Category: Telugu Worship Songs Lyrics

  • Hrudayame nee aalayam
    హృదయమే నీ ఆలయం

    హృదయమే నీ ఆలయం క్రీస్తు
    నీ నామమే నా గానం
    విదితము కాదే ఇలలో ఎవరికీ
    వివరింపగా నీ పవన రూపం
    హృదయమే నీ ఆలయం క్రీస్తు

    మనిషి మనిషిగా బ్రతకాలని
    మంచిని మనసున పెంచాలని
    సిలువలో నీవు మరణించి (2)
    మృత్యువునే నీవు ఎదురించి
    వెలసిన దేవుడా నీవే
    పాపుల రక్షణ నీవే ( హృదయమే)

    కారు చీకటిలో కాంతి రేఖవై
    మూగ గుండెల్లో దివ్య వాణివై
    దీనులనే నీవు కరుణించి(2)
    వేదనలే నీవు తరలించి
    పరమున చేరిన దేవా
    శరణు శరణు ఓ ప్రభువా (హృదయమే)


    Hrudayame nee aalayam kreesthu
    nee namame naa gaanam
    vidhithamu kaadhe ilalo evariki
    vivarinchaga nee paavana roopam
    Hrudayame nee aalyam kreesthu

    Manishi manishiga brathakalani
    manchini manasulo penchalani
    siluvalo neeve maraninchi (2)
    Mruthyuvu ne neevu yedurinchi
    velasina devida neeve paapula rakshana neeve ( Hrudayame)

    Kaaru cheekatilo kaanthi rekhavai
    mooga gundelo dhivya vanivai
    deenulane neevu karuninchi(2)
    vedhanle neevu Tharalinchi
    Vanamunu cherina devaa
    saranu saranu oh prabhuva

  • Gethsemane thotalo
    గెత్సేమనే తోటలో

    గెత్సేమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా…(2)
    ఆ ప్రార్ధనే మాకునిలా రక్షణను కలిగించెను
    ఓ.. ఓ…. ఓ… ఓ…. ||గెత్సేమనే||

    నీ చిత్తమైతే ఈ గిన్నెను – నా యొద్దనుండి తొలగించుమని (2)
    దుఃఖముతో భారముతో – ప్రార్ధించితివా తండ్రి (2) ||గెత్సేమనే||

    నీ వాక్యమే మాకునిలా – నిరీక్షణ భాగ్యంబు కలిగించెను (2)
    నీ సిలువే మాకు శరణం – నిన్న నేడు రేపు మాపు (2) ||గెత్సేమనే||


    Gethsemane thotalo praardhimpa nerpithivaa…(2)
    aa praardhane maakunilaa rakshananu kalginchenu
    Oh… Ho…. Ho…Oh.. Ho.. Ho…. ||Gethsemane||

    Nee chithamaithe ee ginnenu – naa yodhanundi tholaginchumani (2)
    dukkhamutho bhaaramutho – praardhinchitivaa Thandri (2)
    ||Gethsemane||

    Nee Vakyame maakunilaa – nireekshana bhaagyambu Kaliginchenu(2)
    nee siluve maaku Sharanam – ninna nedu repu maapu (2)
    ||Gethsemane||

  • Gathakaalamantha Nee needalona
    గతకాలమంత నీ నీడలోన

    గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం
    కృప చూపినావు -కాపాడినావు
    ఎలా తీర్చగలను నీ ఋణం
    పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2)
    వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||

    ఎన్నెనో అవమానాలెదురైనను
    నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
    ఇక్కట్లతో నేను కృంగినను
    నీ చేయి నను తాకి లేపెనయ్యా
    నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
    నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
    వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||

    మాటలే ముల్లుగా మారిన వేళ
    నీ మాట నన్ను పలకరించేనాయ
    నిందలతో నేను నిండిన వేళ
    నీ దక్షిణ హస్తం నన్నుతాకేనాయ
    నీ మాట చక్కటి జీవపు ఊట
    మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
    వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||
    వందనం యేసయ్య-విభుడవు నీవయ్యా (2)


    Gathakaalamantha Nee needalona – dachavu Deva Vandhanam
    Krupa choopinavu -kaapadinaavu
    Ela tircha galanu ni runam
    Paadana ni keerthana-Pogadana venollana
    Vandhanam Yesayya-Ghanudavu nivayya (2) ||Gathakalamantha||

    Enneno avamaanal edurinanu
    Ni prema nannu vidachi poledayya
    Ikkatlatho nenu krunginanu
    ni cheyi nanu thaaki lepenaya
    Nijamina ni prema nishkalankamu
    Nivichu hasthamu nindu dhiryamu (2)
    Vandhanam Yesayya-Ghanudavu nivayya (2) ||Gathakalamantha||

    Maatale mulluga maarina Vela
    Ni maata nannu palakarinchenaya
    Nindhalatho nenu nindina Vela
    ni dakshina hastham nannu thakenaya
    Nee maata chakkati jeevapu oota
    Maruvanennadu ninnu sthuthiyinchuta (2)
    Vandhanam Yesayya-Ghanudavu nivayya (2) ||Gathakalamantha||

  • Hallelooya Sthothram Yesayyaa
    హల్లెలూయా స్తోత్రం యేసయ్యా

    హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)
    గడచిన కాలం కృపలో మమ్ము
    దాచిన దేవా నీకే స్తోత్రము
    పగలూ రేయి కనుపాపవలె
    కాచిన దేవా నీకే స్తోత్రము (2)
    మము దాచిన దేవా నీకే స్తోత్రము
    కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||

    కలత చెందిన కష్టకాలమున
    కన్న తండ్రివై నను ఆదరించిన
    కలుషము నాలో కానవచ్చినా
    కాదనక నను కరుణించిన (2)
    కరుణించిన దేవా నీకే స్తోత్రము
    కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||

    లోపములెన్నో దాగి ఉన్నను
    ధాతృత్వముతో నను నడిపించినా
    అవిధేయతలే ఆవరించినా
    దీవెనలెన్నో దయచేసిన (2)
    దీవించిన దేవా నీకే స్తోత్రము
    దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన||



    Hallelooya Sthothram Yesayyaa (2)
    Gadachina Kaalam Krupalo Mammu
    Daachina Devaa Neeke Sthothramu
    Pagaloo Reyi Kanupaapavale
    Kaachina Devaa Neeke Sthothramu (2)
    Mamu Daachina Devaa Neeke Sthothramu
    Kaapaadina Devaa Neeke Sthothramu (2) ||Gadachina||

    Kalatha Chendina Kashtakaalamuna
    Kanna Thandrivai Nanu Aadarinchina
    Kalushamu Naalo Kaanavachchinaa
    Kaadanaka Nanu Karuninchina (2)
    Karuninchina Devaa Neeke Sthothramu
    Kaapaadina Devaa Neeke Sthothramu (2) ||Gadachina||

    Lopamulenno Daagi Unnanu
    Dhaathruthvamutho Nanu Nadipinchinaa
    Avidheyathale Aavarinchinaa
    Deevenalenno Dayachesinaa (2)
    Deevinchina Devaa Neeke Sthothramu
    Dayachoopina Thandri Neeke Sthothramu (2) ||Gadachina||

  • Deva Nannela Vidichinavaya
    దేవా నన్నేల విడిచినావయా

    దేవా నన్నేల విడిచినావయా
    దేవా నన్నేల మరిచినావయా
    దీనుడను నేను దిక్కులేని వాడను
    దయచూపి ఆదుకొనుమయా
    అల్పుడను నేను అనాదను నేను
    దరిచేరి ఆదరించుమయా

    దేవా.. నా దేవా
    నా యేసయ్యా(2)

    ఎన్నో ఆశలతో జీవించుచుండగా
    అంతా నా వారేనని నమ్మియుండగా(2)
    ప్రేమించినవారే నను మోసగించి
    నే నమ్మినవారే నా చేయి విడిచి(2)
    ఒంటరిగా చీకటిలో నిలిచియుంటిని(2)

    దేవా.. నా దేవా
    నా యేసయ్యా(2)

    నా జీవితం సుడిగుండాల వలయం
    ఊహించని మలుపులే నిత్య ప్రాప్తం(2)
    అనుకున్నవి జరగకా అనుకోనివి జరుగుతు
    అందరు విడిచిన అనాదనైతిని(2)
    చావలేక బ్రతకలేక కుములుచుంటిని(2)

    దేవా.. నా దేవా
    నా యేసయ్యా(2)

    దేవా నీకై జీవింతును
    నా దేవ నీకై సాక్షినౌదును
    దయ చూపి ఆదుకొనుమయా
    దేవా నీకై జీవింతును
    దేవ నీకై సాక్షినౌదును(2)
    చేయి చాపి ఆదరించుమయా


    Deva Nannela Vidichinavaya Christian Song Lyrics in English
    Deva nannela vidichinavayaa
    Deva nannela marichinaavayaa
    dheenudanu nenu dikkuleni vaadanu
    dayachoopi aadukonumayaa
    alpudanu nenu anaadhanu nenu
    daricheri aadarinchumayaa

    Devaa.. naa Devaa
    naa Yesayyaa(2)

    Enno aasalatho jeevinchuchundagaa
    anthaa naa vaarenani nammiyundagaa(2)
    preminchinavaare nanu mosaginchi
    ne namminavaare naa cheyi vidichi(2)
    ontariga cheekatilo nilichiyuntini

    Devaa.. naa Devaa
    naa Yesayyaa(2)

    Naa jeevitham sudigundaala valayam
    oohinchani malupule nithya praaptham(2)
    anukunnavi jaragakaa anukonivi jaruguthu
    andharu vidichina anaadhanaithini(2)
    chaavaleka brathakaleka kumuluchuntini

    Devaa neekai jeevinthunu
    naa deva neekai saakshinoudhunu
    daya choopi aadukonumayaa
    devaa neekai jeevinthunu
    naa deva neekai saakshinoudhunu(2)
    cheyi chaapi aadarinchumaya

  • Daahamu gonnavaaralaaraa
    దాహము గొన్నవారలారా

    దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండి
    దేవుడేసే జీవజలము – త్రాగ రారండి
    హల్లేలూయ దేవుడేసే జీవజలము త్రాగ రారండి

    జీవ జలము శ్రీ యేసుక్రీస్తు జీవపు ఊటలు ప్రవహింప జేయున్‌
    జలము పొంది – జీవము నొంద జలనిధి చేరండి ||దేవుడేసే||

    నేనిచ్చు నీరు త్రాగెడివారు ఎన్నటికిని దాహముగొనరు
    అని సెలవిచ్చిన ప్రభు యేసు క్రీస్తు చెంతకు చేరండి ||దేవుడేసే||

    తన పాపములను ఎరిగినవాడు తండ్రి క్షమాపణ కోరినవాడు
    తప్పక పొందును జీవజలము త్వరపడి పరుగిడి రండి ||దేవుడేసే||


    Daahamu gonnavaaralaaraa daahamu teerchukonandi
    devudese jeevajalamu – traaga raarandi
    hallelujah (hallaelooya) Devudese jeevajalamu traaga raarandi

    Jeeva jalamu Sree Yesukreestu jeevapu Vutalu pravahimpa jeyunn
    jalamu pondhi – jeevamu nondha jalanidhi cherandi ||Devudese||

    Nenichchu neeru traagedivaaru ennatikini daahamugonaru
    ani selavichchina Prabhu Yesu kreestu chenthaku cherandi ||Devudese||

    Thana paapamulanu eriginavaadu tandri kshamaapana korinavaadu
    thappaka pondunu jeevajalamu tvarapadi parugidi randi ||Devudese||

  • chirakala sneham nee prema
    చిరకాల స్నేహం నీప్రేమ

    చిరకాల స్నేహం – నీప్రేమ చరితం – చిగురించే నాకొసమే (2)
    నీపై నా ధ్యానం – నాకై నీ త్యాగం – వింతైన సందేశమే
    చిరకాల స్నేహం – నీప్రేమ చరితం – చిగురించే నాకొసమే (2)

    కలలుకన్న ప్రేమలన్ని నిలిచిపోయే మౌనమై (2)
    నేను నీకు భారమైన దూరమైన వేళలో
    నీవే నాకు చేరువై చేరదీసినావయా
    ఎంత ప్రేమ యేసయ్యా ||చిరకాల||

    గాలిమేడ నీడ చెదరి కృంగిపోయే నామది (2)
    సంధ్యవేల వెలుగు మరుగై ఒంటరైన వేళలో
    దరికిచేరి దారి చూపి ధైర్యపరచినావయా
    తోడు నీవే యేసయ్యా || చిరకాల||

    మధురమైన ప్రేమలోన విలువకలిగె‌ సిలువకు (2)
    శిలగ నేను నిన్ను చేర నీదురూపుకలిగెను
    శ్రేష్ఠమైన స్వాస్థ్యమoదు నన్ను నిలిపినావయా
    నిలిపినావు యేసయ్యా ||చిరకాల||



    chirakala sneham – nee prema charitam – chigurinche naakosame (2)
    neepai naa dhyaanam – naakai nee thyaagam – vintaina sandesame
    chirakaala sneham – nee prema charitam – chigurinche naakosame (2)

    Kalalukanna premalanni nilichipoye mounamai (2)
    nenu neeku bhaaramaina dooramaina velalo
    neeve naaku cheruvai cheradeesinaavayaa
    entha prema Yesayyaa ||chirakaala||

    Gaalimeda needa chedari krungipoye naa madi (2)
    sandhyavela velugu marugai ontaraina velalo
    darikicheri daari choopi dhairyaparachinaavayaa
    thodu neeve Yesayyaa || chirakaala||

    Madhuramaina premalona viluva kalige‌ siluvaku (2)
    Silaga nenu ninnu chera needu roopu kaligenu
    Sreshtamaina svaasthyamandhu nannu nilipinaavayaa
    nilipinaavu Yesayyaa ||chirakaala||

  • Nee rekkala chaatuna
    నీ రెక్కల చాటున

    నీ రెక్కల చాటున
    నను దాచిన నా ప్రభు
    నీ చేతుల మీదను
    నను మోసిన దైవమా

    మనుషులు ఎదురు తిరిగిన
    మనసు చెదిరిపోయిన
    నీవే ఆదారము
    నీలోన ఆశ్రయం

    అలలు నాపై లేచినా
    ఆకాశమే ఉరిమినా
    నే అదరను, నే బెదరను
    నీవు నాకుండగా||2||

    మనుషులు ఎదురు తిరిగిన
    మనసు చెదిరిపోయిన
    నీవే ఆదారము
    నీలోన ఆశ్రయం

    అలలు నాపై లేచినా
    ఆకాశమే ఉరిమినా
    నే అదరను, నే బెదరను
    నీవు నాకుండగా||4||

    నీవే సర్వాధికారివి
    నీవే సాటిలేనివాడివి
    నీవే సర్వ సృష్టికర్తవు
    నీవే సర్వోన్నతుడు||2||

    అలలు నాపై లేచినా
    ఆకాశమే ఉరిమినా
    నే అదరను, నే బెదరను
    నీవు నాకుండగా


    Nee rekkala chaatuna
    nanu daachina naa Prabhu
    nee chethula meedhanu
    nanu mosina daivamaa

    Manushulu eduru thirigina
    manasu chedhiripoyina
    neeve aadhaaramu
    neelona aashrayam

    Alalu naapai lechinaa
    aakaasame uriminaa
    ne adharanu, ne bedharanu
    neevu naakundagaa||2||

    Manushulu eduru thirigina
    manasu chedhiripoyina
    neeve aadhaaramu
    neelona aashrayam

    Alalu naapai lechinaa
    aakaasame uriminaa
    ne adharanu, ne bedharanu
    neevu naakundagaa||4||

    Neeve sarvaadhikaarivi
    neeve saatilenivaadivi
    neeve sarvasrushtikarthavu
    neeve sarvonnathudu||2||

    Alalu naapai lechinaa
    aakaasame uriminaa
    ne adharanu, ne bedharanu
    neevu naakundagaa

  • Alochinachava Oo Nestam
    ఆలోచి౦చావ ఓ నేస్తం

    ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ
    ఏ సమయంలో ఏమవుతుందో –అని ఆలోచి౦చావ
    ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ
    ఏ సమయంలో ప్రభు పిలుపు౦దో – అని ఎవరికి తెలియదుగా
    ఈ సమయమ౦దే అ౦తా – కనుమరుగైపోతే
    ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ
    ఈ సమయమ౦దే అ౦తా – విడిచి వెళ్ళ వస్తే
    ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ ॥ఆలోచి౦చావ॥

    ఏదేదో అనుకుంటాము – ఏవేవో కలగ౦టాము
    వ్యర్థమైన లోకాశలకు – లోబడుతూ ఉ౦టాము ॥2॥
    ప్రభు నిన్ను చూచుచున్నాడని,
    తన ప్రేమతో పిలచుచున్నాడని,
    తెలిసి కూడా ఎ౦తో నిర్లక్ష్యం ..!
    మేలుకో….. సోదరా ..!
    రానైయు౦దిగా – ప్రభు రాకడ
    మేలుకో ….. సోదరీ ..!
    రానైయు౦దిగా – ప్రభు రాకడ ॥ఆలోచి౦చావ॥

    అన్నీ తెలుసనుకు౦టాము – నాకేదీ కాద౦టాము
    తెలియకు౦డా సాతానుచే – మోసపోతూ ఉ౦టాము ॥2॥
    ప్రభు నిన్ను చూచుచున్నాడని,
    తన ప్రేమతో పిలచుచున్నాడని,
    తెలిసి కూడా ఎ౦తో నిర్లక్ష్యం ..!
    మేలుకో ….. సోదరా ..!
    రానైయు౦దిగా – ప్రభు రాకడ
    మేలుకో ….. సోదరీ ..!
    రానైయు౦దిగా – ప్రభు రాకడ ॥ఆలోచి౦చావ॥


    Alochinachava Oo Nestam Alochinchava
    Ae samayam lo emavutundo ani alochinchava
    Alochinachava Oo Nestam Alochinchava
    Ae samayam lo Prabhu Pilupundho ani evariki teliyaduga
    Ee samayamandhe antha Kanumarugaipothe
    Ae chotiki neevu velthavo ani alochinchava
    Ee samayamandhe antha vidichi vellavaste
    Ae chotiki neevu velthavo ani alochinchava ||Alochinchava||

    Ededo anukuntamu-evevo kalagantamu
    vyardhamaina lokashalaku-lobadutu vuntamu (2)
    Prabhu ninnu chuchuchunnadani
    thana prematho pilachuchunnadani
    telisi kuda entho nirlakshyam
    Melukoo oo sodhara
    ranaiyundiga Prabhu raakada
    Melukoo oo sodhari
    ranaiyundiga Prabhu raakada ||Alochinchava||

    Anni telusanukuntamu-naakedi kaadhantamu
    teliyakunda saatanuche-mosapothu vuntamu (2)
    Prabhu ninnu chuchuchunnadani
    thana prematho pilachuchunnadani
    telisi kuda entho nirlakshyam
    Melukoo oo sodhara
    ranaiyundiga Prabhu raakada
    Melukoo oo sodhari
    ranaiyundiga Prabhu raakada ||Alochinchava||

  • Aakashaana Thaara Okati
    ఆకశాన తార ఒకటి

    ఆకశాన తార ఒకటి వెలసింది
    ఉదయించెను రక్షకుడని తెలిపింది (2)
    ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
    మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ||ఆకాశాన||

    యూద దేశపు బెత్లెహేములో
    కన్య మరియ గర్బమున జన్మించె
    తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు
    యూదుల రాజు ఎక్కడని వెతికారు
    తూరుపు దిక్కున చుక్కను కనుగొని
    ఆనందభరితులై యేసుని చేరిరి
    కానుకలిచ్చిరి పూజించిరి ||ఇదే||

    రాత్రివేళలో మంద కాసెడి
    కాపరులకు ప్రభువు దూత ప్రకటించే
    లోక ప్రజలకు మిగుల సంతసం
    కలిగించెడి వర్తమానమందించే
    క్రీస్తే శిశువుగా యేసుని పేరట
    ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా
    సంతోషగానముతో స్తుతియింతుము ||ఇదే||


    Aakashaana Thaara Okati Velasindi
    Udayinchenu Rakshakudani Thelipindi (2)
    Ide Christmas – Happy Happy Christmas
    Merry Merry Christmas – Happy Christmas ||Aakashaana||

    Yooda Deshapu Bethlehemulo
    Kanya Mariya Garbhamuna Janminche
    Thoorpu Deshapu Goppa Gnaanulu
    Yoodula Raaju Ekkadani Vethikaaru
    Thoorupu Dikkuna Chukkanu Kanugoni
    Aanandbharithulai Yesuni Cheriri
    Kaanukalichchiri Poojinchiri ||Ide||

    Raathri Velalo Manda Kaasedi
    Kaaparulaku Prabhuvu Dootha Prakatinche
    Loka Prajalaku Migula Santhasam
    Kaliginchedi Varthamaanamandinche
    Kreesthe Shishuvugaa Yesuni Perata
    Mukthini Goorchedi Rakshakudaayegaa
    Santhosha Gaanamutho Sthuthiyinthumu ||Ide||