Category: Telugu Worship Songs Lyrics

  • Yenta Prema na Yesuva ఎంత ప్రేమ నా యేసువా

    హల్లెలుయా … హల్లెలుయా … హల్లెలుయా … హల్లెలుయా …
    ఎంత ప్రేమ నా యేసువా – కలువరిలో నను దాచినావ
    ఎంత జాలి నా యేసువా – నీ సిలువలో నను మోసినావ

    ఒకనాడు గురిలేక నేనుంటిని – ఇపుడైతె నీయందు గురి కల్గితి
    సరిలేని నా బ్రతుకు సమరంబున – శిశిరాలు చిగురించె నీవల్లనే
    నీకేమి నేనిత్తును – హృదయాన్ని అర్పింతును /హల్లె/

    అలలెన్నో చెలరేగి భయపెట్టినా – అద్దరికి చేర్చేది నీవే కదా
    నా బలము నా శక్తి నాకేలనో – నీకృపలో నాకన్ని సాధ్యంబెగా
    దయతోడ నా యేసయ్యా – దరిచేర్చి జయమియ్యవా
    క్పపచూపి నాయేసయ్యా – బలపర్చి నడిపించవా /హాలె/

    అలనాడు సీమోను నిను చూడగా – అలలైన నీ దరికి చేరాడుగా
    ఈనాడు నినుచూచి వ్యధలందున – జయమొంద అభయంబు నిచ్చావుగా
    ప్రతి చోట నీ సాక్షిగా – జీవింప వెలిగించవా
    పరమందు నిను చేరగా – నడిపించు నా దైవమా


    Halleluya.. Halleluya.. Halleluya.. Halleluya.. /2/
    Yenta Prema na Yesuva – Kaluvarilo nanu dachinava
    Yenta jali na Yesuva – Ne siluvalo nanu mosinava /2/

    Okanaadu gurileka nenuntini – Ipudaite neyandu guri kalgiti
    Sarileni na bratuku samarambuna Sishiralu chigurinche nevallane
    Neekemi nennittunu – Hrudayaanni arpintunu /Halle/

    Alalenno chelaregi bhayapettina – Addariki cherchedi nevekada
    Na balamu na sakthi nakelano – Ne krupalo nakanni sandhyambega
    Dayatoda na Yesayya – Daricherchi jayameyava
    Krupachupi na Yesayya – Balaparchi nadipinchava /Halle/

    Alanaadu seemonu ninuchudaga – Alalaina nee dariki cheraduga!
    Eenaadu ninu chuchi vyadhalanduna – Jayamonda abhayambu nichhavuga
    Prati chota nee sakshiga – jeevimpa veliginchava
    Paramandu ninu cheraga – Nadipinchu naa daivama /Hale/

  • Ye Reeti ne runam teerchukondu nesuva ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసువా

    ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసువా /2/
    ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయా
    ఎంతో కృపను చూపి నను దీవించినావయా.. /ఏ రీతి/

    పాపాల సంద్రమందున పయనినచువేళలో
    పాషాణ మనసు మార్చి (నను) పరిశుద్ధుని చేసావయా /2/

    నా పాప శిక్ష సిలువపై భరియించినావయా
    నా దోషములను గ్రహియించి (నను) క్షమియించినావయా/2/


    Ye reeti ne runam teerchukondu nesuva /2/
    Ye dikku leni nana preminchinaavaya – Yento krupanu chupi nanu deevinchinaavaya.. /Ye reeti/

    Papaala sandramanduna payaninchu velalo
    Pashana manasu maarchi (nanu) parishudduni chesavaya /2/Ye reeti/

    Naa paapa siksha siluvapai bhariyinchinaavaya..
    Na doshamulanu grahiyinchi (nanu) kshamiyinchinaavaya.. /2/Ye reeti/

  • Vudayinchenu Naakosam ఉదయించెను నాకోసం

    ఉదయించెను నాకోసం-సదయుడైన నిజదైవం /2/
    పులకించెను నాహృదయం-తలపోయగ యేసుని జన్మం
    అ.ప: సంతోషం పొంగింది-సంతోషం పొంగింది-సంతోషం పొంగి పొర్లింది /ఉదయించెను/

    కలుషమెల్లను బాపను-సిలువప్రేమను చూపను /2/
    దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను /సంతోషం/

    భీతిని తొలగించను-నీతిని స్థాపించను /2/
    దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను/సంతోషం/

    దోష శిక్షను మోయను-త్రోవ సిద్థము చేయను /2/
    దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను /సంతోషం/


    Vudayinchenu Naakosam – Sadayudaina nija daivam /2/
    Pulakinchenu naa hrudayam – Talapoyaga Yesuni janmam
    Chorus: Santosham pongindi – Santosham pongindi – Santosham pongi porlindi /Vuda/

    Kalushamellanu baapanu – Siluva premanu chupanu
    Devude deenudai bhuviki digivachhenu – Prematho manishikai rakshananu techhenu / Santosham/

    Bheetini tolaginchanu – Neetini sthaapinchanu
    Devude deenudai bhuviki digivachhenu – Prematho manishikai rakshananu techhenu / Santosham/

    Dosha sikshanu moyanu – Trova siddhamu cheyanu /2/
    Devude deenudai bhuviki digivachhenu – Prematho manishikai rakshananu techhenu / Santosham/

  • Virigina hrudayamuto విరిగిన హృదయముతో

    విరిగిన హృదయముతో నే నిన్ను కొలుతునయ్యా
    నలిగిన హృదయముతో – నీదరి చేరెదనయ్యా
    దేవా యేసయ్యా…. నే నిన్ను కొలుతునయ్యా
    దేవా యేసయ్యా….నా స్తుతులను గైకొనుమా

    మనుగడ లేని నా కొరకు మనుజవతారిగ యేతెంచి
    మాదిరినాకై చూపించి నను చేరదీసినావు
    ఎన్నికలేని నాకొరకు ప్రేమతో ప్రాణము నర్పించి
    రక్షణ మార్గము చూపించి చిరజీవ మిచ్చినావు

    అర్హత లేని నాకొరకు – వెలగల రక్తము చిందించి
    బలిగా ప్రాణము నర్పించి – నను విడిపించినావు
    యోగ్యత లేని నా కొరకు – శ్రమలను సైతం సహియించి
    కృప కనికరములు చూపించి – నను ఆదరించినావు /ఏమి/


    Virigina hrudayamuto – Ne ninnu Kolutunayya
    Naligina Hrudayamuto – Nee daricheredanayya /2/
    Deva Yeasyya.. Ne ninnu kolutunayya
    Deva Yeasyya.. Naa stutulanu gaikonuma /Viri/

    Manugada leni na koraku – Manujavataariga Yetenchi
    Maadiri naakai chupinchi – Nanu cheradeesinaavu
    Ennika leni naa koraku Premato pranamu narpinchi
    Rakshana maargamu chupinchi chirajeevamichhinaavu – Chirajeevamichhinaavu.. /Virigaina/

    Arhata leni naakoraku – Paramunu veedi yetenchi
    Velagala rakthamu chindinchi – Nanu vidipinchinaavu
    Yogyata leni naa koraku – Sramalanu saitam sahiyinchi
    Krupa kanikaramulu chupinchi – Nanu aadarinchinaavu..
    Nanu aadarinchinaavu../Virigina/

  • Vintaina Taaraka వింతైన తారక

    వింతైన తారక వెలసింది గగనాన
    యేసయ్య జన్మ స్థలము – చూపించు కార్యాన /2/
    జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
    దైవమే పంపెనని గ్రహియించు హృదయాన /2/
    మనమంతా జగమంతా తారవలె క్రీస్తుని చాటుదాం
    Happy Christmas – Merry Christmas – We wish you Happy Christmas…

    ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా
    సర్వోన్నతమైన స్థలములలో దేవునికే నిత్య మహిమ /2/
    భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
    ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి /మన/

    ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
    యేసయ్యను దర్శించిరి – ఎంతో విలువైన కానుకలను
    అర్పించి రారాజును పూజించిరి /2/
    హేరోదు పుర జనులకు శుభ వార్త చాటిరి
    అవనిలో వీరును దూతలై నిలిచిరి /మన/


    Vintaina taaraka.. Velisindi gaganaana
    Yesayya janma sthalamu – Choopinchu kaaryaana /2/
    Gnanulake tappaledhu aa taara anusarana
    Daivame pampenani grahiyinchu hrudaayana /2/
    Manamantha..jagamanthaa..
    Taara vale kreesthuni chaatudhaam
    Happy Christmas… – Merry Christmas….
    We wish you happy Christmas….

    Aakaashamantha..aa doothalantha..
    Gonthethi stuthi paadagaa..aa..
    Sarvonnathamaina.. sthalamulalona
    Devunike nithya mahima /2/
    Bhayamutho.. bramalatho – Unna gorrela kaaparulan
    Mudhamutho.. kalisiri – Janana vaartha chaatiri.. /Mana/

    Aa toorpu gnanulu-Aa gorrela kaaparulu
    Yesayyanu darshinchiri
    Entho viluvaina ..Kaanukalanu arpinchi
    Raaraajunu poojinchiri /2/
    Heroduku..pura janulaku
    Shubhavaartha chaatiri
    Avanilo veerunu doothalai nilichiri /Mana/

  • Vinnara janulara విన్నారా జనులారా

    విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త /2/
    యేసయ్య జన్మించాడు – రక్షకుడుదయించి నాడు! /2/
    బేత్లెహేములో పశులపాకలో
    కన్యమరియ – గర్భమందున /2/
    రారాజు జన్మించినాడు మనకై భువికొచ్చినాడు /2/

    “సర్వశక్తిగల యేసుదేవుడు – సమస్తము చేయగల దేవుడు
    పరలోకభాగ్యము వీడి – దీనునిగా భువికొచ్చినాడు” /2/
    పాపమెరుగని పావనాత్ముడు
    పరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడు /2/యేసయ్య/విన్నారా/

    పాపులకై వచ్చిన దేవుడు – ప్రేమించి కరుణించే దేవుడు
    అంధకారమైన జీవితాలకు – వెలుగుగా ఉదయించినాడు
    (మన) పాపదోషము పరిహరింపను – పరిశుద్ధులుగా మనల చేయను /2/యేసయ్య/విన్నారా/


    Vinnaara janulaara – ee vaartha shubha vaartha! /2/
    Yesayya janminchinaadu – Rakshakududayinchinaadu! /2/
    Betlehemulo – pashulapaakalo
    Kanya Mariya – garbhamanduna /2/
    Raaraaju janminchinaadu – manakai bhuvikochhinaadu /2/

    Sarvashakthi gala Yesu devudu – samasthamu cheyagala devudu
    Paraloka bhaagyamu veedi – Deenunigaa bhuvikochhinaadu /2/
    Paapamerugani – paavanaatmudu
    Parishuddhulalo ati sreshtudu /2/Yesayya/vinnara/

    Paapulakai vachhina devudu – preminchi karuninche devudu
    Andhakaaramaina jeevitaalaku – veluguga vudayinchinaadu
    (mana) Paapadoshamu praiharimpanu – Parishuddhuluga manala cheyanu /2/Yesayya/vinnara/

  • Vidudala Vidudala Yesulo Vidudala విడుదల విడుదల – ప్రభు యేసులో విడుదల

    విడుదల విడుదల – ప్రభు యేసులో విడుదల
    విడుదల విడుదల – మన క్రీస్తులో విడుదల /2/

    పాప శాపమంతా మన యేసులో విడుదల
    రోగ దుఃఖమంతా మన క్రీస్తులో విడుదల /2/విడు/

    జీవితకాల వ్యసనం ఇక యేసులో విడుదల
    ఘోరమైన వ్యాధి అది క్రీస్తులో విడుదల /2/విడు/

    భారమైన బ్రతుకా అది యేసులో విడుదల
    చేరలేని గమ్యం అది క్రీస్తులో విడుదల /2/విడు/

    సాధ్యమే సాధ్యమే ప్రభు యేసులో సాధ్యమే
    సాధ్యమే సాధ్యమే మనకన్నియు సాధ్యమే

    మనకన్నియు సాధ్యమే – మనకన్నియు సాధ్యమే…!


    Vidudala Vidudala – Prabhu Yesulo Vidudala
    Vidudala Vidudala – Mana kreestulo Vidudala /2/

    Paapa shaapamanta mana Yesulo vidudala
    Roga dukhamanta mana kreestulo vududala /2/vidu/

    Jeevita kaala vyasanam ika Yesulo Vidudala
    Ghoramaina vyaadhi adi kreestulo vidudala /2/vidu/

    Bhaaramaina bratuka adi Yesulo Vidudala
    Cheraleni gamyam adi kreestulo vidudala /2/vidu/

    Sadhyame sadhyame Prabhu Yesulo sadhyame
    Sadhyame sadhyame manakanniyu sadhyame

    manakanniyu sadhyame.. manakanniyu sadhyame ..!

  • Velegindi gaganam వెలిగింది గగనం

    వెలిగింది గగనం ఒక వింత తారతో
    మురిసింది భువనం ప్రభు యేసు రాకతో /2/
    పులకించె ప్రకృతి-పలికించె ప్రస్తుతి /2/వెలిగింది/
    హ్యేపి హ్యేపి క్రీస్మస్‌-మేర్రీ మేర్రీ క్రిస్మస్‌ /2/

    రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూవికేతెంచెనని
    భూజనులకు బహుమానముగా-ఇలలో జనియించెనని /2/
    పరమ్మోన్నతుని ప్రసన్నత-ఈ జగతిలో నిండెనని /2/
    వరసుతుడేసుని నవ్వుతో పశువుల పాకయే పండెనని /2/వెలిగింది

    దీనులకాచే దైవకుమారుడు పరమును వీడెనని
    ముష్యుకుమారుడై కన్య మరియ ఒడిలో పరుండెనని /2/
    పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని /2/
    కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని /2/వెలిగింది/


    Velegindi gaganam – Oka vinta taarato
    Murisindi bhuvanam – Prabhu yesu raakato /2/
    Pulakinche prakruti – Palikinche prastuti /2/Veligindi/
    happy happy Christmas – Merry Merry Christmas /2/

    Raajula raaju prabhuvula prabhuvu bhuviketenchenani
    Bhujanulaku bahumaanamuga – Ilalo Janiyinchenani /2/
    Pramonnatuni prasannata – Ee jagatilo nindenani /2/
    Varasutudesuni navvuto prashuvula paakaye pandenani /2/Veli/

    Deenulakaache Daivakumaarudu – Paramunu veedenani
    Manushyakumaarudai – Kanya mariya odilo parundenani /2/
    Paapula broche rakshakudu – Yesayyaga vachhenani /2/
    Kaapudalichhe Immanuyelu – Velugunu techhenani /2/Veli/

  • Vandanaalu Vandanaalu varaalu panche వందనాలు వందనాలు వరాలు పంచే

    వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు /2/
    నీ త్యాగ శీలతకు నీ వశమైతినే అతి కాంక్షనీయుడా నా యేసయ్యా /2/వంద/

    ఇహలోక ధననిధులన్ని శాస్వతముకావని ఎరిగితిని /2/
    ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే
    ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి /2/వంద/

    యజమానుడా నీవైపు దాసుడనైన నా కన్నులెత్తగా /2/
    యాజక వస్త్రములతో ననుఅలంకరించి – నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే /2/వంద/

    ఆద్యంతములేని అమరత్వమే నీ స్వంతము /2/
    నీ వారసత్వపు హక్కులన్నియు నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి /2/వంద/


    Vandanaalu Vandanaalu varaalu panche nee guna sampannataku
    Nee tyaagaseelataku nee vasamaitine – ati kaankshaneeyudaa naa yesayyaa /2/vanda/

    Ihaloka dhananidhulanni saaswatamu kaavani yerigitini /2/
    Aatmeeya iswaryam ponduta korake
    Upadeshakramamokati maakichhitivi /2/Vanda/

    Yajamaanuda neevaipu – daasudanaina naa kannulettagaa /2/
    Yaajaka vastramulatho nanu alankarinchi – nee unnata pilupunu sthiraparachitive /2/vanda/

    Aadyantamuleni amaratvame nee swantamu /2/
    nee vaarasatvapu hakkulanniyu naa aajnanu neraverchaga dayachesitivi /2/vanda/

  • Vachhindi vachhindi Christmas aanandam వచ్చింది వచ్చింది క్రిస్మస్ ఆనందం

    వచ్చింది వచ్చింది క్రిస్మస్ ఆనందం – అవధులులేని ఆనందం మనకై తెచ్చింది
    సంతోషం ఉత్సాహం రానేవచ్చింది – యేసు మనలను కాచుటకై క్రిస్మస్ వచ్చింది
    జాలిగానే ఆడిపాడి – బాలయేసుని స్తుతించెదము
    ఒకటిగానే చేరిమనము – క్రిస్మస్ పండుగ చేసెదము /వచ్చింది/

    చల్లటిమంచు కురిసే – యేసు రాజు నిదురించె
    ఆడి పాడి బుజ్జగించ అక్కడికెళదాం రండి
    లోకానికి ఇదియే సంబరమైన నాడు
    దావీదు పురముకే ధన్యత కలిగెను చూడు
    దీనులమైన మనకే – దర్శనమిచ్చెను ఈనాడు /జాలీ/

    అందంగా పుట్టెను నేడు – ఆ బాల యేసుని చూడు
    దీవెన పొందగ నేడే నీవు పరుగిడి చెంతకు రావా /2/
    వరములు ఇచ్చే వరుడు కొలువు తీరినాడు
    పాపులమైన మనకు రక్షణ కలిగిస్తాడు
    ఎనలేని ఆనందం మదిలో నిలిపెను ఈనాడు /జాలీ/


    Vachhindi vachhindi Christmas aanandam – Avadhululeni aanandam manakai tachhindi
    Santosham vutsaaham raanevechhindi – Yesu manalanu kaachutakai Christmas Vachhindi
    Jaaligaane aadipaadi – Baalayesuni stutinchedamu
    Okatigaane cheri manamu – Christmas panduga chesedamu / vachhindi/

    Challati Manchu kurise – Yesu raaju nidurinche
    Aadi padi bujjagincha – Akkadikeladaam randi
    Lokaaniki idiye sambaramaina naadu
    Daavdeedu puramunake dhanyata kaligenu chudu
    Deenulamai manake – Darshanamicheenu eenaadu /jaali/

    Andanga puttenu nedu – Aa baala yesuni choodu
    Deevena pondaga need neevu parugidi chentaku raavaa /2/
    Varamulu ichhe varudu koluvu teerinaadu
    Paapulamaina manaku rakshana kaligistaadu
    Yenaleni aanandam madilona nilipenu eenaadu /jaali/