Category: Telugu Worship Songs Lyrics

  • Avatarinchina deva
    అవతరించిన దేవా

    అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా
    అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా //2//
    నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభో
    క్రీస్తు దేవా మహా రాజా – విస్తార యశశోభిత

    వున్నవాడనేవాడ అన్నీ సృజించినవాడా
    నన్ను మమ్ములనందరిని – మన్నాతో పోషించేవాడా//2//
    మన్నాతో పోషించేవాడా..
    నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభో
    క్రీస్తు నాధా కృపా సింధు- దేవ పుత్ర విమోచక

    కాపరివై కాచేవాడ – పాపము తొలగించేవాడ
    సైతానును జయించినవాడా – మృతులను బ్రతికించేవాడా //2//
    మృతులను బ్రతికించేవాడా..
    నమో నమో నమస్తుభ్యం – నమామి మహా ప్రభో
    రాజ రాజా మహా తేజ – తేజోమయ పరమాత్మ దేవా
    అవతరించిన దేవా ఆద్యంతము లేనివాడా
    అక్షయుడా పాపుల రక్షకుడ విమోచకుడా //2//


    Avatarinchina deva adyantamu lenivaada
    Akshayuda paapula rakshakuda vimochakuda //2//
    Avatarinchina deva adyantamu lenivaada
    Akshayuda paapula rakshakuda vimochakuda //2//
    Namo namo namastubhyam – Namaami mahaprabho
    Kreesthu deva maha raaja – visthaara yasasobhita

    Vunnavaadanevaada – Anne srujinchinavaada
    Nannu mammulanandarini – Mannato poahinchevaada //2//
    Mannato poahinchevaada ..
    Namo namo namastubhyam – Namaami mahaprabho
    Kreesthu naadha krupa Sindhu – Devaputra vimochaka..

    Kaaparivai kaachevaada – Mrutulanu bratikinchevaada
    Saitaanunu jayinchinavaada – Mrutulanu bratikinchevaada //2//
    Mrutulanu bratikinchevaada..
    Namo namo namastubhyam – Namaami mahaprabho
    Raaja raaja maha teja – Tejomaya paramaatma deva

    Avatarinchina deva adyantamu lenivaada
    Akshayuda paapula rakshakuda vimochakuda //2//

  • Atyunnatamainadi Yesu naamam
    అత్యున్నతమైనది యేసునామం

    అత్యున్నతమైనది యేసునామం – యేసునామం (కోరస్)
    అత్యంతశక్తి గలది యేసునామం – యేసునామం (కోరస్)
    ఉన్నత నామం సుందర నామం
    ఉన్నత నామం శ్రీయేసునామం – అన్నినామములకు పైనామం
    పైనామం పైనామం (కోరస్)
    యేసునామం (కోరస్)
    యేసునామం (కోరస్)

    ప్రతిమోకాలు యేసునామంలో నేలవంగును
    ప్రతినాలుకా యేసేదైవమని అంగీకరించును – 2
    పరీశుద్ధ చేతులేత్తి స్తుతుంచి పాడుము
    పరలోక దీవెనలు పోందగ చేరుము (కోరస్)
    హల్లేలూయా – హల్లేలూయా (కోరస్) ॥అత్యున్నత॥

    పరీశుద్ధుడైన యేసునామంలో సాతాను పారిపోవున్
    మృతినే గేల్చిన యేసునామంలో స్వస్ధత దోరుకును – 2
    పరీశుద్ధ చేతులేత్తి స్తుతుంచి పాడుము
    పరలోక దీవెనలు పోందగ చేరుము (కోరస్)
    హల్లేలూయా – హల్లేలూయా (కోరస్) ॥అత్యున్నత॥


    Atyunnatamainadi Yesu naamam – Yesu naamam
    Atyanta shakthi galadi Yesu naamam – Yesu naamam
    Unnata naamam, sundara naamam
    Unnata naamam – Sree Yesu naamam
    Anni naamamulaku painaamam – painaamam – pai naamam
    (Yesu naamam – Yesu naamam)

    Prati mokaalu Yesu naamamlo nela vangunu
    Prati naaluka Yese daivamani angeekarinchunu -2
    (Parishuddha chetuletti stutinchi paadumu
    Paraloka deevenalu pondaga cherumu
    Halleluya – Halleluya ) /Atyunnata/

    Parishuddhudaina Yesu naamamlo saataanu paaripovun
    Mritine gelchina Yesu naamamlo swasthatha dorukunu – 2
    Parishuddha chetuletti stutinchi paadumu
    Paraloka deevenalu pondaga cherumu
    Halleluya – Halleluya ) /Atyunnata/

  • Athyunnatha Maina Shikaraalaku
    అత్యున్నత మైన శిఖరాలకు

    అత్యున్నత మైన శిఖరాలకు – దిన దినము నేను సాగెదన్
    క్రీస్తు యేసులో గొప్ప పర్వతాలపై – ఆశ్రయ దుర్గమందు వర్దిల్లెదను (x2)
    || రాజుల రాజువు||

    రాజుల రాజువు నీవే నన్ను పాలించు వాడవు నీవే (x2)
    హోసన్నా హోసన్నా పాడెదను… (x3) నీకే
    హోసన్నా హోసన్నా పాడెదను… (x3) నీకే

    సర్వసంపదలు గల స్థలమందున – అన్నిటిని సాధించి నిలిచెదను
    జయశాలి యేసుని వెంబడించగ – విశ్వాసముతో నేను జయించెదను (x2)
    || రాజుల రాజువు||


    సైన్యములకు అధిపతి నీవే, నా బలము నీవే, నా జయము నీవే (x2)
    || హోసన్నా ||


    Athyunnatha Maina Shikaraalaku, Dina Dinamu Nenu Saagedhan
    Kristhu Yesu Lo Goppa Parvathaala-Pai, Aasraya Durgamandhu Vardhilledhanu) (X2) ||Rajula||

    Chorus:
    Raajula Rajuvu Neeve, Nannu Paalinchu Vaadavu Neeve (X2)
    Hosanna Hosanna Padedhanu (X3) Neeke
    Hosanna Hosanna Padedhanu (X3) Neeke

    Sarvasampadhalu Gala Sthalamandhuna Annitini Saadhinchi Nilichedhan
    Jayashaali Yesuni Vembadinchaga, Viswasamu Tho Nenu Jayin Chedhanu) (X2) ||Rajula||

    Bridge
    Sainyamu-Laku Adhipathi Neeve, Naa Balamu Neeve, Naa Jayamu Neeve (X2)

    Sainyamu-Laku Adhipathi Neeve, Naa Balamu Neeve, Naa Jayamu Neeve (X2) ||Hosanna||

  • Ascharyakarudu Yesu AlochanaaKartha Yesu
    ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు

    ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త యేసు
    విశ్వాసముంచి ప్రార్ధించిన – అసాధ్యమైనది లేదు /2/

    ఆత్మలో ఆనందం అన్నిటా ఘన విజయం
    శ్రేష్టమైన ప్రతియీవి అనుగ్రహించును మనయేసు /2/ఆశ్చ/

    నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు
    శాశ్వత ప్రేమను చూపే నాధుడు /2/
    ప్రాణం… సర్వం… నా ప్రాణం… నా సర్వం…
    యేసయ్యె యేసయ్యె యేసయ్యె నా యేసయ్యె .. (నా యేసయ్యె )/ఆశ్చ/

    మొదటిగా తన రాజ్యమున్ – నీతిని వెదకువారికి
    అన్నియు సాధ్యమే – ఈ మాట సత్యం /2/
    దేవా నీ ఆత్మను – నా దేవా నీ ఆత్మను
    మాకిచ్చి బలపర్చి దీవించి నడిపించు /ఆశ్చర్య/



    Ascharyakarudu Yesu- Alochanaa Kartha Yesu
    Viswasamunchi Prardinchina – Asadhyamaindi Ledu../2/

    Aathmalao Aanandam – Annita Ghana Vijayam
    Shrestamaina Prathi Eevi – Anugrahinchunu Mana Yesu…/2/Ascha/

    Ninna Nedu Nirathamu – Yekarithiga Unna Vaadu
    Shaswatha Premanu-Chooope Naadhudu /2/
    Praanam..Sarvam…- Na Praanam..Na Sarvam..
    Yesayye..Yesayye -Yesayye..Naa Yesayye( Naa Yesayye ) /Aschar/

    Modhatiga Thana Rajyamu – Neethini Vedakuvariki
    Anniyu Sadhyame..Ee Maata Satyam /2/
    Devaa..Nee Athmanu – Naa Devaa..Nee Athmanu
    Maakichi ..Balaparachi – Deevinchi Nadipinchu.. /Aschar/

  • Arhudavu arhudavu gorrepillaa
    అర్హుడవు అర్హుడవు గొఱ్ఱెపిల్లా

    అర్హుడవు, అర్హుడవు, గొఱ్ఱెపిల్లా నీవు యోగ్యుడవు
    రక్తమిచ్చి, ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు
    అర్హుడవు, అర్హుడవు, గొఱ్ఱెపిల్లా నీవు యోగ్యుడవు
    మహిమయు, ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు
    ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల – ఇవేగా మా కృతజ్ఙతస్తుతులు

    పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి
    సిలువశక్తితోనే నూతన జీవులుగమార్చెను

    దేవుని ప్రేమ విస్తరించగా కృపావరమునే దానముగా
    యేసుక్రీస్తులోనే నీతిమంతులుగ మార్చెను నా యేసుక్రీస్తులోనే


    Arhudavu, arhudavu, gorrepillaa neevu yogyudavu
    raktamichchi, praaNamichchi needu prajalanu koninaavu
    arhuDavu, arhuDavu, gorrepillaa neevu yoegyuDavu
    mahimayu, ghanatayu neekea chellunu ellappuDu
    idigoe deavuni gorrepilla – iveagaa maa krutagnyatastutulu

    paapamunamtaa poegotti praacheena svabhaavamu tolagimchi
    siluvaSaktitoenea nuutana jeevulugamaarchenu

    deavuni preama vistarimchagaa krupaavaramunea daanamugaa
    yeasukreestulonea neetimamtuluga maarchenu naa yeasukreestuloenea

  • Yepati dhananaya
    ఏపాటిదాననయా

    ఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకు
    నేనెంతటిదాననయా – నాపై కృప చూపుటకు(2)
    నా దోషము భరియించి – నా పాపము క్షమియించి
    నను నీలా మార్చుటకు – కలువరిలో మరణించి

    ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి
    కృపచూపు కృపగల దేవా – నీ కృపకు సాటియేది || ఏపాటి ||

    కష్టాల కడలిలో – కన్నీటి లోయలలో
    నా తోడు నిలిచావు – నన్నాదరించావు(2)
    అందరు నను విడచిన – నను విడువని యేసయ్యా
    విడువను ఎడబాయనని – నా తోడై నిలిచితివా || ప్రేమించే ||

    నీ ప్రేమను మరువలేనయ్య – నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
    నేనొందిన నీ కృపను – ప్రకటింతును బ్రతుకంతా(2)
    నేనొందిన ఈ జయము – నీవిచ్చినదేనయ్య
    నీవిచ్చిన జీవముకై – స్తోత్రము యేసయ్య || ప్రేమించే ||


    Yepati dhananaya – nanninthaga hechinchutaku
    nenenthati dhananayaa – naapai krupa chooputaku(2)
    naa dhoshamu bariyinchi – naa paapamu kshamiyinchi
    nanu neela maarchutaku – kaluvarilo maraninchi

    Preminchey Premaamayuda – nee premaku parimithulevi
    krupachoopu krupagala deva – nee krupaku saati yedi || Yepati ||

    Kastaala kadalilo – kanniti loyalalo
    naa thodu nilichaavu – nannaadarinchaavu(2)
    andaru nanu vidachina – nanu viduvani Yesayyaa
    viduvanu edabaayanani – naa thodai nilichitivaa || Preminchey ||

    Nee premanu maruvalenayya – nee saakshiga brathikedanesayyaa
    nenondina nee krupanu – prakatinthunu brathukantha (2)
    nenondina ee jayamu – neevichinadenayya
    neevichchina jeevamukai – sthothramu Yesayya || Preminchey ||

  • Neevu Chesina Mellaku
    నీవు చేసిన మేళ్ళకు

    నీవు చేసిన మేళ్ళకు
    నీవు చూపిన కృపలకు (2)
    వందనం యేసయ్యా (4)

    ఏపాటివాడనని నేను
    నన్నెంతగానో ప్రేమించావు
    అంచెలంచెలుగా హెచ్చించి
    నన్నెంతగానో దీవించావు (2)
    వందనం యేసయ్యా (4)

    బలహీనుడనైన నన్ను
    నీవెంతగానో బలపరచావు
    క్రీస్తేసు మహిమైశ్వర్యములో
    ప్రతి అవసరమును తీర్చావు (2)
    వందనం యేసయ్యా (4)


    Neevu Chesina Mellaku
    Neevu Choopina Krupalaku (2)
    Vandanam Yesayyaa
    Vandanam Yesayyaa
    Vandanam Yesayyaa
    Vandanam Yesayyaa

    Yepativaadanani Nenu
    Nannenthagaano Preminchaavu
    Anchelanchelugaa Hechchinchi
    Nannenthagaano Deevinchaavu (2)
    Vandanam Yesayyaa
    Vandanam Yesayyaa
    Vandanam Yesayyaa
    Vandanam Yesayyaa

    Balaheenudanaina Nannu
    Neeventhagaano Balaparachaavu
    Kreesthesu Mahimaishwaryamulo
    Prathi Avasaramunu Theerchaavu (2)
    Vandanam Yesayyaa
    Vandanam Yesayyaa
    Vandanam Yesayyaa
    Vandanam Yesayyaa

  • Samaadhini Gelchenu
    సమాధిని గెల్చెను

    సమాధిని గెల్చెను – సజీవుడై లేచెను
    సాతానుని జయించెను – మరణపు ముల్లును విరిచెను (2)

    క్రీస్తు లేచెను హల్లేలూయ క్రీస్తు నేడు లేచెను
    క్రీస్తు లేచెను హల్లేలూయ పునరుద్ధానుడై లేచెను

    కలువరిగిరిలో సిలువొందెను – తన రక్తమును చిందించెను
    పాప క్షమాపణ మనకిచ్చెను – బహు వేదననే తను పొందెను (2)
    బహు వేదననే తను పొందెను ||క్రీస్తు లేచెను||

    మరణమా నీ ముల్లెక్కడా! మరణమా నీ జయమెక్కడ
    మరణమా నీ ముల్లు విరిగెను – లేఖనములు నెరవేరెను (2)
    లేఖనములు నెరవేరెను ||క్రీస్తు లేచెను||



    Samaadhini Gelchenu – sajeevudai lechenu
    saathanuni jayinchenu – maranapu mullunu virichenu (2)

    Kreesthu lechenu hallelujah kreesthu nedu lechenu
    Kreesthu lechenu hallelujah punaruddhanudai lechenu

    Kaluvarigirilo siluvondhenu – thana rakthamunu chindinchenu
    paapa kshamaapana manakichenu – bahu vedhanane thanu pondhenu (2)
    bahu vedhanane thanu pondhenu ||Kreesthu||

    Maranamaa nee mullekkada! maranamaa nee jayamekkada
    maranamaa nee mullu virigenu – lekanamulu neraverenu (2)
    lekanamulu neraverenu ||Kreesthu||

  • Preme Jagathiki Moolam
    ప్రేమే జగతికి మూలం

    ప్రేమే జగతికి మూలం
    ప్రేమే దైవ స్వరూపం
    ప్రేమే నిత్య జీవం
    ఆ ప్రేమే మోక్ష మార్గం

    ప్రేమే జగతికి మూలం
    ప్రేమే దైవ స్వరూపం
    ప్రేమే నిత్య జీవం
    ఆ ప్రేమే మోక్ష మార్గం

    అమర్యాదగా నడువనిది
    అపకారం చేయనిది
    అన్నిటిని ఒర్చునది
    అన్నిటికి తాలునది
    స్వప్రయోజనము చూచుకొననిది
    సత్వరమే కోపపడనిది
    మత్సర పడనిది
    డంభములేనిది
    ఉప్పొంగనిది ప్రేమ ఒక్కటే

    ప్రేమే జగతికి మూలం
    ప్రేమే దైవ స్వరూపం
    ప్రేమే నిత్య జీవం
    ఆ ప్రేమే మోక్ష మార్గం

    దేవుడు మనుజుల ప్రేమించి
    తానే మనిషిగా పుట్టాడు
    పాపుల రక్షణ పరమార్ధముగా
    సిలువ మ్రానుపై బలియైనాడు
    మనలో మనము ఒకరికొకరము
    ప్రేమ కలిగి జీవించాలి
    ప్రేమను మించిన పెన్నిధి లేదని
    జగమంతా చాటించాలి

    ప్రేమే జగతికి మూలం
    ప్రేమే దైవ స్వరూపం
    ప్రేమే నిత్య జీవం
    ఆ ప్రేమే మోక్ష మార్గం
    ఆ.. ప్రేమే మోక్ష మార్గం
    ఆ… ప్రేమే మోక్ష మార్గం


    Preme Jagathiki Moolam
    Preme Dhaiva swaroopam
    Preme nithya Jeevam
    aa Preme moksha maargam

    Preme Jagathiki moolam
    Preme dhaiva swaroopam
    Preme nithya Jeevam
    aah Preme moksha maargam

    Amaryadhaga naduvanidhi
    apakaaram cheyanidhi
    annitini Oruchunadhi
    annitiki thaalunadhi
    swaprayojanam chuchukonanidhi
    satwarame Kopapadanidhi
    mathsara padanidhi
    dambhamulenidhi
    upponganidhi prema okkate

    Preme Jagathiki moolam
    Preme Dhaiva swaroopam
    Preme nithya Jeevam
    aa Preme moksha maargam

    Devudu manujula Preminchi
    thaane manishiga puttaadu
    paapula rakshana Paramaardhamuga
    siluva mraanupai bhaliainaadu
    manalo manamu okarikokaramu
    prema kaligi jeevinchaali
    premanu minchina pennidhi ledhani
    jagamantha chaatinchaali

    Preme Jagathiki moolam
    Preme Dhaiva swaroopam
    Preme nithya Jeevam
    aa Preme moksha maargam
    aa Preme moksha maargam
    aa Preme moksha maargamm….

  • Prematho nanu thaakina
    ప్రేమతో నను తాకిన

    ప్రేమతో నను తాకిన – మెల్లగా ఎద మీటినా – వరమే నీవు యేసు
    నీడలా వెంటాడినా – విడువక నను కాపాడినా – నీవే నాలో సాంత్వన (2)

    ఓడిన తావున – తిరిగి లేపి నిలిపిన
    ఓడిన తావున – తిరిగి లేపి నిలిపిన
    వాక్కునే పంపినా- బలముతో నింపినా – నీవే నాకు ప్రేరణ ||ప్రేమతో ||

    విసిగిన ప్రాణము – శిధిలమగుట ఖాయమూ
    విసిగిన ప్రాణము – శిధిలమగుట ఖాయమూ
    క్షేమమే పంచినా – వెలుగుగా ఉంచినా – నీవే నాలో నిరీక్షణ ||ప్రేమతో ||


    Prematho nanu thaakina-Mellagaa yeda meetina-varame neevu yesu
    needala ventaadina-Viduvaka nannu kaapaadina-Neeve naalo saanthwana (2)

    Oodina thaavuna-thriigi lepi nilipina
    Oodina thaavuna-thriigi lepi nilipina
    Vaakkune pampina-balamutho nimpina-Neeve naaku preranaa ||Prematho||

    Visigina praanamu-sidhilamagutaa kaayamu
    visigina praanamu-sidhilamagutaa kaayamu
    Kshemame panchina-veluguga vunchina-neve naaku nireekshana ||Prematho||