరువైన గుండె బద్దలయ్యిందే
    ఆకాశం మబ్బులు కమ్మినా
    కన్నీరే గుండెలు నిండెనే
    సిన్నోడా ఆ ప్రేమ పొంద ఇంటికి తిరిగిరా
    సిన్నోడా కరము(చేతులు) చాచి నిన్ను పిలిచెరా
    కరుణించి ప్రాణమిచ్చి కృప చూపే యేసుని చేరరా


    thandrine vidachi intine marachi
    aasthilo vaataani adigaave naayani
    ontarivai migilipoyaavaa
    bhandhaanni thenchukunnaavaa
    sinnodaa oorumileka nuvvu naligaava
    sinnodaa maata oggesi dhooraana poyaava
    thodu leka needa leka chaavaleka brathukuthunnavaa

    unnodu lenodu ayinodu kaanodu
    nee chentha cheri jalsaalu chese
    lokamlo mosapoyaava
    thodu leka thalladillaava
    sinnoda simma seekatlo enni ikkattlu raa
    sinnoda thaalalevura aalasyamendhuku raa
    neekosam vechi unna nee thandri dhariki neevu cheraraa

    viluvaina bandham karuvaina vela
    baruvaina gunde baddalayyinde
    aakasam mabbulu kamminaa
    kanneere gundelu nindene
    sinnodaa aa prema ponda intiki thirigiraa
    sinnoda karamu chaachi ninnu pilicheraa
    karuninchi praanamichi krupa choope yesuni cheraraa

  • Janminche lokarakshakudu జన్మించె లోకరక్షకుడు

    జన్మించె లోకరక్షకుడు
    మన పాప విమోచకుడు
    జగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడు
    ప్రభుల ప్రభువు రాజుల రాజు
    పరము వీడి జన్మించె
    జన్మించె

    గాబ్రియేలు దూత
    కాపరులకు చెప్పెనే
    రక్షకుడు విమోచకుడు
    మనకొరకు ఇల పుట్టాడని
    పరలోక సైన్య సమూహము
    ప్రభువును స్తుతియించెనే
    ఆనంద ధ్వనులు చేస్తు
    శుభములు తెలుపుతు వచ్చెనే
    ప్రభుల ప్రభువు రాజుల రాజు
    పరము వీడి జన్మించె
    జన్మించె లోకరక్షకుడు
    మన పాప విమోచకుడు

    తూర్పు దేశ జ్ఞానులు
    తారను చూచిరి
    యూదుల రాజుగ
    పుట్టిన వానిని కనుగొన వెతికిరి
    తార నడిపే జ్ఞానులను
    ప్రభువు పాద సన్నిధికి
    కానుకలను అర్పించి
    సాగిలపడి వందనం చేసెనే
    జన్మించె లోకరక్షకుడు
    మన పాప విమోచకుడు
    జగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడు
    ప్రభుల ప్రభువు రాజుల రాజు
    పరము వీడి జన్మించె
    నా నా నా నా నా


    Janminche lokarakshakudu
    mana paapa vimochakudu
    jagathiki mukthini prasaadhinche rakshakudu
    prabhula prabhuvu rajula raju
    paramu veedi janminche
    janminche

    gaabriyelu dhootha
    kaaparulaku cheppene
    rakshakudu vimochakudu
    manakoraku ila puttaadani
    paraloka sainya samoohamu
    prabhuvunu sthuthiyinchene
    aanandha dhwanulanu chesthu
    shubhamulu theluputhu vachene
    prabhula prabhuvu raajula raju
    paramu veedi janminche
    janminche lokarakshakudu
    mana paapa vimochakudu

    thoorpu desa gnaanulu
    thaaranu choochiri
    yudhula raajuga
    puttinavaanini kanugona vethikiri
    thaara nadipey gnanulanu
    prabhuvu paadha sannidhiki
    kaanukalanu arpinchi
    saagila padi vandhanam chesene
    janminche lokarakshakudu
    mana paapa vimochakudu
    jagathiki mukthini prasaadhinche rakshakudu
    prabhula prabhuvu raajula raju
    paramu veedi janminche
    na na na na na na

  • Rajaadhi raaju prabhuvulaku prabhuvu రాజాధి రాజు ప్రభువులకు ప్రభువు

    రాజాధి రాజు ప్రభువులకు ప్రభువు
    నీకోసం నాకోసం పుట్టాడోయమ్మా
    పరలోకం విడచి నరరూపాన్నేదాల్చి
    సిలువలో తన ప్రాణం పెట్టాడోరన్న
    త్వరపడదామా యేసయ్య చెంతకు
    వేగిరపడదామా సువార్త చాటింపుకు

    క్రీస్తు బిడ్డలం మనము సిలువ సైన్యము
    పాపశాప విముక్తిని పొందినవారం
    ఆ యేసు రక్తమే మన విజయానికి కారణం

    యేసు ప్రేమలో స్వార్ధమే లేదు
    సిలువ ప్రేమలో కల్మషంలేదు
    నా యేసు కృపలో నేను ఎల్లప్పుడు జీవించెదను


    rajaadhi raaju prabhuvulaku prabhuvu
    neekosam naakosam puttaadoyamma
    paralokam vidachi nararoopanney dhaalchi
    siluvalo thana praanam pettaadoranna
    twarapadumaa yesayya chenthaku
    vegirapadadhaamaa suvartha chaatinpuku

    kreesthu biddalam manam siluva sainyamu
    paapa shaapa vimukthini pondhinavaaram
    aa yesu rakthamey mana vijayaaniki kaaranam

    yesu premalo swaardhamey ledhu
    siluva premalo kalmasham ledhu
    naa yesu krupalo nenu ellappudu jeevinchedhanu

  • Palle pallelo pattanaala veedhullo పల్లె పల్లెల్లో పట్టణాల వీధుల్లో

    పల్లె పల్లెల్లో పట్టణాల వీధుల్లో
    ఊరు వాడ వాగు వంకల్లో
    కొండకోనల్లో ఆకాశ వీధుల్లో
    భువిలో దివిలో సర్వ సృష్టిలో
    రక్షకుడు పుట్టాడని రక్షింప వచ్చాడని
    మురిసెను లోకమంతా యేసు రాకతో

    ఎంత ప్రేమామయుడమ్మో ఇంత కృపను సుపే
    ఇంకెవరు సుపాలేని ప్రేమ నాపై సుపినాడే

    చిత్రమే చిత్రమే లోకమంతా చిత్రమే
    యేసు స్వామి జననమే బహువిచిత్రమే
    దేవుడే మానవుడై భువికరుదించుట
    కన్యమరియ గర్భమందు దీనుడై పుట్టుట
    పాపినైన నా కోసం పరిపూర్ణ ప్రేమతో
    నశించు ఆత్మను రక్షించు దీక్షతో
    మహిమనంత వీడి అవని చేరినాడే

    సందడే సందడి లోకమంతా సందడి
    లోక రక్షకుడు యేసు ప్రభువేనని
    ఆదియు అంతము నిత్య జీవము
    మోక్ష మార్గము యేసు క్రీస్తేనని
    ఆత్మ రక్షణ నిజమైన ప్రేమ
    శాంతి సమాధానం స్వస్థత విడుదల
    ఇచ్చుట కొరకే ఇలలో పుట్టినాడే


    palle pallelo pattanaala veedhullo
    ooru vaada vaagu vankallo
    kondakonallo aakaasa veedhullo
    bhuvilo dhivilo sarva srushtilo
    rakshakudu puttaadani rakshinpa vachaadani
    murisenu lokamanthaa yesu raakatho

    entha premaamayudammo intha krupanu soope
    inkevaru soopaaleni prema naapai soopinaade

    chithrame chithrame lokamanthaa chithame
    yesu swami jananame bahu vichithrame
    devude maanavudai bhuvikarudhinchuta
    kanya mariya garbamandhu dheenudai puttuta
    paapinaina naa kosam paripoorna prematho
    nasinchu aathmanu rakshinchu dheekshatho
    mahimanantha veedi avani cherinaade

    sandhade sandhadi lokamanthaa sandhadi
    loka rashakudu yesu prabhuvenani
    aadhiyu anthamu nithya jeevamu
    moksha maargamu yesu kreesthenani
    aathma rakshana nijamaina prema
    saanthi samaadhanam swasthatha vidudhala
    ichuta korake ilalo puttinaade

  • Thandri devaa thandri devaa తండ్రి దేవా తండ్రి దేవా

    తండ్రి దేవా తండ్రి దేవా
    నా సర్వం నీవయ్యా
    నీవుంటే నాకు చాలు
    నా ప్రియుడా నా ప్రాణమా
    నిన్ ఆరాధించెదన్
    నా జీవమా నా స్నేహమా
    నిన్ ఆరాధించెదన్

    నీ ప్రేమ వర్ణించుట
    నావల్ల కాదయ్యా
    నీ కార్యము వివరించుట
    నా బ్రతుకు చాలదయ్యా
    తండ్రి దేవా నా ఆనందమా
    నీ వడిలో నాకు సుఖము

    నా ప్రాణ స్నేహితుడా
    నీ సన్నిధి పరిమళమే
    జుంటె తేనె కన్న
    నీ ప్రేమ మధురమయ్యా
    తండ్రి దేవా నా ఆనందమా
    నీ వడిలో నాకు సుఖము


    Thandri devaa thandri devaa
    naa sarvam neevayyaa
    neevunte naaku chaalu
    naa priyudaa naa praanamaa
    nin aaraadhinchedhan
    naa jeevamaa naa snehamaa
    nin aaraadhinchedhan

    nee prema varninchuta
    naavalla kaadhayyaa
    nee kaaryamu vivarinchuta
    naa brathuku chaaladhayyaa
    thandri devaa naa aanandhamaa
    nee vadilo naaku sukhamu

    naa praana snehithudaa
    nee sannidhi parimalame
    junte thene kanna
    nee prema madhuramayyaa
    thandri devaa naa aanandhamaa
    nee vadilo naaku sukhamu

  • Gnanulu aaradhinchirayya ninu జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను

    జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను – కరుణగల యేసువా
    ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా

    ఆదాము దోషము అంతము చేయను
    అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా
    అసువులు బాయను అవతరించినా .. .. ఆ .. ఆ..
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా

    మార్గము నీవే సత్యము నీవే
    జీవము నీవే నా ప్రియుడా
    అర్పించెదను సర్వస్వము
    కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
    యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా


    Gnanulu aaradhinchirayya ninu karunagala yesuvaa
    aa aa aa … karunagala yesuvaa
    yesu rakshakuda naa praana snehithudaa

    aadhaamu dhoshamu anthamu cheyanu
    avanini velasina aascharyakarudaa
    asuvulu baayanu avatharinchinaa .. .. aa.. aa..
    karunagala yesuvaa aa aa aa … karunagala yesuvaa

    maargamu neeve sathyamu neeve
    jeevamu neeve naa priyudaa
    arpinchedhanu sarvaswamu
    karunagala yesuvaa aa aa aa … karunagala yesuvaa
    yesu rakshakuda naa praana snehithudaa

  • Aalanavai paalanavai ఆలనవై పాలనవై

    ఆలనవై, పాలనవై
    అలసిన మా బ్రతుకులలో
    ఆలంబనవై ఆదుకొన్న దేవా స్తోత్రం
    అనవరతం నీకే వందనం
    అదొనై మగెన్

    గడచిన కాలమే గాడాంధకారమై
    తెగులు వేదనలు మరణ శాసనమై
    లయముగాక నన్ను తప్పించినావు
    నీ రెక్కల నీడలో భద్రపరచినావు
    నూతన వత్సరమే నా బ్రతుకులో ఉంచి
    శేషించిన జనములో నీ సాక్షిగా నిలిపి
    బ్రతికించిన దేవా స్తోత్రం
    నా జీవితమే అంకితం
    నా జీవితం నీకే అంకితం

    రానున్న కాలమే
    మా జీవ సారమై
    మా ఆశా ధ్యాసలో కాయ కష్టములో
    మా తోడు నీవై ఫలియింపచేసి
    నీ చిత్తములో భద్రపరచుమయా
    పాతవి గతించి సమస్తము నూతనమై
    నీ నిత్య దీవెనతో నీ సత్య మార్గములో
    నడిపించుము దేవా స్తోత్రం
    నా జీవితమే అంకితం
    నా జీవితం నీకే అంకితం


    Aalanavai, paalanavai
    alasina maa brathukulalo
    aalambanavai aadhukonna devaa sthoathram
    anavaratham neeke vandhanam
    adonai magen

    gadachina kaalame gaadaandhakaaramai
    thegulu vedhanalu marana saasanamai
    layamugaaka nannu thappinchinaavu
    nee rekkala needalo bhadhraparachinaavu
    noothana vathsarame naa brathukulo unchi
    seshinchina janamulo nee saakshigaa nilipi
    brathikinchina devaa sthoathram
    naa jeevithame ankitham
    naa jeevitham neeke ankitham

    raanunna kaalame
    maa jeeva saaramai
    maa aasaa dhyaasalo kaaya kashtamulo
    maa thodu neevai phaliyimpachesi
    nee chitthamulo bhadhraparachumayaa
    paathavi gathinchi samasthamu noothanamai
    nee nithya deevenatho nee sathya maargamulo
    nadipinchumu devaa sthothram
    naa jeevithame ankitham
    naa jeevitham neeke ankitham

  • Rando raarando yesuni choodaganu రండో రారండో యేసుని చూడగను

    రండో రారండో యేసుని చూడగను
    రండో రారండో ప్రభుయేసుని చేరగను
    పరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెను
    పశువుల తొట్టిలో దీనుడై మనలను హెచ్చించెను
    ఆరాధిద్దామా ఆనందిద్దామా
    ఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా

    భువిలోన ప్రతిమనిషి రక్షణ కోసం
    కనులెత్తి ఆకాశం చూస్తుండగా
    అక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూ
    పరుగెత్తి పరుగెత్తి అలసియుండగా
    లోకాన్ని రక్షింప పసిబాలుడై
    మనమధ్య నివసించెను
    మార్గం యేసయ్యే సత్యం యేసయ్యే
    జీవం యేసయ్యే నా సర్వం యేసయ్యే

    గురిలేని బ్రతుకులో గమ్యం కోసం
    అడుగడుగునా ముందుకు వేస్తుండగా
    విలువైన సమాధానం ఎక్కడుందని
    ప్రతిచోట ఆశతో వెదకుచుండగా
    శాంతి సమాధానం మనకివ్వగా
    లోకాన ఏతెంచెను
    నెమ్మది వచ్చింది సంతోషం వచ్చింది
    రక్షణ వచ్చింది నిత్యజీవం వచ్చింది


    rando raarando yesuni choodaganu
    rando raarando prabhuyesuni cheraganu
    paramunu vidichi dhiviki vachi lokaanni rakshinchenu
    pasuvula thottilo dheenudai manalanu hechichenu
    aaraadhiddhaamaa aanandhiddhaama
    arbhaatiddhaamaa yesuni anusariddhaama

    bhuvilona prathi manishi rakshana kosam
    kanuletthi aakaasam choosthunndagaa
    akkadundhi ikkadundhi rakshana antu
    parugetthi parugetthi alasiyundagaa
    lokaanni rakshimpa pasibaaludai
    mana madhya nivasinchenu
    maargam yesayye sathyam yesayye
    jeevam yesayye naa sarvam yesayye

    guri leni brathukulo gamyam kosam
    adugadugunaa mundhuku vesthunndagaa
    viluvaina samaadhaanam ekkadundhani
    prathi chota aasatho vedhakuchundagaa
    shanthi samaadhaanam manakivvagaa
    lokaana yethenchenu
    nemmadhi vachindi santhosham vachindi
    rakshana vachindi nithya jeevam vachindi