Category: Telugu Worship Songs Lyrics

  • chintha laedhiaoka yaesu putte చింత లేదిఁక యేసు పుట్టెను వింత

    చింత లేదిఁక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునఁ చెంత
    జేరను రండి సర్వజనాంగమా సంతస మొందుమా ||చింత||

    దూత తెల్పెను గొల్లలకు శుభ వార్త నా దివసంబు వింతగా ఖ్యాతి
    మీరఁగ వారు యేసును గాంచిరి స్తుతు లొనరించిరి ||చింత||

    చుక్కఁ గనుగొని జ్ఞాను లెంతో మక్కువతో నా ప్రభుని గను గొన
    చక్కఁగా బెత్లెముపురమున జొచ్చిరి కానుక లిచ్చిరి ||చింత||

    కన్యగర్భమునందుఁ బుట్టెను కరుణగల రక్షకుఁడు క్రీస్తుఁడు
    ధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వమాన్యులై ||చింత||

    పాప మెల్లను పరిహరింపను పరమ రక్షకుఁ డవతరించెను దాపుఁ
    జేరిన వారి కిడుఁ గడు భాగ్యము మోక్షభాగ్యము ||చింత||


    Chintha laedhiAOka yaesu puttenu viMthaganu baethlehaemMdhunAO cheMtha
    jaeranu rMdi sarvajanaaMgamaa sMthasa moMdhumaa ||chiMtha||

    dhootha thelpenu gollalaku shubha vaartha
    naa dhivasMbu viMthagaa khyaathi
    meerAOga vaaru yaesunu gaaMchiri sthuthu lonariMchiri ||chiMtha||

    chukkAO ganugoni jnYaanu leMthoa makkuvathoa
    naa prabhuni ganu gona
    chakkAOgaa bethlemupuramuna jochchiri
    kaanuka lichchiri ||chiMtha||

    kanyagarbhamunMdhuAO buttenu karuNagala
    rakShkuAOdu kreesthuAOdu
    Dhanyulagutaku rMdi vaegame dheenulai
    sarvamaanyulai ||chiMtha||

    paapa mellanu parihariMpanu parama
    rakShkuAO davathariMchenu dhaapuAO
    jaerina vaari kiduAO gadu bhaagyamu
    moakShbhaagyamu ||chiMtha||

  • Chudumu gethsemane చూడుము గెత్సేమనే

    చూడుము గెత్సేమనే – తోటలో నా ప్రభువు
    పాపి నాకై వి-జ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది
    పాపి నీకై వి-జ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది

    దేహమంతయు నలగి – శోకము చెందినవాడై
    దేవాది దేవుని – ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే

    తండ్రి ఈ పాత్ర తొలగున్ – నీ చిత్తమైన యెడల
    ఎట్లయినను నీ – చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను

    రక్తపు చెమట వలన – మిక్కిలి బాధనొంది
    రక్షకుడేసు – హృదయము పగలగ – విజ్ఞాపనము చేసెనే

    ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే – మన యేసు
    ప్రభువు – తానే వేడుకొనెను – పాపుల విమోచన కొరకే

    ప్రేమామృత వాక్కులచే – ఆదరించెడి ప్రభువు – వేదన
    సమయమున – బాధపరచెడి వారి కొరకు ప్రార్ధన చేసెనే

    నన్ను తనవలె మార్చెడి – ఈ మహా ప్రేమను త-ల-చి
    తలచి హృదయము కరుగగ – సదా కీర్తించెదను /చూడుము/


    Chudumu gethsemane – Totalo naa prabhuvu
    Paapi naakai vijnaapana chesedi – Dwhanivinabaduchunnadi
    Paapi neekai vijnaapana chesedi – Dwhanivinabaduchunnadi

    Dehamantayu nalagi – Shokamu chendinavaadai
    Devaadhi devuni – Yekaika sutudu padu vedanalu naa korake

    Tandri ee paatra tolagun – Nee chittamaina yedala
    Yetlainanu nee chittamu cheyutaku nannappaginchitivanenu

    Rakthapu chemata valana – Mikkili baadhanondi
    rakshakudesu – hrudayamu pagalaga – vijnaapanamu chesene

    Mummaaru bhoomimedapadi mikkili vedanache – Mana Yesu
    Prabhuvu – Taane vedukonenu – paapula vimochana korake

    Premaamruta vaakkulache – aadarinchedi prabhuvu – vedana
    samayamuna – baadhaparachedi vaari koraku praardhana chesene

    Nannu tanavale marchedi – ee maha premanu talachi
    talachi hrudayamu karugaga – sadaa keertinchedanu / Chudumu/

  • Hosanna paadudam Yesu daasulara హోసన్నా పాడుదాం యేసు దాసులరా

    హోసన్నా పాడుదాం -యేసు దాసులరా
    యెసయ్యా మెస్సయ్యకు – ఉన్నతమందు హోసన్నా /2/

    చిన్న గాడిద పిల్లనెక్కి కన్య సుతుడు వెళ్ళినాడు /2/
    నన్ను తనదు వశము చేసి – పన్నుగ నన్నేలును /హో/

    గరులా ఆదివారమునాడు – గురువు చరణములకరిగి /2/
    పరిశుద్ద అత్మనుపొంది – తిరిగి యేసుని పొగడుదాం /హో/

    బాలుర గీతము లాలకించి – ఎలినమన యేసయ్యను / 2/
    బాలురతో కూడ మనము కూడి స్తుతి చేయుదాం /హో/

    పాపమంతయు పోగొట్టి – పాపి చెయ్యి పట్టి ఎత్తి /2/
    వీపు మీరగ బ్రోవ నన్ను శాపపు సిలువన్ మోసెను /హో/

    నాడు బాలురెల్లరు కూడి – పాడిరేసు స్వామికి /2/
    నేడు యదె రీతి మనము కూడి నుతి చేయుదాం /హో/


    Hosanna paadudaam – Yesu daasulara
    Yeasayya messayyaku – Unnatamandu Hosanna /2/

    Chinna gaadida pillanekki – Kanya sutudu vellinaadu /2/
    Nanu tanadu vashamu chesi – Pannuga nannelunu /Hosanna/

    Garula aaduvaaramu naadu – Guruvu charanamulakarigi /2/
    Parishuddha aatamnu pondi – Tirigi Yesuni pogadudaam /Hosanna/

    Baalura geetamu laalakinchi – Yelina mana Yesayyanu /2/
    Baalurato koodi manamu – kudi stuti cheyudaam /Hosanna/

    Paapamantayu pogotti – Paapi cheyyi patti yeti /2/
    Veepu meeraga brova nannu – Saapapu siluvan mosenu /Hosanna/

    Naadu baalurellaru koodi – Paadiresu swaamiki /2/
    Nedu yade reeti manamu – Koodi nunti cheyudaam /Hosanna/

  • Sthuthi gaanamulathoa naenu స్తుతి గానములతో నేను

    స్తుతి గానములతో నేను – నా దేవునీ స్తుతించెదనూ
    నీ జీవితమంతా ప్రభు కొరకై- నేయిల జీవించెదనూ
    ప్రభూ కొరకై నిలచెదనూ

    అది అంతము నీవే …. ఆధార భూతుడ నీవే
    ప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాత నీవే
    నీ ప్రేమలో … నీ నీడలో నిలుపుము నీకే స్తోత్రము ||స్తుతి||

    లోకమంత నీరాకకై వేచి యుండెను నా ప్రభూ
    మేఘ వాహనంబు మీద మేటి దూత గణముల తోడా
    వేవేగమే రానైయున్న రారాజా- నీకై స్తోత్రము ||స్తుతి||


    sthuthi gaanamulathoa naenu – naa dhaevunee sthuthiMchedhanoo
    nee jeevithamMthaa prabhu korakai- naeyila jeeviMchedhanoo
    prabhoo korakai nilachedhanoo

    adhi aMthamu neevae …. aaDhaara bhoothuda neevae
    prathi jeevini praemiMchi poaShiMchu praaNadhaatha neevae
    nee praemaloa … nee needaloa nilupumu neekae sthoathramu ||sthuthi||

    loakamMtha neeraakakai vaechi yuMdenu naa prabhoo
    maegha vaahanMbu meedha maeti dhootha gaNamula thoadaa
    vaevaegamae raanaiyunna raaraajaa- neekai sthoathramu ||sthuthi||

  • Kalyaana raagaala sandadilo కళ్యాణ రాగాల సందడిలో

    కళ్యాణ రాగాల సందడిలో – ఆనంద హరివిల్లులో
    మల్లెల పరిమళ జల్లులలో – కోయిల గానాలలో /2/
    పరిశుద్ధుడేసుని సన్నిధిలో – నవ దంపతులు ఒకటవ్వగా
    స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం
    నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం
    నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
    స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం

    నరుడు ఒంటరిగ ఉండరాదని – జంటగా ఉండ మేలని
    ఇరువురి కలయిక దేవుని చిత్తమై – ఒకరికి ఒకరు నిలవాలని /2/
    తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని /2/
    స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం
    నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
    నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం
    స్వాగతం వరుడా స్వాగతం – స్వాగతం వధువ స్వాగతం

    సాటిలేని సృష్టి కర్త – సాటిఐన సహాయము
    సర్వ జ్ఞానిఐన దేవుడు – సమయోచితమైన జ్ఞానముతో /2/
    సమకూర్చెను సతిపతులను – ఇది అన్నిటిలో ఘనమైనది /2/
    స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం
    నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం
    నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం
    స్వాగతం వధువ స్వాగతం – స్వాగతం వరుడా స్వాగతం


    Kalyaana raagaala sandadilo – aananda harivillulo
    mallela primal jallulalo – koyila gaanaalao /2/
    parishuddhudesuni sannidhilo – nava dampatulu okatavvaga
    swagatam vadhuva swaagatam – swagatam varuda swaagatam
    nee patin cheraga nava vadhuva swagatam
    nee satin cheraga nava varuda swagatam
    swagatam vadhuva swagatam – swagatam varuda swagatam

    narudu vontariga vundaraadani – jantga vunda melani
    iruvuri kalayika devuni chittamai
    okariki okaru nilavalani /2/
    toduga andaga okariki okaru nilavalani /2/
    swagatam vadhuva swaagatam – swagatam varuda swaagatam
    nee satin cheraga nava varuda swagatam
    nee patin cheraga nava vadhuva swagatam
    swagatam varuda swaagatam – swagatam vadhuva swaagatam

    saatileni srustikartha – saatiyeina sahaayamu
    sarvajnaaniyeina devudu – samayochitamaina jnaanamuto /2/
    samakoorchenu satipatulanu – idi annitilo ghanamainadi /2/
    swagatam vadhuva swaagatam – swagatam varuda swaagatam
    nee patin cheraga nava vadhuva swagatam
    nee satin cheraga nava varuda swagatam
    swagatam vadhuva swagatam – swagatam varuda swagatam

  • Daivanirnayam e parinayam raman దైవనిర్ణయం ఈ పరిణయం రమణీయం అతిమ

    దైవనిర్ణయం ఈ పరిణయం
    రమణీయం అతిమధురం
    యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం
    నిలిచియుండును ఇలలో కలకాలం

    అన్నిటిలో వివాహం ఘనమైనదని
    పానుపు ఏ కల్మషము లేనిదని
    యెహూవాయే కలిగించిన కార్యమని
    మహూన్నతుని వాక్యమే తెలిపెను

    పురుషునిలో సగభాగం తన భార్యయని
    ప్రేమించుట అతనికున్న బాధ్యతని
    విధేయత చూపించుట స్త్రీ ధర్మమని
    సజీవుడైన దేవుడే తెలిపెను


    Daivanirnayam e parinayam
    Ramaniyam atimadhuram
    Yesulo ekamaina iruvuri anubamdham
    Nilichiyumdunu ilalo kalakalam

    Annitilo vivaham ganamainadani
    Panupu E kalmashamu lenidani
    Yehuvaye kaligimchina karyamani
    Mahunnatuni vakyame telipenu

    Purushunilo sagabagam tana baryayani
    Premimchuta atanikunna badhyatani
    Vidheyata chupimchuta stri dharmamani
    Sajivudaina devude telipenu

  • Mamathaanuraagaalae maalalugaa మమతానురాగాలే మాలలుగా

    మమతానురాగాలే మాలలుగా

    సమతానుబంధాలే ఎల్లలుగా
    కట్టబడిన కాపురం – అనురాగ గోపురం
    ఈ పరిణయం – యెహోవా నిర్ణయం

    వరుడైన క్రీస్తు వధువైన సంఘమును
    ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించె
    అటువలెనే పురుషుడు కూడా తన స్వంత దేహమువోలె
    భార్యను ప్రేమించ వలెనని యేసయ్య ఏర్పరచినది

    కుమారుడు క్రీస్తు శిరస్సైన తండ్రికి
    అన్నివేళలందు విధేయత చూపె
    అటువలెనే స్త్రీ కూడా శిరస్సైన పురుషునికి
    అన్నిటిలో విధేయురాలిగ ఉండునట్లు ఏర్పరచినది


    mamathaanuraagaalae maalalugaa

    samathaanubMDhaalae ellalugaa
    kattabadina kaapurM – anuraaga goapurM
    ee pariNayM – yehoavaa nirNayM

    varudaina kreesthu vaDhuvaina sMghamunu
    eMthagaanoa praemiMchi praaNamunae arpiMche
    atuvalenae puruShudu koodaa thana svMtha dhaehamuvoale
    bhaaryanu praemiMcha valenani yaesayya aerparachinadhi

    kumaarudu kreesthu shirassaina thMdriki
    annivaeLalMdhu viDhaeyatha choope
    atuvalenae sthree koodaa shirassaina puruShuniki
    annitiloa viDhaeyuraaliga uMdunatlu aerparachinadhi

  • Mana pattanmbadhigoa మన పట్టణంబదిగో

    మన పట్టణంబదిగో – మన పౌరత్వంబదిగో
    కానాను పురమదిగో – మన యేసుకు జేయునమో

    ఆర్భాటంబులతో – విజయోత్సవంబులతో
    ఏతెంచిన ప్రభు జేరి – పాత భక్తుల జేరి
    మధ్యాకాశంబుననూ – హల్లెలూయా పాడెదము

    జీవ జలనది – పారు నాసనమునుండి
    ఆవల నీవలనూ – జీవ వృక్షంబుండు
    నెల నెల కాయును – పండ్రెండు కాపులను

    నూతన భువియందు – నూతన యెరూషలేముండు
    నూతన వెలుగుననూ – నూతన ప్రజలౌదుము
    నూతనాలయము – గొఱ్ఱెపిల్లయే తాను

    తేజోమయునితో – మరి తేజోవాసులతో
    తేజరిల్లుదుము – తేజో రాజ్యమునందు
    సజీవ జనకుని – సజీవ జనులమని

    చేరుదు మాపురము – పరమ పరదైసునకు
    కరువు మరణములు – కానము ఎన్నడును
    మహిమలో నిత్యంబు – ప్రభు యేసుతో నుందుము


    mana pattaNMbadhigoa – mana paurathvMbadhigoa
    kaanaanu puramadhigoa – mana yaesuku jaeyunamoa

    aarbhaatMbulathoa – vijayoathsavMbulathoa
    aetheMchina prabhu jaeri – paatha bhakthula jaeri
    maDhyaakaashMbunanoo – hallelooyaa paadedhamu

    jeeva jalanadhi – paaru naasanamunuMdi
    aavala neevalanoo – jeeva vrukShMbuMdu
    nela nela kaayunu – pMdreMdu kaapulanu

    noothana bhuviyMdhu – noothana yerooShlaemuMdu
    noothana velugunanoo – noothana prajalaudhumu
    noothanaalayamu – goRRepillayae thaanu

    thaejoamayunithoa – mari thaejoavaasulathoa
    thaejarilludhumu – thaejoa raajyamunMdhu
    sajeeva janakuni – sajeeva janulamani

    chaerudhu maapuramu – parama paradhaisunaku
    karuvu maraNamulu – kaanamu ennadunu
    mahimaloa nithyMbu – prabhu yaesuthoa nuMdhumu

  • Ninne vedakeda nikai bradikeda నిన్నె వెదకెద నీకై బ్రదికెదా

    నిన్నె వెదకెద నీకై బ్రదికెదా
    యేసుతో యీ జీవితం ఆనందమే ఇది సత్యం (2)

    చీకటి లోఐనా చింతలు ఎన్నో ఉన్నా (2)
    కన్నీరు తుడిచే యేసు నాతో ఉండగా
    నా గుండె గాయాలన్ని తానే మాన్పగా (2)
    యేసుతో యీ జీవితం
    ఆనందమే ఇది సత్యం (2)

    నా కొరకై ప్రాణ మిచ్చినా నీకొరకే జీవిస్తున్నా (2)
    నా ఆత్మ ప్రాణం సర్వం నిన్నే తలచగా
    నా గుండె శబ్దం నిత్యం యేసే యేసేగా (2)
    యేసుతో యీ జీవితం
    ఆనందమే ఇది సత్యం (2)


    Ninne vedakeda nikai bradikeda
    Yesuto yi jivitam anamdame idi satyam (2)

    chikati loaaina chimtalu enno unna (2)
    Kanniru tudiche yesu nato umdaga
    Na gumde gayalanni tane manpaga (2)
    Yesuto yi jivitam
    Anamdame idi satyam (2)

    Na korakai prana michchina nikorake jivistunna (2)
    Na atma pranam sarvam ninne talachaga
    Na gumde sabdam nityam yese yesega (2)
    Yesuto yi jivitam
    Anamdame edi satyam (2)

  • Naa praanamaa yehovaanu neevu sannuthinchumu నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించుము

    నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించుము
    నీ ప్రభు చేసిన మేలులలో ఒక్కదానినైన నీవు మరువకు (2)
    అనుదినము ధ్యానించుచు
    కృతజ్ఞతార్పనలు చెల్లించుము (2)

    పాపపు ఊభిలో నీవు మునిగియుండనేల
    నీ దోషములను క్షమియించి లేవనెత్తును
    సమాధిలోన నీవు విసిగియున్న వేళ
    నిను విమోచించి కరుణ కటాక్షముల నిచ్చును (2)
    పక్షిరాజు యవ్వనమును దయచేసి
    మేళ్ళతో నీ హృదయము తృప్తి పరచును
    యేసు నామములోనే నీకు రక్షణ
    యేసు నామములోనే నీకు స్వస్థత
    యేసు నామములోనే నీకు నెమ్మది
    యేసు నామములోనే నిలుపు నీ మది ||నా ప్రాణమా||

    కొండల తట్టు నీ కన్నులెత్తుము
    నీ సహాయము దయచేయు దేవుడు
    ఇరు వైపులా శత్రువు తరుముచున్ననూ
    ఏ అపాయము దరికి చేరనీయడు (2)
    విశ్వాస కవచమును ధరించుము
    విజయ వీరుడవై ముందుకేగుము
    యేసు నామములోనే నీకు విడుదల
    యేసు నామములోనే నీకు క్షేమము
    యేసు నామములోనే నీకు విజయము
    యేసు నామములోనే నిత్యజీవము ||నా ప్రాణమా||


    Naa Praanamaa Yehovaanu Neevu Sannuthinchumu
    Nee Prabhu Chesina Melulalo
    Okkadaaninaina Neevu Maruvaku (2)
    Anudinamu Dhyaaninchuchu
    Kruthagnathaarpanalu Chellinchumu (2)

    Paapapu Oobhilo Neevu Munigiyunda Nela
    Nee Doshamulanu Kshamyinchi Levanethunu
    Samaadhilona Neevu Visigiyunna Vela
    Ninu Vimochinchi Karuna Kataakshamula Nichchunu (2)
    Pakshi Raju Yavvanamunu Dayachesi
    Mellatho Nee Hrudayamu Thrupthi Parachunu
    Yesu Naamamulone Neeku Rakshana
    Yesu Naamamulone Neeku Swasthatha
    Yesu Naamamulone Neeku Nemmadi
    Yesu Naamamulone Nilupu Nee Madi ||Naa Praanamaa||

    Kondala Thattu Nee Kannuleththumu
    Nee Sahaayamu Dayacheyu Devudu
    Iru Vaipula Shathruvu Tharumuchunnanuu
    Ae Apaayamu Dariki Cheraneeyadu (2)
    Vishwaasa Kavachamunu Dharinchumu
    Vijaya Veerudavai Mundukegumu
    Yesu Naamamulone Neeku Vidudala
    Yesu Naamamulone Neeku Kshemamu
    Yesu Naamamulone Neeku Vijayamu
    Yesu Naamamulone NithyaJeevamu ||Naa Praanamaa||