Category: Telugu Worship Songs Lyrics

  • Ninupolina varevaru
    నినుపోలిన వారెవరు

    నినుపోలిన వారెవరు
    మేలుచేయు దేవుడవు
    నిన్నే నే నమ్మితిన్ నా దేవా(2)

    నిన్నే నా జీవితమునకు
    ఆధారము చేసికొంటిని
    నీవులేని జీవితమంత
    వ్యర్దముగా పోవునయ్య(2)

    ఎల్ షద్దాయి! ఆరాధన
    ఏలోహిం! ఆరాధన
    అడోనాయ్! ఆరాధన
    యేషువ! ఆరాధన(2)

    కృంగిఉన్న నన్ను చూచి
    కన్నీటిని తుడిచితివయ్య
    కంటిపాప వలె కాచి
    కరుణతో నడిపితివయ్య(2)

    ఎల్ షద్దాయి! ఆరాధన
    ఏలోహిం! ఆరాధన
    అడోనాయ్! ఆరాధన
    యేషువ! ఆరాధన(2)

    మరణపు మార్గమందు
    నడచిన వేలయందు
    వైద్యునిగా వచ్చి నాకు
    మరో జన్మనిచ్చితివయ్య(2)

    ఎల్ షద్దాయి! ఆరాధన
    ఏలోహిం! ఆరాధన
    అడోనాయ్! ఆరాధన
    యేషువ! ఆరాధన(2)

    ఎల్ షద్దాయి! నీకే ఆరాధన
    ఏలోహిం! ఆరాధన
    అడోనాయ్! ఆరాధన
    యేషువ! యేషువ!

    ఎల్ షద్దాయి! ఆరాధన
    ఏలోహిం! ఆరాధన
    అడోనాయ్! అడోనాయ్!
    అడోనాయ్! ఆరాధన



    Ninupolina varevaru
    melucheyu dhevudavu
    ninne ne nammithin naa Devaa(2)

    ninne naa jeevithamunaku
    aadhaaramu chesikontini
    neevulani jeevithamantha
    vyardamugaa povunayya(2)

    El Shaddai! aradhana
    Elohim! aradhana
    Adonai! aradhana
    Yeshua! aradhana(2)

    Krungiunna nannu choochi
    kannitini tudichithivayya
    kantipaapa vale kaachi
    karunatho nadipithivayya(2)

    El Shaddai! aradhana
    Elohim! aradhana
    Adonai! aradhana
    Yeshua! aradhana(2)

    Maranapu maargamandu
    nadachina velayandu
    vaidyunigaa vachi naaku
    maro janmanichithivayya(2)

    El Shaddai! aradhana
    Elohim! aradhana
    Adonai! aradhana
    Yeshua! aradhana(2)

    El Shaddai! neeke aradhana
    Elohim! aradhana
    Adonai! aradhana
    Yeshua! Yeshua!

    El Shaddai! aradhana
    Elohim! aradhana
    Adonai! Adonai!
    Adonai! aradhana

  • Nenu chesina papamukai
    నేను చేసిన పాపముకై

    నేను చేసిన పాపముకై
    నీదు ప్రాణము బలియాయెను (2)
    నాపైవున్న దోషముకై నలిగి ముద్దాయేనా (2)
    యేసయ్యా …. నీ ప్రేమ ఎంత అమరం
    నాయేసయ్యా..అది విలువకట్టలేను

    ఏ నేరము చేయని నిన్ను
    ఏ పాపము ఎరుగని నిన్ను (2)
    దూషించిరా అపహసించిరా
    నిలువెల్ల నిను గాయపరచిరా (2)
    నాచేయి చేసిన పాపానికై నీచేతిలో సీలలా
    నా కాళ్ళు చేసిన దోషాలకై
    నీ కాళ్ళలో మేకులా

    ఏ బంధము చూపలేనిది
    నాపై నీవు చూపిన ప్రేమ (2)
    నా మనస్సులో చేసిన పాపం
    నీ ప్రక్కలో బల్లెమాయెనా (2)
    నా తలంపుతో చేసిన పాపముకు
    నీకు ముళ్ల మకుటము
    సుకుమారమైన నీ మోముపైన
    నోటితో ఉమ్మిరా

    నా శరీరం చేసిన పాపం
    నీ దేహమునే చీల్చివేసెనా (2)
    సుందరమైన నీ రూపమే
    రక్త వర్ణముగా మారిపోయేన (2)
    వేవేల దూతలతో కొనియడబడుతున్న
    నిన్నే దూషించిరా
    నాపైన ఎనలేని ప్రేమను చూపిన
    నా దైవమా వందనం


    Nenu chesina papamukai
    needu praanamu bali yaayenu (2)
    naapai unna dhoshamukai
    naligi muddhaayena (2)
    Yesayya… nee prema entha amaram
    naa Yesayya… adhi viluvakattalenu

    Ey neramu cheyani ninnu
    ey paapamu erugani ninnu (2)
    dhooshinchiraa apahasinchiraa
    niluvella ninu gaayaparachiraa (2)
    naa cheyi chesina paapanikai nee chethilo seelalaa
    naa kaallu chesina dhoshaalakai
    nee kaallalo mekulaa

    Ey bandhamu choopalenidi
    naapai neevu choopina prema (2)
    naa manassulo chesina paapam
    nee prakkalo ballemaayenaa (2)
    naa thalamputho chesina paapamuku
    neeku mulla makutam
    sukumaaramaina nee momupaina
    notitho ummiraa

    Naa shareeram chesina paapam
    nee dhehamune cheelchivesenaa(2)
    sundharamaina nee roopame
    raktha varnamugaa maaripoyena (2)
    vevela dhoothalatho koniyaadabaduthunna
    ninne dhooshinchiraa
    naapaina enaleni premanu choopina
    naa daivamaa vandhanam

  • Neevantivaaru Lerevvaru
    నీవంటివారు లేరెవ్వరు

    నీవంటివారు లేరెవ్వరు
    మహిమైశ్వర్యములో నీకు సమమేవారు
    ఆకాశమందు ఆసీనుడైనవాడా
    కృప సత్యసంపూర్ణుడ
    భూమిని పాదపీఠముగా చేసినవాడే
    నిత్యుడగు ప్రేమపూర్ణుడ

    పాపినైన నా కొరకై
    పరమును వీడిన ప్రభువా
    నా కొరకై వెదకితివి
    నా పాపమంతా కడిగితివి

    ఏమర్పింతును దేవా
    నీవు చేసిన గొప్ప కార్యముకై
    ఏమిచ్చెదను ఓ ప్రభువా
    ఎనలేని నీ ప్రేమకై
    రక్షణ పాత్రను
    చేతబూని నీ రాజ్యసువార్తను చాటెదను

    చీకటైన నా బ్రతుకులో
    చిరుదివ్వెగా వెలిగితివి
    కఠినమైన నా హృదిని
    నీ ప్రేమతో కరిగించితివి

    ఏమర్పింతును దేవా
    నీవు చేసిన గొప్ప కార్యముకై
    ఏమిచ్చెదను ఓ ప్రభువా
    ఎనలేని నీ ప్రేమకై
    రక్షణ పాత్రను
    చేతబూని నీ రాజ్యసువార్తను చాటెదను


    Neevantivaaru Lerevvaru
    Mahimaishwaryamulo neeku samamevaru
    Aakasamandhu aaseenudainavaada
    Krupa sathyasampoornuda
    Bhoomini paadhapeetamuga chesinavada
    Nithyudagu premapoornuda

    Paapinaina na korakai
    Paramunu veedina prabhuva
    Na korakai vedhakithivi
    Na paapamantha kadigithivi

    Yemarpinthunu deva
    neevu chesina goppa kaaryamukai
    Yemicchedhanu O Prabhuva
    Yenaleni nee premakai
    Rakshana paathranu
    Cheythabooni nee rajyasuvarthanu chatedhanu

    Cheekataina na brathukulo
    Chirudhivvega veligithivi
    Katinamaina na hrudhini
    Nee prematho kariginchithivi

    Yemarpinthunu deva
    neevu chesina goppa kaaryamukai
    Yemicchedhanu O Prabhuva
    Yenaleni nee premakai
    Rakshana paathranu
    Cheythabooni nee rajyasuvarthanu chatedhanu

  • Neekistamainadhi Kavali
    నీకిష్టమైనది కావాలి

    నీకిష్టమైనది కావాలి దేవునికి
    బలి అర్పణ కోరలేదు దేవుడు(2)
    ప్రభు మనసు తెలుసుకో
    వాక్యాన్ని చదువుకో || నీకిష్టమైనది ||

    కయీను అర్పణ తెచ్చాడు దేవునికి
    హేబెలు అర్పణ నచ్చింది దేవునికి (2)
    అర్పించు వాటికంటే – అర్పించు మనసు ముఖ్యం
    నచ్చాలి మొదట నీవే – కావాలి మొదట నీవే || నీకిష్టమైనది ||

    దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
    క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా (2)
    నీ ధనము ధాన్యము కంటే – ఒక పాపి మార్పు ముఖ్యం
    ప్రకటించు క్రీస్తు కొరకే – మరణించు పాపి కొరకే || నీకిష్టమైనది ||


    Neekistamainadhi Kavali Devuniki
    bhali arpana koraledu devudu
    Prabhu manasu telusuko
    vakyanni chaduvuko ||Neekistamainadhi||

    Kayyeenu arpana techadu devuniki
    hebelu arpana nachindhi devuniki (2)
    Arpinchu vatikante arpinchu manishi mukyam
    Arpinchu vatikante arpinchu manasu mukyam
    Nachali modhataneeve kavali modataneeve ||Neekistamainadhi||

    Dehanni devuniki ivvali kanukaga
    Kreesthesu vale deham kavali yaghamugha (2)
    Nee dhanamu dhanyamu kante voka paapi marpu mukyam (2)
    Prakatinchu Kreestu korke maraninchu papi korake
    ||Neekistamainadhi||

  • Nee thyagame ne dhyaaninchuchuu
    నీ త్యాగమే నే ధ్యానించుచూ

    నీ త్యాగమే నే ధ్యానించుచూ
    నీ కోసమే ఇల జీవించెదా(2)
    నీతిమంతుడా షాలేము రాజా(2)
    ఆరాధన నీకే(3)

    గడియ గడియకు నిన్ను గాయపరచితి
    గతమునే మరచి నిన్ను హింసించితి(2)
    అయినా విడువలేదు నీ కృపా
    నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ(2) ||నీ త్యాగమే||

    ఇహలోక ఆశలలో పడియుండగా
    నీ సన్నిధి విడిచి నీకు దూరమవ్వగా(2)
    అయినా విడువలేదు నీ కృపా
    నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ(2) ||నీ త్యాగమే||

    హృదయమనే వాకిట నీవు నిలిచినా
    నిన్ను కానకా నే కఠినుడనైతి(2)
    అయినా విడువలేదు నీ కృపా
    నన్నెన్నడు మరువలేదు నీ ప్రేమ(2) ||నీ త్యాగమే||


    Nee Thyagame ne dhyaaninchuchuu
    nee kosame ila jeevinchedaa(2)
    neethimanthuda shaalemu raajaa(2)
    Aaraadhana neeke(3)

    Gadiya gadiyaku ninnu gaayaparachithi
    gathamune marachi ninnu himsinchithi(2)
    ayinaa viduvaledu nee Krupa
    nannennadu maruvaledhu nee Prema(2) ||Nee thyaagame||

    Ihaloka aashalalo padiyundagaa
    nee sannidhi vidichi neeku dooramavvagaa(2)
    ayinaa viduvaledu nee Krupa
    nannennadu maruvaledhu nee Prema(2) ||Nee thyaagame||

    Hrudayamane vaakita neevu nilichinaa
    ninnu kaanakaa ne katinudanaithi(2)
    ayinaa viduvaledu nee Krupa
    nannennadu maruvaledhu nee Prema(2) ||Nee thyaagame||

  • Naa Pranama Yelane thondhara
    నా ప్రాణమా ఏలనే తొందర

    నా ప్రాణమా
    ఏలనే తొందర నీకు
    ఏమని పాడేద నీవు
    ఎంతనీ పొగడెదవు ||2||

    సముద్రమంతా సిరాతో రాసినా

    ఆకాశమే సరిపడదే
    నా యేసు ప్రేమను కొలువా ||2||

    నా ప్రాణమా

    ఏలనే తొందర నీకు
    ఏమని పాడేద
    నీవు ఎంతనీ పొగడెదవు

    దుప్పి నీటి వాగు – కొరకు అశించునట్లు

    నా ప్రాణము నా దేవా – తృష్ణగొనుచున్నది
    జీవముగల దేవా – నీ సన్నిధికి నేను
    ఎప్పుడు వచ్చెదను – ఎలా నే కనబడుదు (2)
    ఆశతీరా కన్నీళ్ళతో – నీ పాదాలు కడిగెదను (2)

    నా ప్రాణమా
    ఏలనే తొందర నీకు
    ఏమని పాడేద
    నీవు ఎంతనీ పొగడెదవు

    హెర్మోను పర్వతమునుండి – మీసారు కొండనుండి

    నేను నిన్ను నా దేవా – జ్ఞాపకము చేసుకొనుచున్న
    ఈ అలలన్నియు తరంగములన్నియు
    నా మీద పొర్లిపారినా నీ కృపా నను వీడిపోదు (2)
    నా జీవదాత నీ సన్నిధి నా తోడుగ ఉండును (2)

    నా ప్రాణమా

    ఏలనే తొందర నీకు
    ఏమని పాడేద
    నీవు ఎంతనీ పొగడెదవు

    సముద్రమంతా సిరాతో రాసినా

    ఆకాశమే సరిపడదే
    నా యేసు ప్రేమను కొలువా ||2||
    నా ప్రాణమా…….


    Naa Pranama
    Yelane thondhara neeku
    Emani paadedha neevu
    Enthani pogadedhavu ||2||

    Samudramantha siratho raasinaa
    Aakasame saripadadhe
    Naa Yesu premanu koluvaa ||2||

    Naa Pranama
    Yelane thondhara neeku
    Emani paadedha neevu
    Enthani pogadedhavu

    Dhuppi neeti vaagu – Koraku aashinchunatlu
    Naa pranamu naa Deva – thrushnagonuchunnadhi
    Jeevamugala Deva – nee sannidhiki nenu
    Yeppudu vachedhanu – yela ney kanabadudhu (2)
    Aashateeraa kannillatho – nee paadhalu kadigedhanu (2)

    Naa Pranama
    Yelane thondhara neeku
    Emani paadedha neevu
    Enthani pogadedhavu

    Hermonu parvathamunundi – Meesaru kondanundi
    Nenu ninnu naa Deva – Gnapakamu chesukonuchunna
    Ee alalanniyu – tharangamulanniyu
    Naa meedha porli paarina Nee krupaa nanu veedipodhu (2)
    Naa jeevadhatha nee sannidhi Naa thoduga vundunu (2)

    Naa Pranama
    Yelane thondhara neeku
    Emani paadedha neevu
    Enthani pogadedhavu
    Samudramantha siratho raasinaa
    Aakasame saripadadhe
    Naa Yesu premanu koluvaa ||2||
    Naa Pranama…..

  • Naa hrudhyamantha
    నా హృదయమంత

    ఈ లోకము నను విడచినను
    నను విడువని నా దేవుడవు
    ఎవ్వరు లేని ఈ జీవితములో
    నా తోడు నీవై – నన్నాధుకొంటివి . .

    నా హృదయమంత నీ కొరకే.. సమర్పింతును దేవా..
    నా జీవితమంతా… నీ సాక్షిగా నిలిచేదను.. యేసు….
    నీ మార్గములో నే నడిచేదను – నీ చిత్తములో నే సాగేదను

    సొలిపోయినా నా ప్రాణము చెయ్యి పట్టి నన్ను లేపితివి.
    నన్నాధరించి – చేరదీసి
    కన్నీరు తుడచి – హత్తుకొంటివి

    నా హృదయమంత నీ కొరకే… సమర్పింతును దేవా..
    నా జీవితమంతా… నీ సాక్షిగా నిలిచేదను.. యేసు….
    నీ మార్గములో నే నడిచేదను – నీ చిత్తములో నే సాగేదను.

    యేసయ్యా…….

    నా చింతలన్ని తీరెనయ్య – నిన్ను చేరిన క్షణమే.
    నిత్య జీవితం దొరికేనయ్యా- నిన్ను చూసిన క్షణమే. (3)

    నా వ్యాధులన్నీ తొలిగేనయ్య – నిన్ను తాకిన క్షణమే
    నా భయాలన్నీ పోయేనయ్య – నిన్ను నమ్మినా క్షణమే..

    నా అడుగులన్ని స్తి‌రపరచువాడా – నా త్రోవలను సిద్ధపరచువాడా..
    నీ చిత్తములో నన్ను నడుపుమయ్య – నీ వాఖ్యముతో నన్ను నింపుమయ్యా



    Ee lokamu nanu vidachina
    nannu viduvani naa dhevudavu
    evvaru leni ee jeevithamulo
    naa thodu neevai – nannaadhukontivi

    Naa hrudhyamantha nee korakai – samarpinthunu deva
    naa jeevithamantha nee saakshiga nilichedanu yesu
    nee margamulo ne nadichedanu – nee chittamulo ne saagedhanu

    Solipoyina naa praanamu cheyyi patti nannu lepithivi
    nannaadharinchi cheradeesi
    kanneeru thudachi hattukontivi

    Naa hrudhyamantha nee korakai – samarpinthunu deva
    naa jeevithamantha nee saakshiga nilichedanu yesu
    nee margamulo ne nadichedanu – nee chittamulo ne saagedhanu

    Yesayya…

    Na chintalanni theerenayya – ninnu cherina kshaname
    nityajeevitham dhorikenayya – ninnu choosina kshaname

    na vyaadhulanni tholigenayya – ninnu thaakina kshaname
    na bayaalanni poyenayya – ninnu nammina kshaname

    na adugulanni sthiraparachuvaada – na throvalanu siddaparachuvaada
    nee chittamulo nannu nadupuvaada – nee vaakyamutho nannu nimpumayya

  • Madhuramaina Prema Marapurani Prema
    మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ

    మధురమైన ప్రేమ
    మరపురాని ప్రేమ
    నా యేసు ప్రభుని కన్నతండ్రి ప్రేమ(2)
    మధురమైన ప్రేమ…

    మంచిలేని నన్ను ఎంచుకున్న ప్రేమ
    వంచితుడను నన్ను వరియించిన ప్రేమ(2)
    ఎంచలేను ఆ ప్రేమ మించెనా భాషకు(2)
    ఏమని వివరింతు నా యేసుని దివ్యప్రేమ
    నా యేసుని దివ్యప్రేమ…

    దిక్కులేని నాకై దిగివచ్చిన ప్రేమ
    దీనుడుగా దారియిద్రుడుగా జన్మించిన ప్రేమ(2)
    విలువలేని నాకై సిలువెక్కిన ప్రేమ(2)
    కొలువలేను నా తండ్రి కలువరి నీ దివ్యప్రేమ
    కలువరి నీ దివ్యప్రేమ…


    Madhuramaina Prema
    Marapurani Prema
    Naa Yesu Prabhuni
    kannathandri Prema(2)
    Madhuramaina Prema…

    Manchileni nannu enchukunna Prema
    Vanchitudanu nannu variyinchina Prema(2)
    Enchalenu aa Prema minchena bhashaku(2)
    Emani vivarinthu na Yesuni divyaprema
    Na Yesuni divyaprema…

    Dhikkuleni naakai digivachina Prema
    Deenuduga dariyidruduga janminchina Prema(2)
    Viluvaleni naakai siluvekkina Prema(2)
    Koluvalenu na Thandri kaluvari nee divyaprema
    Kaluvari nee divyaprema…

  • Kalvari giripai Naa Yesayyaa
    కల్వరి గిరిపై నా యేసయ్య

    కల్వరి గిరిపై నా యేసయ్య
    నాకొరకై నీప్రాణం పెట్టావయ్యా!
    నీకెన్నిశ్రమలు కరుణామయా !
    నీప్రేమకు సాటేది ఓనజరేయా ! (2) || కల్వరిగిరిపై||

    కాళ్ళకు మేకులు కొట్టిరా – తలపై ముళ్ళకిరీటమా
    నేరమే ఏమిలేకనే – అయ్యో ఇంతటి ఘోరమా (2)
    మా పాపభారం మోసావయ్యా
    మాకొరకై సిలువ మరణమొందావయ్యా
    నీకెన్నిశ్రమలు కరుణామయా !
    నీప్రేమకు సాటేది ఓ నజరేయా ! || కల్వరిగిరిపై||

    తనువునే చీల్చి వేసిరా – రుథిరమే ఏరులైపారెనా
    లోకమే ఏక మాయెనా – అయ్యో అంతటి ద్వేషమా (2)
    మా పాపభారం మోసావయ్యా
    మా కొరకై సిలువ మరణమొందావయ్యా
    నీకెన్నిశ్రమలు కరుణామయా !
    నీప్రేమకు సాటేది ఓ నజరేయా ! || కల్వరిగిరిపై||



    Kalvari giripai – Naa Yesayyaa
    Naa korakai nee praanam pattavayya!
    Neekenni sramalu – Karunaamayaa
    Nee premaku saatedi o najareya! (2) ||Kalvari giripai||

    Kaallaku mekulu kottiraa – Talapai mullakireetamaa
    Nerame yemi lekane – Ayyo inthati ghoramaa (2)
    Maa paapabhaaram mosaavayyaa
    Maa korakai siluva maranamondaavayya
    Neekenni sramalu Karunaamayaa
    Nee premaku saatedi o Najareya! ||Kalvari giripai||

    Tanuvune cheelchivesiraa – Rudhirame yerulai paarenaa
    Lokame yekamaayenaa – Ayyo anthati dweshamaa (2)
    Maa paapabhaaram mosaavayyaa
    Maa korakai siluva maranamondaavayya
    Neekenni sramalu Karunaamayaa
    Nee premaku saatedi o Najareya! ||Kalvari giripai||

  • Kadavari kalamidhi
    కడవరి కాలమిది

    కడవరి కాలమిది
    కడవరి కాలమిది
    ప్రభు యేసు రెండవసారి
    రానున్న కాలమిది (2)

    సిద్దపడు ఓ సోదర
    ప్రభు రాకకై ఎదురు చూడుమా
    సిద్దపడు ఓ సోదరి
    ప్రభు రాకకై ఎదురు చూడుమా

    కడవరి కాలమిది
    కడవరి కాలమిది
    ప్రభు యేసు రెండవసారి
    రానున్న కాలమిది

    రెండువేళ సంవత్సరాలు గడచిపోయాయని
    ప్రభు చేసిన వాగ్ధానమింకా నెరవేరలేదని (2)
    ఇది కల్పితమని తలంచకు (2)
    అపవాదికి తలవంచకు

    కడవరి కాలమిది
    కడవరి కాలమిది
    ప్రభు యేసు రెండవసారి
    రానున్న కాలమిది

    ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయుటలేదు
    ఎవరూ నశియించి పోవుట ఆయన చిత్తం కాదు (2)
    అతి త్వరలోనే ప్రభు రాక (2)
    నీవు రక్షణ పొందుమికా

    కడవరి కాలమిది
    కడవరి కాలమిది
    ప్రభు యేసు రెండవసారి
    రానున్న కాలమిది (2)

    సిద్దపడు ఓ సోదర
    ప్రభు రాకకై ఎదురు చూడుమా
    సిద్దపడు ఓ సోదరి
    ప్రభు రాకకై ఎదురు చూడుమా

    కడవరి కాలమిది
    కడవరి కాలమిది
    ప్రభు యేసు రెండవసారి
    రానున్న కాలమిది


    Kadavari kalamidhi
    Kadavari kalamidhi
    Prabhu Yesu rendavasari
    raanunna kalamidhi (2)

    Sidhapadu o sodhara
    Prabhu raakakao yedhuru chooduma
    Sidhapadu o sodhari
    Prabhu raakakai yeduru chooduma

    Kadavari kalamidhi
    Kadavari kalamidhi
    Prabhu Yesu rendavasari
    raanunna kalamidhi

    Rendu velaa samvatsaraalu gadachipoyayani
    Prabhu chesina vaagdhanminka neraveraledani (2)
    Idi kalpitham ani thalanchaku(2)
    Apavaadiki thalavanchaku

    Kadavari kalamidhi
    Kadavari kalamidhi
    Prabhu Yesu rendavasari
    raanunna kalamidhi

    Prabhu thana vaagdhanam gurchi alasyam cheyutaledu
    Evaru nashiyinchi povuta aayana chitham kadu (2)
    Athi twaralone Prabhu raaka(2)
    Neevu rakshana pondhumika

    Kadavari kalamidhi
    Kadavari kalamidhi
    Prabhu Yesu rendavasari
    raanunna kalamidhi (2)

    Sidhapadu o sodhara
    Prabhu raakakao yedhuru chooduma
    Sidhapadu o sodhari
    Prabhu raakakai yeduru chooduma

    Kadavari kalamidhi
    Kadavari kalamidhi
    Prabhu Yesu rendavasari
    raanunna kalamidhi