Category: Telugu Worship Songs Lyrics

  • Neevu lekundaa nenundalenu నీవు లేకుండా నేనుండలేను

    నీవు లేకుండా నేనుండలేను
    నాకున్నవన్నీ నీవే యేసయ్య
    నా ప్రాణమా నా ధ్యానమా
    నా ఊపిరి నీవే యేసయ్య

    జాలిలేనిది ఈ మాయలోకము
    కలతచెందెను నా దీన హృదయము
    నను కాపాడుటకు నా దరి నిలచితివా
    హస్తము చాపితివా నను బలపరచితివా

    నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను
    అంతము వరుకు నాతో ఉండరు
    నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా
    నా ప్రాణము నీవే యేసయ్య

    కన్నులు మూసిన కన్నులు తెరచిన
    నా చూపులలో నీ రూపమే
    కనికరించితివా కరుణామయుడా
    కృప చూపించితివా నాకు చాలిన దేవుడా


    Neevu lekundaa nenundalenu
    naakunnavanni neevey yesayya
    naa praanamaa naa dhyaanamaa
    naa oopiri neevey yesayya

    jaalilenidhi ee maayalokamu
    kalathachendenu naa deena hrudayamu
    nanu kaapaadutaku naa dhari nilachithivaa
    hasthamu chaapithivaa nanu balaparachithivaa

    nanu preminchevaaru endharu unnanu
    anthamu varuku naatho undaru
    naalo unnavaadaa naatho unnavaadaa
    naa praanamu neevey yesayya

    kannulu moosina kannulu therachina
    naa choopulalo nee roopamey
    kanikarinchithivaa karunaamayudaa
    krupa choopinchithivaa naaku chaalina devudaa

  • Dhaevara nee dhaevenalu dhaaraLamuganu దేవర నీ దేవెనలు ధారళముగను

    దేవర నీ దేవెనలు ధారళముగను వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ము
    పావన యేసుని ద్వారగను ||దేవర||

    దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ
    నింపుగ పెంపగుచు స హింపున వీరు సుఖించుటకై ||దేవర||

    ఈ కవను నీ కరుణన్ ఆకరువరకును లోకములో శోకము లేకయె
    యేకముగాఁ బ్రాకటముగను జేకొనుము ||దేవర||

    ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పునఁ
    దప్పకను మెప్పుగ బ్రతుకగఁ బంపు కృపన్ ||దేవర||

    తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగాఁ గాపుగఁ బ్రాపుగ
    దాపునుండి యాపద లన్నియుఁ బాపుచును ||దేవర||

    సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగాఁ కదలక వదలక
    ముదమున నీ పాదము దాపునఁ బాదుకొనన్ ||దేవర||

    మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ
    నండనుండి వెండియు వానిని ఖండించవే ||దేవర||

    ఇద్దర వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిద్ధ
    పడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర||

    వాసిగ నీ దాసులము చేసిన యీ మొఱల్ దీసికొని మా సకలేశ్వర నీ
    సుతుఁడౌ యేసుని పేరిటఁ బ్రోవు మామేన్ ||దేవర||


    Dhaevara nee dhaevenalu DhaaraLamuganu veeralapai
    baaguga vaegame dhiganimmu
    paavana yaesuni dhvaaraganu ||dhaevara||

    dhmpathulu dhMdiga nee Dhaathriloa velayuchu
    sMpadhalan soMpuga
    niMpuga peMpaguchu sa hiMpuna veeru sukhiMchutakai ||dhaevara||

    ee kavanu nee karuNan aakaruvarakunu loakamuloa
    shoakamu laekaye
    yaekamugaaAO braakatamuganu jaekonumu ||dhaevara||

    ippagidhi neppudunu goppagu praemathoa noppuchu dhaa
    moppina choppunAO
    dhappakanu meppuga brathukagAO bMpu krupan ||dhaevara||

    thaapamulu paapamulu moapuga veeripai raakuMdagaaAO
    gaapugAO braapuga
    dhaapunuMdi yaapadha lanniyuAO baapuchunu ||dhaevara||

    saaDhulugan jaeyutakai shoaDhanalachae neevu shoaDhiMpagaaAO
    kadhalaka vadhalaka
    mudhamuna nee paadhamu dhaapunAO baadhukonan ||dhaevara||

    meMduga bhoomMdalapu gMdamulaloa veeruMdaganu thMdriga dhMdiga
    nMdanuMdi veMdiyu vaanini khMdiMchavae ||dhaevara||

    idhdhara veeridhdharunu shudhDhulai ninnu saeviMchutakai
    shradhDhathoa budhDhiga sidhDha
    padan dhidhdhumu nee priya biddalugaan ||dhaevara||

    vaasiga nee dhaasulamu chaesina yee moRal dheesikoni
    maa sakalaeshvara nee
    suthuAOdau yaesuni paeritAO broavu maamaen ||dhaevara||

  • Dhoorapu komdapai shramalaku gurthagu దూరపు కొండపై శ్రమలకు గుర్తగు

    దూరపు కొండపై శ్రమలకు గుర్తగు
    కౄరపు సిలువయే కనబడె
    పాపలోకమునకై ప్రాణము నొసగిన
    ప్రభుని సిలువను ప్రేమింతున్

    ప్రియుని సిలువను ప్రేమింతున్
    ప్రాణమున్నంత వరకును
    హత్తుకొనెదను సిలువను
    నిత్యకిరీటము పొందెదన్

    లోకులు హేళన చేసిన సిలువ
    నా కెంతో అమూల్యమైనది
    కల్వరిగిరికి సిలువను మోయను
    క్రీస్తు మహిమను విడచెను

    రక్తశిక్తమైన కల్వరి సిలువలో
    సౌందర్యంబును నే గాంచితిని
    నన్ను క్షమించను పెన్నుగ యేసుడు
    ఎన్నదగిన శ్రమ పొందెను

    వందనస్తుడను యేసుని సిలువకు
    నిందను ఈ భువిన్ భరింతు
    పరమ గృహమునకు పిలిచెడు దినమున
    ప్రభుని మహిమను పొందెద


    Dhoorapu komdapai shramalaku gurthagu
    kroarapu siluvayae kanabade
    paapaloakamunakai praaNamu nosagin
    prabhuni siluvanu praemiMthun

    priyuni siluvanu praemimthun
    praanamunnmtha varakunu
    haththukonedhanu siluvanu
    nithyakireetamu pomdhedhan

    loakulu haeLana chaesina siluv
    naa kemthoa amoolyamainadhi
    kalvarigiriki siluvanu moayanu
    kreesthu mahimanu vidachenu

    rakthashikthamaina kalvari siluvaloa
    sauMdharymbunu nae gaamchithini
    nannu kshmimchanu pennuga yaesudu
    ennadhagina shrama pomdhenu

    vMdhanasthudanu yaesuni siluvaku
    niMdhanu ee bhuvin bharimthu
    parama gruhamunaku pilichedu dhinamun
    prabhuni mahimanu pomdhedh

  • Ontarini nenu ontarini ఒంటరిని నేను ఒంటరిని

    ఒంటరిని నేను ఒంటరిని
    ఓడిపోయి నేను ఒంటరినై
    ఓదార్పులేక ఓరిమిలేక
    మరణమే ఇక శరణం అనుచు
    అంతమవ్వాలని ఆశపడితి || ఒంటరిని ||

    దావీదు వలె నేను శ్రమలనొందుచు
    నిందకు వేదనకు వేడుకనైతిని
    ఒంటరినై నేను నిను వెదకుచుండగా
    నీ వాక్యముచే నను ఆదరించి
    ఇదిగో నేను ఉన్నాను అని నీవు
    అభయము ఇచ్చితివి యేసు దేవా! || ఒంటరిని ||

    తప్పిపోయిన తనయుని వలె నేను
    తండ్రికి దూరమై ఒంటరినైతిని
    తప్పు తెలిసి క్షమీయించుమని
    నీ చెంతకు నే చేరితి తండ్రి
    నీవు నన్ను కౌగిలించి
    క్షమియించిన ఓ కరుణామయుడా! || ఒంటరిని ||

    యాకోబు వలె నేను భయముతో వణకుచు
    ఒంటరినై నీతో పోరాడుచుండగా
    పేరు పెట్టి పిలిచినా దేవా
    నీదు మోమును చూపించితివి
    భయపడక నీవు సాగిపొమ్మని
    దీవించితివి ఓ యేసు దేవా! || ఒంటరిని ||


    ontarini nenu ontarini
    odipoyi nenu ontarini
    odhaarpu leka orimi leka
    maraname ika saranam anuchu
    anthamavvaalani aasapadithey

    daavidu valey nenu sramalanonduchu
    nindaku vedhanaku vedukanaithini
    ontarinai nenu ninu vedhakuchundagaa
    nee vaakyamuche nanu aadharinchi
    idigo nenu unnaanu ani neevu
    abhayamu ichithivi yesu deva

    thappipoyina thanayuni valey nenu
    thandriki dhooramai ontarinaithini
    thappu thelisi kshamiyinchumani
    nee chenthaku ne cherithi thandri
    neevu nannu kougilinchi
    kshamiyinchinaa oh karunaamayudaa

    yakobu valey nenu bhayamutho vanukuchu
    ontarinai neetho poraaduchundagaa
    peru petti pilichinaa devaa
    needhu momunu choopinchithivi
    bhayapadaka neevu saagipommani
    dheevinchithivi oh yesu deva

  • Swachamaina thalli premalaa స్వచ్చమైన తల్లి ప్రేమలా

    స్వచ్చమైన తల్లి ప్రేమలా
    కమ్మనైన తల్లి పాలలా
    మధురం యేసు వాక్యము
    ఎంత మధురం మధురాతి మధురం
    యేసుని వాక్యం సర్వదా మధురం
    నిన్న నేడు ఒక్కటే రీతిగా
    నిరతము ఒకే మాటగా
    మారని మార్పులేని యేసు మాట మధురం

    స్వచ్చమైన తల్లి ప్రేమలా
    కమ్మనైన తల్లి పాలలా
    జుంటితేనె ధారలకన్నా మధురమైనది
    సత్యమైన తండ్రి మాటలా
    నమ్మదగిన చెలిమి తోడుగా
    ప్రియమైన వారలకన్నా కోరదగినది
    హృదయమును సంతోషపరచును
    ప్రాణమును సంతృప్తిపరచును
    జీవపు ప్రేమామృతమైన
    యేసు మాట మధురం

    పారుతున్న జీవధారలా
    ప్రాణులకు ఆధారముగా
    దప్పికగల వారలకెల్లా జీవమైనది
    వెలుగుతున్న జీవజ్యోతిలా
    వేదనలో ఆశాజ్యోతిగా
    నిరాశగల వారలనెల్లా బలపరచునది
    పాపములను ప్రత్యక్ష పరచును
    ఫలమును ప్రత్యేక పరచును
    పరమ జీవాహారమైనా
    యేసు మాట మధురం


    Swachamaina thalli premalaa
    kammanaina thalli paalalaa
    madhuram yesu vaakyamu
    entha madhuram madhuraathi madhuram
    yesuni vaakyam sarvadaa madhuram
    ninna nedu okkate reethigaa
    nirathamu oke maatagaa
    maarani maarpuleni yesu maata madhuram

    swachamaina thalli premalaa
    kammanaina thalli paalalaa
    juntithene dhaaralakannaa madhuramainadhi
    sathyamaina thandri maatalaa
    nammadhagina chelimi thodugaa
    priyamaina vaaralakannaa koradhaginadhi
    hrudhayamunu santhoshaparachunu
    praanamunu santhrupthi parachunu
    jeevapu premaamruthamaina
    yesu maata madhuram

    paaruthunna jeevadhaaralaa
    praanulaku aadhaaramugaa
    dappikagala vaaralakellaa jeevamainadi
    veluguthunna jeeva jyothilaa
    vedhanalo aasaajyothigaa
    niraasagala vaaralanellaa balaparachunadi
    paapamulanu prathyaksha parachunu
    phalamunu prathyeka parachunu
    parama jeevaahaaramainaa
    yesu maata madhuram

  • Naakunnaadu oka snehithudu నాకున్నాడు ఒక స్నేహితుడు

    నాకున్నాడు ఒక స్నేహితుడు
    నాకున్నాడు స్నేహితుడు
    నా యేసుడు నా ప్రియుడు
    నాకోసం ప్రాణం పెట్టినా
    చెలికాడు చెలికాడు చెలికాడు
    నాకున్నాడు స్నేహితుడు

    యేసు నీవు నాకు ఉండగా
    రోజంతా నాకు పండుగ
    కీడేమి రాదు అడ్డుగా
    ఆనందం గుండె నిండుగా

    రేయైన పగలైన
    యేసే నా తోడు
    నేను పడినా తొట్రిల్లిన్నా
    నన్ను బాగుచేయువాడతడు

    ఏమున్న లేకున్న
    యేసుంటే నాకు చాలు
    అన్న పానములు కలిగియున్న
    అవి అన్నియు యేసు కోసమే

    నాకున్నాడు ఒక స్నేహితుడు
    నాకున్నాడు స్నేహితుడు
    నా యేసుడు నా ప్రియుడు
    నాకోసం ప్రాణం పెట్టినా
    చెలికాడు చెలికాడు చెలికాడు
    నాకున్నాడు స్నేహితుడు


    Naakunnaadu oka snehithudu
    naakunnaadu snehithudu
    naa yeasudu naa priyudu
    naakoasam praanam pettinaa
    chelikaadu chelikaadu chelikaadu
    naakunnaadu snehithudu

    yesu neevu naaku undagaa
    roajantha naaku panduga
    keedemi raadhu addugaa
    aanandham gunde nindugaa

    reyaina pagalaina
    yesey naa thodu
    nenu padinaa thotrillinaa
    nannu baagucheyu vaadathadu

    emunna lekunna
    yesuntey naaku chaalu
    anna paanamulu kaligiyunna
    avi anniyu yesu kosamey

    naakunnaadu oka snehithudu
    naakunnaadu snehithudu
    naa yeasudu naa priyudu
    naakoasam praanam pettinaa
    chelikaadu chelikaadu chelikaadu
    naakunnaadu snehithudu

  • Ben and holly ishtamaa బెన్ అండ్ హలీ ఇష్టమా

    బెన్ అండ్ హలీ ఇష్టమా
    బింగో అంటే ఇష్టమా
    బర్గర్ అంటే ఇష్టమా
    బైబిల్ అంటే ఇష్టమా
    పెప్ప పిగ్ ఇష్టమా
    పబ్జి అంటే ఇష్టమా
    పిజ్జ అంటే ఇష్టమా
    ప్రేయర్ అంటే ఇష్టమా

    హే మై బ్రదర్, హల్లో సిస్టర్
    వీటన్నిటిలో మీకేది ఇష్టము

    సూపర్ మాన్ ఇష్టమా
    సెల్ఫి అంటే ఇష్టమా
    స్విమ్మింగ్ పూల్ ఇష్టమా
    సండే స్కూల్ ఇష్టమా
    జాక్ అండ్ జిల్ ఇష్టమా
    జంగిల్ బుక్ ఇష్టమా
    జంక్ ఫూడ్ అంటే ఇష్టమా
    జీసస్ అంటే ఇష్టమా

    ఇడ్లి దోసా ఇష్టమా
    ఐస్ క్రీం అంటే ఇష్టమా
    ఐఫోన్ అంటే ఇష్టమా
    ఇంటిగ్రిటి ఇష్టమా
    మెక్ డి అంటే ఇష్టమా
    మిస్టర్ బీన్ ఇష్టమా
    మిక్కి మౌస్ ఇష్టమా
    మోరల్ వాల్యుస్ ఇష్టమా

    జీసస్ అంటే ఇష్టము
    బైబిల్ అంటే ఇష్టము
    ప్రేయర్ అంటే ఇష్టము
    చర్చ్ అంటే ఇష్టము


    Ben and holly ishtamaa
    bingo antey ishtamaa
    burger antey ishtamaa
    bible antey ishtamaa
    peppa pig ishtamaa
    pubg antey ishtamaa
    pizza antey ishtamaa
    prayer antey ishtamaa

    hey my brother, hello sister
    veetannitilo meekedhi ishtamu

    super man ishtamaa
    selfi antey ishtamaa
    swimming pool ishtamaa
    sunday school ishtamaa
    jack and jil ishtamaa
    jungle book ishtamaa
    junk food antey ishtamaa
    jesus antey ishtamaa

    idli dosaa ishtamaa
    ice cream antey ishtamaa
    iphone antey ishtamaa
    integrity ishtamaa
    mcd antey ishtamaa
    mr.bean ishtamaa
    mickey mouse ishtamaa
    moral values ishtamaa

    jesus antey ishtamu
    bible antey ishtamu
    prayer antey ishtamu
    church antey ishtamu

  • Thalli mariya vadilonaa pavalinchagaa తల్లి మరియ వడిలోనా పవలించగా

    తల్లి మరియ వడిలోనా పవలించగా
    అందాల తార వెలసెనంట

    రాజులకు రారాజు పుట్టెనంట
    ఇలలోనంట
    అందాల తార వెలసెనంట
    సర్వలోక ప్రజలందరికి మహిమ
    క్రీస్తు నీలో నాలో ఉదయించెను
    ఆనందం సంతోషం సమాధానం
    కలుగును మనకు
    Happy Happy Christmas
    Merry Merry Christmas

    మానవాళి రక్షణకై దివిని వీడి
    భువికొచ్చిన మా యేసు రాజు మారాజు
    పాపులను క్షమియించి పరమునకు
    నడిపించే ఈ యేసు రారాజు
    నీతిసూర్యుడా పావనాత్ముడా
    పరలోక మా రాజా

    ఈ చల్లని కాలంలో ఈ సంతస వేళలో
    జరిగే క్రిస్మస్ వేడుక
    ప్రతి సంఘములోను వీనులకు విందైన
    సంతోష సునాదాలు
    సర్వశక్తుడా అద్వితీయుడా
    సర్వలోక పాలకుడా


    thalli mariya vadilonaa pavalinchagaa
    andhaala thaara velasenanta

    raajulaku raaraaju puttenanta
    ilalonanta
    andhaala thaara velasenanta
    sarvaloka prajalandhariki mahima
    kreesthu neelo naalo udayinchenu
    aanandham santhosham samaadhaanam
    kalugunu manaku
    happy happy christmas
    merry merry christmas

    maanavaali rakshanakai dhivini veedi
    bhuvikochina maa yesu raaju maaraaju
    paapulanu kshamiyinchi paramunaku
    nadipinche ee yesu raaraaju
    neethisooryudaa paavanaathmudaa
    paraloka maa raajaa

    ee challani kaalamlo ee santhasa velalo
    jarige krismas veduka
    prathi sanghamulonu veenulaku vindhaina
    santhosha sunaadhaalu
    sarvashakthudaa adhvitheeyudaa
    sarvaloka paalakudaa

  • kaluvari naadhaa karunanu choopi కలువరి నాధా కరుణను చూపి

    కలువరి నాధా కరుణను చూపి
    నాకై బలియైతివా యేసయ్య
    కలుషము బాపా రుధిరము కార్చి
    జీవమునిచ్చావు నా యేసయ్య
    ఎలా తీర్చను నీ రుణం
    ప్రతిక్షణం అంకితం

    సొగసైనను సురూపమైనను
    లేనివానిగా నిను హింసించిరా
    మనుష్యుల వలన తృణీకరణతో
    విసర్జింపబడితివా నా యేసయ్య
    అయినా ప్రేమ ఒక మాటమాత్రమైన
    తిరిగిచెప్పనీయలేదు నా కోసమే

    నా దోషములు నా పాపములు
    మేకులతో నిన్ను సిలువ వేసెనా
    అన్యాయముగా తీర్పుతీర్చినను
    తగ్గింపుతో నాకై బలియైతివా
    అయినా ప్రేమ ఒక మాటమాత్రమైన
    తిరిగిచెప్పనీయలేదు నా కోసమే


    kaluvari naadhaa karunanu choopi
    naakai baliyaithivaa yesayya
    kalushamu baapaa rudhiramu kaarchi
    jeevamu nichaavu naa yesayya
    elaa theerchanu nee runam
    prathikshanam ankitham

    sogasainanu suroopamainanu
    lenivaanigaa ninu himsinchiraa
    manushyula valana thrunikaranatho
    visarjimpabadithivaa naa yesayya
    ayinaa prema oka maata maathramaina
    thirigi cheppaneeyaledhu naa kosame

    naa dhoshamulu naa paapamulu
    mekulatho ninnu siluva vesenaa
    anyaayamugaa theerputheerchinanu
    thaggimputho naakai baliyaithivaa
    ayinaa prema oka maata maathramaina
    thirigi cheppaneeyaledhu naa kosame

  • Kotha visthaarathanu kanalevaa కోత విస్తారతను కనలేవా

    కోత విస్తారతను కనలేవా
    కనులెత్తి పంటను కోయ చేరవా
    సమరయ స్త్రీ సంబరము కనవా
    స్వగ్రామమునే తెచ్చెను చూడవా

    ప్రభు నీళ్లడిగెను పరామర్శించెను
    ఆమె ప్రతి పాపమును తెలిపి కృప చూపెను
    పరీక్షించుకొనె తాను కనవా
    ప్రక్షాళనకై ప్రభువైపు చూడవా

    ప్రభు వివరించెను దేవుడు ఆత్మని
    ఆత్మతో సత్యముతో ఆరాధించగా
    విగ్రహ ఆరాధనను విడువవా
    ప్రతి ప్రతిమను నీలోనుండి త్రోయవా

    ప్రభు ప్రకటించెను క్రీస్తు తానే అని
    కళ్ళు తెరువబడే కుండ విడువబడే
    క్రీస్తేసుని ఊరందరికి చూపవా
    కరుణామయిని కనుగొన కదలింపవా


    kotha visthaarathanu kanalevaa
    kanulethi pantanu koya cheravaa
    samaraya sthree sambaramu kanavaa
    swagraamamune thechenu choodavaa

    prabhu neelladigenu paraamarsinchenu
    aamey prathi paapamunu thelipi krupa choopenu
    parikshinchukone thaanu kanavaa
    prakshaalanakai prabhu vaipu choodavaa

    prabhu vivarinchenu devudu aathmani
    aathmatho sathyamutho aaraadhinchagaa
    vigraha aaraadhananu viduvavaa
    prathi prathimanu neelonundi throyavaa

    prabhu prakatinchenu kreesthu thaaney ani
    kallu theruvabadey kunda viduvabadey
    kreesthesuni oorandhariki choopavaa
    karunaamayini kanugona kadhalimpavaa